scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నా పొగరు, ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చుంటాయి!

Anasuya Bharadwaj revealed many lesser known facts about her life in alitho saradaga show

అందం, అణకువ, వాక్చాతుర్యం.. ఇలా ఒక వ్యాఖ్యాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది అందాల యాంకర్‌ అనసూయ. ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై సందడి చేస్తూ ప్రతి ఇంట్లో ఆడపడుచులా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తన చలాకీ మాటలతో, చిరునవ్వుతో అందరినీ పలకరించే అను.. ‘రంగమ్మత్త’గా సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని, అమ్మ వల్లే ఇప్పుడిలా ఉన్నానంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మనకు తెలియని బోలెడన్ని విషయాలు పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


మీ అసలు పేరు పవిత్రా?
అనసూయ: అమ్మ నా పేరు పవిత్ర అని పెడదామనుకున్నారట. నాన్నగారి కుటుంబం నుంచి చూస్తే నేనే మొదటి ఆడపిల్లను. దీంతో వాళ్లమ్మ పుట్టిందనుకొని ఆ పేరు పెట్టారు. అలా నా పేరు అనసూయ అయింది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


అనసూయ పేరు కలిసొచ్చిందా? పవిత్ర పెడితే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా?
చాలాసార్లు అనుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో చాలామంది కావాలని గట్టిగా ‘అనసూయ’ అంటూ పిలిచేవారు. అప్పటి నుంచి ఎవరైనా ‘అను’ అని పిలిస్తేనే పలికేదాన్ని. ఎన్‌సీసీలో చేరిన తర్వాత ‘అనసూయ’ పేరు వెనుక ఉన్న కథ తెలిసి సిగ్గుపడ్డా. ఆ తర్వాత ఎవరు ఎలా పిలిచినా పట్టించుకునే దాన్ని కాదు.
టీవీ ఇండస్ట్రీకి రాకముందు అనసూయ ఎవరు? ఏ ఊరు? ఏం చదువుకుంది?
నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్‌. హెచ్‌ఆర్‌ మేజర్‌ తీసుకున్నా. ఒక విజువల్‌ ఎఫెక్ట్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా కూడా పనిచేశా. అంతకన్నా ముందు బ్యాంకులో టెలీకాలర్‌గా చేశా. రూ.5 వేలు జీతం.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


మీ ఆయన భరద్వాజ్‌ పరిచయం ఎలా?
సుశాంక్‌ భరద్వాజ్‌ను ఎన్‌సీసీలో కలిశా. అదొక పెద్ద స్టోరీలెండి. ఎవరికైనా చెబితే, ‘ఎన్‌సీసీలో ట్రైనింగ్‌కు వెళ్లకుండా లవ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారా?’ అని అంటారని ఎవరికీ చెప్పను.
మీ లవ్‌స్టోరీ ఇంట్లో తెలిసి తొలుత ఒప్పుకోలేదట!
అవునండీ. సుశాంక్‌ కూడా ‘పెళ్లి చేసుకుందామా?’ అని అన్నాడు. వెంటనే ఈ విషయాన్ని అమ్మకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. ‘వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’ అని నేను అంటే, ‘మన కుటుంబాల్లో గౌరవం ఉండదు’ అని సుశాంక్‌ ఆపారు. 9 సంవత్సరాల తర్వాత ఒప్పుకొన్నారు. పెళ్లి కూడా అయిష్టంగానే జరిగింది. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అందరం ఒక్కటయ్యాం.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


టెలివిజన్‌ రంగానికి రావాలని ఎందుకు అనిపించింది?
స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎత్తుగా ఉండటంతో ‘నువ్వు మోడల్‌ అవ్వొచ్చు కదా’ అనేవారు. పిక్సలాయిడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నప్పుడు చాలామంది దర్శకులు వచ్చేవారు. వారిలో సుకుమార్‌ గారు కూడా ఉన్నారు. అప్పట్లోనే ‘ఆర్య’ సినిమాలో చేయమని అడిగారు. ప్రతి తెలుగు ఇంట్లో సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భయం ఉంటుంది. నాకు కూడా ఉండేదేమో..! పైగా నాకు అప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయింది. చాలా సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ‘వద్దు’ అని చెప్పేదాన్ని. చివరకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూస్‌ రీడర్‌గా చేరాను.
సోషల్‌ మీడియాలో మీ మీద ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంటుంది?
‘అత్తారింటికి దారేది’ సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్రోలింగ్‌ మొదలైంది. అప్పుడు ట్విటర్‌కు కొత్త. ‘ఆ పాటలో నేను లేను. గుంపులో గోవిందంలా లేకపోవడం మంచిది అయింది’ అని ట్వీట్‌ చేశా. అంతే, ట్రోలింగ్‌ మొదలైంది. ఒక ఆర్టిస్ట్‌గా ఫోకస్‌ మొత్తం మనపై ఉండాలనుకోవడం తప్పు కాదు కదా! నేను ఒక్కదాన్ని అయితే చేసేదాన్నేమో. పైగా నేను ఆరునెలల గర్భవతిని. బహుశా ఆ పాట చేయకపోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉండచ్చు. ట్రోలింగ్‌ విషయానికొస్తే, కొందరు నెటిజన్లకు ‘తెలుగింటి అమ్మాయిలు అంటే లోకువ’ అని ఒకప్పుడు బాధేసేది. వివరణలు ఇచ్చుకుంటూ ఉండేదాన్ని. చాలా డిప్రెషన్‌లోకి వెళ్లేదాన్ని. అప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


డెలివరీ తర్వాత ఏ మహిళ అయినా, శారీరకంగా, మానసికంగా వీక్‌ అయిపోతారు. కానీ, నా శ్రేయోభిలాషుల వల్ల నేను త్వరగా కోలుకున్నా. ఇప్పటికీ కొందరు ఉన్నారు. నేను ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయిస్తారు. ‘నేను నొప్పులు పడి.. నేను కని.. నేను పెంచుకుంటున్నా. కష్టమంతా నాది’. కానీ, వాళ్లు ‘నువ్వు తల్లివి.. అలా ఉండలేవా’ అంటుంటారు. ఇక ఎవరినీ ఉపేక్షించాలనుకోలేదు. అందుకే రెబల్‌గా మారా. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా కొంచెం తగ్గాను. నా దగ్గర ఎంతోమంది మీద ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. ఒక్కరినీ వదిలేది లేదు. ఇలా ట్రోల్స్‌ చేసే వారిని కీబోర్డ్‌ వారియర్స్‌ అంటాను. ఎదురుగా నిలబడితే ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అమ్మవారిని దైవంగా కొలిచే ఈ దేశంలో ఒక మహిళపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నా పిల్లలను, నా భర్తను కూడా ఇందులోకి లాగుతారు.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


మీ అమ్మగారి నుంచి మీకు సపోర్ట్‌ ఎలా ఉండేది?
నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆమే కారణం. నేను షూటింగ్‌కు, మా ఆయన జాబ్‌కు వెళ్లిపోతే, నా పిల్లలను అమ్మ జాగ్రత్తగా చూసుకునేది. ఒకవేళ నా పిల్లలకు పిల్లలు పుట్టాలనుకున్నప్పుడు ‘నా వల్ల కాదు.. మీరు చూసుకునే వీలుంటే కనండి’ అని చెప్పేస్తా. మా కోసం అమ్మ చాలా కష్టపడ్డారు. ఇంటి అద్దె కట్టేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది. స్కూల్‌ ఫీజు కట్టకపోతే నిలబడిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మ.. పక్కింటి వాళ్ల చీరలకు ఫాల్స్‌ కుట్టి; నాకు-చెల్లెళ్లకు దుస్తులు కొనేది.. స్కూల్‌ ఫీజులు కట్టేది. నా జీవితంలో చిన్నప్పటి నుంచి తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. 50 పైసలు కలిసి వస్తుందని, రెండు స్టాప్‌లు నడిచి వెళ్లి బస్సు ఎక్కేదాన్ని. నా పొగరు.. బలుపు.. ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చి ఉంటాయి. ఎలా బతకాలో కూడా ఆమె నుంచి నేర్చుకున్నా.
మీ మొదటి సినిమా ఏది?
మొదటగా ఒప్పుకొన్నది ‘క్షణం’.. విడుదలైంది మాత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’.
‘కథనం’ ఫ్లాప్‌ తర్వాత 15 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట!
నేనెప్పుడూ ఒక సినిమా నా భుజాలపై మోసుకెళ్లాలని అనుకోలేదు. ఎవరూ ఫ్లాప్‌ సినిమా తీద్దామని మొదలు పెట్టరు కదా! ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపిస్తాం. అందుకే నాకు బాధగా అనిపించింది. ఆ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


‘రంగమ్మత్త’ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది?
డబ్బుల కోసం ఆ సినిమా చేయలేదు. టీవీ నుంచే నాకు బోలెడంత వస్తుంది. లేకపోతే మా ఆయన ఇస్తాడు. టీవీలో నా ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. టెలివిజన్‌ నా ఇల్లు. నేను సినిమాల్లో ఎందుకు నటిస్తున్నానంటే.. నన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లు.. ఎక్స్‌పోజింగ్‌తో నెట్టుకొస్తున్నానని కామెంట్‌ చేసేవాళ్ల నోళ్లు మూయించడానికే సినిమాలు చేస్తున్నా. సినిమాల్లో వేరే అనసూయను చూడాలి. ‘రంగమ్మత్త’ కోసం నాకంటే ముందు 20మందిని ఆడిషన్‌ చేశారట. ఆ అవకాశం నాకు వచ్చింది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో రంగమ్మత్త ‘ది బెస్ట్’.
ఎవరైనా ఒకరికి థ్యాంక్స్‌.. మరొకరికి వార్నింగ్‌ ఇవ్వాలంటే ఎవరెవరికి ఇస్తారు?
నాకు అవకాశం ఇచ్చిన ప్రతి దర్శకుడికి, నిర్మాతకు థ్యాంక్స్‌..! వాళ్ల వల్లే చాలామంది తెలుగు అమ్మాయిలు ఇంకా కలలు కనగలుగుతున్నారు. ముఖ్యంగా అడవి శేష్‌కు కృతజ్ఞతలు. ఇక ఎవరైనా యూట్యూబ్‌లో కింద కామెంట్‌ చేస్తే ఎవరినీ వదలను. ఈ జన్మలోనే మీ కర్మ మీరు అనుభవిస్తారు. ప్రేమను పంచండి.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


మంచి రెమ్యునరేషన్‌.. ముఖ్యమైన పాత్ర దేనికి మీ ఓటు?
ముఖ్యమైన పాత్రకే నా ఓటు..!
టీవీ/సినిమా దేనికి ప్రాధాన్యం?
ఎనీ టైమ్‌ టీవీ
మీరు సంగీతం నేర్చుకున్నారా?
ఆరు నెలలు కర్ణాటక సంగీతం, రెండు సంవత్సరాలు హిందుస్థానీ నేర్చుకున్నా. నేను గాయని కావాలనేది అమ్మ కోరిక.
వచ్చే జన్మలో ఏ జంతువులా పుట్టాలనుకుంటున్నారు?
ఏనుగు.. అదే నా స్ఫూర్తి జంతువు. ఈ ప్రపంచంలో తల్లి ఏనుగు పిల్లలపై చూపే ప్రేమ అపారం. అదే సమయంలో తన పార్ట్‌నర్ చనిపోతే తినకుండా ఆ ఏనుగు కూడా తనువు చాలిస్తుందట.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


మీ ఆయన పేరు మీ ఫోన్‌లో ఏమని ఉంటుంది?
నిక్కు
మీ ఆయన ఫోన్‌ ఆయనకు తెలియకుండా ఎప్పుడైనా చెక్‌ చేశారా?
రోజూ రాత్రి పూట చెక్‌ చేస్తా. నా జన్మతః వచ్చిన అధికారం అది. ఏదో సరదాగా మా పిల్లలు ఫొటోలు తీశారేమో చూస్తుంటా.
మీ ఫోన్‌ ఎప్పుడైనా మీ ఆయన చెక్‌ చేస్తారా?
చేస్తారేమో తెలియదు. అయినా, అన్ని విషయాలు ఆయనకు చెబుతా.
మీ హైట్‌కు, పర్సనాలిటీకి మీరొక పేరు పెట్టుకోవాలంటే ఏం పెట్టుకుంటారు?
ఖేలన్‌.. అంటే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ఎంతో ముఖ్యమని అర్థం. నా చేతిపై ట్యాటూ అదే.

ఒక్కమాటలో..!

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


నాన్న: పాపాజీ
అమ్మ: నా అస్తిత్వం
భర్త: సర్వస్వం
అత్త: స్వేచ్ఛ
టీవీ: పేరునిచ్చిన తల్లి
సినిమా: నాన్న
జబర్దస్త్: మరో కుటుంబం

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


రోజా: ఫైర్‌ బ్రాండ్‌, డైనమిక్
రామ్‌చరణ్: నా సిట్టిబాబు
ఎన్టీఆర్: తారక్‌లా తెలుగు మాట్లాడాలని ఉంటుంది.
సుకుమార్: నా సేవియర్
సుమ: అమ్మ తర్వాత ఎవరైనా ఉంటే సుమక్కే.
ఆలీ: మీరొక గార్డియన్





women icon@teamvasundhara
anaita-shroff-adajania-shares-her-experiences-on-playing-kajol’s-friend-in-ddlj

అప్పుడు అక్కడ షారుఖ్‌ నా కోసమే ఎదురుచూస్తున్నాడనుకున్నా!

నటన అంటే ఇష్టమున్న వాళ్లు సినిమా అవకాశాల కోసం పరితపించిపోతుంటారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే చిన్న పాత్రలో అవకాశమొచ్చినా ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది అసలు నటన గురించి తెలియకపోయినా, చిత్ర పరిశ్రమతో సంబంధం లేకపోయినా నటించే అవకాశం తలుపు తడితే.. అదీ స్టార్‌ నటీనటుల సరసన అయితే.. ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదా! అలాంటి అరుదైన అవకాశమే తనను వరించిందంటోంది బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ అనైతా ష్రాఫ్‌ అదజానియా. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ గురించి బొత్తిగా తనకు తెలియదని, అలాంటి సమయంలో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి హిట్‌ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమంటోంది. ఈ చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు అనైతా.

Know More

women icon@teamvasundhara
amrita-rao-confirms-her-pregnancy-in-telugu

కరోనా గురించి కడుపులో ఉన్న నా బేబీకి కూడా తెలిసిపోయిందేమో!

అమ్మతనం ఓ అద్భుతం. గర్భం ధరించడం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటారు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది అమృతా రావు. ‘అతిథి’ సినిమాలో మహేశ్‌ సరసన నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార త్వరలోనే తల్లి కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నానంటూ తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
what-is-in-my-box-?-anchor-suma-kanakala-shares-her-diet-secrets-through-a-video

సుమక్క ఎనర్జీ సీక్రెట్‌ ఇదేనట!

గలగల పారే సెలయేరుల్లాంటి మాటలు, సందర్భానికి తగినట్లుగా సంధించే హాస్యఛలోక్తులు, ముఖంపై చెరగని చిరునవ్వుతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల. తాను స్టేజీ మీదకు అడుగుపెట్టిందంటే అటు ప్రేక్షకుల్లో, ఇటు టీవీల ముందు కూర్చున్న మహిళామణుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. మరి, మనలో ఇంతటి ఎనర్జీని బూస్టప్‌ చేస్తోన్న మన సుమక్క ఎనర్జీ సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ఆ రహస్యాన్ని ఇటీవలే బయటపెట్టిందీ సూపర్బ్‌ యాంకర్‌. అంతేనా.. తాను ఇంత అందంగా, యాక్టివ్‌గా ఉండడానికి తాను పాటించే ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లే కారణమని చెబుతూ తన డైట్‌ సీక్రెట్స్‌ని ఓ వీడియోలో భాగంగా పంచుకుంది సుమ. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-actress-shikha-malhotra-tests-covid-19-positive-and-shares-her-experiences-about-fighting-with-this-virus

కరోనా ఇంకా మన చుట్టూనే ఉంది.. 'ఏం కాదులే' అనుకోవద్దు!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా లెక్కచేయకుండా ఉచితంగా సేవ చేయడానికి కదులుతూ తమలోని సేవాభావాన్ని, మంచి మనసును ప్రపంచానికి చాటుతున్నారు మరికొందరు మహిళలు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది - బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా. నర్సింగ్‌ కోర్సు చదువుతూనే నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవకే ఓటేసింది. ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా ముంబయిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా కరోనా బాధితులను కంటికి రెప్పలా కాచుకుంటోన్న ఆమె.. తాజాగా వైరస్‌ బారిన పడింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆస్పత్రిలో చేరిన శిఖ.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తనకు ఎదురవుతోన్న అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూనే.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కరోనా జాగ్రత్తలు చెబుతూ అందరినీ అలర్ట్‌ చేస్తోందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
meghana-raj-on-her-pregnancy-and-husband-chiranjeevi-sarja-in-telugu
women icon@teamvasundhara
niti-taylor-reveals-she-tied-knot-parikshit-in-august-in-telugu

ఇప్పుడు ‘హలో హజ్బెండ్‌’ అని గట్టిగా కేకలు వేయగలను!

ఎనిమిదేళ్ల క్రితం ‘మేం వయసుకు వచ్చాం’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది నీతి టేలర్‌. ఆ సినిమాలో ‘దిల్’ అనే ముస్లిం యువతి పాత్రలో కుర్రకారు మనసులను కొల్లగొట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘పెళ్లి పుస్తకం’, ‘లవ్‌డాట్‌ కామ్‌’ అనే సినిమాల్లో సందడి చేసిన ఈ అందాల తార ఆ తర్వాత బాలీవుడ్‌ బుల్లితెరకు వెళ్లిపోయింది. పలు సీరియళ్లు, మ్యూజిక్ వీడియోలతో మెప్పించి టెలివిజన్‌ స్టార్‌గా మారిపోయింది. ఇలా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆగస్టులో తన చిరకాల స్నేహితుడు పరీక్షిత్‌ బవాతో కలిసి పెళ్లిపీటలెక్కినట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిందీ ముద్దుగుమ్మ. తద్వారా తన అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా నీతి టేలర్ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

Know More

women icon@teamvasundhara
sharukh-khan-daughter-suhana-khan-inspirational-social-media-post-on-end-colourism

‘నల్ల పిల్లి’ అని హేళన చేసేవారు..!

‘చూడ్డానికి తెల్లగా ఉండాలి.. ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా ఉండాలి.. ఐదున్నర అడుగుల ఎత్తుండాలి.. దానికి తగ్గ చక్కటి శరీర సౌష్టవం ఉండాలి.. అప్పుడే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్లు లెక్క!’... ఇదీ అందం గురించి ఇప్పటికీ సమాజంలో చాలామందికి ఉండే అభిప్రాయం. వీటిలో ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా చుట్టూ ఉండే వారు ఆమెపై విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోల్స్‌, బాడీ షేమింగ్‌ కామెంట్లు మరీ మితిమీరిపోతున్నాయి. సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌ తప్పట్లేదు. అయితే వీటిని పంచుకోకుండా తమలోనే దాచుకునే వారు కొందరైతే.. తాము ఎదుర్కొన్న మాటల తూటాల్ని నలుగురితో పంచుకొని బాడీ షేమింగ్‌ని అణచివేయాలని ధైర్యంగా ముందుకొచ్చే వారు మరికొందరు.

Know More

women icon@teamvasundhara
allu-arjun-wishes-wife-sneha-reddy-on-her-birthday-shares-an-adorable-pic

ఇలా ఎప్పటికీ నీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నా!

టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహల జంట కూడా ఒకటి. తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్‌. ఇక సినిమాలతో పాటు కుటుంబానికి అంతే ప్రాధాన్యమిస్తాడు బన్నీ. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. ఈ క్రమంలో తాజాగా తన భార్య పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడీ స్టైలిష్‌ స్టార్. ఈ సందర్భంగా కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఓ పార్టీ ఏర్పాటు చేసిన బన్నీ... తన జీవిత భాగస్వామితో కేక్‌ కట్‌ చేయించాడు.

Know More

women icon@teamvasundhara
me-and-irrfan-wanted-to-have-a-daughter-desperately-says-sutapa-sikdar

అప్పుడు మాకు అమ్మాయే పుట్టాలని కోరుకున్నాం!

ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు...చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. ఇక ఇంట్లో కూతురు పుట్టిందంటే ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’, ‘మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది’ అని అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇలా ఆనందాలు కురిపించే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తమకూ ఓ ఆడపిల్ల పుడితే బాగుండేదని... తన భర్త కూడా ఇదే కోరుకున్నాడంటోంది దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సతీమణి సుతపా సిక్దార్‌. ఈ క్రమంలో ‘డాటర్స్‌ డే’ ను పురస్కరించుకుని ఆమె ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-shares-tips-that-help-her-with-pcos-in-new-post

ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!

పీసీఓఎస్‌/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్‌ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్‌, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్‌ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-who-was-shooting-for-mere-dad-ki-dulhan-tests-covid-19-positive

అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకున్నా.. ఇప్పుడు బాగానే ఉన్నా!

బయటికెళ్తే కరోనా వస్తుందన్న భయం.. ఇంట్లోనే ఉంటే ఓ రకమైన మానసిక ఒత్తిడి.. ప్రస్తుతం చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ కరోనా వచ్చినా దాన్నుంచి కోలుకుంటామో, లేదోనన్న టెన్షన్‌తో అనుక్షణం భయపడిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం వారి కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. అలాంటి వారిలో పలువురు నటీమణులు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఇటీవలే తనకు కొవిడ్‌ నిర్ధారణ అయిందని, అయితే ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ క్రమంలో తాను పాటిస్తోన్న పలు జాగ్రత్తల్ని కూడా పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
vithika-sheru-shares-about-her-depression-through-a-heart-touching-video

అది కరోనా కన్నా ప్రమాదకరమైంది!

తామెలా ఉన్నామో చూసుకోకుండా ఇతరుల్ని కామెంట్‌ చేయడం, విమర్శించడం చాలామందికి అలవాటు. ఇలాంటివి ఎదుటివారిని బాధపెడతాయేమోనన్న కనీస ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు కొంతమంది. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోలింగ్‌కి హద్దే ఉండదు. ఇక ఇలా తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా వదిలేసే వారు కొందరైతే.. వాటి మూలంగా కలిగిన బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లే వారు మరికొందరు. ఈ రెండో జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ వితికా షేరు. గతేడాది ఓ రియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌కి తట్టుకోలేకపోయానని, అవి క్రమంగా తనని కుంగదీశాయంటూ తన మనసులోని ఆవేదనను ఓ సుదీర్ఘ వీడియో రూపంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో తాను రూపొందించిన ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
malaika-arora-shares-her-experience-after-beating-corona-in-telugu

ఆ జాగ్రత్తలే నన్ను కరోనా నుంచి కోలుకునేలా చేశాయి!

కరోనా మహమ్మారి బారిన పడి దాన్నుంచి కోలుకున్నారంటే ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడిపోతున్నారంతా! ఆ సంతోషంలోనే తమ కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా కూడా ప్రస్తుతం అంతకుమించిన ఆనందంలోనే తేలియాడుతోంది. ఇందుకు కారణం ఆమె వైరస్‌ను జయించడమే! ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందిన ఆమెకు తాజా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. దీంతో ఎన్నో రోజుల తర్వాత తన గది నుంచి బయటకొచ్చానంటూ విజయ దరహాసాన్ని ప్రదర్శిస్తోన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ బేబ్‌. అంతేకాదు.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలనూ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది మలైకా. మరి, ఈ ముద్దుగుమ్మ తన కొవిడ్‌ జర్నీ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
singer-chinmayi-sripada-records-song-dedications-to-raise-funds-for-the-needy

వారికోసం 3 వేల పాటలు.. 85 లక్షలు.. దటీజ్ చిన్మయి!

తన శ్రావ్యమైన స్వరంతో సంగీత ప్రియుల్ని అలరించే బ్యూటిఫుల్‌ సింగర్‌ చిన్మయీ శ్రీపాద. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై స్పందించే ఈ గాయని.. తన సేవా భావంతోనూ అశేష అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే తన సంగీత కళను ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సేవ కోసమే వినియోగిస్తోందీ సూపర్‌ సింగర్‌. తన ప్రియమైన అభిమానులు అడిగిన పాటలు పాడుతూ, వారికి విషెస్‌ చెబుతూ లక్షల కొద్దీ విరాళాలు సేకరిస్తోందీ ముద్దుగుమ్మ. ఇలా పోగైన మొత్తాన్ని ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగిస్తోంది. ఇలా మరోసారి తన సేవాభావంతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల గాయని.

Know More

women icon@teamvasundhara
here-is-the-lesson-tejaswi-madivada-learnt-from-covid-19-in-telugu

ఎవరి కోసమో నేనెందుకు మారాలి?!

ఎవరినైనా చూస్తే చాలు.. వారిలో ఏం లోపముందా? అనే వెతుకుతుంటాయి చాలామంది కళ్లు. ఇక నిజంగానే వారి శరీరాకృతిలో ఏదైనా లోపమున్నా, చర్మ ఛాయ తక్కువగా ఉన్నా.. ఏదో ఒక మాట అనేదాకా ఊరుకోవు వాళ్ల నోళ్లు! అసలు ముందు వాళ్లు ఎలా ఉన్నారో చూసుకోకుండా, ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందేమో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా ఇతరుల శరీరాకృతి, అందం గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి బాడీ షేమింగ్‌కు తాను కూడా బాధితురాలినే అంటోంది టాలీవుడ్‌ భామ తేజస్వీ మదివాడ. దీని కారణంగా తాను ఎంతో బాధను అనుభవించానని, అయితే ఇతరుల కోసం మనం మారాల్సిన అవసరం లేదని ఆలస్యంగా గ్రహించానని చెబుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తన కోసం తాను సమయం కేటాయించుకోవడం వల్ల బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది ఈ ఐస్‌క్రీమ్‌ బ్యూటీ..

Know More

women icon@teamvasundhara
indian-model-paula-accuses-bollywood-director-of-sexual-harassment-when-she-was-17

ఆఫర్‌ కావాలంటే దుస్తులు విప్పమన్నాడు!

పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలన్న మహిళల ఆశయాన్ని ఆసరాగా చేసుకుని, తమ అవసరాలు తీర్చుకోవాలని చూసే మగవాళ్లు ప్రతి రంగంలోనూ ఉన్నారు. సినీ రంగమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే చిత్ర సీమలో ఉన్న ఇలాంటి కొందరు మగాళ్ల ఆగడాలను బయటపెట్టే క్రమంలో తెరమీదకొచ్చిందే ‘మీటూ ఇండియా’ ఉద్యమం. ఎక్కడో అమెరికన్‌ చిత్ర పరిశ్రమలో మొదలైన ‘మీటూ’ దావానలంలా విస్తరిస్తూ మనదాకా చేరింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమంలో భాగంగా ఎందరో సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. మరెందరో మహిళా సెలబ్రిటీలు తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెట్టారు. అయితే అది అక్కడితో సమసిపోలేదు. ఇప్పటికీ కొంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెడుతూనే ఉన్నారు. అలా తాజాగా ప్రముఖ భారతీయ మోడల్‌ పౌలా మీటూ ఉద్యమాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. తన కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెబుతూ ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
celebrities-shares-their-pcos-struggles-and-experiences-in-telugu

మాకూ పీసీఓఎస్ ఉంది.. అయినా దాచుకోలేదు.. కుంగిపోలేదు..!

‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్‌.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్‌ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
padma-lakshmi-shows-how-50-is-the-new-30-in-her-birthday-post

ఇంకా 30లోనే ఉన్నట్లుంది!

పద్మాలక్ష్మి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ప్రముఖ మాజీ మోడల్‌. ప్రస్తుతం అమెరికన్‌ టీవీ ఛానల్స్‌లో టాప్‌ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అందాల తార మంచి రచయిత్రి కూడా. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఈ ప్రవాస భారతీయురాలు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం మహిళల్లో స్ఫూర్తి కలిగించే పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టిన పద్మ... తన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
amitabh-bachchan’s-grand-daughter-navya-naveli-nanda-opens-up-about-struggle-with-anxiety-seeking-therapy

సిగ్గు పడకండి.. అలాంటప్పుడు బయటికి చెప్పుకోండి..!

మనసులో ఎంత బాధున్నా బయటికి చెప్పరు చాలామంది. ఒకవేళ తమ సమస్య గురించి నలుగురికీ చెప్తే ఎక్కడ పలుచనైపోతామో, నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే వారితో వెనకడుగు వేయిస్తుంది. ఇలా చేస్తే ఆ బాధ తీవ్రత క్రమంగా పెరిగి పెరిగి మన మనసునే తొలిచేసే స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. ఇలా పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ జబ్బు ఇప్పుడు చాలామంది పాలిట శాపంగా పరిణమిస్తోంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు. ఇలా తాము ఎదుర్కొన్న మానసిక సమస్య గురించి బయటికి చెప్పి సామాన్యుల్లో ధైర్యాన్ని నింపిన అందాల తారలు ఎంతోమంది! ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా. గత కొంత కాలంగా యాంగ్జైటీతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దాన్నుంచి విముక్తి పొందేందుకు థెరపీ తీసుకుంటున్నానంటూ ఈ మానసిక వ్యాధి నుంచి బయటపడే మార్గాల్ని చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపిందీ క్యూటీ.

Know More

women icon@teamvasundhara
on-the-account-of-national-nutrition-week-manushi-chillar-conduct-ask-me-session-with-fans-shares-her-healthy-food-habits

హాస్టల్ ఫుడ్ తిని బాగా లావయ్యా.. అప్పుడలా సన్నబడ్డా!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అవును మరి.. మనం ఏ పనిచేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా పూర్తిచేయగలుగుతాం. అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో పోషకాహారం, ఆరోగ్యం గురించి అందరిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్‌ 1-7 వరకు ‘జాతీయ పోషకాహార వారం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ పోషకాహారం గురించి అందరిలో అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుందీ బ్యూటీ. ఒకప్పుడు లావుగా ఉన్న తాను చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్లే లావు తగ్గానని, అప్పట్నుంచి చక్కటి ఆహారపుటలవాట్లను అలాగే కొనసాగిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన ఆహారపుటలవాట్లు, ఆరోగ్య రహస్యాల గురించి ‘ఆస్క్‌ మీ సెషన్‌’ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిందీ హరియాణా అందం. మరి, ఈ చక్కనమ్మ పంచుకున్న ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
mira-kapoor-took-to-instagram-to-reveal-her-favourite-indian-foods-and-desserts-among-other-things-in-an-ask-me-anything-session-with-fans

మేమిద్దరం.. మాకిద్దరు.. అంతే!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అర్ధాంగిగానే కాదు.. తన అందంతో, తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో అనతికాలంలోనే సెలబ్రిటీగా మారిపోయిందీ బ్యూటీ. ఓ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ పరిపూర్ణ మహిళకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంటుందీ అందాల అమ్మ. తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకునే మీరా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఈ వేదికగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం, తన ఇద్దరు చిన్నారుల గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ చూసేద్దామా?!

Know More

women icon@teamvasundhara
nia-sharma-wins-khatron-ke-khiladi-made-in-india-trophy-in-telugu

నన్ను విమర్శించే వారికి ఇదే నా సమాధానం!

బాలీవుడ్‌ టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్‌ ఇండియా’. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు, భయానికి గురిచేసే సాహస కృత్యాలతో కూడిన ఈ అడ్వెంచరస్‌ టీవీ షోకు అభిమానుల ఆదరణ బాగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్టసాధ్యమైన టాస్క్‌లన్నింటినీ సమర్ధంగా పూర్తి చేసి ఈ సీజన్‌ విజేతగా నిలిచింది నియా శర్మ. మూడేళ్ల క్రితం ఇదే ‘ఖత్రోంకీ ఖిలాడీ 8’ సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన నియా.. ఈ సీజన్‌ ఆసాంతం తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నియా శర్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
these-bollywood-beauties-turned-into-gardeners-amid-pandemic

ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది.. మీకూ కావాలా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న మాట వాస్తవమే అయినా.. చాలామందికి జీవితం విలువేంటో తెలియజేస్తోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో పాఠాలు నేర్పుతోంది. అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా చేస్తోంది. గార్డెనింగ్‌ కూడా ఇందులో ఓ భాగమే! ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లి ఆపద కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతోనో.. లేదంటే సహజ పద్ధతుల్లో ఇంటి ఆవరణలోనే పండించిన కాయగూరలు ఆరోగ్యకరమన్న విషయం గ్రహించో.. ఇలా కారణమేదైనా చాలామంది హోమ్‌ గార్డెనింగ్‌కే ఓటేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు.

Know More