scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనాతో క్షణాల్లో వారి ఆరోగ్యం క్షీణించడం కళ్లారా చూశాను!'

'సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రోగికి కచ్చితంగా తోడుగా ఉంటారు. చికిత్స సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాస్పిటల్‌కు వచ్చి మనో ధైర్యం చెబుతుంటారు. కానీ కరోనా సోకి చికిత్స తీసుకునే రోగులకు ఇలాంటి సదుపాయాలేవీ ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఏకాకిగానే గడపాలి. ఫలితంగా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వైద్యులు, నర్సులే కరోనా బాధితుల కుటుంబ సభ్యులుగా మారిపోతున్నారు. వైరస్ తమకు సోకే ప్రమాదముందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న స్నేహ ఏడు నెలలుగా కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. కరోనా రోగులను తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారిని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో కరోనాను జయించి తిరిగి విధుల్లో నిమగ్నమైన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!'

Know More

Movie Masala

 
category logo

మాకూ పీసీఓఎస్ ఉంది.. అయినా దాచుకోలేదు.. కుంగిపోలేదు..!

Celebrities shares their PCOS Struggles and experiences in Telugu

‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్‌.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్‌ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.
కానీ కొందరు మొహమాటం అనే ఆ గీత దాటి ధైర్యంగా తమ సమస్య గురించి ప్రపంచానికి చాటి చెబుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. కొందరు సెలబ్రిటీలూ ఉన్నారు. తామూ పీసీఓఎస్‌ బాధితులమేనని, ఈ క్రమంలో తోటి వారి నుంచి విమర్శల్ని సైతం ఎదుర్కొన్నామంటూ పలు సందర్భాల్లో పంచుకున్నారు కూడా! సెప్టెంబర్‌ నెలను ‘ప్రపంచ పీసీఓఎస్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో అలా కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న పీసీఓఎస్‌ స్టోరీస్‌ ఏంటో తెలుసుకొని మనమూ స్ఫూర్తి పొందుదాం!


అప్పుడు నాకు నేను నచ్చలేదు!

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

బాలీవుడ్‌ ఫ్యాషనిస్టాగా పేరుపొందిన సోనమ్‌ కపూర్‌ ఇండస్ట్రీలోకి రాకముందు ఎంతో బబ్లీగా ఉండేది. అయితే అందుకు పీసీఓఎస్‌ కూడా ఓ కారణమంటూ ఓ సందర్భంలో భాగంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘టీనేజ్‌లో ఉండగానే నాకు పీసీఓఎస్‌ సమస్య ఉందని తెలిసింది. దాంతో ఆరు నెలల్లోనే నేను 35 కిలోల దాకా బరువు పెరిగాను. అవాంఛిత రోమాలు, మొటిమలతో సతమతమయ్యా. ఆ సమయంలో నాకు నేనే నచ్చేదాన్ని కాదు. అమ్మకు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయాల్లో అవగాహన ఎక్కువ. అలాంటిది నా గురించి తను ఎంతో బాధపడిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు.. పీసీఓఎస్‌ నా శరీరంపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపించిందో! ఇక ఇలా బాధపడితే లాభం లేదనుకున్న నేను.. ఎలాగైనా సరే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. అది కూడా ఆరోగ్యకరంగానే! ఈ క్రమంలో అమ్మ నాకు చాలా సహాయపడింది. నాకెంతో ఇష్టమైన జంక్‌ ఫుడ్‌, చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌.. వంటి వాటిపైకి నా మనసు మళ్లకుండా ఓ కచ్చితమైన డైట్‌ ప్లాన్‌ ఫాలో అయ్యేలా చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ యోగా చేయడం కూడా నాకు బాగా కలిసొచ్చింది. ఇక చక్కటి శరీరాకృతి కోసం కథక్‌ కూడా నేర్చుకున్నా. ఇలా రెండేళ్ల పాటు కచ్చితమైన ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ పెరిగిన బరువును తిరిగి తగ్గించుకోగలిగా..’ అంటూ చెప్పుకొచ్చింది సోనమ్.పిజ్జాలు పిచ్చిపిచ్చిగా తినేదాన్ని!

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

పటౌడీ ప్రిన్సెస్‌ సారా అలీ ఖాన్‌ కూడా పీసీఓఎస్‌ బాధితురాలే! ఈ క్రమంలో తాను చాలా లావయ్యానని, ఇతర అనారోగ్యాలూ ఎదుర్కొన్నానంటూ సందర్భం వచ్చినప్పుడల్లా నిర్మొహమాటంగా చెబుతుంటుందీ బ్యూటీ. అంతేకాదు.. తాను లావుగా ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఎలా ఉన్నా తమను తాము స్వీకరించాలన్న స్ఫూర్తిదాయక సందేశం ఇస్తుంటుందీ చిన్నది.
‘సినిమాల్లోకి రాకముందు నా బరువు 96 కిలోలు. బహుశా.. నాకున్న పీసీఓఎస్ సమస్య వల్లే నేను అంత బరువు పెరిగి ఉంటా. దీనికి తోడు హార్మోన్ల అసమతుల్యత కూడా తలెత్తింది. అప్పట్లో ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది కాబట్టి ఏది పడితే అది ఎక్కువగా తినేదాన్ని. కొలంబియాలో చదువుకోవడానికి వెళ్లినప్పుడు మా ఇంటికి దగ్గర్లో ఓ పిజ్జా షాపు ఉండేది. అందులోని పిజ్జాలంటే ప్రాణమిచ్చేదాన్ని. అయితే ఆ పక్కనే ఓ విటమిన్ షాపు కూడా ఉండేదన్న విషయం నేను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాకే తెలిసిందంటే.. పిజ్జాలకు నేనెంతలా అలవాటు పడ్డానో మీరు అర్థం చేసుకోవచ్చు. నటనపై ఆసక్తిని గమనించాక ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడయ్యా. ఈ క్రమంలో ఆ విటమిన్ షాపులోని సలాడ్లు, ప్రొటీన్ బార్స్.. వంటి పదార్థాలే నేను బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాయి.. కథక్‌, యోగా, పిలాటిస్‌.. వంటి వర్కవుట్స్‌ కూడా నేను పెరిగిన బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేశాయి.. అలా పీసీఓఎస్‌ నా జీవితంలో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడేలా చేసింది’ అంటోంది సారా.నా మనసుతో యుద్ధం చేసేదాన్ని!

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan) on

ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పే టాలీవుడ్‌ బ్యూటీ శృతీ హాసన్‌.. తన ఆరోగ్య సమస్యల్ని కూడా అందరితో పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడదు. ఈ క్రమంలోనే తాను గతంలో హార్మోన్ల సమస్యలు, పీసీఓఎస్‌తో బాధపడ్డానని, దాని పర్యవసానాల ప్రభావం తనపై చాలానే ఉందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ.

‘నాకు 26 ఏళ్ల వయసులో పీసీఓఎస్‌ ఉందని తెలిసింది. ఆ సమయంలో నా శరీరంలో కలిగే మార్పులు, లక్షణాల గురించి గ్రహించినా.. వాటిని నేను అదుపు చేసుకోలేకపోయేదాన్ని. నా పట్ల నేనే అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. అందంగా కనిపించట్లేదనే భావన నాలో ఏర్పడింది. ఇవన్నీ నన్ను మానసికంగా కుంగదీశాయి. ఈ సమస్యల్ని అధిగమించడానికి నాతో నేనే యుద్ధం చేసేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నటన నాకు కాస్త ఊరటనిచ్చింది. షూటింగ్స్‌లో పాల్గొన్నంత సేపు నా పాత్ర, దానికి పూర్తి న్యాయం చేయడమెలా?.. అన్న విషయాల పైనే దృష్టి పెట్టేదాన్ని. ఆ బిజీలో పడిపోయి ఇతర విషయాలు నాకు గుర్తొచ్చేవి కాదు. కానీ పిరియడ్స్‌ వచ్చిన ప్రతిసారీ మాత్రం నాలో ఆందోళన విపరీతంగా పెరిగిపోయేది. నెలసరి నొప్పులు వేధించేవి. దాంతో ఆ రోజుల్లో డ్యాన్స్‌ షూట్స్‌, స్టేజీ పెర్ఫార్మెన్స్‌లేవీ ఉండకూడదని కోరుకునేదాన్ని. వీటి గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నానేమో అనిపించేది.

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan) on


గర్భనిరోధక మాత్రలు, ఈస్ట్రోజెన్‌ సప్లిమెంట్స్‌ వేసుకున్నా. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ట్రై చేశా.. ఏవీ వర్కవుట్‌ కాలేదు. హోమియోపతి, సహజసిద్ధమైన పద్ధతులు కొంతమంది మహిళలకు ఈ సమయంలో బాగా పనిచేస్తాయి. నా విషయంలో అదీ జరగలేదు. దాదాపు 10 కిలోల దాకా బరువు పెరిగా. దీనికి తోడు నా శరీరాకృతి గురించి ఇతరులు చేసే కామెంట్లు భరించలేకపోయేదాన్ని. ఇలా దాదాపు ఏడాది గడిచిపోయింది. ఇక లాభం లేదనుకొని నటన నుంచి కాస్త విరామం తీసుకొని పీసీఓఎస్‌కు చికిత్స తీసుకున్నా. నాలోని నెగెటివ్‌ ఆలోచనల్ని దూరం చేయడానికి థెరపిస్ట్‌ సలహాలు బాగా పనికొచ్చాయి. నెలసరి నొప్పుల్ని అదుపు చేసుకోవడానికి యోగా, స్క్వాట్స్.. వంటి వ్యాయామాల్ని నా లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకున్నా. ఇలా ఈ క్రమంలో మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకున్నా..’ అంటూ తన పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంది శృతి.అదేంటో ముందు తెలుసుకోలేకపోయా!

View this post on Instagram

A post shared by Harleen Sethi (@itsharleensethi) on

‘బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌’ అనే వెబ్‌సిరీస్‌తో పాపులారిటీ సంపాదించింది హర్లీన్‌ సేథి. ఆపై వరుణ్‌ ధావన్‌తో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియోలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇలా ఆన్‌స్క్రీన్‌లో తన గ్లామర్‌తో కట్టిపడేసే ఈ బ్యూటీ.. గతంలో తాను పీసీఓఎస్‌తో బాధపడినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
‘నాకు 15 ఏళ్లున్నప్పుడు పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఎందుకిలా జరుగుతోందని ఎంతోమంది డాక్టర్స్‌ దగ్గరికి వెళ్లా. కానీ ఎవరూ నా అసలు సమస్యేంటో గుర్తించలేకపోయారు. అప్పుడు అమ్మే హార్మోన్ల సమస్య ఉందేమోనని రక్తపరీక్ష చేయించుకోమంది. అందులో తెలిసింది నా సమస్య పీసీఓఎస్‌ అని! ఇది దీర్ఘకాలిక సమస్య. అయితే ఈ సమస్య నా జీవన శైలిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. చక్కటి ఆహారపుటలవాట్లు అలవడేలా, వ్యాయామాలను నా రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకునేలా చేసింది. అలాగే నా ఆలోచనా ధోరణిలోనూ మార్పులు తెచ్చింది..’ అంటూ పీసీఓఎస్‌తో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చిందీ ముద్దుగుమ్మ.పాజిటివ్‌గా ఉండడమే సమస్యకు పరిష్కారం!

View this post on Instagram

A post shared by Himanshi Khurana 👑 (@iamhimanshikhurana) on

మోడల్‌గా, బిగ్‌బాస్‌-13 కంటెస్టెంట్‌గా అందరికీ సుపరిచితురాలైన హిమాన్షీ ఖురానా పంజాబీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తన శరీరాకృతి గురించి సోషల్‌ మీడియాలో చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేసేవారని, కానీ పీసీఓఎస్‌ వల్లే ఆ బరువు పెరిగానన్న విషయం ఎవరూ అర్థం చేసుకోలేదని చెబుతోందీ సుందరి.

‘బిగ్‌బాస్‌-13లో పాల్గొనక ముందు, పాల్గొన్న తర్వాత సోషల్‌ మీడియాలో నన్ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. నా శరీరాకృతి గురించి ఏవేవో కామెంట్లు చేసేవారు. నాకు పీసీఓఎస్‌ ఉంది.. ఈ విషయం ఎవరూ అర్థం చేసుకోకుండా ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ ఈ సమస్య గురించి ఆన్‌లైన్‌లో వెతకండి.. దీని పర్యవసానాలేంటో తెలుసుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు పీసీఓఎస్‌ గురించి తప్పకుండా అవగాహన పెంచుకోవాలి. ఈ సమస్య కారణంగా ఒక్కోసారి ఎక్కువగా బరువు పెరిగిపోతాం.. ఒక్కోసారి ఊహించలేనంతగా తగ్గుతుంటాం. నా సమస్య కూడా అదే! దీనివల్ల నా బీపీలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఇదిలా ఉంటే ఇతరులు అనే మాటలు నన్ను మానసికంగా మరింత ఇబ్బంది పెట్టేవి. దీన్నుంచి బయటపడడానికి సైకియాట్రిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్‌ తీసుకున్నా. పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టా. బరువు తగ్గడానికి రెండుసార్లు ఆపరేషన్‌ కూడా చేయించుకున్నా.. అలా బరువును అదుపులోకి తెచ్చుకున్నా. ఇప్పటికీ నా చుట్టూ పాజిటివ్‌ వ్యక్తులుండేలా జాగ్రత్తపడుతున్నా..’ అంటోందీ క్యూటీ.అందుకే గడ్డం, మీసాలు తొలగించలేదు!

View this post on Instagram

A post shared by Harnaam Kaur (@harnaamkaur) on

పీసీఓఎస్‌ ముఖంపై అవాంఛిత రోమాలు రావడానికి కూడా కారణమవుతుంది. అయితే చాలామంది ఇబ్బందిగా ఫీలై వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉంటారు. కానీ తాను మాత్రం అలా కాదని, తనెలా ఉన్నా తనని తాను ప్రేమించుకుంటానంటోంది మోడల్‌, యాక్టివిస్ట్‌, మోటివేషనల్‌ స్పీకర్‌ హర్నామ్‌ కౌర్‌. ఇంగ్లండ్‌కు చెందిన ఆమె పీసీఓఎస్‌ కారణంగా తన ముఖంపై పెరిగిన గడ్డం, మీసాలను తొలగించుకోకుండా అలాగే ఉంచుకోవడంతో పాటు.. తాను తీసుకున్న ప్రతి ఫొటోనూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ బాడీ పాజిటివిటీని చాటుతుంటుంది.

‘12 ఏళ్ల వయసులో నాకు పీసీఓఎస్‌ ఉందని తెలిసింది. దీని ప్రభావంతో నాకు మీసాలు, గడ్డం రావడం మొదలైంది. ఇది చూసి చాలామంది నన్ను హేళన చేసేవారు. దీంతో మొదట్లో ఈ అవాంఛిత రోమాల్ని తీసేద్దామనుకున్నా. కానీ ‘ఇతరుల కోసం నేనెందుకు మారాలి.. నా శరీరాన్ని నేనెందుకు అసహ్యించుకోవాలి’ అనుకున్నా. అందుకే నాతో పాటే నా మీసాలు, గడ్డం పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సమాజంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళలందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే! దీని గురించి మీ మనసులోనే దాచుకొని కుంగిపోకండి. డాక్టర్‌ సలహాతో సరైన చికిత్స తీసుకోండి. ఈ సమస్య మానసికంగా కూడా కుంగదీస్తుంది. అలాగని ఆ ఫీలింగ్స్‌ని మీలోనే దాచుకుంటే సమస్య జఠిలమవుతుంది. కాబట్టి నలుగురితో పంచుకోండి. ఒకవేళ ఇతరుల నుంచి బాడీ షేమింగ్‌ ఎదురైనా ఆ మాటల్ని పట్టించుకోకండి. ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోండి. ఇలా మీ ఆలోచనా ధోరణి మారినప్పుడే మిమ్మల్ని మీరు అంగీకరించగలుగుతారు..’ అంటూ చక్కటి సందేశంతో అందరిలో స్ఫూర్తి నింపుతోంది హర్నామ్.
పీసీఓఎస్‌ అనేది మనం కావాలని సృష్టించుకున్న సమస్య కాదు.. అలాంటప్పుడు మనమెందుకు బాధపడాలి? ఇతరులు అన్న మాటలు ఎందుకు పట్టించుకోవాలి? ఇది దీర్ఘకాలిక సమస్యే కావచ్చు.. కానీ చక్కటి లైఫ్‌స్టైల్‌తో, అవసరమైతే మందులతో, ప్రత్యేక చికిత్సలతో దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీలో మీరే మధనపడిపోయి ఆందోళనకు గురవడం, ఆరోగ్యాన్ని మరింతగా పాడు చేసుకోవడం ఎంతమాత్రం కరక్ట్ కాదు. కాబట్టి బాధపడకుండా, ఇతరులేమనుకుంటారోనని వెనకడుగు వేయకుండా సమస్య నివారణ కోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే- మీ పీసీఓఎస్‌ అనుభవాలను ‘వసుంధర.నెట్‌’ వేదికగా అందరితో పంచుకోండి.. మీ స్ఫూర్తితో మరో నలుగురు ముందుకొచ్చేలా వారిలో ధైర్యం నింపండి!

Also Read:
అమ్మ ప్రోత్సాహం వల్లే 35 కిలోలు తగ్గా!
96 కిలోల పిజ్జా గర్ల్‌ నుంచి ఫిట్టెస్ట్‌ గర్ల్‌గా ఇలా మారా!

women icon@teamvasundhara
anaita-shroff-adajania-shares-her-experiences-on-playing-kajol’s-friend-in-ddlj

అప్పుడు అక్కడ షారుఖ్‌ నా కోసమే ఎదురుచూస్తున్నాడనుకున్నా!

నటన అంటే ఇష్టమున్న వాళ్లు సినిమా అవకాశాల కోసం పరితపించిపోతుంటారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే చిన్న పాత్రలో అవకాశమొచ్చినా ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది అసలు నటన గురించి తెలియకపోయినా, చిత్ర పరిశ్రమతో సంబంధం లేకపోయినా నటించే అవకాశం తలుపు తడితే.. అదీ స్టార్‌ నటీనటుల సరసన అయితే.. ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదా! అలాంటి అరుదైన అవకాశమే తనను వరించిందంటోంది బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ అనైతా ష్రాఫ్‌ అదజానియా. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ గురించి బొత్తిగా తనకు తెలియదని, అలాంటి సమయంలో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి హిట్‌ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమంటోంది. ఈ చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు అనైతా.

Know More

women icon@teamvasundhara
amrita-rao-confirms-her-pregnancy-in-telugu

కరోనా గురించి కడుపులో ఉన్న నా బేబీకి కూడా తెలిసిపోయిందేమో!

అమ్మతనం ఓ అద్భుతం. గర్భం ధరించడం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటారు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది అమృతా రావు. ‘అతిథి’ సినిమాలో మహేశ్‌ సరసన నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార త్వరలోనే తల్లి కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నానంటూ తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
what-is-in-my-box-?-anchor-suma-kanakala-shares-her-diet-secrets-through-a-video

సుమక్క ఎనర్జీ సీక్రెట్‌ ఇదేనట!

గలగల పారే సెలయేరుల్లాంటి మాటలు, సందర్భానికి తగినట్లుగా సంధించే హాస్యఛలోక్తులు, ముఖంపై చెరగని చిరునవ్వుతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల. తాను స్టేజీ మీదకు అడుగుపెట్టిందంటే అటు ప్రేక్షకుల్లో, ఇటు టీవీల ముందు కూర్చున్న మహిళామణుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. మరి, మనలో ఇంతటి ఎనర్జీని బూస్టప్‌ చేస్తోన్న మన సుమక్క ఎనర్జీ సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ఆ రహస్యాన్ని ఇటీవలే బయటపెట్టిందీ సూపర్బ్‌ యాంకర్‌. అంతేనా.. తాను ఇంత అందంగా, యాక్టివ్‌గా ఉండడానికి తాను పాటించే ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లే కారణమని చెబుతూ తన డైట్‌ సీక్రెట్స్‌ని ఓ వీడియోలో భాగంగా పంచుకుంది సుమ. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-actress-shikha-malhotra-tests-covid-19-positive-and-shares-her-experiences-about-fighting-with-this-virus

కరోనా ఇంకా మన చుట్టూనే ఉంది.. 'ఏం కాదులే' అనుకోవద్దు!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా లెక్కచేయకుండా ఉచితంగా సేవ చేయడానికి కదులుతూ తమలోని సేవాభావాన్ని, మంచి మనసును ప్రపంచానికి చాటుతున్నారు మరికొందరు మహిళలు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది - బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా. నర్సింగ్‌ కోర్సు చదువుతూనే నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవకే ఓటేసింది. ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా ముంబయిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా కరోనా బాధితులను కంటికి రెప్పలా కాచుకుంటోన్న ఆమె.. తాజాగా వైరస్‌ బారిన పడింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆస్పత్రిలో చేరిన శిఖ.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తనకు ఎదురవుతోన్న అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూనే.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కరోనా జాగ్రత్తలు చెబుతూ అందరినీ అలర్ట్‌ చేస్తోందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
meghana-raj-on-her-pregnancy-and-husband-chiranjeevi-sarja-in-telugu
women icon@teamvasundhara
niti-taylor-reveals-she-tied-knot-parikshit-in-august-in-telugu

ఇప్పుడు ‘హలో హజ్బెండ్‌’ అని గట్టిగా కేకలు వేయగలను!

ఎనిమిదేళ్ల క్రితం ‘మేం వయసుకు వచ్చాం’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది నీతి టేలర్‌. ఆ సినిమాలో ‘దిల్’ అనే ముస్లిం యువతి పాత్రలో కుర్రకారు మనసులను కొల్లగొట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘పెళ్లి పుస్తకం’, ‘లవ్‌డాట్‌ కామ్‌’ అనే సినిమాల్లో సందడి చేసిన ఈ అందాల తార ఆ తర్వాత బాలీవుడ్‌ బుల్లితెరకు వెళ్లిపోయింది. పలు సీరియళ్లు, మ్యూజిక్ వీడియోలతో మెప్పించి టెలివిజన్‌ స్టార్‌గా మారిపోయింది. ఇలా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆగస్టులో తన చిరకాల స్నేహితుడు పరీక్షిత్‌ బవాతో కలిసి పెళ్లిపీటలెక్కినట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిందీ ముద్దుగుమ్మ. తద్వారా తన అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా నీతి టేలర్ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

Know More

women icon@teamvasundhara
sharukh-khan-daughter-suhana-khan-inspirational-social-media-post-on-end-colourism

‘నల్ల పిల్లి’ అని హేళన చేసేవారు..!

‘చూడ్డానికి తెల్లగా ఉండాలి.. ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా ఉండాలి.. ఐదున్నర అడుగుల ఎత్తుండాలి.. దానికి తగ్గ చక్కటి శరీర సౌష్టవం ఉండాలి.. అప్పుడే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్లు లెక్క!’... ఇదీ అందం గురించి ఇప్పటికీ సమాజంలో చాలామందికి ఉండే అభిప్రాయం. వీటిలో ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా చుట్టూ ఉండే వారు ఆమెపై విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోల్స్‌, బాడీ షేమింగ్‌ కామెంట్లు మరీ మితిమీరిపోతున్నాయి. సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌ తప్పట్లేదు. అయితే వీటిని పంచుకోకుండా తమలోనే దాచుకునే వారు కొందరైతే.. తాము ఎదుర్కొన్న మాటల తూటాల్ని నలుగురితో పంచుకొని బాడీ షేమింగ్‌ని అణచివేయాలని ధైర్యంగా ముందుకొచ్చే వారు మరికొందరు.

Know More

women icon@teamvasundhara
allu-arjun-wishes-wife-sneha-reddy-on-her-birthday-shares-an-adorable-pic

ఇలా ఎప్పటికీ నీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నా!

టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహల జంట కూడా ఒకటి. తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్‌. ఇక సినిమాలతో పాటు కుటుంబానికి అంతే ప్రాధాన్యమిస్తాడు బన్నీ. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. ఈ క్రమంలో తాజాగా తన భార్య పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడీ స్టైలిష్‌ స్టార్. ఈ సందర్భంగా కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఓ పార్టీ ఏర్పాటు చేసిన బన్నీ... తన జీవిత భాగస్వామితో కేక్‌ కట్‌ చేయించాడు.

Know More

women icon@teamvasundhara
me-and-irrfan-wanted-to-have-a-daughter-desperately-says-sutapa-sikdar

అప్పుడు మాకు అమ్మాయే పుట్టాలని కోరుకున్నాం!

ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు...చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. ఇక ఇంట్లో కూతురు పుట్టిందంటే ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’, ‘మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది’ అని అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇలా ఆనందాలు కురిపించే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తమకూ ఓ ఆడపిల్ల పుడితే బాగుండేదని... తన భర్త కూడా ఇదే కోరుకున్నాడంటోంది దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సతీమణి సుతపా సిక్దార్‌. ఈ క్రమంలో ‘డాటర్స్‌ డే’ ను పురస్కరించుకుని ఆమె ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-shares-tips-that-help-her-with-pcos-in-new-post

ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!

పీసీఓఎస్‌/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్‌ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్‌, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్‌ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-who-was-shooting-for-mere-dad-ki-dulhan-tests-covid-19-positive

అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకున్నా.. ఇప్పుడు బాగానే ఉన్నా!

బయటికెళ్తే కరోనా వస్తుందన్న భయం.. ఇంట్లోనే ఉంటే ఓ రకమైన మానసిక ఒత్తిడి.. ప్రస్తుతం చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ కరోనా వచ్చినా దాన్నుంచి కోలుకుంటామో, లేదోనన్న టెన్షన్‌తో అనుక్షణం భయపడిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం వారి కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. అలాంటి వారిలో పలువురు నటీమణులు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఇటీవలే తనకు కొవిడ్‌ నిర్ధారణ అయిందని, అయితే ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ క్రమంలో తాను పాటిస్తోన్న పలు జాగ్రత్తల్ని కూడా పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
vithika-sheru-shares-about-her-depression-through-a-heart-touching-video

అది కరోనా కన్నా ప్రమాదకరమైంది!

తామెలా ఉన్నామో చూసుకోకుండా ఇతరుల్ని కామెంట్‌ చేయడం, విమర్శించడం చాలామందికి అలవాటు. ఇలాంటివి ఎదుటివారిని బాధపెడతాయేమోనన్న కనీస ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు కొంతమంది. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోలింగ్‌కి హద్దే ఉండదు. ఇక ఇలా తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా వదిలేసే వారు కొందరైతే.. వాటి మూలంగా కలిగిన బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లే వారు మరికొందరు. ఈ రెండో జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ వితికా షేరు. గతేడాది ఓ రియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌కి తట్టుకోలేకపోయానని, అవి క్రమంగా తనని కుంగదీశాయంటూ తన మనసులోని ఆవేదనను ఓ సుదీర్ఘ వీడియో రూపంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో తాను రూపొందించిన ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
malaika-arora-shares-her-experience-after-beating-corona-in-telugu

ఆ జాగ్రత్తలే నన్ను కరోనా నుంచి కోలుకునేలా చేశాయి!

కరోనా మహమ్మారి బారిన పడి దాన్నుంచి కోలుకున్నారంటే ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడిపోతున్నారంతా! ఆ సంతోషంలోనే తమ కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా కూడా ప్రస్తుతం అంతకుమించిన ఆనందంలోనే తేలియాడుతోంది. ఇందుకు కారణం ఆమె వైరస్‌ను జయించడమే! ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందిన ఆమెకు తాజా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. దీంతో ఎన్నో రోజుల తర్వాత తన గది నుంచి బయటకొచ్చానంటూ విజయ దరహాసాన్ని ప్రదర్శిస్తోన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ బేబ్‌. అంతేకాదు.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలనూ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది మలైకా. మరి, ఈ ముద్దుగుమ్మ తన కొవిడ్‌ జర్నీ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
singer-chinmayi-sripada-records-song-dedications-to-raise-funds-for-the-needy

వారికోసం 3 వేల పాటలు.. 85 లక్షలు.. దటీజ్ చిన్మయి!

తన శ్రావ్యమైన స్వరంతో సంగీత ప్రియుల్ని అలరించే బ్యూటిఫుల్‌ సింగర్‌ చిన్మయీ శ్రీపాద. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై స్పందించే ఈ గాయని.. తన సేవా భావంతోనూ అశేష అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే తన సంగీత కళను ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సేవ కోసమే వినియోగిస్తోందీ సూపర్‌ సింగర్‌. తన ప్రియమైన అభిమానులు అడిగిన పాటలు పాడుతూ, వారికి విషెస్‌ చెబుతూ లక్షల కొద్దీ విరాళాలు సేకరిస్తోందీ ముద్దుగుమ్మ. ఇలా పోగైన మొత్తాన్ని ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగిస్తోంది. ఇలా మరోసారి తన సేవాభావంతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల గాయని.

Know More

women icon@teamvasundhara
here-is-the-lesson-tejaswi-madivada-learnt-from-covid-19-in-telugu

ఎవరి కోసమో నేనెందుకు మారాలి?!

ఎవరినైనా చూస్తే చాలు.. వారిలో ఏం లోపముందా? అనే వెతుకుతుంటాయి చాలామంది కళ్లు. ఇక నిజంగానే వారి శరీరాకృతిలో ఏదైనా లోపమున్నా, చర్మ ఛాయ తక్కువగా ఉన్నా.. ఏదో ఒక మాట అనేదాకా ఊరుకోవు వాళ్ల నోళ్లు! అసలు ముందు వాళ్లు ఎలా ఉన్నారో చూసుకోకుండా, ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందేమో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా ఇతరుల శరీరాకృతి, అందం గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి బాడీ షేమింగ్‌కు తాను కూడా బాధితురాలినే అంటోంది టాలీవుడ్‌ భామ తేజస్వీ మదివాడ. దీని కారణంగా తాను ఎంతో బాధను అనుభవించానని, అయితే ఇతరుల కోసం మనం మారాల్సిన అవసరం లేదని ఆలస్యంగా గ్రహించానని చెబుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తన కోసం తాను సమయం కేటాయించుకోవడం వల్ల బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది ఈ ఐస్‌క్రీమ్‌ బ్యూటీ..

Know More

women icon@teamvasundhara
indian-model-paula-accuses-bollywood-director-of-sexual-harassment-when-she-was-17

ఆఫర్‌ కావాలంటే దుస్తులు విప్పమన్నాడు!

పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలన్న మహిళల ఆశయాన్ని ఆసరాగా చేసుకుని, తమ అవసరాలు తీర్చుకోవాలని చూసే మగవాళ్లు ప్రతి రంగంలోనూ ఉన్నారు. సినీ రంగమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే చిత్ర సీమలో ఉన్న ఇలాంటి కొందరు మగాళ్ల ఆగడాలను బయటపెట్టే క్రమంలో తెరమీదకొచ్చిందే ‘మీటూ ఇండియా’ ఉద్యమం. ఎక్కడో అమెరికన్‌ చిత్ర పరిశ్రమలో మొదలైన ‘మీటూ’ దావానలంలా విస్తరిస్తూ మనదాకా చేరింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమంలో భాగంగా ఎందరో సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. మరెందరో మహిళా సెలబ్రిటీలు తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెట్టారు. అయితే అది అక్కడితో సమసిపోలేదు. ఇప్పటికీ కొంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెడుతూనే ఉన్నారు. అలా తాజాగా ప్రముఖ భారతీయ మోడల్‌ పౌలా మీటూ ఉద్యమాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. తన కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెబుతూ ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
padma-lakshmi-shows-how-50-is-the-new-30-in-her-birthday-post

ఇంకా 30లోనే ఉన్నట్లుంది!

పద్మాలక్ష్మి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ప్రముఖ మాజీ మోడల్‌. ప్రస్తుతం అమెరికన్‌ టీవీ ఛానల్స్‌లో టాప్‌ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అందాల తార మంచి రచయిత్రి కూడా. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఈ ప్రవాస భారతీయురాలు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం మహిళల్లో స్ఫూర్తి కలిగించే పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టిన పద్మ... తన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
amitabh-bachchan’s-grand-daughter-navya-naveli-nanda-opens-up-about-struggle-with-anxiety-seeking-therapy

సిగ్గు పడకండి.. అలాంటప్పుడు బయటికి చెప్పుకోండి..!

మనసులో ఎంత బాధున్నా బయటికి చెప్పరు చాలామంది. ఒకవేళ తమ సమస్య గురించి నలుగురికీ చెప్తే ఎక్కడ పలుచనైపోతామో, నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే వారితో వెనకడుగు వేయిస్తుంది. ఇలా చేస్తే ఆ బాధ తీవ్రత క్రమంగా పెరిగి పెరిగి మన మనసునే తొలిచేసే స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. ఇలా పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ జబ్బు ఇప్పుడు చాలామంది పాలిట శాపంగా పరిణమిస్తోంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు. ఇలా తాము ఎదుర్కొన్న మానసిక సమస్య గురించి బయటికి చెప్పి సామాన్యుల్లో ధైర్యాన్ని నింపిన అందాల తారలు ఎంతోమంది! ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా. గత కొంత కాలంగా యాంగ్జైటీతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దాన్నుంచి విముక్తి పొందేందుకు థెరపీ తీసుకుంటున్నానంటూ ఈ మానసిక వ్యాధి నుంచి బయటపడే మార్గాల్ని చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపిందీ క్యూటీ.

Know More

women icon@teamvasundhara
on-the-account-of-national-nutrition-week-manushi-chillar-conduct-ask-me-session-with-fans-shares-her-healthy-food-habits

హాస్టల్ ఫుడ్ తిని బాగా లావయ్యా.. అప్పుడలా సన్నబడ్డా!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అవును మరి.. మనం ఏ పనిచేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా పూర్తిచేయగలుగుతాం. అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో పోషకాహారం, ఆరోగ్యం గురించి అందరిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్‌ 1-7 వరకు ‘జాతీయ పోషకాహార వారం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ పోషకాహారం గురించి అందరిలో అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుందీ బ్యూటీ. ఒకప్పుడు లావుగా ఉన్న తాను చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్లే లావు తగ్గానని, అప్పట్నుంచి చక్కటి ఆహారపుటలవాట్లను అలాగే కొనసాగిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన ఆహారపుటలవాట్లు, ఆరోగ్య రహస్యాల గురించి ‘ఆస్క్‌ మీ సెషన్‌’ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిందీ హరియాణా అందం. మరి, ఈ చక్కనమ్మ పంచుకున్న ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
mira-kapoor-took-to-instagram-to-reveal-her-favourite-indian-foods-and-desserts-among-other-things-in-an-ask-me-anything-session-with-fans

మేమిద్దరం.. మాకిద్దరు.. అంతే!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అర్ధాంగిగానే కాదు.. తన అందంతో, తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో అనతికాలంలోనే సెలబ్రిటీగా మారిపోయిందీ బ్యూటీ. ఓ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ పరిపూర్ణ మహిళకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంటుందీ అందాల అమ్మ. తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకునే మీరా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఈ వేదికగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం, తన ఇద్దరు చిన్నారుల గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ చూసేద్దామా?!

Know More

women icon@teamvasundhara
nia-sharma-wins-khatron-ke-khiladi-made-in-india-trophy-in-telugu

నన్ను విమర్శించే వారికి ఇదే నా సమాధానం!

బాలీవుడ్‌ టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్‌ ఇండియా’. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు, భయానికి గురిచేసే సాహస కృత్యాలతో కూడిన ఈ అడ్వెంచరస్‌ టీవీ షోకు అభిమానుల ఆదరణ బాగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్టసాధ్యమైన టాస్క్‌లన్నింటినీ సమర్ధంగా పూర్తి చేసి ఈ సీజన్‌ విజేతగా నిలిచింది నియా శర్మ. మూడేళ్ల క్రితం ఇదే ‘ఖత్రోంకీ ఖిలాడీ 8’ సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన నియా.. ఈ సీజన్‌ ఆసాంతం తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నియా శర్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
these-bollywood-beauties-turned-into-gardeners-amid-pandemic

ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది.. మీకూ కావాలా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న మాట వాస్తవమే అయినా.. చాలామందికి జీవితం విలువేంటో తెలియజేస్తోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో పాఠాలు నేర్పుతోంది. అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా చేస్తోంది. గార్డెనింగ్‌ కూడా ఇందులో ఓ భాగమే! ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లి ఆపద కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతోనో.. లేదంటే సహజ పద్ధతుల్లో ఇంటి ఆవరణలోనే పండించిన కాయగూరలు ఆరోగ్యకరమన్న విషయం గ్రహించో.. ఇలా కారణమేదైనా చాలామంది హోమ్‌ గార్డెనింగ్‌కే ఓటేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు.

Know More

women icon@teamvasundhara
kamya-punjabi-opens-up-on-divorce-and-second-marriage-in-telugu
women icon@teamvasundhara
anasuya-bharadwaj-revealed-many-lesser-known-facts-about-her-life-in-alitho-saradaga-show

నా పొగరు, ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చుంటాయి!

అందం, అణకువ, వాక్చాతుర్యం.. ఇలా ఒక వ్యాఖ్యాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది అందాల యాంకర్‌ అనసూయ. ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై సందడి చేస్తూ ప్రతి ఇంట్లో ఆడపడుచులా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తన చలాకీ మాటలతో, చిరునవ్వుతో అందరినీ పలకరించే అను.. ‘రంగమ్మత్త’గా సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని, అమ్మ వల్లే ఇప్పుడిలా ఉన్నానంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మనకు తెలియని బోలెడన్ని విషయాలు పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
actress-kasturi-in-alitho-saradaga-chat-show

రోజూ ఆ ముగ్గురికీ ‘థ్యాంక్స్‌’ చెప్పాకనే నిద్ర పోతాను!

‘ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా’ అంటూ ‘అన్నమయ్య’ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది కస్తూరి. తమిళ ఇంట్లో పుట్టినా... అచ్చమైన తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ భామ ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్‌ కూతురిగా కూడా నటించింది. వీటితో పాటు ‘నిప్పురవ్వ’, ‘మెరుపు’ ‘సోగ్గాడి పెళ్లాం’, ‘మా ఆయన బంగారం’, ‘చిలక్కొట్టుడు’, ‘ఆకాశవీధిలో’, ‘డాన్ శీను’, ‘శమంతకమణి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ఈ సొగసరి పలు తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ సందడి చేసింది. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకుంది.

Know More