టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహల జంట కూడా ఒకటి. తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్. ఇక సినిమాలతో పాటు కుటుంబానికి అంతే ప్రాధాన్యమిస్తాడు బన్నీ. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. ఈ క్రమంలో తాజాగా తన భార్య పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడీ స్టైలిష్ స్టార్. ఈ సందర్భంగా కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఓ పార్టీ ఏర్పాటు చేసిన బన్నీ... తన జీవిత భాగస్వామితో కేక్ కట్ చేయించాడు.
హ్యాపీ బర్త్‌డే క్యూటీ!
ఇక తన సతీమణి పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసిన స్టైలిష్ స్టార్...పార్టీ అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘నా జీవితంలో నువ్వు ఎంతో ప్రత్యేకం. ఇలాంటి పుట్టిన రోజుల్ని మరెన్నో జరుపుకోవాలి. ఆ పుట్టిన రోజు వేడుకలన్నింటిలోనూ నేను ఇలాగే నీ పక్కనుండాలని కోరుకుంటున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు క్యూటీ’ అని తన భార్యపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు బన్నీ.
ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ప్రత్యేకించి పింక్ కలర్ ట్యూబ్ ఫ్లోరల్ ప్రింట్ డ్రస్సులో ముస్తాబైన స్నేహతో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన స్నేహ తొలిసారి ఓ వివాహ వేడుకలో అల్లు అర్జున్ను కలుసుకుంది. మొదట మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ తమ బంధాన్ని ప్రేమగా మార్చుకున్నారు. ఆతర్వాత మూడుముళ్లతో తమ ప్రేమ బంధాన్ని మరింత గట్టిగా ముడి వేసుకున్నారు. 2011లో ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటైన ఈ లవ్లీ కపుల్‌కు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన స్నేహ పుట్టిన రోజు ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.





