scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు?

Janhvi kapoor opens about nepotism and sexism in industry

అతిలోక సుందరి ‘శ్రీదేవి’ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం ‘ధడక్‌’తోనే అందరి ప్రశంసలు అందుకొని ..అందంతో పాటు నటన కూడా తన డీఎన్‌ఏలోనే ఉందని నిరూపించుకుంది. నటనలో తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమె త్వరలో ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్ గర్ల్‌’ గా మన ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రియల్‌ కార్గిల్‌ గర్ల్‌ గుంజన్‌ సక్సేనాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ... తన వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


శ్రీదేవి వారసురాలిగా!
యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్పుత్‌ హఠాన్మరణం తర్వాత బాలీవుడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి బంధుప్రీతి, వేధింపులు, వివక్ష వంటి విషయాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దివంగత శ్రీదేవి- నిర్మాత బోనీకపూర్‌ల వారసురాలైన జాన్వీ ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘గుంజన్‌ సక్సేనా’, ‘రూహి అఫ్జానా,’ ‘దోస్తానా-2’ తదితర చిత్రాలు ఉన్నాయి. వీటిలో ‘గుంజన్‌ సక్సేనా’ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కుటుంబ నేపథ్యం, ఇండస్ట్రీలోని బంధుప్రీతి, లింగ వివక్ష తదితర విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


ఆ విషయంలో నాకు గిల్టీగా ఉంది!
‘ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమీ నాకు ఎదురుకాలేదు. దీనికి కారణమేంటో మీకు కూడా తెలుసు. ఎందుకంటే నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఇండస్ట్రీలో నాకు లభిస్తున్న గౌరవం...అవకాశాలను చూస్తుంటే నేను ఎంతో లక్కీ అనిపిస్తుంది. అయితే కష్టపడి పనిచేస్తే ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుందని నేను అనుకుంటున్నా. నా సినీ నేపథ్యం కారణంగా నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలుసు. ఆ విషయంలో నాకు గిల్టీగా ఉంది. కానీ నేను ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి’ అని చెప్పుకొచ్చింది జాన్వీ.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


ఈ విషయంలో సక్సేనానే అందరికీ ఆదర్శం!
ఇక సినీ పరిశ్రమలోని లింగ వివక్షపై మాట్లాడిన జాన్వీ... కొంతమంది ఫిల్మ్‌ మేకర్లకు అదో అలవాటుగా మారిపోయిందన్నారు. ‘ కొన్ని సార్లు కథ చెప్పేటప్పుడు కొందరు దర్శకులు ఎక్కువగా హీరో పైనే దృష్టి పెడతారు. సినిమాలో హీరో పాత్రే ప్రధానం కాబట్టి అలా చేస్తున్నారని నేను మొదట్లో భావించేదాన్ని. అయితే వారికి తెలియకుండానే అదో అలవాటుగా మారిపోయిందని తర్వాతే నాకు తెలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు సమాజమంతటా లింగ వివక్ష ఉంది. ఈక్రమంలో బయట చాలామంది మనం ధరించే దుస్తులు, వేషధారణను చూసిన వెంటనే మన క్యారక్టర్‌ను జడ్జ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ‘మీరు ఈ దుస్తులు ధరించకూడదు. మీరిలా చేయాల్సింది కాదు’ అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నేను జిమ్‌కు వెళుతున్న ఫొటోలను పోస్ట్‌ చేసినప్పుడు నాకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అవతలివారు ఎలా ఉండాలో, ఏ దుస్తులు ధరించాలో మీరెలా నిర్ణయిస్తారు? అదేవిధంగా ఎదుటివారు ధరించిన దుస్తులను బట్టి వారిని ఎలా జడ్జ్‌ చేస్తారు? ఇలాంటి అవరోధాలన్నింటినీ అధిగమిస్తేనే మనం ముందుకెళ్లగలం. ఈ విషయంలో గుంజన్‌ సక్సేనానే అందరికీ ఆదర్శం’ అని తెలిపిందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


అప్పుడు నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది!
ఇక జాన్వీతో పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుంజన్‌ సక్సేనా కూడా తన వృత్తి నిర్వహణకు సంబంధించి కొన్ని విషయాలను అందరితో పంచుకున్నారు. ‘నేను విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్స్‌, డ్రస్సింగ్‌ రూమ్స్‌ ఉండేవి కావు. అదేవిధంగా అక్కడున్న మనుషుల ఆలోచనలను అధిమించి, నన్ను ఒక ప్రొఫెషనల్‌గా నిరూపించుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అదేవిధంగా నన్ను ఒక మహిళా అధికారిణిలా కాకుండా ఒక అధికారిలా చూసేలా చేయడం నాకు ఓ ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని తన అనుభవాలను గుదిగుచ్చింది గుంజన్.





women icon@teamvasundhara
singer-chinmayi-sripada-records-song-dedications-to-raise-funds-for-the-needy

వారికోసం 3 వేల పాటలు.. 85 లక్షలు.. దటీజ్ చిన్మయి!

తన శ్రావ్యమైన స్వరంతో సంగీత ప్రియుల్ని అలరించే బ్యూటిఫుల్‌ సింగర్‌ చిన్మయీ శ్రీపాద. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై స్పందించే ఈ గాయని.. తన సేవా భావంతోనూ అశేష అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే తన సంగీత కళను ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సేవ కోసమే వినియోగిస్తోందీ సూపర్‌ సింగర్‌. తన ప్రియమైన అభిమానులు అడిగిన పాటలు పాడుతూ, వారికి విషెస్‌ చెబుతూ లక్షల కొద్దీ విరాళాలు సేకరిస్తోందీ ముద్దుగుమ్మ. ఇలా పోగైన మొత్తాన్ని ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగిస్తోంది. ఇలా మరోసారి తన సేవాభావంతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల గాయని.

Know More

women icon@teamvasundhara
here-is-the-lesson-tejaswi-madivada-learnt-from-covid-19-in-telugu

ఎవరి కోసమో నేనెందుకు మారాలి?!

ఎవరినైనా చూస్తే చాలు.. వారిలో ఏం లోపముందా? అనే వెతుకుతుంటాయి చాలామంది కళ్లు. ఇక నిజంగానే వారి శరీరాకృతిలో ఏదైనా లోపమున్నా, చర్మ ఛాయ తక్కువగా ఉన్నా.. ఏదో ఒక మాట అనేదాకా ఊరుకోవు వాళ్ల నోళ్లు! అసలు ముందు వాళ్లు ఎలా ఉన్నారో చూసుకోకుండా, ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందేమో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా ఇతరుల శరీరాకృతి, అందం గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి బాడీ షేమింగ్‌కు తాను కూడా బాధితురాలినే అంటోంది టాలీవుడ్‌ భామ తేజస్వీ మదివాడ. దీని కారణంగా తాను ఎంతో బాధను అనుభవించానని, అయితే ఇతరుల కోసం మనం మారాల్సిన అవసరం లేదని ఆలస్యంగా గ్రహించానని చెబుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తన కోసం తాను సమయం కేటాయించుకోవడం వల్ల బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది ఈ ఐస్‌క్రీమ్‌ బ్యూటీ..

Know More

women icon@teamvasundhara
indian-model-paula-accuses-bollywood-director-of-sexual-harassment-when-she-was-17

ఆఫర్‌ కావాలంటే దుస్తులు విప్పమన్నాడు!

పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలన్న మహిళల ఆశయాన్ని ఆసరాగా చేసుకుని, తమ అవసరాలు తీర్చుకోవాలని చూసే మగవాళ్లు ప్రతి రంగంలోనూ ఉన్నారు. సినీ రంగమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే చిత్ర సీమలో ఉన్న ఇలాంటి కొందరు మగాళ్ల ఆగడాలను బయటపెట్టే క్రమంలో తెరమీదకొచ్చిందే ‘మీటూ ఇండియా’ ఉద్యమం. ఎక్కడో అమెరికన్‌ చిత్ర పరిశ్రమలో మొదలైన ‘మీటూ’ దావానలంలా విస్తరిస్తూ మనదాకా చేరింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమంలో భాగంగా ఎందరో సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. మరెందరో మహిళా సెలబ్రిటీలు తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెట్టారు. అయితే అది అక్కడితో సమసిపోలేదు. ఇప్పటికీ కొంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెడుతూనే ఉన్నారు. అలా తాజాగా ప్రముఖ భారతీయ మోడల్‌ పౌలా మీటూ ఉద్యమాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. తన కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెబుతూ ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
celebrities-shares-their-pcos-struggles-and-experiences-in-telugu

మాకూ పీసీఓఎస్ ఉంది.. అయినా దాచుకోలేదు.. కుంగిపోలేదు..!

‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్‌.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్‌ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
padma-lakshmi-shows-how-50-is-the-new-30-in-her-birthday-post

ఇంకా 30లోనే ఉన్నట్లుంది!

పద్మాలక్ష్మి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ప్రముఖ మాజీ మోడల్‌. ప్రస్తుతం అమెరికన్‌ టీవీ ఛానల్స్‌లో టాప్‌ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అందాల తార మంచి రచయిత్రి కూడా. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఈ ప్రవాస భారతీయురాలు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం మహిళల్లో స్ఫూర్తి కలిగించే పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టిన పద్మ... తన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
amitabh-bachchan’s-grand-daughter-navya-naveli-nanda-opens-up-about-struggle-with-anxiety-seeking-therapy

సిగ్గు పడకండి.. అలాంటప్పుడు బయటికి చెప్పుకోండి..!

మనసులో ఎంత బాధున్నా బయటికి చెప్పరు చాలామంది. ఒకవేళ తమ సమస్య గురించి నలుగురికీ చెప్తే ఎక్కడ పలుచనైపోతామో, నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే వారితో వెనకడుగు వేయిస్తుంది. ఇలా చేస్తే ఆ బాధ తీవ్రత క్రమంగా పెరిగి పెరిగి మన మనసునే తొలిచేసే స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. ఇలా పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ జబ్బు ఇప్పుడు చాలామంది పాలిట శాపంగా పరిణమిస్తోంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు. ఇలా తాము ఎదుర్కొన్న మానసిక సమస్య గురించి బయటికి చెప్పి సామాన్యుల్లో ధైర్యాన్ని నింపిన అందాల తారలు ఎంతోమంది! ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా. గత కొంత కాలంగా యాంగ్జైటీతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దాన్నుంచి విముక్తి పొందేందుకు థెరపీ తీసుకుంటున్నానంటూ ఈ మానసిక వ్యాధి నుంచి బయటపడే మార్గాల్ని చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపిందీ క్యూటీ.

Know More

women icon@teamvasundhara
on-the-account-of-national-nutrition-week-manushi-chillar-conduct-ask-me-session-with-fans-shares-her-healthy-food-habits

హాస్టల్ ఫుడ్ తిని బాగా లావయ్యా.. అప్పుడలా సన్నబడ్డా!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అవును మరి.. మనం ఏ పనిచేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా పూర్తిచేయగలుగుతాం. అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో పోషకాహారం, ఆరోగ్యం గురించి అందరిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్‌ 1-7 వరకు ‘జాతీయ పోషకాహార వారం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ పోషకాహారం గురించి అందరిలో అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుందీ బ్యూటీ. ఒకప్పుడు లావుగా ఉన్న తాను చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్లే లావు తగ్గానని, అప్పట్నుంచి చక్కటి ఆహారపుటలవాట్లను అలాగే కొనసాగిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన ఆహారపుటలవాట్లు, ఆరోగ్య రహస్యాల గురించి ‘ఆస్క్‌ మీ సెషన్‌’ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిందీ హరియాణా అందం. మరి, ఈ చక్కనమ్మ పంచుకున్న ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
mira-kapoor-took-to-instagram-to-reveal-her-favourite-indian-foods-and-desserts-among-other-things-in-an-ask-me-anything-session-with-fans

మేమిద్దరం.. మాకిద్దరు.. అంతే!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అర్ధాంగిగానే కాదు.. తన అందంతో, తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో అనతికాలంలోనే సెలబ్రిటీగా మారిపోయిందీ బ్యూటీ. ఓ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ పరిపూర్ణ మహిళకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంటుందీ అందాల అమ్మ. తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకునే మీరా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఈ వేదికగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం, తన ఇద్దరు చిన్నారుల గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ చూసేద్దామా?!

Know More

women icon@teamvasundhara
nia-sharma-wins-khatron-ke-khiladi-made-in-india-trophy-in-telugu

నన్ను విమర్శించే వారికి ఇదే నా సమాధానం!

బాలీవుడ్‌ టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్‌ ఇండియా’. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు, భయానికి గురిచేసే సాహస కృత్యాలతో కూడిన ఈ అడ్వెంచరస్‌ టీవీ షోకు అభిమానుల ఆదరణ బాగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్టసాధ్యమైన టాస్క్‌లన్నింటినీ సమర్ధంగా పూర్తి చేసి ఈ సీజన్‌ విజేతగా నిలిచింది నియా శర్మ. మూడేళ్ల క్రితం ఇదే ‘ఖత్రోంకీ ఖిలాడీ 8’ సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన నియా.. ఈ సీజన్‌ ఆసాంతం తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నియా శర్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
these-bollywood-beauties-turned-into-gardeners-amid-pandemic

ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది.. మీకూ కావాలా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న మాట వాస్తవమే అయినా.. చాలామందికి జీవితం విలువేంటో తెలియజేస్తోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో పాఠాలు నేర్పుతోంది. అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా చేస్తోంది. గార్డెనింగ్‌ కూడా ఇందులో ఓ భాగమే! ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లి ఆపద కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతోనో.. లేదంటే సహజ పద్ధతుల్లో ఇంటి ఆవరణలోనే పండించిన కాయగూరలు ఆరోగ్యకరమన్న విషయం గ్రహించో.. ఇలా కారణమేదైనా చాలామంది హోమ్‌ గార్డెనింగ్‌కే ఓటేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు.

Know More

women icon@teamvasundhara
anasuya-bharadwaj-revealed-many-lesser-known-facts-about-her-life-in-alitho-saradaga-show

నా పొగరు, ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చుంటాయి!

అందం, అణకువ, వాక్చాతుర్యం.. ఇలా ఒక వ్యాఖ్యాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది అందాల యాంకర్‌ అనసూయ. ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై సందడి చేస్తూ ప్రతి ఇంట్లో ఆడపడుచులా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తన చలాకీ మాటలతో, చిరునవ్వుతో అందరినీ పలకరించే అను.. ‘రంగమ్మత్త’గా సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని, అమ్మ వల్లే ఇప్పుడిలా ఉన్నానంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మనకు తెలియని బోలెడన్ని విషయాలు పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
actress-kasturi-in-alitho-saradaga-chat-show

రోజూ ఆ ముగ్గురికీ ‘థ్యాంక్స్‌’ చెప్పాకనే నిద్ర పోతాను!

‘ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా’ అంటూ ‘అన్నమయ్య’ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది కస్తూరి. తమిళ ఇంట్లో పుట్టినా... అచ్చమైన తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ భామ ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్‌ కూతురిగా కూడా నటించింది. వీటితో పాటు ‘నిప్పురవ్వ’, ‘మెరుపు’ ‘సోగ్గాడి పెళ్లాం’, ‘మా ఆయన బంగారం’, ‘చిలక్కొట్టుడు’, ‘ఆకాశవీధిలో’, ‘డాన్ శీను’, ‘శమంతకమణి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ఈ సొగసరి పలు తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ సందడి చేసింది. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
singer-sunitha-talks-about-her-health-condition-in-telugu
women icon@teamvasundhara
manushi-chhillar-auctions-her-painting-to-raise-funds-for-frontline-workers

వారి ‘హార్ట్‌ వర్క్‌’ కోసమే ఈ ఆర్ట్‌ వర్క్!

కరోనా సృష్టించిన ఈ కల్లోల పరిస్థితుల్లో కనీసం కంఫర్ట్‌ జోన్లో ఉండి మన పనులు మనం చేసుకునే వెసులుబాటైనా మనకుంది.. అదే వైద్యులు, వైద్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాళ్లు, ఇతర అత్యవసర సేవల్లో భాగమయ్యే వారు వైరస్‌ ముప్పు పొంచి ఉందని తెలిసినా కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే! అలాంటి కరోనా యోధుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మన క్షేమాన్ని కాంక్షిస్తూ మనకు సకల సదుపాయాలు సమకూర్చుతోన్న అలాంటి వారియర్స్ కోసం మన వంతుగా సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని చెబుతోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌. కేవలం చెప్పడమే కాదు.. కరోనా యోధులకు అండగా నిలబడేందుకు తాను కూడా ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపానని ఓ చిన్న వీడియో ద్వారా పంచుకుందీ మాజీ మిస్‌ వరల్డ్‌. మరి, కరోనాపై పోరులో ముందుండి పోరాడుతోన్న యోధులకు ఈ ముద్దుగుమ్మ చేస్తోన్న సాయమేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
suma-kanakala-shares-her-experience-with-star-mahila

‘స్టార్‌ మహిళ’ నన్ను ఇంటింటి ఆడపడుచులా మార్చేసింది!

‘స్టార్‌ మహిళ’... బుల్లితెరపై దశాబ్దానికి పైగా కొనసాగిన ఈ గేమ్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆడపడుచులందరికీ తెగ నచ్చేసింది. స్టార్ యాంకర్‌ సుమ గలగల మాటలకు తోడు గమ్మత్తైన ఆటలు, ఆసక్తికరమైన టాస్క్‌లతో మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుందీ సూపర్బ్‌ ప్రోగ్రామ్‌. 2008లో ఈటీవీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 2019 జనవరి 26న ముగిసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ బుల్లితెర సెన్సేషన్‌.. 3,181 ఎపిసోడ్లతో భారతదేశంలోనే అతిపెద్ద రెండో గేమ్ షోగా రికార్డు సృష్టించింది. ఇప్పుడీ ‘స్టార్‌ మహిళ’ చిన్న గ్యాప్‌ తర్వాత ఆగస్టు 17, సోమవారం నుంచి ఈటీవీలో తిరిగి ప్రారంభమైంది. మొదటి సీజన్‌లో తన మాటల పరవళ్లతో ప్రతి ఇంటినీ సందడిగా మార్చేసిన సుమ... మహిళలందరినీ ‘స్టార్‌’గా మార్చేందుకు మళ్లీ మన ముందుకొచ్చేసింది. ఈ సందర్భంగా- ఈ మాటల ప్రవాహం పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు...

Know More

women icon@teamvasundhara
actress-and-former-miss-india-world-natasha-suri-tests-positive-for-covid-19

women icon@teamvasundhara
bhojpuri-actress-anupama-pathak-commits-suicide-in-mumbai

నమ్మిన వారే మనల్ని నట్టేట ముంచేస్తారు!

మొన్న సుశాంత్‌.... నిన్న సమీర్... నేడు అనుపమా పాథక్‌... సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. డిప్రెషన్‌, ఆర్థికంగా.. ఇలా కారణాలేవైనా కానీ ఈ వరుస బలవన్మరణాలు ముంబైవాసులతో పాటు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా భోజ్‌పురి నటి అనుపమా పాథక్‌ (40) ముంబైలో బలవన్మరణానికి పాల్పడింది. బిహార్‌కు చెందిన ఆమె భోజ్‌పురి సినిమాలు, టీవీ సీరియల్స్‌ ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే నమ్మిన వారే తనను మోసం చేశారంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తన ఇంట్లోనే తనువు చాలించుకుంది. ఈ మేరకు సంఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు ఆమెది ఆత్మహత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Know More

women icon@teamvasundhara
bride-to-be-miheeka-bajaj-chooses-yellow-lehenga-sea-shell-jewellary-for-haldi-ceremony

భళ్లాల దేవుడి ఇష్ట సఖి.. మెరిసేను ‘పుత్తడి’ బొమ్మలా..!

‘తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన.. శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ’ అంటూ నవవధువు అందచందాల్ని పొగిడారో సినీ కవి. ఆ పోలికలకు ఏమాత్రం తగ్గకుండా కుందనపు బొమ్మలా ముస్తాబైంది మన భళ్లాలదేవుడికి కాబోయే భార్య మిహీకా బజాజ్‌. ఆగస్టు 8న రానా-మిహీకల వివాహ ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రోజుల ముందుగానే వధూవరుల ఇళ్లలో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు మొదలయ్యాయి. తాజాగా మిహీక ఇంట్లో నిర్వహించిన హల్దీ ఫంక్షన్‌లో కొత్త పెళ్లి కూతురు పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తులు-జ్యుయలరీతో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ పసుపు వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా

Know More

women icon@teamvasundhara
celebrity-siblings-in-entertainment-industry

వెండితెరనూ పంచుకున్నారు... ఈ సెలబ్రిటీ తోబుట్టువులు!

తోబుట్టువులంటే కేవలం ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని పంచుకోవడం మాత్రమే కాదు.. అవసరమైతే బాధ్యతల్లో భాగస్వాములై, ఒకరికొకరు సాయపడుతూ ఒకే కెరీర్‌లో కూడా కొనసాగొచ్చని చెబుతున్నారీ సెలబ్రెటీలు. ఇందులో కొందరు నటులుగా ప్రసిద్ధులైతే, మరికొందరు దర్శకులుగా, నిర్మాతలుగా.. ఇలా ఒకరికి మించి మరొకరు సినీరంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. అక్కను మార్గదర్శకురాలిగా తీసుకుని ముందుకు సాగుతున్న తమ్ముళ్లు కొందరైతే.. అన్నను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచిన చెల్లెళ్లు మరికొందరు. ఏదేమైనా వీరందరూ అనుబంధంతో పాటు 'వెండితెర'నూ సమానంగా పంచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 'రాఖీ పండగ' సందర్భంగా వెండితెరను వేదికగా చేసుకుని పలువిభాగాల్లో వెలిగిపోతున్న కొందరు సెలబ్రిటీ తోబుట్టువుల గురించి తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
naomi-osaka-hits-back-at-netizens-trolling-on-her-flaunting-swim-suit

నాకిప్పుడు 22 ఏళ్లు... నా దుస్తులపై మీ కామెంట్లు ఏంటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాకా తన దుస్తులపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన నెటిజన్లకు తగిన రీతిలో సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
celebrities-posts-black-and-white-photos-in-instagram

women icon@teamvasundhara
sameera-reddy-talks-body-positivity-in-an-instagram-video

ఎవరేమనుకుంటే మనకేంటి..? మనకు నచ్చినట్లుగా మనముందాం!

అమ్మతనం.. ఇది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం.. మహిళలుగా మనకు మాత్రమే దక్కిన గొప్ప వరం. అలాంటి అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే క్రమంలో కొంతమంది మహిళలు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు.. నలుగురితో పోల్చుకుంటున్నారు.. తమను తామే తక్కువ చేసి చూసుకుంటున్నారు.. కారణం.. అమ్మయ్యాక శరీరంలో కలిగిన మార్పులే! అయితే అలాంటి ఆందోళనలు, పోలికలు అనవసరమంటోంది బాలీవుడ్‌ అందాల అమ్మ సమీరా రెడ్డి. తనకూ ఇలాంటి సంఘటనలు బోలెడన్ని ఎదురయ్యాయని, ఎవరేమన్నా పట్టించుకోకుండా ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవాలని అమ్మలందరిలో పాజిటివిటీని నింపుతోంది. ఇటీవలే తల్లైన ఓ మహిళ తనకు పంపిన సందేశానికి బదులిస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది సమీర. ఇలా బాడీషేమింగ్‌ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చి అతివల్లో స్ఫూర్తి నింపుతోందీ బ్యూటిఫుల్‌ మామ్.

Know More

women icon@teamvasundhara
manisha-koirala-says-situation-during-corona-pandemic-seems-easy

women icon@teamvasundhara
rupali-ganguly-shares-her-experience-about-shootings-during-the-pandemic

అమ్మా.. మళ్లీ నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఆరునెలలు ఆగాలా?

స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం అంటూ మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది కరోనా. ఈ మహమ్మారి తీసుకొచ్చిన భయంతో కనీసం కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్‌ కారణంగా అత్యంత సన్నిహితులైనా, స్నేహితులైనా దూరంగా ఉంచుతున్నాం. ఇలా శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న ఈ మహమ్మారి తనను మరింత సతమతం చేస్తోందని వాపోతోంది బెంగాలీ నటి రూపాలీ గంగూలీ. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సీరియళ్లు, సినిమా షూటింగులకు ప్రభుత్వాలు అనుమతినివ్వడంతో మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతోందామె. అయితే కరోనా భయంతో తన కుటుంబ సభ్యులకు వీలైనంత దూరంగా ఉంటున్న ఆమె... తాజాగా తన ఆవేదన గురించి అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
rashi-kanna-and-manchu-lakshmi-completed-green-india-challenge

women icon@teamvasundhara
rashmi-sudheer-in-ali-tho-saradaga-show

ఈ విశ్వంలో నేను చూసిన గొప్ప అందం తనే...!

రష్మీ-సుధీర్‌...బుల్లితెరపై ‘జబర్దస్త్‌’ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సందడికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే ఈ జంట... తమ ఆన్‌స్ర్కీన్‌ కెమిస్ట్రీతో ఎలాంటి కార్యక్రమాన్నైనా రక్తి కట్టిస్తారు. డ్యాన్స్‌లు, జోకులతో అలరిస్తూ స్టేజిపై ఆహ్లాదకర వాతావరణం సృష్టిస్తారు. ఆన్‌స్ర్కీన్‌పై అద్భుత కెమిస్ట్రీతో అందరినీ అలరిస్తున్న ఈ ఇద్దరి గురించి, వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం గురించి వాళ్లంతట వాళ్లు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సుధీర్‌, రష్మీ ఇటీవల మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈక్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ హిట్‌పెయిర్‌ లాక్‌డౌన్‌ ముచ్చట్లు, వారి వృత్తిగత, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
actresses-who-affected-by-corona-virus-and-share-their-experiences

పాజిటివ్‌ వచ్చినా ‘పాజిటివ్‌’గానే ఉన్నాం!

పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా.. ఈ తేడాలేవీ కరోనా మహమ్మారికి తెలియవు.. కనికరం లేకుండా విరుచుకుపడడం తప్ప! అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. తమ సందేశాల ద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం వీరిద్దరూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలోనూ పలువురు ముద్దుగుమ్మలు ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసింది. అయితే తాము ఈ మహమ్మారి బారిన పడినప్పటికీ ఎంతో ధైర్యంగా ఉన్నామని, ఆత్మస్థైర్యమే కరోనాకు ఔషధమని సోషల్‌ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. మరికొందరు తాము కొవిడ్‌ను జయించిన అనుభవాలను అందరితో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌లో ధైర్యం నూరిపోశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ బారిన పడిన కొందరు ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-these-celebrities-beat-lockdown-blues?

మళ్లీ మంచిరోజులొస్తాయి.. అప్పటిదాకా ఇలా బిజీగా ఉందాం..!

సాధారణంగా వృత్తిఉద్యోగాలు చేసే వారికి వారానికి కనీసం ఒకట్రెండు రోజులైనా సెలవులుంటాయి. అదే సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఆ సమయం కూడా దొరకదు. సినిమా వాళ్లు నెలల తరబడి షూటింగ్స్‌కి, క్రీడాకారులు ప్రాక్టీస్‌కు సమయం వెచ్చించాల్సిందే! అలాంటి వారికి అరుదుగా, అనుకోకుండా లాక్‌డౌన్ పేరుతో బోలెడంత ఖాళీ సమయం దొరికే సరికి తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఇంకా టోర్నమెంట్లు, షూటింగులు మొదలు కాకపోవడంతో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తమ అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. భారత యువ షూటర్‌ మనూ భాకర్‌ కూడా ఈ ఖాళీ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు నచ్చిన పనులు చేస్తున్నానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన సినీ తారలు, క్రీడాకారిణులు ఏం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-jaya-bhattacharya-food-packets-and-essentials-to-needy-amid-lockdown

కరోనా అంతమైనా నా సేవను మాత్రం ఆపను!

అప్పటిదాకా హాయిగా ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయి కొందరు బాధపడుతుంటే.. తినడానికి తిండి కూడా కరవై ఆకలితో అలమటిస్తోన్న వారు ఎందరో! ఇక ఇలాంటి కష్ట కాలంలో మూగ జీవాల వెతలు ఎవరికీ పట్టవు. కానీ ఈ గడ్డు కాలంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు.. అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటున్నారు బాలీవుడ్‌ నటీమణి జయా భట్టాచార్య. బుల్లితెరపై పలు సీరియళ్లలో, వెండితెరపై కీలక పాత్రల్లో నటించి మెప్పించిన జయ.. ఈ లాక్‌డౌన్‌లో నలుగురికి సహాయపడుతూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. అంతేకాదు.. తన సేవలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా తన సేవల్ని ఇలాగే కొనసాగిస్తానంటోన్న ఈ నటీమణి గురించి, ఆమె చేస్తోన్న సేవల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
payal-ghosh-and-parno-mittra-opens-about-fighting-depression

సమస్య పంచుకోండి.. భారం దించుకోండి!

ఒత్తిడి, ఆందోళన... ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగా కుంగదీస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుంటాయీ మానసిక రుగ్మతలు. వీటిని భరించలేక ఒకనొక సమయంలో చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా ఈ సమస్యతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తాము కూడా డిప్రెషన్‌ బాధితులమేనంటూ పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తమకెదురైన గడ్డు పరిస్థితుల గురించి ధైర్యంగా చెప్పడమే కాకుండా.. వాటినెలా అధిగమించారో వివరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘ప్రయాణం’ ఫేం పాయల్‌ ఘోష్‌, బెంగాలీ నటి పార్నో మిత్రా కూడా తమ డిప్రెషన్‌ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
kushboo-and-shamita-shetty-opens-about-fighting-depression

డిప్రెషన్‌ మమ్మల్ని కూడా కుంగదీసింది... కానీ కసితో పోరాడాం!

మానసిక ఆందోళన... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, పలు ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి.. వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తడానికి దోహదం చేస్తున్నాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ ఆరోగ్య సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే ఒకానొక సమయంలో వీటిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. అందుకు తాజా నిదర్శనమే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం. బాలీవుడ్‌తో పాటు సినిమా పరిశ్రమను కుదిపేసిన అతడి మరణం అందరికీ షాక్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో మానసిక ఒత్తిడి కారణంగా గతంలో తమ మదిలోనూ ఇలాంటి ఆలోచనలు మెదిలాయంటున్నారు ప్రముఖ తారలు ఖుష్బూ, షమితా శెట్టి. ఈ సందర్భంగా వీరిద్దరూ సోషల్‌ మీడియా వేదికగా డిప్రెషన్‌కు సంబంధించిన తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
actors-who-died-mysteriously-at-young-age

ఎంత కష్టం వచ్చిందో.. అర్థాంతరంగా తనువు చాలించేశారు..!

అందం, డబ్బు, స్టార్‌ స్టేటస్‌...ఇవన్నీ మనిషి బతకడానికి సరిపోవంటూ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌(34) అకాల మరణం మరోసారి రుజువు చేసింది. వెండితెరపై ‘ధోనీ’గా మెప్పించిన ఈ యంగ్‌ హీరో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తద్వారా తన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు..అందరినీ శోకసంద్రంలో ముంచి స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆకట్టుకునే అందం, డబ్బు, అభిమానులు, గొప్ప పేరు...ఇలా అన్నీ ఉన్న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో సెలబ్రిటీల జీవితం పూలపాన్పేమీ కాదని మరోసారి నిరూపితమైంది. అయితే గతంలో సుశాంత్‌ మాదిరిగానే కొందరు తారలు అర్థాంతరంగా తనువు చాలించారు. అయినవాళ్లకు శోకాన్ని మిగిల్చారు. అలా చిన్న వయసులోనే మరణించిన కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
manjula-opens-about-her-depression-and-shares-about-her-shattered-dreams

ఆ రెండూ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి!

‘షో’.. సినిమాతో ఇటు నటిగా, అటు నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైంది మంజుల. తన నట ప్రతిభతో జాతీయ అవార్డుతో పాటు పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. ఈక్రమంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కూతురిగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సత్తా చాటిన ఆమె తాజాగా తన పేరు మీద ఓ వెబ్‌సైట్‌ను, యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఈమేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో మొదటి వీడియో పోస్ట్‌ చేసిన ఆమె.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-became-pregnant-before-marriage

పెళ్లికి ముందే ఆ శుభవార్త చెప్పేశారు!

రెండు హృదయాలను కలిపే అందమైన బంధం ప్రేమ. పెళ్లితో అది నిండు నూరేళ్ల అనుబంధమవుతుంది. అలాంటి అనుబంధం సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే ఇద్దరు ముగ్గురైనప్పుడే! అయితే పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. అయితే రాన్రానూ పాశ్చాత్య పోకడలు మన దేశం వారిపైనా ప్రభావం చూపడం, ఇతర దేశాలకు చెందిన సినీ తారలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడంతో.. పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. ఇందుకు తాజా ఉదాహరణ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రియురాలు, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌. ఈ ఏడాది తొలి రోజే ఉంగరాలు మార్చుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈ ముద్దుల జంట.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నటాషానే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. ఆపై వివాహబంధంతో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tahira-kashyap-pens-about-her-cancer-scars

ఆ మచ్చల్ని దాచద్దు.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి!

క్యాన్సర్‌... మందు లేని ఈ మహమ్మారి గురించి ఎంతోమంది భయపడుతుంటారు. అయితే ఈ భయాన్ని పటాపంచలు చేస్తూ చాలామంది సెలబ్రిటీలు ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో విజయం సాధించి తమ లాంటి క్యాన్సర్‌ బాధితులకు ఆదర్శంగా నిలిచారు. అందులో ఒకరు బాలీవుడ్‌ క్రియేటివ్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌ తహీరా కశ్యప్‌. రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడినా ఆమె మానసిక స్థైర్యంతో ఆ మహమ్మారిని అధిగమించింది. చికిత్స సమయంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ఫొటోలు, అనుభవాలను షేర్‌ చేసుకున్న ఈ ట్యాలెంటెడ్‌ రైటర్‌ ఆ తర్వాత కూడా తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం లాంటివి చేస్తోంది. ఈక్రమంలో ‘నేషనల్‌ క్యాన్సర్‌ సర్వైవర్స్‌ డే’ను పురస్కరించుకుని మరొక స్ఫూర్తిదాయక పోస్టుతో మన ముందుకొచ్చిందీ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sonakshi-sinha-twitter-chat-with-fans

అతడు ఆరడుగులుండాలి.. నన్ను నవ్వించాలి!

కరోనా అందరి జీవితాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర్నుంచి బిజీ లైఫ్‌స్టైల్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఇంట్లో వాళ్లతో గడపడం దాకా.. అందరూ సరికొత్త అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు విభిన్న అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా తమ లాక్‌డౌన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడంలో అందరికంటే ముందుంటున్నారు మన ముద్దుగుమ్మలు. సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అందాల తారలు.. పోస్టులు, ఫొటోలు, వీడియోలు, ఛాటింగ్స్‌ రూపంలో తమ అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ అందాల భామ సోనాక్షీ సిన్హా ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #SonaSays అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ ఛాటింగ్‌లో తన జ