scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పిల్లల కోసమైనా బతకాలనుకుంది.. కానీ కనికరం లేని కరోనా పగబట్టేసింది!'

'కరోనా ఉపద్రవంతో దేశంలో ఎక్కడ చూసినా హృదయ విదారక సంఘటనలే కనిపిస్తున్నాయి. రోడ్లపై సాధారణ వాహనాల కంటే అంబులెన్స్‌ సైరన్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక మహమ్మారి కారణంగా కుటుంబ సభ్యులు, ఆప్తులను కోల్పోయిన వారి ఆవేదన వర్ణనాతీతం. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేని పరిస్థితి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు ఇలాంటి ఎన్నో హృదయ విదారక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీకి చెందిన ఓ వైద్యురాలు కరోనా కారణంగా తనకెదురైన కొన్ని అనుభవాలను ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌లో షేర్‌ చేసుకుంది. చదువుతుంటేనే కన్నీళ్లు తెప్పిస్తోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.'

Know More

Movie Masala

 
category logo

అందుకే... నాకు కష్టమొస్తే గోడకు చెప్పుకుంటున్నా!

Alitho Saradaga Special Chat Show With Srilakshmi And Hema

వారు తమ నటనతో వెండితెరపై నవ్వుల పువ్వులు పండించారు. తమకే సాధ్యమైన మేనరిజమ్స్‌తో, డైలాగులతో ప్రేక్షకుల మదిని దోచారు. కామెడీ నుంచి క్యారక్టర్‌ ఆర్టిస్టు దాకా ఎలాంటి పాత్రలకైనా ప్రాణం పోయగల వారిద్దరే సీనియర్‌ నటీమణులు శ్రీలక్ష్మి, హేమ. సున్నితమైన హాస్యంతో సిల్వర్‌ స్ర్కీన్‌పై తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ తాజా ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, అనందపడ్డ క్షణాలు... ఇలా ఎన్నో అనుభూతులను పంచుకున్నారు. మరి, ఆ సరదా సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...
ఆలీ: శ్రీలక్ష్మి అక్కగారూ ఎలా ఉన్నారు?
శ్రీలక్ష్మి: బాగున్నా!
కృష్ణవేణిగారూ ఎలా ఉన్నారు? అసలు మీ సొంతూరు ఎక్కడ?
హేమ: చాలా బాగున్నా! మాది తూర్పుగోదావరి జిల్లా.. రాజోలు.

alithosaradagahemsrilakshmi650-8.jpg
శ్రీలక్ష్మి: మా సొంతూరు రాజమండ్రి. అయితే, ఊహ తెలిసినప్పటి నుంచి చెన్నైలోనే పెరిగా. మా తల్లిదండ్రులు నేను పుట్టకముందే చెన్నై వచ్చేశారు. మా నాన్నగారు అమర్‌నాథ్‌. ఆయన కూడా నటుడే. పాత తరం సినిమాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు ఎక్కువగా యూట్యూబ్‌లోనే చూశా. మా తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. నేను రెండో బిడ్డను. అక్క, తమ్ముళ్లిద్దరూ ఈ లోకంలో లేరు. పెద్ద తమ్ముడు రాజేష్‌ హీరోగా నటించేవాడు. జంధ్యాల గారు తీసిన ‘ఆనంద భైరవి’, ‘రెండు జళ్ల సీత’ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతని కూతురే ప్రస్తుతం కోలీవుడ్‌లో కథానాయికగా వెలుగుతున్న ఐశ్వర్యా రాజేష్‌. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యాను.
హేమకు మొత్తం ఎన్ని పేర్లున్నాయి?
హేమ: మా కుటుంబమంతా గ్రామదేవత పెద్దింట్లమ్మను కొలుస్తారు. ఆ దేవత పేరు మీదనే మా అమ్మ నాకు పద్మ అని పేరు పెట్టింది. తర్వాత జాతక ప్రకారం కృష్ణవేణి అని నామకరణం చేశారు. నాన్నేమో నన్ను అబ్బాయిలాగే పెంచారు. అందుకే ‘రాజు..రాజు’ అని పిలిచేవారు. సినిమాల్లోకి వచ్చాక నేనే ‘హేమ’ అని పేరు మార్చుకున్నా. మా అమ్మే స్వయంగా నన్ను చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చింది.

alithosaradagahemsrilakshmi650-4.jpg
చిన్నతనంలో హేమ పెద్ద ‘రౌడీ’ అంటగా?
హేమ: అలా ఏం కాదు కానీ.. ఇంట్లో అందరికంటే నేనే చిన్నదాన్ని. అక్కలతో పాటు జాతరలకు, అంతర్వేది తీర్థాలకు వెళ్తుండేదాన్ని. అక్కడకు ఎంతోమంది జనం వచ్చేవారు. ఎవరైనా మాతో వెకిలి వేషాలు వేస్తే అక్కడే కొట్టేసేదాన్ని. అలా ఒకబ్బాయిని కొడితే తలపై బొప్పి కట్టింది. అప్పట్లో నా చేతికి ఇనుప గాజులు ఉండేవి. నేను ప్రతిసారీ గాజులు పగలగొట్టుకుంటున్నానని మా అమ్మే.. ఆ ఇనుప గాజులు వేసేది.
నీ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి మళ్లీ కనిపించాడా?
హేమ: లేదు. అప్పుడు బాగా చిన్నదాన్ని. ఊళ్లో 7వ తరగతి పూర్తవగానే సినీ అవకాశాల కోసం కుటుంబమంతా చెన్నై వచ్చేసింది. నేను పెరిగిందంతా చెన్నైలోనే.
మొదటి సినిమా ఏది? అవకాశం ఎలా వచ్చింది?
హేమ: బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ‘భలేదొంగ’ చిత్రంలో రావుగోపాలరావు గారి కుమార్తెగా నటించా. ఆ తర్వాత ‘క్షణ క్షణం’ తో పాటు పది సినిమాల్లో వరుస పెట్టి నటించా. కమల హాసన్‌ గారి వ్యక్తిగత డ్యాన్స్‌ మాస్టర్‌ రఘు మాస్టర్‌ దగ్గర డ్యాన్స్‌ నేర్చుకునేదాన్ని. అప్పుడే ఆ చిత్ర బృందం వారు నన్ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.

alithosaradagahemsrilakshmi650-2.jpg
శ్రీలక్ష్మి.. అమాయకత్వం రెండూ పర్యాయ పదాలనుకుంటా?
శ్రీలక్ష్మి: ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో అలాగే ఉండేదాన్ని. కాలం గడుస్తున్న కొద్దీ చాలా నేర్చుకున్నా. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ జీవితం గురించి కొత్త పాఠం నేర్చుకుంటూనే ఉన్నా. ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జీవితానుభవాలు సముద్రం వంటివి. నేర్చుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. మనకంతా తెలుసనుకోవడం బుద్ధి తక్కువతనం.
మహిళా కమెడియన్లలో అద్భుతమైన ఫాలోయింగ్‌ ఉన్న శ్రీలక్ష్మి, ఎప్పుడు చూసినా డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపిస్తారు ఎందుకు?
శ్రీలక్ష్మి: లేడీ కమెడియన్‌ ఆర్టిస్ట్‌ అవ్వడం నా అదృష్టం. అభిమానుల ఆదరణ వల్ల ప్రేక్షకులను నవ్విస్తూ.. నా నిజ జీవితంలో ఉండే బాధల్ని మర్చిపోతా. నాకుండే సమస్యలను ఎవరికైనా చెబుతుంటే లోకువగా చూస్తున్నారు. గడ్డిపోచ తీసేసినట్టు నన్ను తీసేస్తున్నారు. అప్పటి నుంచి నాకు ఎన్ని సమస్యలున్నా ఇతరులకు చెప్పడం మానేశా. పైపైన బంధాలనే కొనసాగించాలని నిర్ణయించుకున్నా. ఆ రోజుల్లో ఎవరితోనైనా కష్టాలు పంచుకుంటే ఓదార్చేవారు, ఆదరించేవారు. ఇప్పుడలా లేదు. ఒక్కోసారి కష్టమొస్తే గోడకు చెప్పుకుంటున్నా. ఎందుకంటే అది ప్రతిస్పందించదు. మనుషుల్ని లోకువ చేయదు. నాకంటూ ఇండస్ట్రీలో ఉన్న ఆత్మీయులు నటి అన్నపూర్ణమ్మ గారు. కానీ, ఈ షోలో ఆలీ ముఖం చూశాక నా కష్టాల్లో కొన్ని పంచుకుంటా.
హేమ ఏ ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు?
హేమ: ఏమో, అదిప్పటికీ తెలియదు! కేవలం చిరంజీవి గారిని చూడాలనే ఉద్దేశంతోనే వచ్చేశాననుకుంటున్నా. పద్నాలుగేళ్ల వయసులో పెద్దగా ప్రణాళికలేముంటాయ్? ఆటలు ఆడుకోవడం, బడికెళ్లటం తప్ప. మా ఇంటి పక్కనే ఉండే దుకాణం అతను ఒక పేపర్‌లో వేసిన ‘యాక్టింగ్‌ స్కూల్‌’ ప్రకటనను మా అమ్మకు చూపించి అక్కడ ప్రయత్నించమన్నాడు. దీంతో మా అమ్మ నన్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఆవిడ చాలా ధైర్యవంతురాలు. వచ్చేటప్పుడు రాజోలు పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒక లెటర్‌ తీసుకొచ్చి ఇక్కడి పోలీసులకు ఇచ్చింది. మాతో పాటు ఆ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ఒక కానిస్టేబుల్‌ను పంపించారు. అదంతా మా రక్షణ కోసమే. తీరా ఇక్కడికొస్తే ఆ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడో మారుమూలన ఉంది. అక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. దాంతో మళ్లీ రాజోలు వెళ్లిపోయి, అక్కడి నుంచి ఫ్యామిలీ మొత్తం చెన్నైకి మారిపోయాం. అక్కడ కోడంబాకం ఏరియాలో మీరు, మేము పక్క పక్క ఇళ్లల్లోనే ఉండే వాళ్లం (ఆలీని ఉద్దేశిస్తూ). ఆ ఇంటి నెల అద్దె రూ.250.

అక్కా.. మీరు ఇప్పటిదాకా ఎన్ని సినిమాల్లో నటించారు?
శ్రీలక్ష్మి: సుమారు 500 చిత్రాలకు పైనే ఉండొచ్చు. మొదటి సినిమా ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించా. దేవదాస్‌ కనకాల గారు దర్శకులు. నటులు శ్రీధర్‌, సంగీత గారు ఒక జంటైతే, గుమ్మడి గారి అబ్బాయి, నేను మరో జంటగా ఆ సినిమాలో నటించాం. ఆ తర్వాత తమిళంలో ఐదు, మలయాళంలో నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించా. ఆపై కమెడియన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా 500 నుంచి 600 వరకు సినిమాలు చేశాను. మా గురువుగారు జంధ్యాల గారి చిత్రాల్లో కచ్చితంగా ఉండేదాన్ని. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డిగారు నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.
ఇంట్లో వాళ్లకు తెలియకుండా రూ. 10 తీసుకుని సినిమాకు వెళ్లావంట కదా? తర్వాత అమ్మ బడిత పూజ చేశారటగా?
హేమ: అవును (నవ్వులు), ఇంట్లో వాళ్లు గట్టిగా దంచేశారు. మా పిల్ల గ్యాంగ్‌ను సినిమాకెళ్లమని నాన్న డబ్బులిచ్చారు. ఆ గ్యాంగ్‌కు నేనే లీడర్ని. దానికితోడు మా అమ్మ పర్సులో నుంచి రూ. 10 దొంగతనం చేశా. థియేటర్‌కు వెళ్లాక నేను, మా అక్క వాళ్ల ముందు ఏం తెలియనట్టు రూ.10 నోటు కింద పడేసి ‘ఏయ్‌ చూడండి. ఎవరో డబ్బులు పడేసుకున్నారు. తీసుకుందాం’ అన్నాను. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఖర్చు పెట్టేశాను. నాకు డబ్బులు దొరికాయన్న విషయాన్ని మేం పెంచుకునే దత్తపుత్రుడు మా అమ్మకు చెప్పేశాడు. దాంతో మా అమ్మ నాకు బడిత పూజ చేసింది.

alithosaradagahemsrilakshmi650-1.jpg
చిన్నప్పుడు నువ్వు బతకవు.. చనిపోతావ్‌ అనుకున్నారట కదా?
హేమ: అవును. అప్పుడు నాకు ఏడెనిమిదేళ్లు ఉండొచ్చేమో! ఒకసారి కొయ్యలా బిగుసుకుపోయానట. చనిపోయాననుకుని మావాళ్లు నన్ను బయట పడుకోబెట్టారు. మా అమ్మ వాళ్లు ఏడుస్తూ ఉన్నారట. మా నాన్నగారు పనిమీద బయటకెళ్లి వచ్చేసరికి ఈ దృశ్యం కనిపించింది. వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసిన కొద్దిసేపటికే గట్టిగా ఏడ్చానట (నవ్వులు). అందుకే, నాకు ఇంకా ఏ గండాలు లేవు!
అలాగే ఇక్కడొకటి చెప్పాలి. మా నాన్నకు ఇద్దరు భార్యలు. నేను రెండో భార్య సంతానం. ఆయన మొదటి భార్య పిల్లలతో కలిసి పెరిగా. మా అక్కలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఇదంతా నేను చెప్పలేదు. కానీ, మా అక్కా వాళ్లు అడుగుతుండేవారు. ఎందుకు నువ్వు మా గురించి చెప్పడం లేదని. అందుకే ఈ షోలో చెప్పాలనిపించింది. వాళ్లంతా ప్రస్తుతం ఊళ్లోనే ఉంటున్నారు.
అక్కా.. హేమ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని, మీ అంత కామెడీ ఆర్టిస్టు కావాలని పరిశ్రమకు వచ్చింది తెలుసా?
శ్రీలక్ష్మి: అవునా! తప్పకుండా తను బాగుండాలని కోరుకుంటున్నా. అలా ఒకరిని ఆదర్శంగా తీసుకుంటేనే జీవితంలో మనం అనుకున్న మార్గం వైపు త్వరగా చేరుకోగలం. నేనైతే అర్టిస్టునవుతానని కలలో కూడా ఊహించలేదు. అంతా జంధ్యాల గారి ఆశీర్వాదమే.

హేమ: ఎందుకంటే నా కెరీర్‌ మొదట్లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నా. కొంత గ్యాప్ తీసుకున్నాక మళ్లీ నటిద్దామనుకున్నప్పుడు డైరెక్టర్‌ త్రివిక్రమ్ గారు ‘నువ్వు కామెడీ ట్రై చెయ్యొచ్చుగా’ అన్నారు. అలా మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని ‘అతడు’ లో మీ మాదిరే అమాయకంగా నటించా (శ్రీలక్ష్మి వైపు చూస్తూ). చాలా మంచి పేరొచ్చింది.
నటుడు చంద్రమోహన్ గారి కారణంగా జంధ్యాల గారు మిమ్మల్ని తిట్టారట?
శ్రీలక్ష్మి: అవును. రావుగోపాల్‌రావు, చంద్రమోహన్‌ కాంబినేషన్‌లో ‘రామారావు గోపాల్రావు’ అనే సినిమా తీస్తున్నారు. అందులో భాగంగా మేమంతా పిక్నిక్కి వెళ్లి బస్సు‌ దిగే సీన్‌ను లాంగ్‌షాట్‌లో తీస్తున్నారు. బస్సు దిగుతూ నేను డైలాగ్‌ చెప్పాలి. డైరెక్టర్‌ దూరం నుంచి మైక్‌ పట్టుకుని ఏం చేయాలో చెప్తున్నారు. బస్సు దిగే క్రమంలో చంద్రమోహన్‌గారు వెనుక నుంచి నా చెవిపై కొడితే కళ్లు బైర్లు కమ్మాయి. దాంతో డైలాగ్స్‌ మర్చిపోయా. ఒక పక్క నుంచి జంధ్యాల గారి తిట్లు. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఆ రోజు నన్ను చెడామడా తిట్టేశారు జంధ్యాల గారు. అసలేం జరిగిందో చంద్రమోహన్ గారు కూడా చెప్పలేదు. తర్వాత ఆయన్ను ‘ఏమండీ ఇదేమన్నా పద్ధతిగా ఉందా’ అని అడిగితే.. ‘నేనేం చేశా’ అంటూ ఆయన తప్పించుకున్నారు.

alithosaradagahemsrilakshmi650-6.jpg
‘పెళ్లిసందడి’ షూటింగ్‌లో ఉన్నప్పుడే కదా మీ తమ్ముడు రాజేష్‌ చనిపోయారు ?
శ్రీలక్ష్మి: అవును. రాత్రి రెండు గంటలకు రాజేష్‌ చనిపోయాడని కాల్‌ వచ్చింది. నాకైతే ఆ క్షణం నుంచి ఏడుపు ఆగలేదు. ఒక పక్క ఉదయాన్నే కాంబినేషన్‌ సీన్లు ఉన్నాయి. ఒక్కరం లేకపోయినా ఆ రోజు షూటింగ్‌ వాయిదా వేయాల్సిందే. నేను మేనేజర్‌ దగ్గరకు వెళ్లి ‘నన్ను వెంటనే మా ఇంటికి పంపండి. మా తమ్ముడు చనిపోయాడు’ అంటూ ఒకటే ఏడుపు. ఆయన రాఘవేంద్రరావు గారికి ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. రాఘవేంద్రరావు గారు వెంటనే అనుమతి ఇచ్చారు. విమానంలో కూడా ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న వ్యక్తి నన్ను ఓదార్చారు. మద్రాసులో దిగాక ఆయనే కారులో నన్ను ఇంటి దగ్గర దిగబెట్టారు. తర్వాత తెలిసింది.. ఆ వ్యక్తి నాటి సంగీత దర్శకుడు చక్రవర్తిగారి తనయుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీ గారని.

alithosaradagahemsrilakshmi650-5.jpg
అక్కా.. మీ రెండో తమ్ముడికి సీరియస్‌గా ఉందని చెప్తే ఒక షూటింగ్ వాళ్లు వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేదట కదా?
శ్రీలక్ష్మి: అవును. అప్పుడు తమిళంలో ఒక సీరియల్‌లో నటిస్తున్నా. తమ్ముడు ఆనంద్‌కు సీరియస్‌గా ఉంది. ఆసుపత్రిలో ఉంచారని ఫోన్‌ వచ్చింది. మామూలుగా అయితే సీరియల్‌ కాల్షీట్‌‌ రాత్రి తొమ్మిది గంటల కల్లా అయిపోతుంది. నేను ఒక గంట ముందు అనుమతి తీసుకుని వెళ్దామనుకున్నా. కానీ, వాళ్లు ఆ రోజు రాత్రి మరికొన్ని షాట్స్ ఉన్నాయంటూ 10 గంటల దాకా చేశారు. అందులోనూ అది కామెడీ సీన్‌. నేను ఒక పక్క ఎంతో వేదన అనుభవిస్తూ ఆ సీన్‌లో నటించా. అప్పుడు ఈ జీవితం అవసరమా అనే భావన కలిగింది. షూటింగ్ ప్యాకప్‌ అవ్వగానే కార్లో సామాను వేసుకుని స్పీడ్‌గా డ్రైవ్‌ చేశా. మామూలుగా 40 కి.మీ స్పీడ్‌లో వెళ్లే నేను.. 80 కి.మీ వేగంతో ఆసుపత్రికి వెళ్లా. స్టీరింగ్‌ తిప్పుతూనే ‘ఆనందం..ఆనందం’ అంటూ వెర్రిగా అరిచాను. తీరా ఆసుపత్రికి వెళ్లేటప్పటికి తమ్ముడు చనిపోయాడు. నా ఇద్దరు తమ్ముళ్లను అలా కోల్పోయాను. ఇద్దరూ కామెర్ల కారణంగానే చనిపోయారు.(ఈ మాట చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు).
హేమ: నటులకు ఇదొక శాపమేమో! నిజ జీవితంలో ఎంత వేదన ఉన్నా కెమెరా ఎదుట నవ్వుతూ నటించాలి. ఎమ్మెస్‌ నారాయణ అన్నయ్య గారు కూడా ఇదే చెప్పారు. ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం గారి కాంబినేషన్‌లో ఒక పక్క కామెడీ సన్నివేశంలో నటిస్తున్నారు. మరోపక్క ఆయన భార్యకు అపోలో ఆసుపత్రిలో బైపాస్‌ సర్జరీ జరుగుతోంది. ఆ సమయంలో ఆయన ఎంతో మనోవేదన అనుభవించారట. షాట్‌ గ్యాప్‌లో వాష్‌రూమ్‌కి వెళ్లి అద్దం ముందు నిల్చుని ఏడ్చేవారట. వెంటనే ముఖం కడుక్కుని తర్వాతి షాట్‌కు సిద్ధం అయ్యేవారట. ఆపరేషన్‌ అనుమతి పత్రాన్ని షూటింగ్‌ లొకేషన్‌కే తెప్పించుకొని సంతకం చేశారట. ఎంత బాధాకరం అది!

alithosaradagahemsrilakshmi650-7.jpg
నీ దగ్గర ఒక టాలెంట్‌ ఉందట కదా? మొక్కజొన్న పొత్తు బరువు చూసి ముదురా, లేతా అని చెప్పేస్తావట?
హేమ: అవును (నవ్వులు). ఆ ట్యాలెంట్‌కు కారణం మా నాన్నే. మగపిల్లాడిలా నన్ను పెంచాడు. సాధారణంగా మొక్కజొన్న పొత్తు ఎలా ఉందో తెలుసుకోవాలంటే దానిపై ఉండే ఆకులు తీసి గోరుతో గిచ్చి తెలుసుకుంటారు. కానీ, నేను మాత్రం బరువు చూస్తా. బాగా లేతగా ఉండే పొత్తైనా, ముదురు పొత్తైనా తేలిగ్గా ఉంటుంది. అదే సరైన పొత్తైతే కొంచెం బరువుంటుంది. అదే విధంగా కూరగాయలు కూడా. అందరూ బెండకాయలు, ములక్కాడలను మాత్రమే లేతవో, ముదురువో గుర్తించగలరు. వంకాయలను కూడా మనం తెలుసుకోవచ్చు. లేతవైతే వాటి మొదట్లో ఉండే కాండం దగ్గర ముచ్చికల మందం ఎక్కువగా ఉంటుంది.
స్కైడైవ్‌ ఎక్కడ చేశారు?
హేమ: వాషింగ్టన్‌ డీసీలో చేశా. నేనూ, సింగర్‌ శ్రీకృష్ణ స్కైడైవింగ్‌కు వెళ్లాం. అయితే, అక్కడి నిర్వాహకులు మొదట ఒక కుర్రాడిని తీసుకొచ్చి ‘ఇతనితోనే మీరు డైవింగ్‌ చేస్తున్నారు’ అని చెప్పారు. తీరా డ్రస్‌ వేసుకొని రెడీ అయ్యాక ఒక ముసలి వ్యక్తిని తీసుకొచ్చి ‘సారీ ఆ వ్యక్తి ప్రస్తుతం లేరు. ఈయనతో మీరు డైవ్‌ చెయ్యాలి’ అని చెప్పారు. నేను వెంటనే కుదరదన్నా. దీంతో సింగర్‌ శ్రీకృష్ణకు కేటాయించిన వ్యక్తిని నాకు ఇచ్చి డైవింగ్‌ చేయించారు. నిజంగా ఆ థ్రిల్‌ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎంత కిక్కుంటదనేది!

అక్కా, మీ తండ్రి చనిపోయాక కుటుంబాన్ని పోషించడానికి ఆ స్థానం మీరు తీసుకున్నారు కదూ?
శ్రీలక్ష్మి: అవును. మా నాన్న అమర్‌నాథ్ గారు మా అందరినీ ఎంతో గారాబంగా పెంచారు. బయట పోకడ అస్సలు తెలీదు. ఆయన చనిపోయాక మా పరిస్థితి గందరగోళంగా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా చేప పిల్లలను చెరువులో పడేస్తే ఈత రాక ఎలా అల్లాడుతాయో అలా కొట్టుమిట్టాడాం.. నాన్న చనిపోయాక ఆయనకు తెలిసిన ఒక కలెక్టరు మా ఇంటికి వచ్చారు. ఆయన మా అమ్మతో ‘అమ్మా మీ కుటుంబంలో ఎవరైనా బాగా చదువుకున్న వాళ్లుంటే చెప్పండి. ఉద్యోగం ఇప్పిస్తా’ అన్నారు. అసలు మాకు చదువులే లేవు. ఆ మాట చెప్పగానే ఆ కలెక్టర్‌ ‘మరీ అలా అయితే మేమేం చేయగలం చెప్పండి’ అన్నారు. అప్పుడు అమ్మ నాతో మాట్లాడుతూ ‘చూడమ్మాయ్‌. మనకు తెలిసిందల్లా సినిమాల్లో నటించడమే. నువ్వే చూడ్డానికి కొద్దో, గొప్పో బాగుంటావ్‌. సినిమాల్లో ప్రయత్నించు. మనకున్న పరిచయాలతో కొన్ని వేషాలు వస్తాయి. అలా ఈ కుటుంబాన్ని లాక్కురావాల్సిందే.. లేదంటే చెప్పు అందరం కలిసి తలో కొంత విషం తాగి చచ్చిపోదాం’ అంది. నేనిక ‘నీ ఇష్టం అమ్మా. ఏం చెయ్యమంటే అది చేస్తా’ అని మాటిచ్చా. అంతకు ముందే హీరోయిన్‌గా విశ్వనాథ్‌ గారి సినిమాలో ఎంపికై, ముహూర్తం షాట్‌కు కూడా వెళ్లా. కానీ, ఈ లోగా నాన్నగారు చనిపోవడం, ఇతర ఇబ్బందుల వల్ల ఆ సినిమాలో అవకాశం పోగొట్టుకున్నాను. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రల్లో నటిస్తూ ఉండగా.. ‘రెండు జెళ్ల సీత’లో అవకాశం వచ్చింది. అదే సినిమాలో తమ్ముడు రాజేష్‌కు హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలోని పాత్రతో నాకు మంచి పేరొచ్చింది. ఇప్పుడున్న పిల్లలు కూడా నా డైలాగుల్ని బాగా ఇష్టపడుతున్నారు. ‘బాబూ చిట్టీ’, ‘అబ్బ జబ్బ దబ్బ’, డైలాగ్స్‌తో పాటు ‘చంటబ్బాయి’ లోని ‘బంగాళా భౌభౌ’ అన్న డైలాగ్స్‌ బాగా పాపులరయ్యాయి.

View this post on Instagram

A post shared by Hema_Kolla (@urshemakolla)


హేమ.. మీ కుటుంబం గురించి చెప్పండి?
హేమ: నా భర్త పేరు జాన్‌. మాకు ఒక కూతురు ఇషా. ప్రస్తుతం బీబీఎం రెండో సంవత్సరం చదువుతోంది. తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చా. ఇండిపెండెంట్‌గా ఉండాలనే ప్రోత్సహిస్తుంటాను. అలా చేస్తేనే భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతారు. అయినప్పటికీ తను అమ్మ కూచే. ఎప్పుడైనా బయటకు వెళ్తే.. నా కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది.
ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు?
హేమ: ఇప్పటివరకు 475 సినిమాల్లో నటించా. 500 మార్కును త్వరలోనే చేరుకుంటా. నాకు మంచైనా, చెడైనా ఇండస్ట్రీనే. ఎందుకంటే చిత్ర పరిశ్రమ నాకు జీవితాన్నిచ్చింది. మా అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంది.. నాన్నకంటే ఎక్కువ ధైర్యాన్నిచ్చింది కూడా ఇండస్ట్రీనే. అవకాశాలు రావడం కొంచెం ఆలస్యమైనా బాధపడను. కొన్నాళ్లు జుట్టుకు రంగు వేయడం మానేస్తే తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలు కూడా చేయొచ్చు (నవ్వులు). నేను చనిపోయాక పాడెను సినిమా వాళ్లే మోయాలన్నది నా బలమైన కోరిక.

alithosaradagahemsrilakshmi650-3.jpg
అక్కా.. మీ కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు?
శ్రీలక్ష్మి: నా చెల్లెళ్లందరూ చెన్నైలోనే ఉంటున్నారు. షూటింగ్స్‌ లేకపోతే ఎప్పుడూ అక్కడే ఉంటా. మా వాళ్లంతా నన్ను బాగా చూసుకుంటారు. అక్కడ మాకు సొంత ఇల్లు ఉంది. కింద ఫ్లోర్‌ అద్దెకిచ్చా. నేనెప్పుడైనా వెళ్లినప్పుడు పైన ఇంట్లో ఉంటా. నాకంటూ పిల్లలు ఎవరూ లేరు. నా చెల్లెళ్ల పిల్లలు, తమ్ముడి పిల్లలే నాకు వారసులు. అలా అనుకుంటే నన్నిప్పుడు కూడా అభిమానిస్తున్న యువ అభిమానులంతా నా పిల్లలే అనుకుంటా. అంతెందుకు, నా తమ్ముళ్లు లేకపోయినా నిన్నే నా తమ్ముడిగా భావిస్తుంటా (ఆలీని ఉద్దేశించి). అంతటి అనుబంధం మనిద్దరిది.
ఒక సినిమాకు మొత్తం మూడు షోలకు అక్కడే టికెట్‌ క్యూలో నిలబడ్డారట?
శ్రీలక్ష్మి: అవును. ఆ చిత్రం ‘సుడిగుండాలు’. అందరూ సినిమా బాగుందనడంతో చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లా. ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇంతలో టికెట్‌ క్యూలైన్‌ పెరుగుతుండేది. అక్కడికి వెళ్తే ఆ ఒత్తిడిలో మమ్మల్ని పక్కకు తోసేసేవాళ్లు. అలా మ్యాట్నీషోకు కూడా జరిగింది. ఎలాగైనా సినిమా చూడాలనే ఉద్దేశంతో అక్కడే ఉండి చివరకు మూడో షోలో చూసి వచ్చాం.

women icon@teamvasundhara
women-should-not-give-up-on-any-of-their-passions-says-geeta-basra

ఆ పవర్ మనకు పుట్టుకతోనే వచ్చింది!

అప్పటిదాకా జీవితంలో ఏదో సాధించాలని ఆరాట పడే మహిళల్లో చాలామంది పెళ్లి తర్వాత తమ కలలను పక్కన పెట్టేస్తుంటారు. భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు... తదితర బాధ్యతలలో పడి తమ ఆకాంక్షలు, ఆశయాలను త్యాగం చేసేస్తుంటారు. అయితే మల్టీ టాస్కింగ్‌ పవర్‌ అనేది మహిళల్లో సహజంగా ఉంటుందని... ఎవరూ పెళ్లి, పిల్లల కోసం తమ కలలను త్యాగం చేయాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా. మాతృత్వం అనేది కేవలం వ్యక్తిగత విషయమని, ఓ మహిళ జీవితాన్ని అది పూర్తిగా నిర్వచించలేదని ఆమె చెబుతోంది. ఆరేళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో పెళ్లిపీటలెక్కిన గీతకు హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ క్రమంలో మరోసారి తల్లి కాబోతున్న ఆమె తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
pregnant-shreya-ghoshal-shares-pics-from-surprise-baby-shower

శ్రేయా ఘోషల్ సీమంతం వేడుకలు చూశారా?

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన స్వరంతో సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది శ్రేయా ఘోషల్‌. ‘జల జల జలపాతం’ అంటూ ప్రస్తుతం మనందరి మదిని మీటుతోన్న ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ త్వరలోనే తల్లిగా తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయిందీ అందాల గాయని. పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఆమె బేబీ షవర్‌ (సీమంతం) ఫంక్షన్‌ వేడుకగా జరిగింది. శ్రేయ సన్నిహితులు, స్నేహితుల ఆధ్వర్యంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-recalls-the-hate-she-received-after-covid-diagnosis

అప్పుడు కరోనా కంటే వాళ్ల కామెంట్లే నన్ను ఎక్కువగా బాధపెట్టాయి!

సాఫీగా సాగిపోతున్న మన జీవితాల్లోకి కోరుకోని అతిథిలా వచ్చింది కరోనా. కనికరం లేకుండా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. అదే సమయంలో భయం పేరుతో మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మంటగలిపిందీ మహమ్మారి. ఇప్పుడు కరోనాకు భయపడడం కాస్త తగ్గింది కానీ సరిగ్గా ఏడాది క్రితం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సమయాన అక్కడక్కడా జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. చాలా ప్రాంతాల్లో కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపడం, వారి కుటుంబ సభ్యులను అవమానాలకు గురిచేయడం లాంటి సంఘటనల గురించి మనకు తెలిసిందే.

Know More

women icon@teamvasundhara
mira-rajput-interacting-with-instagram-fans-and-held-thisorthat-session

అదంటే ఎక్కువ ఇష్టం.. ఆ విషయం షాహిద్‌కి కూడా తెలుసు!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి అయిన ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్లను మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఆమెను 2.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడంతో పాటు...వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘దిస్‌ ఆర్‌ దట్‌’ సెషన్‌ను నిర్వహించింది మీరా. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dia-mirza-clarification-over-her-pregnancy-getting-married

అందుకే అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేకపోయాను!

‘బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ అన్న మాటలకు సరిగ్గా సరిపోతుంది బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా. సామాజిక అంశాలు, మహిళల సమస్యలపై తనదైన శైలిలో స్పందించే తెగువే ఆమెకు ఆ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిందీ అందాల తార. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్న దియా తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చిందా? అన్న సందేహాలు చాలామందిలో తలెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌, విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు, నెటిజన్లు లేవనెత్తిన పలు సందేహాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
actress-and-tv-host-hariteja-blessed-with-a-baby-girl-in-telugu

women icon@teamvasundhara
from-yoga-to-ghar-ka-khaana-shilpa-shetty-reveals-20-things-she-loves

ఈ 20 నాకెంతో ఇష్టం!

శిల్పా శెట్టి...ఈ పేరు తలచుకోగానే సన్నజాజి తీగ లాంటి నాజూకైన శరీరాకృతి, అందమైన రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. వయసు పెరుగుతోన్నా వన్నె తరగని ఈ అందాల రాణి పూర్తి స్థాయి సినిమాలో నటించి సుమారు పద్నాలుగేళ్లు గడిచాయి. అయినా తన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదంటే అందుకు ప్రధాన కారణం సోషల్‌ మీడియానే అని చెప్పుకోవచ్చు. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలతో పాటు.. తాను పాటించే ఆహార, ఫిట్‌నెస్‌ నియమాల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం ఈ సొగసరికి అలవాటు. అందుకు తగ్గట్టే సామాజిక మాధ్యమాల్లో శిల్పను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
miss-india-finalist-diksha-singh-to-contest-up-panchayat-poll

ఈ అందాల రాణి అందుకే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందట!

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మున్సిపాలిటీ, పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ తారలు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేస్తూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంచాయతీ ఎన్నికల బరిలో దిగింది. 2015మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన ఆమె.. పలు వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. మరి అలాంటి అందాల రాణి పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
these-star-kids-are-making-a-splash-on-social-media-in-telugu
women icon@teamvasundhara
meet-geeta-a-52-years-teacher-turned-lingerie-model-who-is-redefining-beauty-standards

ఈ వయసులో లో దుస్తుల మోడలింగ్‌ ఎందుకంటే!

చూడగానే ఆకట్టుకునే అందం... సొగసైన శరీరాకృతి... పొడవాటి కేశ సౌందర్యం... ఇలా నవ యవ్వనంతో మెరిసిపోయే యువ అందాలనే తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా, అంబాసిడర్లుగా నియమించుకుంటాయి దుస్తుల తయారీ సంస్థలు. యువతులు, మధ్య వయసు మహిళలు, వృద్ధులు... ఏ వయసు వారి దుస్తులకైనా యువతులనే ప్రచారకర్తలుగా తీసుకుంటాయి. వయసు ప్రతిపాదికన మోడల్స్‌ను తీసుకునే సంస్థలు ఎక్కడా కనిపించవు. ఈ క్రమంలో ‘నా వయసు వారి లో దుస్తులకు నా వయసు వారినే మోడల్స్‌గా ఎందుకు నియమించకూడదు’ అనే ఓ సరికొత్త ఆలోచనను రేకెత్తించింది ముంబయికి చెందిన 52 ఏళ్ల గీత. లో దుస్తుల మోడలింగ్‌లో దూసుకెళుతోన్న ఆమె లింగరీ మోడలింగ్‌పై ఆన్‌లైన్‌ వేదికగా ఒక ఉద్యమమే చేస్తున్నారు. ఇంతకీ ఎవరామె ఎందుకీ ఉద్యమం చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-on-how-failed-marriages-impacted-her-children

నేను చేసిన తప్పులు నా కూతురు అస్సలు చేయదు!

స్వశక్తితో సొంత కాళ్లపై నిలబడినా... వ్యక్తిగతంగా ఎంత ఎత్తుకు ఎదిగినా విడాకులు తీసుకున్న స్త్రీలంటే ఈ సమాజంలో కాస్త చిన్నచూపు ఉంటుంది. వాళ్లేదో తప్పు చేశారన్నట్లుగా చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితాన్ని వారి పిల్లలకు ముడిపెడుతూ సూటిపోటి మాటలతో అవమానాలకు గురిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో తాను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా నేటికీ తాను, తన పిల్లలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నామంటోంది ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీ. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ బుల్లితెరను ఏలుతోన్న ఈ ముద్దుగుమ్మ రెండుసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం సింగిల్ మదర్‌గానే కొనసాగుతోన్న ఆమె.. ఓవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈక్రమంలో తన విడాకుల వ్యవహారం, పిల్లలపై దాని ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
rubina-dilaik-opens-up-about-her-mental-health-issues-in-telugu

అప్పుడు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను!

డిప్రెషన్... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుందీ సమస్య. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, వ్యక్తిగత, ఆర్థికపరమైన సమస్యలు, పని ఒత్తిడి... వంటి ఎన్నో కారణాలు డిప్రెషన్‌ తలెత్తడానికి దోహదం చేస్తాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే దీనిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఈ నేపథ్యంలో మానసిక ఆందోళనతో గతంలో తన మదిలోనూ ఆత్మహత్య ఆలోచనలు మెదిలాయంటోంది ‘ఛోటీ బహూ’ రుబీనా దిలాయిక్‌. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ముగిసిన బిగ్‌బాస్‌-14 సీజన్‌లోనూ విజేతగా అవతరించింది. తద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా డిప్రెషన్‌తో తనకెలాంటి గడ్డు పరిస్థితులెదురయ్యాయో అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
ankita-lokhande-shares-casting-couch-experience-in-telugu

సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో కాంప్రమైజ్‌ కావాలన్నాడు!

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ రాణించాలంటే ఎన్నో ముళ్ల దారులు దాటాల్సి ఉంటుంది. అవకాశమొస్తే కాటేయాలని చూసే ఎన్నో మృగాలు ఆ దారిలో కాచుకుని ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుని తెరపై కనిపించి, అభిమానులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందాలంటే అంత సులభమేమీ కాదు. ఈక్రమంలో చాలామందిలాగే తానూ ఎన్నో ముళ్లదారులను దాటాకే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నానంటోంది బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే. దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రేయసిగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆమె కెరీర్‌ ప్రారంభంలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడ్డానంటోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకెదురైన కొన్ని చేదు అనుభవాలను అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-says-she-had-it-hard-as-a-teenager-as-she-would-stammer-and-was-on-the-heavier-side

అప్పట్లో ఆ కామెంట్లను తట్టుకోలేకపోయాను!

కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిల్ని చూడగానే కొంతమంది వెంటనే ‘అబ్బ ఎంత లావుగా ఉంది’ అంటూ నవ్వుకోవడం, హేళన చేయడం చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... బొద్దుగా ఉన్న వాళ్లు సరదాకి ఏదైనా ఫొటో షేర్ చేస్తే చాలు... కామెంట్ల రూపంలో అసభ్యకర మాటలు, దూషణలు కనిపిస్తుంటాయి. ఇలాంటి మాటలతో ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా తానూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. అయితే సమాజంలో అన్ని విషయాలను సహనంతో ఎదుర్కొన్నానని, తన పిల్లలకు కూడా అదే నేర్పిస్తానంటూ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిందీ సూపర్‌ మామ్.

Know More

women icon@teamvasundhara
geeta-basra-harbhajan-expecting-second-child-in-july

మరోసారి అమ్మను కాబోతున్నా!

అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నామని తెలియగానే కలిగే ఆనందం అనిర్వచనీయం. ఇక మొదటిసారి పేరెంట్స్‌గా మారిన జంటలు... మరోసారి తల్లిదండ్రులయ్యేసరికి మరింత ఆనందోత్సాహాలకు, భావోద్వేగానికి గురవుతుంటారు. తమ సంతోషాన్ని అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా-టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇప్పటికే హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ సందర్భంగా త్వరలోనే తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్.

Know More

women icon@teamvasundhara
actress-varalakshmi-and-vijayalalitha-in-alitho-saradaga-chat-show

ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు..!

వారిద్దరూ విభిన్న పరిస్థితుల మధ్య వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు చెల్లెలిగా మెప్పిస్తే.. మరొకరు ప్రత్యేక పాత్రలు, స్పెషల్‌ సాంగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలెన్నో పోషించారు. అద్భుత అభినయంతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న వారే సీనియర్‌ నటీమణులు వరలక్ష్మి, జయలలిత. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తోన్న వీరు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు.. ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి, ఆ సరదా సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sunitha-takes-instagram-to-counter-trolls-on-women’s-day

మీరు నిందిస్తారు.. అండగా నిలవరు.. అయినా క్షమిస్తా!

రాజ్యాంగం అందించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను అడ్డుపెడ్డుకుంటూ కొంతమంది అవసరం లేకపోయినా ఇతరుల జీవితాల్లోకి తొంగిచూస్తుంటారు. తాము ఎలా ఉన్నా సరే... వారిని మాత్రం నోటికొచ్చినట్లు ఆడిపోసుకుంటుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమంది నెటిజన్లు ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. ప్రత్యేకించి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను టార్గెట్‌ చేసుకుని, వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్ చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత కూడా సోషల్‌ మీడియాలో ఎన్నోసార్లు నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ పెద్దగా వాటిపై స్పందించని ఈ స్టార్‌ సింగర్‌ తాజాగా నోరు విప్పింది. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ కారణంగా తానెలా ఆవేదన చెందానో అందరితో షేర్‌ చేసుకుంది. అదే సందర్భంలో అకారణంగా తనను ఆడిపోసుకున్న వారికి సున్నితంగా సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
singer-shreya-ghoshal-announces-first-pregnancy-with-this-adorable-post

నేను అమ్మను కాబోతున్నా!

మహిళలకు అమ్మతనానికి మించి మరే విషయం అమితానందాన్ని ఇవ్వదు. అందుకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన మహిళలందరూ ఎప్పుడెప్పుడు అమ్మగా ప్రమోషన్‌ పొందుదామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక కడుపులో నలుసు పడిందని తెలిసిన మరుక్షణం వారి ఆనందానికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తోంది అందాల సింగర్ శ్రేయాఘోషల్. తన శ్రావ్యమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ సింగర్‌ త్వరలో అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను అందరితో షేర్‌ చేసుకున్న ఆమెకు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
jayasudha-latest-grey-hair-look-goes-viral-on-social-media

మా ‘సహజ నటి’ ఎందుకిలా మారిపోయారు?

జయసుధ... నాలుగున్నర దశాబ్దాలుగా సినీ కళామతల్లికి సేవలు అందిస్తున్న ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాడు కథానాయికగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆమె... నేడు మోడ్రన్‌ మదర్‌గా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఇలా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సహజనటి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న జయసుధ చివరిగా రెండేళ్ల క్రితం ‘రూలర్‌’ సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత ఎక్కడా కనిపించని ఆమె చాలా రోజుల తర్వాత మన ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌ బృందానికి అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను రిలీజ్‌ చేశారీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
richa-gangopadhyay-announces-pregnancy-on-social-media

మా బార్బీ డాల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం!

అమ్మతనం మాటలకందని అనుభూతినిస్తుంది. కడుపులో నలుసు పడిన క్షణం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటుంది అమ్మ మనసు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురుచూస్తూ మాతృత్వంలోని మధురిమలను ఆస్వాదిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది రిచా గంగోపాధ్యాయ్‌. ‘మిర్చి’ సినిమాలోని ‘మానస’ పాత్రతో కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ఈ అందాల తార త్వరలోనే అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా తను తల్లి కాబోతున్న శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sreemukhi-chitchat-with-fans-in-instagram-in-telugu

నా బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటంటే...!

శ్రీముఖి... తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై తనదైన స్టైల్‌, మ్యానరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార ..‘నేను శైలజ’, ‘జులాయి’ తదితర హిట్ సినిమాలతో వెండితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇక బిగ్‌బాస్‌-3 రియాల్టీ షోలో రన్నరప్‌గా నిలిచి అమితమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీ ప్రస్తుతం పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటోంది. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ... తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Post A Picture of’! Or ‘Ask Me Anything’ పేరుతో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులతో దిగిన ఫొటోలతో పాటు ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది.

Know More

women icon@teamvasundhara
mira-rajput-held-an-ask-me-anything-session-on-instagram-and-answered-multiple-questions-about-her-life-marriage-and-more

షాహిద్‌ కాదు.. అతడే నా ఆల్‌టైమ్‌ క్రష్!

మన జీవితంలో మనకు ఇష్టమైన వాళ్లు ఎంతమంది ఉన్నా.. తొలిచూపులోనే మన మనసు దోచుకున్న వాళ్లు (క్రష్‌) మాత్రం ఒక్కరే ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం తన భర్త షాహిద్‌ మాత్రం కాదంటోంది మీరా రాజ్‌పుత్‌. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్యగానే కాదు.. తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో తానెంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు అనుక్షణం టచ్‌లోనే ఉంటుందీ అందాల అమ్మ. అంతేనా.. వీలు చిక్కినప్పుడల్లా వారితో ముచ్చటిస్తుంటుంది కూడా! అలా తాజాగా ఇన్‌స్టాలో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించింది మీరా. ఈ క్రమంలో తన భర్త, పిల్లలు, బ్యూటీ సీక్రెట్స్‌, ఫిట్‌నెస్‌.. వంటి బోలెడన్ని విషయాలతో పాటు తన క్రష్‌ ఎవరో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara