scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'‘నాతో ఒక్క రోజు గడుపు.. నిన్నొదిలేస్తా’ అన్నాడు!'

'అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉందామె.. దానికి తోడు కరోనా ప్రతికూల పరిస్థితులు ఆమెకున్న ఉద్యోగాన్ని లాగేసుకొని ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినా ఉద్యోగ ప్రయత్నాలు మానుకోలేదామె. తన పనితనం, ప్రతిభకు మెచ్చి ఓ కంపెనీ ఆమెకు ఉద్యోగమిచ్చింది.. అందులోనూ కరోనా కారణంగా ఇంటి నుంచే పని చేయమనే ఆఫర్‌ కూడా ఇచ్చింది. ‘నా అదృష్టమో, దేవుడి దయో గానీ.. ఉద్యోగమైతే వచ్చింది’ అని సంబరపడిపోయిందామె. ఇక తన కష్టాలు తీరిపోయినట్లే అనుకుంది.. కానీ అప్పట్నుంచి ఆ కష్టాలకు మించిన నరకం అనుభవిస్తానని ఊహించలేదామె. మరి, ఉద్యోగం చేద్దామంటే రోజూ వేధింపులే, మానేద్దామంటే మానేయలేని పరిస్థితి.. అంటూ తనకెదురైన చేదు అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైన కొత్తందాలు..!

2019 debut heroines in Tollywood

చరిత్రలో మరో ఏడాది గతించిపోతోంది. ఎన్నో మధుర, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2019ఏడాదికి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏటా తెలుగు తెరకు నూతన నటీమణులు పరిచయమ్యారు. వారి అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి 2019లో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన కొంతమంది హీరోయిన్లెవరూ? వారి సక్సెస్‌ఫుల్‌ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం...

ప్రియాంక అరుల్‌ మోహన్‌...

2019newactressgh650-6.jpg

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి ప్రియాంక అరుల్‌ మోహన్‌. సెప్టెంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రియాంక నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన క్యూట్‌ నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిందీ భామ. తన ఆహార్యంతో తెలుగమ్మాయిని తలపించే ప్రియాంక చెన్నైలో జన్మించింది. బెంగళూరులో ఉన్నత విద్యనభ్యసించింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ చిన్నది 2019లోనే ‘ఓంద్‌ కథే హెల్లా’ అనే కన్నడ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రియాంక ప్రస్తుతం ‘డాక్టర్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది 2020లో ఈ సినిమా విడుదల కానుంది

శ్రద్ధా శ్రీనాథ్‌..

2019newactressgh650-8.jpg

ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ భామ కూడా నాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవడం విశేషం. నాని హీరోగా గౌతమ్‌ తిన్నూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమాతో శ్రద్ధా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక ప్రేయసిగా, భార్యగా ఈ సినిమాలో శ్రద్ధ పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుందీ భామ. ఇక శ్రద్ధ కెరీర్‌ విషయానికొస్తే... 2015లో ‘కోహినూర్‌’ అనే మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం కన్నడలో వచ్చిన ‘యూటర్న్‌’ చిత్రంతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఆది హీరోగా నటించిన ‘జోడి’ చిత్రంతో ఈ ఏడాది రెండోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ‘క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ అనే చిత్రంలో నటిస్తోంది. 2020లో విడుదల కానున్న ఈ సినిమాకు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం.

అనన్య నాగళ్ల...

2019newactressgh650-2.jpg

తెలంగాణకు చెందిన చేనేత కార్మికుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమా ద్వారా ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైంది నటి అనన్య నాగళ్ల. ఈ సినిమాలో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళగా అనన్య అద్భుత నటన కనబరిచింది. హీరో ప్రియదర్శితో పోటీపడీ మరీ నటించింది అనన్య. 2017లో ‘షాదీ.. ది వెడ్డింగ్‌’ అనే ఓ షార్ట్‌ ఫిలింలో అనన్య నటించింది. ఈ భామ ప్రస్తుతం ‘ప్లేబ్యాక్‌’ అనే విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

సాషా ఛెత్రి...

2019newactressgh650-7.jpg

తన అసలు పేరు కంటే ‘ఎయిర్‌టెల్‌ 4జీ గర్ల్‌’గానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది సాషా. ఎయిర్‌టెల్‌ 4జీ యాడ్‌తో ఎంతో పాపులర్‌ అయిన ఈ అందాల తార ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైంది. ఆది హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ ‘4జీ గర్ల్‌’. ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఈ చిన్నది ముంబైలో డిగ్రీ (అడ్వర్టైజింగ్‌ విభాగంలో) పూర్తి చేసింది. అనంతరం 2015లో ఎయిర్‌టెల్‌కు సంబంధించిన యాడ్‌లో కనిపించి యావత్‌ భారతదేశానికి సుపరిచితురాలైంది

దివ్యాంశ కౌశిక్‌..

2019newactressgh650-4.jpg

నాగచైతన్య, సమంత జంటగా ఈ ఏడాది వచ్చిన ‘మజిలీ’ సినిమాతో ఓ కొత్తమ్మాయి తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. తన పేరే దివ్యాంశ కౌశిక్‌. ఈ సినిమాలో నాగచైతన్యకు ప్రేయసిగా నటించిన దివ్యాంశ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. స్కూలింగ్‌ నుంచే దివ్యాంశకు మోడలింగ్‌ అంటే ఆసక్తి ఆ క్రమంలోనే తల్లి సహకారంతో ఆ రంగంలో రాణించింది. 2018లో ‘ఎ లైన్‌ ఆఫ్‌ సిల్వర్‌’ అనే షార్ట్‌ మూవీలో నటించిన ఈ ముంబై భామ... అనంతరం ‘మజిలీ’ చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకుంది

శృతీ శర్మ...

2019newactressgh650-10.jpg

ఈ ఏడాది జూన్‌లో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుందీ సినిమా. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాతోనే తెలుగు తెరకు శృతీ శర్మ అనే కొత్త హీరోయిన్‌ పరిచయమైంది. కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించిన శృతి... తన నటనతో ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక శృతి కెరీర్‌ విషయానికొస్తే... స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘ఇండియాస్‌ నెక్ట్స్‌ సూపర్‌ స్టార్స్‌’ అనే షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ దిల్లీ భామ ఈ ఏడాది ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తెలుగులో నటించే అవకాశం దక్కించుకుంది

గార్గేయి ఎల్లాప్రగడ...

2019newactressgh650-5.jpg

ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్‌కు పరిచయమైంది తెలుగమ్మాయి గార్గేయి ల్లాప్రగడ. హైదరాబాదీ అమ్మాయి అయిన గార్గేయి గతంలో పలు లఘు చిత్రాల్లో నటించింది. అనంతరం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో గార్గేయి నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి

శ్రద్ధా కపూర్‌...

2019newactressgh650-9.jpg

ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఈ ఏడాదే తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్ధ. ప్రభాస్‌ హీరోగా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ‘సాహో’ చిత్రంలో శ్రద్ధ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం సంచలనం సృష్టించింది. శ్రద్ధ కెరీర్‌ విషయానికొస్తే 2010లో వచ్చిన ‘తీన్‌పత్తి’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం వచ్చిన ‘ఆషికీ-2’ చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక శ్రద్ధ ప్రస్తుతం ‘స్ట్రీట్‌ డ్యాన్స్‌’, ‘భాగీ 3’ చిత్రాల్లో నటిస్తోంది

విద్యా బాలన్‌..

2019newactressgh650-11.jpg

సగటు భారతీయ సినీ ప్రేక్షకునికి పరిచయం అక్కర్లేని పేరిది. ‘డర్టీ పిక్చర్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యాబాలన్‌ తెలుగులో నేరుగా ఈ ఏడాదే ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాల్లో బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక విద్య కెరీర్‌ విషయానికొస్తే... విద్యాబాలన్‌కు చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. తొలిసారిగా తన పదహారేళ్ల వయసులో ఏక్తాకపూర్ నిర్మించిన ‘హమ్‌ పాంచ్‌’ అనే హిందీ సీరియల్‌ ద్వారా బుల్లి తెరకు పరిచయమైంది విద్య. కెరీర్‌ ప్రారంభంలో అవకాశాలు దక్కక, ఒకవేళ దక్కినా సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొందీ బాలీవుడ్‌ అందం. ఇక 2003లో ‘భాలో థేకో’ అనే బెంగాలీ సినిమాతో ఎట్టకేలకు వెండితెరకు పరిచయమైంది విద్యాబాలన్‌. ఇక ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన విద్యాబాలన్‌ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకొని ప్రస్తుతం బాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకెళుతోంది

అన్యసింగ్‌..

2019newactressgh650-3.jpg

సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి అన్యసింగ్‌. ఈ సినిమాలో తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. ఇక అన్యసింగ్‌ కెరీర్‌ విషయానికొస్తే.. షార్ట్‌ ఫిలింతో సినిమా జీవితాన్ని ప్రారంభించిన ఈ భామ 2017లో ‘ఖైదీ బ్యాండ్‌’ అనే సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఇక ప్రస్తుతం ‘నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్‌ఫ్రెండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది అన్య. ఈ సిరీస్‌ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది

ఐశ్వర్య రాజేష్‌..

2019newactressgh650-1.jpg

ఈ ఏడాది చిన్న సినిమాలుగా వచ్చి మంచి సక్సెస్‌ అందుకున్న చిత్రాల్లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఒకటి. ‘గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ క్రికెటర్‌గా ఎలా ఎదిగింద’న్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతోనే ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైంది ‘ఐశ్వర్య రాజేష్‌’. తమిళంలో అగ్ర కథనాయికల్లో ఒకరైన ఐశ్వర్య తమిళ, మలయాళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక ఐశ్వర్య ప్రస్తుతం యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు నాని హీరోగా తెరకెక్కనున్న ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానుందీ ముద్దుగుమ్మ.





women icon@teamvasundhara
rashmika-mandana-shares-a-glimpse-of-her-beach-workout

ఈ బీచ్‌ వర్కవుట్‌కు బాగా అలవాటు పడిపోయాను!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయానికి తోడు తనకు మాత్రమే సాధ్యమయ్యే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనతి కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోను చురుగ్గా ఉండే ఈ కన్నడ బ్యూటీ...తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన బీచ్‌ వర్కవుట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
tollywood-actress-ramyakrishnan-turns-50-in-telugu
women icon@teamvasundhara
lavanya-tripathi-chitchat-with-insta-fans

కరోనా లాంటి వైరస్‌లు ఇంకెప్పుడూ రాకూడదని కోరుకుంటున్నా!

లావణ్యా త్రిపాఠి... పేరుకు తగ్గట్టే అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించుకుంది. ‘దూసుకెళ్తా’, భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్‌’, ‘రాధ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘అంతరిక్షం’, ‘అర్జున్‌ సురవరం’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకునే ఈ సొగసరి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి ఈ అందాల తారకు, ఫ్యాన్స్కు మధ్య జరిగిన సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sameera-reddy-about-casting-couch-in-film-industry-in-telugu

అలాంటి పాములు నన్నూ కాటేయాలనుకున్నాయి..!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు ఎవరికీ కనిపించవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌, బంధుప్రీతిపై అసహనం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఇక యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినిమా పరిశ్రమలోని బంధుప్రీతి, వేధింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు అతనిలాగే తాము కూడా ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా సమీరా రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించి తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
samantha-sharing-gardening-tips-and-narrating-how-to-plant-seeds

అవి మన పిల్లల్లాంటివి... అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకుందాం!

ప్రస్తుతం గార్డెనింగ్‌లో తెగ బిజీ అయిపోయింది టాలీవుడ్‌ బ్యూటీ సమంత. కరోనా ప్రతికూల పరిస్థితులు తనకు జీవితం విలువ తెలియజేశాయని, అవే తనను గార్డెనింగ్‌ వైపు పురికొల్పాయని గతంలో ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో చెప్పుకొచ్చిన సామ్‌.. ఇక అప్పట్నుంచి మొక్కల్నే తన కన్న పిల్లలుగా చూసుకుంటోంది. ఇలా తన ఆహారాన్ని తాను పండించుకునే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులు, చిట్కాలను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టుల రూపంలో పంచుకుంటూ మురిసిపోతోందీ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో తాజాగా మరో పోస్ట్‌తో మన ముందుకొచ్చిందీ టాలీవుడ్‌ అందం. విత్తనాల్ని ఎలా విత్తుకోవాలి?, ఈ క్రమంలో పాటించాల్సిన నియమాలేంటి? తదితర విషయాలన్నీ తాజా ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా పంచుకుంది సమంత.

Know More

women icon@teamvasundhara
akkineni-samantha-chit-chat-with-fans-in-twitter-in-telugu

ఆ సీక్రెట్ ఇప్పుడే తెలిసింది!

సమంత... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన ఫ్యాషనబుల్ ఫొటోలు, సినిమా విశేషాలతో పాటు బ్యూటీ సీక్రెట్స్‌, హెల్త్‌ టిప్స్‌, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తికే ఇంటికే పరిమితమైన ఈ అందాల తార ఇంట్లోనే ఆహారాన్ని పండిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆన్‌లైన్‌లో అభిమానులతో ముచ్చటించే సామ్‌... తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ను పలకరించింది. ట్విట్టర్‌ వేదికగా ‘#AskSam’ అంటూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
keerthy-suresh-special-photo-shoot-on-onam-in-telugu

ఓనమ్ వేడుకల్లో ‘మహానటి’ ఎలా మెరిసిపోతోందో చూడండి!

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ ఎంత ప్రీతిపాత్రమో... మలయాళీలకు ‘ఓనమ్’ అంతే ప్రత్యేకం. కేరళ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండగను అక్కడి ప్రజలు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఇక ఈ పండగ వచ్చిందంటే చాలు...కేరళ కుట్టీల హడావిడి మామూలుగా ఉండదు. తెల్లటి దుస్తుల్లో సంప్రదాయబద్ధంగా ముస్తాబై మెరిసిపోతుంటారు. ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు వేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో ‘ఓనమ్’ పండగను పురస్కరించుకుని కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది ‘మహానటి’ కీర్తి సురేశ్‌. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దిగిన ఫొటోలతో పాటు, కీర్తి ప్రత్యేకంగా దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
nikki-galrani-recovers-from-covid-19-urges-people-to-get-tested-if-they-show-symptoms

'కరోనా మనల్ని ఏం చేస్తుందిలే ' అనుకోవద్దు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ప్రస్తుతం మనదేశంలోనూ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజుకు లక్షకు దగ్గరగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా సోకి కోలుకున్న బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక వైరస్‌ను జయించిన సెలబ్రిటీలు కూడా తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటి నిక్కీ గల్రానీ కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. సుమారు రెండు వారాల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను ఓ వీడియో రూపంలో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
genelia-dsouza-reveals-she-tested-positive-for-covid-19-three-weeks-ago-is-negative-now

కరోనా వచ్చి పోయింది.. కానీ ఆ మూడు వారాలు మూడు యుగాలయ్యాయి!

ఒంటరితనం.. కరోనా వచ్చాకే చాలామందికి దీని అసలైన అర్థమేంటో తెలిసింది. వైరస్‌ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు, వృత్తిరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటూ మరికొందరు.. ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మారిపోతున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు రోజుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది ‘బొమ్మరిల్లు’ బ్యూటీ జెనీలియా డిసౌజా. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌తో వివాహం తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైన జెన్నీ.. ఇద్దరు కొడుకులతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. అయితే ఇలా హ్యాపీగా ఉన్న సమయంలోనే కరోనా వల్ల తన కుటుంబానికి మూడు వారాల పాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
akkineni-samantha-chitchat-with-fans-in-instagram-in-telugu

2017 నుంచే నేను గర్భంతో ఉన్నాననుకుంటున్నా!

ఓ వైపు సినిమాలతో మాయ చేస్తూ.. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే నటీమణుల్లో అక్కినేని సమంత కూడా ఒకరు. పెళ్లయ్యాక నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల తార లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే వ్యవసాయం చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Ask me anything’ అంటూ అభిమానులతో ముచ్చటించింది సామ్‌. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
janhvi-says-criticism-is-an-opportunity-to-better-herself-in-telugu

అమ్మ ఇప్పుడు ఉంటే అవి చూసి మురిసిపోయేది!

అందాల తారలను అభిమానించే వారే కాదు... వారిపై విమర్శనాస్త్రాలు సంధించే వారూ చాలామందే ఉంటారు. నేరుగానే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా పలువురు సెలబ్రిటీలపై విమర్శలు రావడం సహజమే. ఈ క్రమంలో శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్‌ కూడా తన డ్రస్సింగ్‌, సినిమాలు, ఇతర విషయాల్లో అప్పుడప్పుడు విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉంది. ఆమె నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమా విడుదలై కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో- తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌ను ఎలా సానుకూలంగా మార్చుకుంటుందో జాన్వీ ఓ సందర్భంలో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
krishna-and-his-leela-actress-shalini-weds-manoj-in-telugu

women icon@teamvasundhara
bipasha-basu-on-taking-a-break-after-marrying-karan-singh-grover-in-telugu

భర్తలు అలా చేస్తే చాలు.. భార్యలు ప్రేమ నింపేసుకుంటారు!

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది బిపాసా బసు. హిందీ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, బెంగాలీ, హాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల తార 2016లో సహనటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోన్న బిపాసా ఐదేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం ‘డేంజరస్’. బిపాసా తన భర్తతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ..

Know More

women icon@teamvasundhara
samantha-flags-off-growwithme-challenge-nominates-manchu-lakshmi-and-rakul-preet

కుండ, మట్టి, ఖాళీ పాల ప్యాకెట్‌తో రడీగా ఉండండి!

సమంత... విలక్షణమైన పాత్రల్లో సిల్వర్‌ స్ర్కీన్‌పై సందడి చేసే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన బ్యూటీ సీక్రెట్స్, హెల్త్‌ టిప్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. ఇక లాక్‌డౌన్‌లో పూర్తిగా ఇంటికే పరిమితమైన సామ్‌ ఓ సరికొత్త పని కూడా నేర్చుకుంది. అదేనండీ...గార్డెనింగ్‌! ఈ మధ్య తాను ఇంటి మేడ పైనే కాయగూరలు, ఆకుకూరలు పండించడం తన సోషల్‌ మీడియా ఫొటోల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ కార్యక్రమానికి మరింత ప్రాచుర్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఈ బ్యూటీ #GrowWithMe పేరుతో ఓ సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది.

Know More

women icon@teamvasundhara
niharika-konidela-intimate-pasupu-function-after-the-engagement

పెళ్లి సందడి మొదలైపోయింది!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రిన్సెస్‌ నిహారికా కొణిదెల మిసెస్‌గా ప్రమోషన్‌గా పొందేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు ఐజీ జేవీ ప్రభాకరరావు తనయుడు, వ్యాపార వేత్త జేవీ చైతన్యతో నిహారిక పెళ్లి ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్రాండ్‌గా జరిగిన నిశ్చితార్థం వేడుకలో కాబోయే వధూవరులిద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. ప్రి వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా తాజాగా పసుపు దంచే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మెగా కుటుంబంలోని ఆడవాళ్లందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే పెళ్లికూతురితో కలిసి పసుపు కొడుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

Know More

women icon@teamvasundhara
jacqueline-adopts-two-maharashtra-villages-to-look-after-more-than-1550-people-for-three-years

తిరిగి ఇవ్వకపోతే లావైపోతా అని...!

శ్రీలంకలో పుట్టి పెరిగినప్పటికీ బాలీవుడ్‌ ఇండస్ట్రీ ద్వారా భారతీయులకు దగ్గరైంది జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. గతేడాది విడుదలైన ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ పక్కన స్టెప్పులేసి టాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇలా తన సినిమాలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ శ్రీలంకన్‌ బ్యూటీ సమాజ సేవలోనూ ముందుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు (ఆగస్టు 11)ని పురస్కరించుకుని మరో మంచి నిర్ణయం తీసుకుందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న రెండు గ్రామాల ప్రజలను దత్తత తీసుకుంది జాక్వెలిన్‌. ఇందులో భాగంగా ఆ గ్రామాల్లో ఉంటున్న సుమారు 1, 550 మందికి మూడేళ్ల పాటు అవసరమైన ఆహార సామగ్రిని సమకూర్చేందుకు ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
nikki-galrani-tests-positive-for-covid-19-in-telugu

కరోనా నుంచి కోలుకుంటున్నా.. కానీ వాళ్ళ గురించి భయంగా ఉంది!

కరోనా మహమ్మారి ఏ మాత్రం కనికరించడం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక వైపు నుంచి అందరినీ వెంటాడుతూనే ఉంది. అందుకే సామాన్యులే కాదు...పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అదే సమయంలో ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ అభిమానులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌లో కొవిడ్‌ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా తమిళ నటి నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్న ఆమె త్వరలోనే ఈ వైరస్‌పై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి తన అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
niharika-konidela-gets-engaged-to-chaitanya-in-a-private-ceremony

‘ఒక మనసు’కు తను వలచిన ఘనుడితో నిశ్చితార్థమైంది!

మెగా వారసురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. తనదైన నటప్రతిభతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మెగా ప్రిన్సెస్‌ నిహారికా కొణిదెల. తన చలాకీతనంతో, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో మనింట్లో అమ్మాయిగా మెలిగిన ఈ మిస్‌.. త్వరలోనే మిసెస్‌గా ప్రమోషన్‌ పొందబోతోంది. గుంటూరు ఐజీ జేవీ ప్రభాకర్‌రావు తనయుడు, వ్యాపారవేత్త అయిన జేవీ చైతన్యతో నిహారిక నిశ్చితార్థం తాజాగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో కాబోయే వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థపు ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ దగ్గర్నుంచి ప్రముఖుల దాకా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
madhuri-dixit-twitter-chat-with-fans-in-telugu

ఆ మూడే నా మధుర జ్ఞాపకాలు!

మాధురీ దీక్షిత్‌... సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అసమాన నటన, అందం, డ్యాన్స్‌తో వెండితెర రాణిగా ఓ వెలుగు వెలిగిందీ తార. మధ్యలో సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చినా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ‘టోటల్‌ ఢమాల్‌’, ‘కళంక్‌’ వంటి సినిమాలతో మరోసారి తన నటనా ప్రతిభను చాటుకుంది. అలాంటి మాధురి తొలిసారి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అబోధ్’. 1984లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల 36 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మాధురి ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #Askmd అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా చేసిన ఈ ఆన్‌లైన్‌ ఛాటింగ్‌లో తన 36 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sameera-reddy-shares-a-post-on-breastfeeding-in-telugu

ఈ బ్యూటిఫుల్‌ జర్నీలో మీరే వారికి తోడుగా నిలవాలి!

అమ్మతనం.. ఆడజన్మకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. అందుకే పెళ్లైన ప్రతి మహిళా తాను అమ్మగా ఎప్పుడెప్పుడు ప్రమోషన్‌ పొందుతానా అని ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఇక అలాంటి అమ్మతనాన్ని పరిపూర్ణం చేసే ప్రక్రియ బ్రెస్ట్‌ఫీడింగ్‌ . తల్లి తన బిడ్డకు ఎంత ఎక్కువ కాలం పాటు పాలిస్తే అంత మంచిది. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కొత్తగా తల్లైన మహిళలు అటు తన పాపాయి సంరక్షణ చూసుకుంటూ, ఇటు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు.. మరోవైపు ఇంటి పనుల్నీ సమన్వయం చేసుకుంటారు. ఈ క్రమంలో వారిపై చాలా ఒత్తిడి పడుతుంది. కానీ బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవం’ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. కొత్తగా అమ్మతనంలోకి అడుగుపెట్టిన మహిళలకు అటు భర్త, ఇటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండదండలు చాలా ముఖ్యమని, తద్వారా అమ్మలు ఎలాంటి ఆందోళన చెందకుండా పిల్లలకు పాలివ్వడం, అన్ని పనుల్ని సమన్వయం చేసుకోవడం వీలవుతుందని చెబుతూ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
deepika-padukone-spills-all-her-foodie-secrets-in-ask-me-anything-session

అమ్మ చేతి వంట.. ఆవకాయ.. జీవితాంతం తింటా!

దీపికా పదుకొణె.. ఈ మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ బ్యూటీ మన తెలుగువారిని ఎప్పుడెప్పుడు పలకరిస్తుందా అని ఎదురుచూశాం.. కోరిక మన్నించి దేవత వరమిచ్చినట్లు.. త్వరలోనే ప్రభాస్‌తో నటించడానికి ఒప్పేసుకుందీ ముద్దుగుమ్మ. దాంతో తెలుగు సినీ ప్రేక్షకులంతా ఓ రేంజ్‌లో ఆనందపడిపోతున్నారు. కేవలం తెలుగులో నటించడమే కాదు.. మన తెలుగింటి ఆవకాయ అన్నా దీపికకు చచ్చేంత ఇష్టమట! ఇటీవలే ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరుతో నిర్వహించిన సోషల్‌ మీడియా చాట్‌లో భాగంగా తానే స్వయంగా ఈ విషయం చెప్పుకొచ్చింది దీప్స్‌. ఇదొక్కటే కాదు.. ఈ వేదికగా ఇంకా బోలెడన్ని విషయాలు పంచుకుంది రాణి పద్మిని. అవేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
samantha-akkineni-reveals-the-reason-behind-her-journey-of-growing-food-at-home-through-instagram-video

మొత్తానికి ఆ సీక్రెట్ చెప్పేసింది!

సమంత.. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఫ్యాషనబుల్‌ ఫొటోలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. అంతేనా.. ఈ బ్యూటీ చాలా హోమ్లీ కూడా! నటనకు ఎంత ప్రాధాన్యమిస్తుందో.. ఇంటికీ అంతే ప్రాముఖ్యతనిస్తుంటుంది. ఇందుకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలే ప్రత్యక్ష సాక్ష్యం. ఇంట్లో తన భర్తతో గడుపుతూ, పెట్‌తో ఆడుకుంటూ, వ్యాయామాలు చేస్తూ.. ఇలా విభిన్న రకాలుగా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి నేటి మహిళలకు పాఠాలు నేర్పుతుంటుందీ అందాల తార. అయితే సామ్‌ ఈ మధ్య ఓ సరికొత్త అలవాటు కూడా చేసుకుంది. మీరు గమనించారా? అదేనండీ.. గార్డెనింగ్! ఈ మధ్య తాను ఇంట్లోనే కాయగూరలు, ఆకుకూరలు పండించడం తన సోషల్‌ మీడియా ఫొటోల్లో మనం చూస్తూనే ఉన్నాం. మరి, ఇంత సడెన్‌గా తాను ఈ అలవాటు చేసుకోవడానికి కారణమేంటంటారు? ‘మీ అందరికీ ఆ విషయం నేనే చెప్తా’నంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ క్యూట్‌ బేబ్.

Know More

women icon@teamvasundhara
shruthi-haasan-opens-up-about-nepotism-and-body-shaming

నాకు తెలిసి లైఫ్ అంటే ఇది కాదు..!

కమల్ హాసన్‌ కూతురిగా సినిమా ఇండస్ర్టీకి పరిచయమైనా తన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్‌. సిల్వర్‌ స్ర్కీన్‌పై అందం, అభినయంతో ఆకట్టుకునే ఆమె సింగర్‌గాను, మ్యూజిక్‌ కంపోజర్‌గాను సత్తా చాటింది. చిన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలను అలవాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మహిళలకు సంబంధించిన సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రస్తుతం సినిమా ఇండస్ర్టీలో చర్చనీయాంశమైన బంధుప్రీతి, బాడీషేమింగ్‌, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై తన అభిప్రాయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
kriti-sanon-shares-emotional-post-about-sushant

నా హృదయం మళ్లీ ముక్కలైంది!

‘దిల్‌ బేచారా’...సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. యాదృచ్ఛికమో, కాకతాళీయమో లేక కథ అలాగే కుదిరిందేమో తెలియదు కానీ... ఈ సినిమాలో మాదిరిగానే రియల్‌ లైఫ్‌లోనూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు సుశాంత్‌. దీంతో ‘దిల్‌ బేచారా’ సినిమాను చూసిన వారంతా ఈ యంగ్‌హీరోని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక ఈ సినిమాను వీక్షించిన సుశాంత్‌ తోటి నటీనటులు అతనితో గడిపిన అద్భుత క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ కృతి సనన్‌ కూడా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
rhea-chakraborty-shared-emotional-post-about-sushanth

సుశాంత్... నువ్వు నాతో కలిసి ఈ సినిమా చూస్తున్నావని తెలుసు!

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌...తన నటనతో అనతి కాలంలోనే అందరినీ ఆకట్టుకున్న ఈ హీరో అర్ధాంతరంగా తనువు చాలించాడు. కారణమేదైనా తన బలవన్మరణంతో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచాడీ యంగ్‌ హీరో. సుశాంత్‌ చనిపోయి సుమారు నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అతని స్నేహితులు, సన్నిహితులు అతడి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా అతనితో గడిపిన అద్భుత క్షణాలు, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంది నటి రియా చక్రవర్తి. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
tv-actress-vandana-vithlani-selling-rakhis-online-in-corona-pandemic

సీరియల్స్ లేవు.. అందుకే ఇలా ఆన్‌లైన్‌లో రాఖీలు అమ్ముతున్నా!

కనికరం లేని కరోనా అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓవైపు లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటూనే...మరోవైపు బతికున్నవారిని మానసికంగా ఇబ్బంది పెడుతోంది. ప్రత్యేకించి లాక్‌డౌన్‌ కాలంలో పలువురి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. కరోనాకు ముందు ఓ మోస్తరుగా జీవించిన కుటుంబాలు కూడా ఈ వైరస్‌ ధాటికి కకావికలమమయ్యాయి. దీంతో ‘పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లు’ ఉపాధి కోల్పోయిన చాలామంది ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈక్రమంలో గతంలో హిందీ టీవీ సీరియల్స్‌తో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న వందనా విత్లానీ నేడు ఆదాయం కోసం ఆన్‌లైన్‌లో రాఖీలు అమ్ముతోంది.

Know More

women icon@teamvasundhara
priyanka-reveals-about-nick-proposal-of-marriage

ఎప్పటికీ ఇలాగే నీ కళ్లలోకి చూస్తూ ఉంటాను.. ఐ లవ్యూ!

బాలీవుడ్‌కు సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనస్‌ జోడీ ఒకటి. రెండేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన ఈ క్యూట్‌ కపుల్‌ తమ దాంపత్య జీవితాన్ని నిత్య నూతనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజును పురస్కరించుకుని తన భర్తపై ఉండే ప్రేమను మరోసారి చాటుకుంది ప్రియాంక. ఈ సందర్భంగా నిక్‌తో తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-sends-birthday-wishes-for-upasana-and-sitara

నీకు తెలియనంతగా ప్రేమిస్తున్నా!

రామ్‌చరణ్‌-ఉపాసన... టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వృత్తిపరంగా పరస్పరం ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ప్రేమానురాగాలతో దంపతులందరికీ రిలేషన్‌ షిప్‌ పాఠాలు నేర్పుతున్నారీ రొమాంటిక్‌ కపుల్‌. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుపుకోవడమే కాదు... వృత్తిపరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారీ సెలబ్రిటీ కపుల్‌. ఈక్రమంలో ఉపాసన పుట్టిన రోజు (జులై 20) పురస్కరించుకుని ఇన్‌స్టా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు చెర్రీ. అలాగే టాలీవుడ్‌ స్టార్ కిడ్‌ సితార కూడా నేడు ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్‌- మహేశ్‌ దంపతులు కూడా తమ కూతురికి సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Know More

women icon@teamvasundhara
sai-pallavi-opens-about-her-facial-acne-and-career-plans

అప్పుడే అర్థమైంది ఆత్మవిశ్వాసమే అసలైన అందమని..!

‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’గా మలయాళ హృదయాలను కొల్లగొట్టింది. ‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. ‘రౌడీ బేబీ’ అంటూ యూట్యూబ్‌ రికార్డులు తిరగరాసింది. ఇలా అందం, అభినయం, డ్యాన్స్‌తో అందరి మనసులు దోచుకుంటోంది సాయిపల్లవి. సిల్వర్‌ స్ర్కీన్‌పై సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ నేచురల్‌ బ్యూటీ ముఖంపై ఉన్న మొటిమలు ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిపల్లవి... తన ముఖంపై ఉన్న మొటిమల గురించి, తన కెరీర్‌ ప్లాన్స్‌ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
richa-chadda-talks-about-bollywood-indudtry-in-telugu

తమ గదికి రాలేదని అలా చేసిన వాళ్ళూ ఎందరో!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. చాలామందికి ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు కనిపించవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ర్టీలోని వేధింపులు, బంధుప్రీతిపై అసహనం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినిమా పరిశ్రమలో దాగున్న చీకటి కోణాలు మరోసారి తెరమీదకొస్తున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని, కొందరి వేధింపుల వల్లే సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సుశాంత్‌ స్నేహితురాలు, కథానాయిక రిచా చద్దా కూడా ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన స్నేహితుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన సోషల్‌ మీడియా బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
shradda-kapoor-pooja-hegde-thanks-to-their-insta-followers