scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ప్రేమా.. ప్రేమా.. ప్రేమించడం నేరమా..?!'

'ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే ఈ మధురమైన భావనకు కులమతాల తారతమ్యం లేదంటారు.. రూపు-రేఖలు ఎలా ఉన్నా పట్టించుకోదంటారు.. వయసుతో అసలు పనే లేదంటారు. ఇలా అన్నింటా ప్రేమదే అంతిమ విజయం. కానీ పరువు దగ్గరికొచ్చే సరికి మాత్రం దీనికి ఎప్పుడూ ఓటమే ఎదురవుతుంది. ప్రేమతో ఒక్కటై ‘ఇక నిండు నూరేళ్లు నీతోనే నా బతుకు!’ అని బాస చేసుకున్న జంటల ఆనందాన్ని ఆవిరి చేస్తోందీ ఎందుకూ కొరగాని ఈ పరువు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమంటారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పా? అతనితో జీవితాన్ని పంచుకోవడం నేరమా? పెద్దల దృష్టిలో వారికి నచ్చని వారిని ప్రేమిస్తే పరువు పోతుంది కానీ వారు ఆ ప్రేమను చంపేసి నలుగురిలో హంతుకులుగా మారితే అది పరువు తక్కువ కాదా? ఇలా పరువు-ప్రతిష్టల పేరుతో ప్రేమను చంపేసి ఏం సాధిస్తారు? అంతులేని దుఃఖం తప్ప! అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంటోంది ఎంతగానో ప్రేమించిన తన భర్తను పోగొట్టుకున్న ఓ అభాగ్యురాలు. మరి, ఆమె హృదయరాగమేంటో మనమూ తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

ఈ బ్రెస్ట్‌ఫీడింగ్ స్టోరీలు విన్నారా?

Bollywood moms share their breastfeeding stories in Telugu

Breast-Feeding.jpg

అమ్మతనం.. ఈ సృష్టిలో అన్నింటికంటే అమూల్యమైనది ఆ ఫీలింగ్. ఒక్కమాటలో చెప్పాలంటే అది కేవలం మహిళలకు మాత్రమే దక్కిన గొప్ప వరం. తమ జీవితంలో ఆనందాన్ని నింపిన ఏ క్షణాన్నైనా మర్చిపోవచ్చేమో గానీ.. పుట్టిన బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణం, ఆనంద భాష్పాలు నిండిన నయనాలతో తన ప్రతిబింబాన్ని చూసుకున్న ఆ సందర్భం మాత్రం ప్రతి తల్లికీ మరపురాని మధురజ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇక తన బుజ్జాయి తన ఒళ్లో పడుకొని పాలు తాగుతున్నప్పుడు కలిగే అద్భుతమైన ఆనందం అది అనుభవించే తల్లులకే సొంతం.
ఇలాంటి బ్రెస్ట్‌ఫీడింగ్ స్వీట్ మెమరీస్ తమకూ బోలెడున్నాయంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అమ్మతనంలోకి అడుగుపెట్టి అందులోని మాధుర్యాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకునే ఈ అందాల అమ్మలు.. తమ బ్రెస్ట్‌ఫీడింగ్ స్టోరీస్, అనుభవాలను సైతం సోషల్ మీడియా పోస్టుల రూపంలో పంచుకుంటూ మురిసిపోతున్నారు. అంతేనా.. తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలుపుతూ వీలైనన్ని ఎక్కువ రోజులు బిడ్డకు పాలు పట్టాలని, పబ్లిక్ ప్రదేశాల్లో సైతం బిడ్డకు పాలివ్వడానికి ఏమాత్రం వెనకాడకూడదని చెబుతూ నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. 'ప్రపంచ తల్లిపాల వారోత్సవం (ఆగస్టు 1-7)' జరుపుకుంటోన్న నేపథ్యంలో కొందరు సెలబ్రిటీ మామ్స్ పలు సందర్భాల్లో పంచుకున్న బ్రెస్ట్‌ఫీడింగ్ అనుభవాలు, నేటి తల్లులకు అందిస్తున్న స్ఫూర్తిదాయక మాటలేంటో తెలుసుకుందాం రండి..

నా బ్రెస్ట్‌ఫీడింగ్ స్టోరీ ఇది.. మరి మీది?

View this post on Instagram

A post shared by Neha Dhupia (@nehadhupia) on

బయటి ప్రదేశాల్లో బిడ్డలకు పాలివ్వడానికి చాలామంది తల్లులు ముందుకు రారు. కారణం.. ఇతరుల చూపులు తమను అసౌకర్యానికి గురిచేస్తాయేమోనన్న భావనే. అయితే.. ఇలాంటి పరిస్థితి మారాలని చెబుతోంది బాలీవుడ్ అందాల అమ్మ నేహా ధూపియా. 2018, నవంబర్‌ 18న మెహ్ర్ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన ఈ అందాల అమ్మ.. పబ్లిక్ ప్రదేశాల్లో తల్లులు తమ పిల్లలకు పాలివ్వడానికి నర్సింగ్ రూమ్స్ ఉండడం తప్పనిసరి అంటోంది. ఈ నేపథ్యంలోనే తన బుజ్జాయిని గుండెలకు హత్తుకున్న ఓ ఫొటోని అప్పట్లో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నేహ.. బ్రెస్ట్‌ఫీడింగ్‌లో దాగున్న మాధుర్యం, అందుకు బయటి ప్రదేశాల్లో తల్లులు పిల్లలకు పాలిచ్చేలా వ్యవస్థ కల్పించాల్సిన సౌకర్యాలను వివరిస్తూ ఓ అర్థవంతమైన పోస్ట్‌ని దానికి జతచేసింది.

'మా జీవితాల్లోకి మా పాప రూపంలో వచ్చిన ఎంజాయ్‌మెంట్‌ని మీ అందరితో పంచుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి లేదనేది నా భావన. అన్నింటిలా మాతృత్వం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది.. పిల్లలకు మనం ఆహారపు వనరు (ఫుడ్ సోర్స్) అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. నిజానికి ఇలాంటి కష్టమైన అనుభూతుల్ని అందించే అద్భుతమైన ప్యాకేజ్ అమ్మతనం మనకు అందిస్తోంది. ఒకే సమయంలో అటు బిడ్డను చూసుకుంటూ, ఇటు అన్ని పనుల్ని సమన్వయం చేసుకునే విషయంలో అమ్మ బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. పాపాయికి పాలు పట్టడం, ఆపై బర్పింగ్ చేయడం.. వంటి విషయాల్లో తల్లి కంటే ఎక్స్‌పర్ట్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.

View this post on Instagram

A post shared by Neha Dhupia (@nehadhupia) on

అయితే బయటి ప్రదేశాల్లో చాలామంది తల్లులు తమ చిన్నారులకు పాలు పట్టడానికి ముందుకు రారు. ఇందుకు మన వ్యవస్థలో ఉండే లోపాలే కారణమని నాకూ ఓసారి అనుభవపూర్వకంగా అర్థమైంది. ఓసారి నేను విమానంలో ప్రయాణిస్తున్నా. అప్పుడు నా పాపకు పాలు పట్టాల్సి ఉంది. దాంతో వెంటనే తనని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లా.. నా పని పూర్తయ్యే వరకు అటుగా ఎవరినీ రావద్దని చెప్పా. ఇలా ఎక్కువ సేపు టాయిలెట్‌ని ఉపయోగించుకున్నందుకు బయటికొచ్చాక వారికి సారీ చెప్పాననుకోండి! అయితే మనం ఇలా సరైన పని చేస్తున్నా వ్యవస్థ దీన్ని తప్పుగా ఎందుకు చూస్తుందో నాకు అసలు అర్థం కాదు. అందుకే పాలిచ్చే తల్లులకు, చిన్నారులకు, బ్రెస్ట్ పంప్స్‌ని ఉపయోగించే తల్లులకు మరెన్నో సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. అదంతా ఎలా సాధ్యమవుతుందంటే.. మనందరం ముందుకొచ్చి మన బ్రెస్ట్‌ఫీడింగ్ స్టోరీస్‌ని పంచుకున్నప్పుడే! అప్పుడే మన సమస్యలు అందరికీ అర్థమవుతాయి. అందుకే నేను ప్రారంభించిన #freedomtofeed హ్యాష్‌ట్యాగ్ వేదికగా మీరూ మీ బ్రెస్ట్‌ఫీడింగ్ స్టోరీని నాతో పంచుకోండి.. లైవ్‌ టాక్స్‌లో కూడా నాతో మాట్లాడచ్చు..’' అంటూ మహిళల్ని ప్రోత్సహించేలా పోస్ట్ పెట్టింది నేహ. ఈ తల్లిపాల వారోత్సవం సందర్భంగా తల్లులందరినీ తమ బ్రెస్ట్‌ఫీడింగ్ స్టోరీస్‌ని, పబ్లిక్ ప్రదేశాల్లో పాలివ్వడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పంచుకోమని కోరుతోంది. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటోందీ బ్యూటిఫుల్ మామ్.

అలాంటి తండ్రులకు హ్యాట్సాఫ్!

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on

కొత్తగా తల్త్లెన మహిళలు బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు, ఇతర పనుల్ని బ్యాలన్స్ చేసుకుంటూ అనుక్షణం బిజీబిజీగా గడుపుతుంటారు. ఈ సమయంలో వారికి ఎంతో కొంత ఒత్తిడి ఎదురవడం సహజం. అయితే వారు దీన్ని అధిగమించడంలో చాలా వరకు వారి భర్తల మద్దుతు ఎంతగానో ఉంటుందంటోంది బాలీవుడ్ యమ్మీ మమ్మీ సమీరా రెడ్డి. గతేడాది జులై 12న నైరా అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన ఈ అందాల తార.. బ్రెస్ట్‌ఫీడింగ్‌ గురించి అప్పట్లో పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తన బిడ్డను ప్రేమగా ఎత్తుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ న్యూ మామ్.. 'కొత్తగా తండ్రైన వారు, నా ప్రియమైన అభిమానులు.. అందరూ వినండి! ఈ బ్రెస్ట్‌ఫీడింగ్ వీక్ సందర్భంగా.. కొత్తగా తల్త్లెన మహిళల్ని ప్రోత్సహిస్తూ, వారికి అడుగడుగునా అండగా నిలుస్తోన్న ప్రతి ఒక్కరికీ ఈ పోస్టును అంకితమిస్తున్నా. కొత్తగా తల్త్లెన మహిళ ఆందోళన చెందినా, బాధపడినా, ఒత్తిడికి గురైనా.. అది తల్లిపాలపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఇవన్నీ తల్లిపాల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపకపోయినా పాపాయిని చూసుకునే క్రమంలో తల్లి ప్రతిస్పందించే విధానాన్ని బట్టి ఆమె మానసిక స్థితి ఏంటి అని అర్థమవుతుంది. తద్వారా పాపాయి తక్కువ పాలు తాగడం, పాల ఉత్పత్తి క్రమంగా తగ్గిపోవడం.. వంటివి జరుగుతాయి. కాబట్టి తల్లి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకొని నడుచుకోవడమే మీరు చేసే గొప్ప పని అవుతుంది. అలాగే ఈ సమయంలో మీరు కురిపించే ప్రేమకు మరేదీ సాటి రాదు.

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on

అలాగే కొత్తగా తల్త్లెన మహిళలకూ నేను ఒక విషయం చెప్పదలచుకున్నా.. న్యూ మామ్స్‌లో కొందరు పాల ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల ఆందోళన చెందుతుంటారు. అందుకు ఎండోక్రైన్ సమస్య లేదంటే ఇతర అనారోగ్యాలు కారణం కావచ్చు. ఈ రెండూ కాకుండా అంటే కొంతమంది తల్లుల్లో ఎలాంటి సమస్య లేకపోయినా పాలు తక్కువగా ఉత్పత్తవుతుంటాయి. పాల ఉత్పత్తిని మెరుగుపరచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా ఫలితమేమీ ఉండదు. ఇలాంటి వారు సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదు. అలాగే తల్లిపాల విషయంలో ఎలాంటి ఒత్తిడికీ గురికావద్దు. ఇలాంటి అమ్మలందరికీ సాటి మహిళలుగా మనమూ మద్దతిద్దాం.. వారి పట్ల ప్రేమను, గౌరవాన్ని చాటుదాం..' అంటూ రాసుకొచ్చింది సమీర. బ్రెస్ట్‌ఫీడింగ్‌ సమయంలో మహిళలు ఒత్తిడికి గురవడం సహజమని, అయితే పనుల్ని బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగితే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చని గతంలోనూ పలు ఇన్‌స్టా పోస్టుల రూపంలో వివరించింది సమీర.

'ఇంకా పాలిస్తున్నావా?' అనేవారు!

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

బిడ్డకు పాలివ్వడం వల్ల బిడ్డకే కాదు.. తల్లికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అంటోంది బాలీవుడ్ యమ్మీ మమ్మీ లిసా హెడెన్. అయితే ఈ క్రమంలో చాలామంది తనని ఇంకా ఎన్ని రోజులు పాలిస్తావ్ అని అడిగేవారని, తాను మాత్రం వీటన్నింటినీ పక్కన పెట్టి తన బాబుకు ఫీడింగ్ ఇవ్వడం పైనే దృష్టి పెట్టానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ హాట్‌ మామ్‌.

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

'జాక్ పుట్టాక కొన్ని సందర్భాల్లో కొంతమంది నన్ను ఇంకా పాలిస్తున్నావా..? అని అడిగేవారు. అప్పటికి వాడు పుట్టి కేవలం నాలుగు నెలలైంది అంతే..! ఇంకొందరేమో.. నీ బిడ్డకు ఇంకా పాలివ్వడానికి నువ్వు ఆవువి కాదు కదా అనేవారు. ఇలాంటి మాటలు నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించినా.. వాటిని నేను పట్టించుకోలేదు. నేనే కాదు.. కారణాలేవైనా చాలామంది తల్లులు బ్రెస్ట్‌ఫీడింగ్ విషయంలో ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే బిడ్డకు జన్మనిచ్చాక కొన్ని రోజులకు తిరిగి వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తుంటారు చాలామంది అమ్మలు. అది తప్పు కాదు.. కానీ బిడ్డకు నిర్ణీత సమయాల్లో పాలివ్వడం కూడా ముఖ్యమే కదా! నేనూ అదే చేశా. వృత్తి కంటే ఎక్కువగా నా పాపాయికి పాలివ్వడమే ముఖ్యంగా భావించా. ప్రతి తల్లీ ఇలా ఎక్కువ కాలం పాటు పాలివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అలాంటి వారికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నేను నా పిల్లలకు ఏడాది కాలం పాటు పాలిచ్చా. బ్రెస్ట్‌ఫీడింగ్ వల్ల తల్లీబిడ్డల బంధం బలపడడంతో పాటు అటు బిడ్డకీ-ఇటు తల్లికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. ప్రసవం తర్వాత నేను తిరిగి ఫిట్టెస్ట్ బాడీని సొంతం చేసుకోవడంలో బ్రెస్ట్‌ఫీడింగ్ పాత్ర కీలకం అని చెబుతా..' అంటోంది లిసా. మన చుట్టూ ఉన్న వారిలో ఎవరేమన్నా పట్టించుకోకుండా బిడ్డకు తల్లిపాలు అందించడమే లక్ష్యంగా ప్రతి తల్లీ ముందుకు సాగాలని నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపుతోందీ బాలీవుడ్ మామ్.

ఆరు నెలల దాకా పాలిచ్చా!

View this post on Instagram

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

ముగ్గురు పిల్లల తల్లిగా అమ్మతనంలోని మాధుర్యాన్ని అణువణువునా ఆస్వాదించానని చెబుతోంది బాలీవుడ్ అందాల తార సెలీనా జైట్లీ. తాను ఆరు నెలల దాకా తన చిన్నారులకు పాలిచ్చానని.. ఈ ప్రక్రియ అటు తల్లుల, ఇటు బిడ్డల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని చెబుతోందీ ముద్దుగుమ్మ. 'తల్లీబిడ్డలిద్దరికీ బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రక్రియ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. ఈ విషయం పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఓ అధ్యయనం ప్రకారం తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల ఆమె సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అని తేలింది. నేను నా పిల్లలకు ఆరు నెలల దాకా పాలిచ్చా. ఈ క్రమంలో మనం పాలివ్వడం వల్ల పిల్లల్లో ఉత్పత్తయ్యే యాంటీ బాడీస్, రోగనిరోధక శక్తి వారిని జీవితాంతం రక్షిస్తాయి..' అంటూ బ్రెస్ట్‌ఫీడింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతూ ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ రోజులు తమ చిన్నారులకు పాలివ్వాలంటూ కొత్తగా తల్త్లెన మహిళల్ని ప్రోత్సహిస్తోందీ బ్యూటిఫుల్ మామ్.

అది బిడ్డ తల్లికి అందించే కానుక!

View this post on Instagram

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

బ్రెస్ట్‌ఫీడింగ్ అనేది ఈ సృష్టిలో ఎంతో అమూల్యమైనదని, అది బిడ్డ తల్లికి అందించే అపురూప కానుక అంటోంది సెలబ్రిటీ మామ్ మీరా రాజ్‌పుత్. బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో షాహిద్ కపూర్ అర్ధాంగిగానే కాకుండా.. తనదైన ఫిజిక్, ఫ్యాషన్ సెన్స్‌తో ఎందరో సినీ అభిమానుల మనసు దోచుకున్న ఈ అందాల అమ్మ.. తల్లిపాల ప్రాముఖ్యంపై ఓ సందర్భంలో భాగంగా తన మనసులోని మాటల్ని ఇలా పంచుకుంది.

'పాపాయికి పాలివ్వడం వల్ల అటు తల్లికి, ఇటు బిడ్డకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.. అలాగే వారిద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. అందుకే నేను నా పిల్లలు మిషా, జైన్‌లకు చాలా రోజుల పాటు పాలిచ్చా. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రెస్ట్‌ఫీడింగ్ అనేది పిల్లలు తల్లులకిచ్చే అపురూప కానుక. అందుకే తల్లులందరూ ఈ కానుకను అందుకోవాలి. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించాలంటే అందుకు చక్కటి పోషకాహారం, హ్యాపీగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే పాపాయి పడుకున్నప్పుడు, ఇతర ఖాళీ సమయాల్లో కాలక్షేపం చేయకుండా మీరూ నిద్రపోండి.. తద్వారా నిద్రలేమి, ఒత్తిళ్లను ఇట్టే అధిగమించచ్చు..' అంటూ తన మాటలతో కొత్తగా తల్త్లెన మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ క్యూట్ మామ్.


తల్లిపాల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, ఈ క్రమంలో తమకు ఎదురైన మధురానుభూతుల్ని పంచుకుంటూ నేటి తరం తల్లుల్లో స్ఫూర్తి నింపిన సెలబ్రిటీ మామ్స్‌ చెప్పిన విషయాలు తెలుసుకున్నారుగా! మరి, వీటిని దృష్టిలో ఉంచుకొని మీరూ మీ చిన్నారికి మరింత ఎక్కువ కాలం పాటు పాలివ్వండి.. తద్వారా అటు బిడ్డ ఆరోగ్యాన్ని, ఇటు మీ ఆరోగ్యాన్నీ కాపాడుకోండి.. సరేనా?!

women icon@teamvasundhara
sonam-kapoor-shares-tips-that-help-her-with-pcos-in-new-post

ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!

పీసీఓఎస్‌/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్‌ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్‌, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్‌ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-who-was-shooting-for-mere-dad-ki-dulhan-tests-covid-19-positive

అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకున్నా.. ఇప్పుడు బాగానే ఉన్నా!

బయటికెళ్తే కరోనా వస్తుందన్న భయం.. ఇంట్లోనే ఉంటే ఓ రకమైన మానసిక ఒత్తిడి.. ప్రస్తుతం చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ కరోనా వచ్చినా దాన్నుంచి కోలుకుంటామో, లేదోనన్న టెన్షన్‌తో అనుక్షణం భయపడిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం వారి కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. అలాంటి వారిలో పలువురు నటీమణులు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఇటీవలే తనకు కొవిడ్‌ నిర్ధారణ అయిందని, అయితే ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ క్రమంలో తాను పాటిస్తోన్న పలు జాగ్రత్తల్ని కూడా పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
vithika-sheru-shares-about-her-depression-through-a-heart-touching-video

అది కరోనా కన్నా ప్రమాదకరమైంది!

తామెలా ఉన్నామో చూసుకోకుండా ఇతరుల్ని కామెంట్‌ చేయడం, విమర్శించడం చాలామందికి అలవాటు. ఇలాంటివి ఎదుటివారిని బాధపెడతాయేమోనన్న కనీస ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు కొంతమంది. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోలింగ్‌కి హద్దే ఉండదు. ఇక ఇలా తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా వదిలేసే వారు కొందరైతే.. వాటి మూలంగా కలిగిన బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లే వారు మరికొందరు. ఈ రెండో జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ వితికా షేరు. గతేడాది ఓ రియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌కి తట్టుకోలేకపోయానని, అవి క్రమంగా తనని కుంగదీశాయంటూ తన మనసులోని ఆవేదనను ఓ సుదీర్ఘ వీడియో రూపంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో తాను రూపొందించిన ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
malaika-arora-shares-her-experience-after-beating-corona-in-telugu

ఆ జాగ్రత్తలే నన్ను కరోనా నుంచి కోలుకునేలా చేశాయి!

కరోనా మహమ్మారి బారిన పడి దాన్నుంచి కోలుకున్నారంటే ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడిపోతున్నారంతా! ఆ సంతోషంలోనే తమ కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా కూడా ప్రస్తుతం అంతకుమించిన ఆనందంలోనే తేలియాడుతోంది. ఇందుకు కారణం ఆమె వైరస్‌ను జయించడమే! ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందిన ఆమెకు తాజా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. దీంతో ఎన్నో రోజుల తర్వాత తన గది నుంచి బయటకొచ్చానంటూ విజయ దరహాసాన్ని ప్రదర్శిస్తోన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ బేబ్‌. అంతేకాదు.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలనూ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది మలైకా. మరి, ఈ ముద్దుగుమ్మ తన కొవిడ్‌ జర్నీ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
singer-chinmayi-sripada-records-song-dedications-to-raise-funds-for-the-needy

వారికోసం 3 వేల పాటలు.. 85 లక్షలు.. దటీజ్ చిన్మయి!

తన శ్రావ్యమైన స్వరంతో సంగీత ప్రియుల్ని అలరించే బ్యూటిఫుల్‌ సింగర్‌ చిన్మయీ శ్రీపాద. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై స్పందించే ఈ గాయని.. తన సేవా భావంతోనూ అశేష అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే తన సంగీత కళను ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సేవ కోసమే వినియోగిస్తోందీ సూపర్‌ సింగర్‌. తన ప్రియమైన అభిమానులు అడిగిన పాటలు పాడుతూ, వారికి విషెస్‌ చెబుతూ లక్షల కొద్దీ విరాళాలు సేకరిస్తోందీ ముద్దుగుమ్మ. ఇలా పోగైన మొత్తాన్ని ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగిస్తోంది. ఇలా మరోసారి తన సేవాభావంతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల గాయని.

Know More

women icon@teamvasundhara
here-is-the-lesson-tejaswi-madivada-learnt-from-covid-19-in-telugu

ఎవరి కోసమో నేనెందుకు మారాలి?!

ఎవరినైనా చూస్తే చాలు.. వారిలో ఏం లోపముందా? అనే వెతుకుతుంటాయి చాలామంది కళ్లు. ఇక నిజంగానే వారి శరీరాకృతిలో ఏదైనా లోపమున్నా, చర్మ ఛాయ తక్కువగా ఉన్నా.. ఏదో ఒక మాట అనేదాకా ఊరుకోవు వాళ్ల నోళ్లు! అసలు ముందు వాళ్లు ఎలా ఉన్నారో చూసుకోకుండా, ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందేమో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా ఇతరుల శరీరాకృతి, అందం గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి బాడీ షేమింగ్‌కు తాను కూడా బాధితురాలినే అంటోంది టాలీవుడ్‌ భామ తేజస్వీ మదివాడ. దీని కారణంగా తాను ఎంతో బాధను అనుభవించానని, అయితే ఇతరుల కోసం మనం మారాల్సిన అవసరం లేదని ఆలస్యంగా గ్రహించానని చెబుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తన కోసం తాను సమయం కేటాయించుకోవడం వల్ల బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది ఈ ఐస్‌క్రీమ్‌ బ్యూటీ..

Know More

women icon@teamvasundhara
indian-model-paula-accuses-bollywood-director-of-sexual-harassment-when-she-was-17

ఆఫర్‌ కావాలంటే దుస్తులు విప్పమన్నాడు!

పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలన్న మహిళల ఆశయాన్ని ఆసరాగా చేసుకుని, తమ అవసరాలు తీర్చుకోవాలని చూసే మగవాళ్లు ప్రతి రంగంలోనూ ఉన్నారు. సినీ రంగమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే చిత్ర సీమలో ఉన్న ఇలాంటి కొందరు మగాళ్ల ఆగడాలను బయటపెట్టే క్రమంలో తెరమీదకొచ్చిందే ‘మీటూ ఇండియా’ ఉద్యమం. ఎక్కడో అమెరికన్‌ చిత్ర పరిశ్రమలో మొదలైన ‘మీటూ’ దావానలంలా విస్తరిస్తూ మనదాకా చేరింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమంలో భాగంగా ఎందరో సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. మరెందరో మహిళా సెలబ్రిటీలు తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెట్టారు. అయితే అది అక్కడితో సమసిపోలేదు. ఇప్పటికీ కొంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెడుతూనే ఉన్నారు. అలా తాజాగా ప్రముఖ భారతీయ మోడల్‌ పౌలా మీటూ ఉద్యమాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. తన కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెబుతూ ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
celebrities-shares-their-pcos-struggles-and-experiences-in-telugu

మాకూ పీసీఓఎస్ ఉంది.. అయినా దాచుకోలేదు.. కుంగిపోలేదు..!

‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్‌.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్‌ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
padma-lakshmi-shows-how-50-is-the-new-30-in-her-birthday-post

ఇంకా 30లోనే ఉన్నట్లుంది!

పద్మాలక్ష్మి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ప్రముఖ మాజీ మోడల్‌. ప్రస్తుతం అమెరికన్‌ టీవీ ఛానల్స్‌లో టాప్‌ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అందాల తార మంచి రచయిత్రి కూడా. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఈ ప్రవాస భారతీయురాలు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం మహిళల్లో స్ఫూర్తి కలిగించే పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టిన పద్మ... తన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
amitabh-bachchan’s-grand-daughter-navya-naveli-nanda-opens-up-about-struggle-with-anxiety-seeking-therapy

సిగ్గు పడకండి.. అలాంటప్పుడు బయటికి చెప్పుకోండి..!

మనసులో ఎంత బాధున్నా బయటికి చెప్పరు చాలామంది. ఒకవేళ తమ సమస్య గురించి నలుగురికీ చెప్తే ఎక్కడ పలుచనైపోతామో, నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే వారితో వెనకడుగు వేయిస్తుంది. ఇలా చేస్తే ఆ బాధ తీవ్రత క్రమంగా పెరిగి పెరిగి మన మనసునే తొలిచేసే స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. ఇలా పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ జబ్బు ఇప్పుడు చాలామంది పాలిట శాపంగా పరిణమిస్తోంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు. ఇలా తాము ఎదుర్కొన్న మానసిక సమస్య గురించి బయటికి చెప్పి సామాన్యుల్లో ధైర్యాన్ని నింపిన అందాల తారలు ఎంతోమంది! ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా. గత కొంత కాలంగా యాంగ్జైటీతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దాన్నుంచి విముక్తి పొందేందుకు థెరపీ తీసుకుంటున్నానంటూ ఈ మానసిక వ్యాధి నుంచి బయటపడే మార్గాల్ని చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపిందీ క్యూటీ.

Know More

women icon@teamvasundhara
on-the-account-of-national-nutrition-week-manushi-chillar-conduct-ask-me-session-with-fans-shares-her-healthy-food-habits

హాస్టల్ ఫుడ్ తిని బాగా లావయ్యా.. అప్పుడలా సన్నబడ్డా!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అవును మరి.. మనం ఏ పనిచేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా పూర్తిచేయగలుగుతాం. అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో పోషకాహారం, ఆరోగ్యం గురించి అందరిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్‌ 1-7 వరకు ‘జాతీయ పోషకాహార వారం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ పోషకాహారం గురించి అందరిలో అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుందీ బ్యూటీ. ఒకప్పుడు లావుగా ఉన్న తాను చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్లే లావు తగ్గానని, అప్పట్నుంచి చక్కటి ఆహారపుటలవాట్లను అలాగే కొనసాగిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన ఆహారపుటలవాట్లు, ఆరోగ్య రహస్యాల గురించి ‘ఆస్క్‌ మీ సెషన్‌’ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిందీ హరియాణా అందం. మరి, ఈ చక్కనమ్మ పంచుకున్న ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
mira-kapoor-took-to-instagram-to-reveal-her-favourite-indian-foods-and-desserts-among-other-things-in-an-ask-me-anything-session-with-fans

మేమిద్దరం.. మాకిద్దరు.. అంతే!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అర్ధాంగిగానే కాదు.. తన అందంతో, తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో అనతికాలంలోనే సెలబ్రిటీగా మారిపోయిందీ బ్యూటీ. ఓ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ పరిపూర్ణ మహిళకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంటుందీ అందాల అమ్మ. తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకునే మీరా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఈ వేదికగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం, తన ఇద్దరు చిన్నారుల గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ చూసేద్దామా?!

Know More

women icon@teamvasundhara
nia-sharma-wins-khatron-ke-khiladi-made-in-india-trophy-in-telugu

నన్ను విమర్శించే వారికి ఇదే నా సమాధానం!

బాలీవుడ్‌ టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్‌ ఇండియా’. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు, భయానికి గురిచేసే సాహస కృత్యాలతో కూడిన ఈ అడ్వెంచరస్‌ టీవీ షోకు అభిమానుల ఆదరణ బాగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్టసాధ్యమైన టాస్క్‌లన్నింటినీ సమర్ధంగా పూర్తి చేసి ఈ సీజన్‌ విజేతగా నిలిచింది నియా శర్మ. మూడేళ్ల క్రితం ఇదే ‘ఖత్రోంకీ ఖిలాడీ 8’ సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన నియా.. ఈ సీజన్‌ ఆసాంతం తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నియా శర్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
these-bollywood-beauties-turned-into-gardeners-amid-pandemic

ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది.. మీకూ కావాలా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న మాట వాస్తవమే అయినా.. చాలామందికి జీవితం విలువేంటో తెలియజేస్తోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో పాఠాలు నేర్పుతోంది. అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా చేస్తోంది. గార్డెనింగ్‌ కూడా ఇందులో ఓ భాగమే! ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లి ఆపద కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతోనో.. లేదంటే సహజ పద్ధతుల్లో ఇంటి ఆవరణలోనే పండించిన కాయగూరలు ఆరోగ్యకరమన్న విషయం గ్రహించో.. ఇలా కారణమేదైనా చాలామంది హోమ్‌ గార్డెనింగ్‌కే ఓటేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు.

Know More

women icon@teamvasundhara
kamya-punjabi-opens-up-on-divorce-and-second-marriage-in-telugu
women icon@teamvasundhara
anasuya-bharadwaj-revealed-many-lesser-known-facts-about-her-life-in-alitho-saradaga-show

నా పొగరు, ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చుంటాయి!

అందం, అణకువ, వాక్చాతుర్యం.. ఇలా ఒక వ్యాఖ్యాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది అందాల యాంకర్‌ అనసూయ. ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై సందడి చేస్తూ ప్రతి ఇంట్లో ఆడపడుచులా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తన చలాకీ మాటలతో, చిరునవ్వుతో అందరినీ పలకరించే అను.. ‘రంగమ్మత్త’గా సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని, అమ్మ వల్లే ఇప్పుడిలా ఉన్నానంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మనకు తెలియని బోలెడన్ని విషయాలు పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
actress-kasturi-in-alitho-saradaga-chat-show

రోజూ ఆ ముగ్గురికీ ‘థ్యాంక్స్‌’ చెప్పాకనే నిద్ర పోతాను!

‘ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా’ అంటూ ‘అన్నమయ్య’ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది కస్తూరి. తమిళ ఇంట్లో పుట్టినా... అచ్చమైన తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ భామ ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్‌ కూతురిగా కూడా నటించింది. వీటితో పాటు ‘నిప్పురవ్వ’, ‘మెరుపు’ ‘సోగ్గాడి పెళ్లాం’, ‘మా ఆయన బంగారం’, ‘చిలక్కొట్టుడు’, ‘ఆకాశవీధిలో’, ‘డాన్ శీను’, ‘శమంతకమణి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ఈ సొగసరి పలు తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ సందడి చేసింది. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
manushi-chhillar-auctions-her-painting-to-raise-funds-for-frontline-workers

వారి ‘హార్ట్‌ వర్క్‌’ కోసమే ఈ ఆర్ట్‌ వర్క్!

కరోనా సృష్టించిన ఈ కల్లోల పరిస్థితుల్లో కనీసం కంఫర్ట్‌ జోన్లో ఉండి మన పనులు మనం చేసుకునే వెసులుబాటైనా మనకుంది.. అదే వైద్యులు, వైద్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాళ్లు, ఇతర అత్యవసర సేవల్లో భాగమయ్యే వారు వైరస్‌ ముప్పు పొంచి ఉందని తెలిసినా కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే! అలాంటి కరోనా యోధుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మన క్షేమాన్ని కాంక్షిస్తూ మనకు సకల సదుపాయాలు సమకూర్చుతోన్న అలాంటి వారియర్స్ కోసం మన వంతుగా సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని చెబుతోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌. కేవలం చెప్పడమే కాదు.. కరోనా యోధులకు అండగా నిలబడేందుకు తాను కూడా ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపానని ఓ చిన్న వీడియో ద్వారా పంచుకుందీ మాజీ మిస్‌ వరల్డ్‌. మరి, కరోనాపై పోరులో ముందుండి పోరాడుతోన్న యోధులకు ఈ ముద్దుగుమ్మ చేస్తోన్న సాయమేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
suma-kanakala-shares-her-experience-with-star-mahila

‘స్టార్‌ మహిళ’ నన్ను ఇంటింటి ఆడపడుచులా మార్చేసింది!

‘స్టార్‌ మహిళ’... బుల్లితెరపై దశాబ్దానికి పైగా కొనసాగిన ఈ గేమ్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆడపడుచులందరికీ తెగ నచ్చేసింది. స్టార్ యాంకర్‌ సుమ గలగల మాటలకు తోడు గమ్మత్తైన ఆటలు, ఆసక్తికరమైన టాస్క్‌లతో మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుందీ సూపర్బ్‌ ప్రోగ్రామ్‌. 2008లో ఈటీవీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 2019 జనవరి 26న ముగిసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ బుల్లితెర సెన్సేషన్‌.. 3,181 ఎపిసోడ్లతో భారతదేశంలోనే అతిపెద్ద రెండో గేమ్ షోగా రికార్డు సృష్టించింది. ఇప్పుడీ ‘స్టార్‌ మహిళ’ చిన్న గ్యాప్‌ తర్వాత ఆగస్టు 17, సోమవారం నుంచి ఈటీవీలో తిరిగి ప్రారంభమైంది. మొదటి సీజన్‌లో తన మాటల పరవళ్లతో ప్రతి ఇంటినీ సందడిగా మార్చేసిన సుమ... మహిళలందరినీ ‘స్టార్‌’గా మార్చేందుకు మళ్లీ మన ముందుకొచ్చేసింది. ఈ సందర్భంగా- ఈ మాటల ప్రవాహం పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు...

Know More

women icon@teamvasundhara
actress-and-former-miss-india-world-natasha-suri-tests-positive-for-covid-19

women icon@teamvasundhara
bhojpuri-actress-anupama-pathak-commits-suicide-in-mumbai

నమ్మిన వారే మనల్ని నట్టేట ముంచేస్తారు!

మొన్న సుశాంత్‌.... నిన్న సమీర్... నేడు అనుపమా పాథక్‌... సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. డిప్రెషన్‌, ఆర్థికంగా.. ఇలా కారణాలేవైనా కానీ ఈ వరుస బలవన్మరణాలు ముంబైవాసులతో పాటు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా భోజ్‌పురి నటి అనుపమా పాథక్‌ (40) ముంబైలో బలవన్మరణానికి పాల్పడింది. బిహార్‌కు చెందిన ఆమె భోజ్‌పురి సినిమాలు, టీవీ సీరియల్స్‌ ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే నమ్మిన వారే తనను మోసం చేశారంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తన ఇంట్లోనే తనువు చాలించుకుంది. ఈ మేరకు సంఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు ఆమెది ఆత్మహత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Know More

women icon@teamvasundhara
bride-to-be-miheeka-bajaj-chooses-yellow-lehenga-sea-shell-jewellary-for-haldi-ceremony

భళ్లాల దేవుడి ఇష్ట సఖి.. మెరిసేను ‘పుత్తడి’ బొమ్మలా..!

‘తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన.. శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ’ అంటూ నవవధువు అందచందాల్ని పొగిడారో సినీ కవి. ఆ పోలికలకు ఏమాత్రం తగ్గకుండా కుందనపు బొమ్మలా ముస్తాబైంది మన భళ్లాలదేవుడికి కాబోయే భార్య మిహీకా బజాజ్‌. ఆగస్టు 8న రానా-మిహీకల వివాహ ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రోజుల ముందుగానే వధూవరుల ఇళ్లలో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు మొదలయ్యాయి. తాజాగా మిహీక ఇంట్లో నిర్వహించిన హల్దీ ఫంక్షన్‌లో కొత్త పెళ్లి కూతురు పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తులు-జ్యుయలరీతో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ పసుపు వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా

Know More

women icon@teamvasundhara
celebrity-siblings-in-entertainment-industry

వెండితెరనూ పంచుకున్నారు... ఈ సెలబ్రిటీ తోబుట్టువులు!

తోబుట్టువులంటే కేవలం ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని పంచుకోవడం మాత్రమే కాదు.. అవసరమైతే బాధ్యతల్లో భాగస్వాములై, ఒకరికొకరు సాయపడుతూ ఒకే కెరీర్‌లో కూడా కొనసాగొచ్చని చెబుతున్నారీ సెలబ్రెటీలు. ఇందులో కొందరు నటులుగా ప్రసిద్ధులైతే, మరికొందరు దర్శకులుగా, నిర్మాతలుగా.. ఇలా ఒకరికి మించి మరొకరు సినీరంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. అక్కను మార్గదర్శకురాలిగా తీసుకుని ముందుకు సాగుతున్న తమ్ముళ్లు కొందరైతే.. అన్నను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచిన చెల్లెళ్లు మరికొందరు. ఏదేమైనా వీరందరూ అనుబంధంతో పాటు 'వెండితెర'నూ సమానంగా పంచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 'రాఖీ పండగ' సందర్భంగా వెండితెరను వేదికగా చేసుకుని పలువిభాగాల్లో వెలిగిపోతున్న కొందరు సెలబ్రిటీ తోబుట్టువుల గురించి తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
naomi-osaka-hits-back-at-netizens-trolling-on-her-flaunting-swim-suit

నాకిప్పుడు 22 ఏళ్లు... నా దుస్తులపై మీ కామెంట్లు ఏంటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాకా తన దుస్తులపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన నెటిజన్లకు తగిన రీతిలో సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
celebrities-posts-black-and-white-photos-in-instagram