scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

పాజిటివ్‌ వచ్చినా ‘పాజిటివ్‌’గానే ఉన్నాం!

Actresses Who affected by Corona Virus and Share their experiences

పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా.. ఈ తేడాలేవీ కరోనా మహమ్మారికి తెలియవు.. కనికరం లేకుండా విరుచుకుపడడం తప్ప! అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. తమ సందేశాల ద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం వీరిద్దరూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గతంలోనూ పలువురు ముద్దుగుమ్మలు ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసింది. అయితే తాము ఈ మహమ్మారి బారిన పడినప్పటికీ ఎంతో ధైర్యంగా ఉన్నామని, ఆత్మస్థైర్యమే కరోనాకు ఔషధమని సోషల్‌ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. మరికొందరు తాము కొవిడ్‌ను జయించిన అనుభవాలను అందరితో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌లో ధైర్యం నూరిపోశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ బారిన పడిన కొందరు ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తల్లీ-కూతుళ్లిద్దరికీ పాజిటివ్‌!

View this post on Instagram

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on


బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అంతకుముందు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కొడుకు-నటుడు అభిషేక్‌ బచ్చన్‌ వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకోగా అమితాబ్‌ సతీమణి, అలనాటి నటి జయా బచ్చన్‌కు నెగెటివ్‌గా తేలింది. కానీ ఐశ్వర్య, ఆరాధ్యకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, వారిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు అభిషేక్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఐశ్వర్య, ఆరాధ్యకు కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వాళ్లు వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అమ్మకు నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. మేము త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వారందరికీ పేరుపేరునా థ్యాంక్స్‌!’ అంటూ ట్వీట్‌ చేశారు అభిషేక్‌. ఇక మరోవైపు బచ్చన్‌ కుటుంబ సభ్యులు వైరస్‌ నుంచి త్వరగా కోలుకోవాలంటూ పలువురు ప్రముఖులు, ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మీ ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష!

View this post on Instagram

A post shared by Rachel White (@whitespeaking) on


‘ఉంగ్లి’, ‘హర్‌ హర్‌ బ్యోమ్‌కేశ్‌’.. వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్‌ నటి రాచెల్‌ వైట్‌ కూడా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. ‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నా. నా ఆరోగ్యం కోసం మీరు చేస్తోన్న ప్రార్థనలు నేను త్వరగా కోలుకోవడానికి సహకరిస్తున్నాయి..’ అంటూ ట్వీట్‌ చేసిందీ బ్యూటీ.

‘ప్లాస్మా’తో వారికి ప్రాణదానం చేయండి..!

View this post on Instagram

A post shared by Zoa💫 (@zoamorani) on


‘ఓం శాంతి ఓం’ సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల తార జోయా మొరానీ కూడా గతంలో కరోనా బారిన పడింది. ‘ఆల్వేస్‌ కభీ కభీ’, ‘భాగ్‌ జానీ’.. వంటి సినిమాల్లో నటిగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరీమ్‌ మొరానీ తనయ. మార్చిలో రాజస్థాన్‌ వెళ్లొచ్చిన తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్న జోయాకు మొదటిసారి నెగెటివ్‌గా తేలింది. అయితే ఆపై మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుందీ చిన్నది.

View this post on Instagram

A post shared by Zoa💫 (@zoamorani) on


ఇక ఆసుపత్రి నుంచి కోలుకున్నాక తన ప్లాస్మాను దానం చేయడానికీ వెనకాడలేదీ బ్యూటీ. ఈ క్రమంలో తాను ప్లాస్మా దానం చేస్తుండగా క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న జోయా.. ‘నాయర్‌ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్‌లో భాగంగా నేను నా ప్లాస్మాను దానం చేశా. ఇదెంతో సంతోషంగా అనిపిస్తోంది. ఈ క్రమంలో వైద్య బృందం నాకు సహకరించిన తీరు నన్ను కట్టిపడేసింది. వాళ్లు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారందరూ ఈ ప్లాస్మా ట్రయల్స్‌లో పాల్గొనాలని, ఇతర బాధితులు ఈ మహమ్మారి నుంచి బయటపడడానికి సహకరించాలని కోరుతున్నా. థ్యాంక్యూ!’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది జోయా. ఆపై కొన్ని రోజులకు మరోసారి తన ప్లాస్మాను దానం చేసిందీ మనసున్న తార.

ఇతరుల పట్ల వివక్ష వద్దు!

View this post on Instagram

A post shared by Indira (@indypindy9) on


బ్రిటిష్‌-ఇండియన్‌ నటి, ‘కామసూత్ర’ సినిమా ఫేమ్‌ ఇందిరా వర్మ తనకు కరోనా సోకినట్లు ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ సిరీస్‌లో నటిస్తోన్న తనకు.. తన సహనటుడు క్రిస్టోఫర్‌ హివ్జుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రెండు రోజుల తర్వాత పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ వైరస్‌ బారిన పడడం విచారకరం. అందులో నేనూ ఉన్నా. మనందరం త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అందరూ జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉండండి.. మీ తోటి వారి పట్ల వివక్ష చూపకుండా దయతో మెలగండి..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ అందాల తార.

ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత త్వరగా నెగెటివ్‌ వస్తుంది!

View this post on Instagram

A post shared by Additi Gupta Chopra (@additigupta) on


బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ అదితీ గుప్తా తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఇటీవలే వెల్లడించింది. ‘ఇష్క్‌బాజ్‌’ సీరియల్‌తో పాపులర్‌ అయిన ఈ అందాల తార.. తనకు వాసన, రుచి కోల్పోవడం తప్ప మరే లక్షణాలు కనిపించలేదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా పంచుకుంది. ‘వాసన, రుచి పసిగట్టే సామర్థ్యం కోల్పోవడంతో నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలింది. నాకు మరే ఇతర లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా ఏడెనిమిది రోజుల పాటు ఓ ప్రత్యేకమైన గదిలో నన్ను నేను నిర్బంధించుకున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతోంది. వాసన పసిగట్టే సామర్థ్యం కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అయినా మరో పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వైద్యులు సూచించిన మందులు వాడుతున్నా. మీ అందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. భయపడకండి.. ధైర్యంగా ఉండండి! మొదట్లో నాకూ కాస్త భయంగానే అనిపించింది.. కానీ సానుకూల దృక్పథమే నన్ను తిరిగి మామూలు మనిషిని చేస్తోంది..’ అంటూ తన స్ఫూర్తిదాయక సందేశంతో అందరిలో ప్రేరణ కలిగిస్తోందీ బ్యూటిఫుల్‌ బేబ్‌.

నెల తర్వాత నెగెటివ్‌!

View this post on Instagram

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on


‘కరోనాకు భయపడకు.. మనో నిబ్బరాన్ని కోల్పోకు..’ అంటోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ మోహెనా కుమారి సింగ్‌. కొన్ని రోజుల క్రితం తనతో పాటు తన కుటుంబంలోని మరో ఏడుగురికి కరోనా సోకిందని.. వారంతా కోలుకొని డిశ్చార్జి అవుతున్నప్పటికీ తనకు మాత్రం పదే పదే పాజిటివ్‌ రావడంతో కాస్త టెన్షన్‌ పడ్డానంటోందీ చిన్నది. అంతేకాదు.. తాను ట్రీట్‌మెంట్‌ తీసుకునే క్రమంలో తనకెదురైన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌లో ధైర్యం నింపిన ఈ అందాల తార.. నెల రోజుల తర్వాత ఎట్టకేలకు కరోనా నెగెటివ్‌గా వచ్చిందంటూ ఇటీవలే మరో పోస్ట్‌ రూపంలో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on


పీపీఈ కిట్లు ధరించిన డాక్టర్లతో తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన మోహెన.. ‘నెల రోజుల తర్వాత నాకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ సందర్భంగా నాకు అత్యుత్తమ వైద్య సేవలందించిన ఎయిమ్స్‌ రిషికేష్‌ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సమయంలో నేను నా జీవితంలో అత్యుత్తమైన డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్స్‌, ఇతర వైద్య సిబ్బందిని కలిశాను. తమ నిస్వార్థ పనితీరుతో నిజాయతీతో ఎందరో బాధితులకు సేవలందిస్తూ, వారిని ఈ గండం నుంచి గట్టెక్కిస్తోన్న ఇలాంటి వైద్య సిబ్బందికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ప్రజలు డాక్టర్లపై పూర్తి నమ్మకముంచారు. అలాగే డాక్టర్లు కూడా తమ నిస్వార్థమైన సేవలను ఇకపైనా కొనసాగించాలని కోరుకుంటున్నా..’ అంటూ క్యాప్షన్‌ పెట్టిందీ బుల్లితెర తార.

View this post on Instagram

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on


అంతేకాదు.. ట్రీట్‌మెంట్‌ తీసుకునే క్రమంలో తాను పాటించిన ఆహార నియమాలు, ఇతర జాగ్రత్తల గురించి కూడా మరో పోస్ట్‌ రూపంలో పంచుకుందీ సుందరి. ఈ క్రమంలో తన సోదరుడు దివ్యరాజ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘నాకు కరోనా నెగెటివ్‌ వచ్చింది.. నీకు పాజిటివ్‌ వచ్చింది. కానీ నన్ను నమ్ము దాదూ.. ఇది అంత ప్రమాదకరమేమీ కాదు! అయితే ఈ చిన్న చిన్న చిట్కాలు మాత్రం గుర్తుపెట్టుకో..!
* జలుబు, దగ్గు.. వంటి ఫ్లూ లక్షణాలను దూరం చేసే కాఢా డ్రింక్‌ లేదా కాఢా టీ (లవంగాలు, నల్ల మిరియాల పొడి, అల్లం తురుము, తులసి ఆకులను నీళ్లలో మరిగించి తయారుచేసే డ్రింక్‌) రోజూ తీసుకోవాలి.
* ఇంటి ఆహారమే తీసుకోవాలి. అందులోనూ తాజా పండ్లు, కాయగూరలు, పప్పులు.. వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
* రోజూ విటమిన్‌ ‘సి’ సప్లిమెంట్స్‌ వేసుకోవాలి.
* ఏసీ వాడకూడదు.
* గోరువెచ్చటి నీటితో పుక్కిలించాలి (గార్ గ్లింగ్ చేయాలి).
* పాలల్లో పసుపు వేసుకొని తాగాలి.
* గుండె కొట్టుకునే వేగాన్ని (హార్ట్‌ రేట్‌) ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడానికి వీలుగా ఓ ఆక్సీమీటర్‌ని వెంటే ఉంచుకోవాలి..’ అంటూ రాసుకొచ్చింది మోహెన. ఇలా కొవిడ్‌ ఎదుర్కొనే క్రమంలో తన అనుభవాలన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో ధైర్యం నింపిందీ సుందరి.

అది నా నిర్లక్ష్యం కాదు!

View this post on Instagram

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on


మన దేశంలో కరోనా బారిన పడిన తొలి సెలబ్రిటీ బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌. మార్చి 9న లండన్‌ నుంచి ముంబై వచ్చిన కనిక.. అక్కడి నుంచి కాన్పూర్‌, లక్నో వెళ్లింది. అక్కడ ఓ విందులో ప్రముఖులతో పాల్గొంది. ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పది రోజులు గడిచినా ఆమె ఆరోగ్యం మెరుగపడకపోవడంతో, నాలుగు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించినప్పటికీ నాలుగు సార్లూ పాజిటివ్‌ రావడంతో కనిక ఐసీయూలో చికిత్స తీసుకుందంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి అసత్య వార్తలకు తన పోస్ట్‌తోనే చెక్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ సింగర్‌.

View this post on Instagram

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on


ఆపై తన కరోనా అనుభవాలను పంచుకుంటూనే, మరోవైపు తన నిర్లక్ష్యం వల్లే కరోనా బారిన పడిందంటూ కొంతమంది చేసిన విమర్శల్ని సున్నితంగా తిప్పికొట్టింది కనిక. ‘మార్చి 20న నాకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. వెంటనే హాస్పిటల్‌లో చేరాను. చికిత్స తర్వాత వరుసగా 3 సార్లు చేసిన టెస్ట్‌లలో నెగెటివ్‌ వచ్చిన తర్వాత నన్ను హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ చేశారు. ఆపై 21 రోజులుగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ ఈ విషయంలో నిజాయతీగా, సున్నితంగా వ్యవహరిస్తారని భావిస్తున్నాను. ఓ వ్యక్తి గురించి చెడుగా ప్రచారం చేసినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు..’ అంటూ కాస్త ఎమోషనల్‌గానే స్పందించిందీ ముద్దుగుమ్మ. ఇలా పదే పదే పాజిటివ్‌ వచ్చినా తనలోని ధైర్యాన్ని కోల్పోకుండా నెమ్మదిగా ఆ మహమ్మారి నుంచి బయటపడిందీ సూపర్‌ సింగర్‌.

ధైర్యమే మనల్ని కాపాడుతుంది!


‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’.. వంటి బుల్లితెర సీరియళ్లతో తెలుగు అతివలకు దగ్గరైంది కన్నడ బ్యూటీ నవ్య స్వామి. ఇటీవలే కరోనా బారిన పడిన ఆమె.. తనకెలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే కరోనాను జయించాలంటే ధైర్యంగా ఉండాల్సిందేనని చెబుతూ ఓ సందేశాత్మక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బుల్లితెర తార.

View this post on Instagram

A post shared by Navya Swamy (@navya_swamy) on


‘హాయ్‌.. నేను మీ అందరితో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాకు కొవిడ్‌ సోకిందని తెలిసిన మరుక్షణం నేను డాక్టర్‌ని సంప్రదించాను.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. ప్రస్తుతం డాక్టర్‌ సూచన మేరకు మందులు వాడుతున్నా. సప్లిమెంట్స్‌ తీసుకుంటున్నా. నా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాహారం తీసుకుంటున్నా. గత వారం రోజులుగా నన్ను కలిసిన నా స్నేహితులు, నాకు దగ్గరగా ఉన్న వాళ్లంతా దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి.. స్వీయ నిర్బంధంలో ఉండండి. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.. సిగ్గు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నెగెటివిటీకి దూరంగా ఉండండి.. అసత్య వార్తల్ని ప్రచారం చేయకండి. వైరస్‌ సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే సోకకుండా ముందు జాగ్రత్తపడడం చాలా మంచిది. అయినప్పటికీ ఒకవేళ పాజిటివ్‌ వచ్చినా సరే.. అస్సలు భయపడకండి. దృఢంగా ఉండండి.. మీ శరీరంలోని వైరస్‌ పూర్తిగా నశించిపోయే దాకా ఇతరులకు దూరంగా ఉండండి.. వైరస్‌ గొలుసును తెంచాలంటే మన ముందున్న ఒకే ఒక్క దారి ఇదే! దేవుడి దయవల్ల, మీ అందరి ప్రేమాప్యాయతల వల్ల నేను క్షేమంగా ఉన్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకొస్తా..’ అంటూ వీడియోలో భాగంగా పంచుకుందీ ముద్దుగుమ్మ. ఇలా తన సందేశంతో అభిమానుల్లో కరోనా పట్ల నెలకొన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసింది నవ్య.

స్వల్ప లక్షణాలు బయటపడ్డాయ్‌!

View this post on Instagram

A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) on


అలనాటి అందాల తార, పార్లమెంట్‌ సభ్యురాలు సుమలత అంబరీష్‌ తనకు కరోనా నిర్ధారణ అయినట్లు ఇటీవలే ప్రకటించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంలో పరీక్షలు చేయించుకున్న తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ పెట్టారు. ‘జులై 4న కాస్త తలనొప్పిగా అనిపించింది. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డాక్టర్‌ సలహా మేరకు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా. నా బలమైన రోగనిరోధక శక్తికి తోడు మీ అందరి ఆశీస్సులు నేను తిరిగి కోలుకునేలా చేస్తాయి. ఇటీవలే నన్ను కలిసిన వారంతా దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి..’ అంటూ రాసుకొచ్చారు సుమలత.

ఇలా ఈ ముద్దుగుమ్మలంతా ఓవైపు తాము కరోనా బారిన పడినప్పటికీ మరోవైపు తమ గుండె ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, ధైర్యమే మనల్ని ఈ వైరస్‌ బారి నుంచి కాపాడగలవని, అందుకే ప్రతి ఒక్కరూ భయపడకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలని తమ ఫ్యాన్స్‌లో ధైర్యం నింపుతున్నారు.

women icon@teamvasundhara
actress-and-former-miss-india-world-natasha-suri-tests-positive-for-covid-19

women icon@teamvasundhara
bhojpuri-actress-anupama-pathak-commits-suicide-in-mumbai

నమ్మిన వారే మనల్ని నట్టేట ముంచేస్తారు!

మొన్న సుశాంత్‌.... నిన్న సమీర్... నేడు అనుపమా పాథక్‌... సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. డిప్రెషన్‌, ఆర్థికంగా.. ఇలా కారణాలేవైనా కానీ ఈ వరుస బలవన్మరణాలు ముంబైవాసులతో పాటు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా భోజ్‌పురి నటి అనుపమా పాథక్‌ (40) ముంబైలో బలవన్మరణానికి పాల్పడింది. బిహార్‌కు చెందిన ఆమె భోజ్‌పురి సినిమాలు, టీవీ సీరియల్స్‌ ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే నమ్మిన వారే తనను మోసం చేశారంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తన ఇంట్లోనే తనువు చాలించుకుంది. ఈ మేరకు సంఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు ఆమెది ఆత్మహత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Know More

women icon@teamvasundhara
bride-to-be-miheeka-bajaj-chooses-yellow-lehenga-sea-shell-jewellary-for-haldi-ceremony

భళ్లాల దేవుడి ఇష్ట సఖి.. మెరిసేను ‘పుత్తడి’ బొమ్మలా..!

‘తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన.. శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ’ అంటూ నవవధువు అందచందాల్ని పొగిడారో సినీ కవి. ఆ పోలికలకు ఏమాత్రం తగ్గకుండా కుందనపు బొమ్మలా ముస్తాబైంది మన భళ్లాలదేవుడికి కాబోయే భార్య మిహీకా బజాజ్‌. ఆగస్టు 8న రానా-మిహీకల వివాహ ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రోజుల ముందుగానే వధూవరుల ఇళ్లలో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు మొదలయ్యాయి. తాజాగా మిహీక ఇంట్లో నిర్వహించిన హల్దీ ఫంక్షన్‌లో కొత్త పెళ్లి కూతురు పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తులు-జ్యుయలరీతో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ పసుపు వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా

Know More

women icon@teamvasundhara
celebrity-siblings-in-entertainment-industry

వెండితెరనూ పంచుకున్నారు... ఈ సెలబ్రిటీ తోబుట్టువులు!

తోబుట్టువులంటే కేవలం ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని పంచుకోవడం మాత్రమే కాదు.. అవసరమైతే బాధ్యతల్లో భాగస్వాములై, ఒకరికొకరు సాయపడుతూ ఒకే కెరీర్‌లో కూడా కొనసాగొచ్చని చెబుతున్నారీ సెలబ్రెటీలు. ఇందులో కొందరు నటులుగా ప్రసిద్ధులైతే, మరికొందరు దర్శకులుగా, నిర్మాతలుగా.. ఇలా ఒకరికి మించి మరొకరు సినీరంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. అక్కను మార్గదర్శకురాలిగా తీసుకుని ముందుకు సాగుతున్న తమ్ముళ్లు కొందరైతే.. అన్నను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచిన చెల్లెళ్లు మరికొందరు. ఏదేమైనా వీరందరూ అనుబంధంతో పాటు 'వెండితెర'నూ సమానంగా పంచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 'రాఖీ పండగ' సందర్భంగా వెండితెరను వేదికగా చేసుకుని పలువిభాగాల్లో వెలిగిపోతున్న కొందరు సెలబ్రిటీ తోబుట్టువుల గురించి తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
naomi-osaka-hits-back-at-netizens-trolling-on-her-flaunting-swim-suit

నాకిప్పుడు 22 ఏళ్లు... నా దుస్తులపై మీ కామెంట్లు ఏంటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాకా తన దుస్తులపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన నెటిజన్లకు తగిన రీతిలో సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
celebrities-posts-black-and-white-photos-in-instagram

women icon@teamvasundhara
janhvi-kapoor-opens-about-nepotism-and-sexism-in-industry

ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు?

అతిలోక సుందరి ‘శ్రీదేవి’ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం ‘ధడక్‌’తోనే అందరి ప్రశంసలు అందుకొని ..అందంతో పాటు నటన కూడా తన డీఎన్‌ఏలోనే ఉందని నిరూపించుకుంది. నటనలో తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమె త్వరలో ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్ గర్ల్‌’ గా మన ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రియల్‌ కార్గిల్‌ గర్ల్‌ గుంజన్‌ సక్సేనాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ... తన వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-talks-body-positivity-in-an-instagram-video

ఎవరేమనుకుంటే మనకేంటి..? మనకు నచ్చినట్లుగా మనముందాం!

అమ్మతనం.. ఇది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం.. మహిళలుగా మనకు మాత్రమే దక్కిన గొప్ప వరం. అలాంటి అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే క్రమంలో కొంతమంది మహిళలు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు.. నలుగురితో పోల్చుకుంటున్నారు.. తమను తామే తక్కువ చేసి చూసుకుంటున్నారు.. కారణం.. అమ్మయ్యాక శరీరంలో కలిగిన మార్పులే! అయితే అలాంటి ఆందోళనలు, పోలికలు అనవసరమంటోంది బాలీవుడ్‌ అందాల అమ్మ సమీరా రెడ్డి. తనకూ ఇలాంటి సంఘటనలు బోలెడన్ని ఎదురయ్యాయని, ఎవరేమన్నా పట్టించుకోకుండా ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవాలని అమ్మలందరిలో పాజిటివిటీని నింపుతోంది. ఇటీవలే తల్లైన ఓ మహిళ తనకు పంపిన సందేశానికి బదులిస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది సమీర. ఇలా బాడీషేమింగ్‌ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చి అతివల్లో స్ఫూర్తి నింపుతోందీ బ్యూటిఫుల్‌ మామ్.

Know More

women icon@teamvasundhara
manisha-koirala-says-situation-during-corona-pandemic-seems-easy

women icon@teamvasundhara
rupali-ganguly-shares-her-experience-about-shootings-during-the-pandemic

అమ్మా.. మళ్లీ నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఆరునెలలు ఆగాలా?

స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం అంటూ మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది కరోనా. ఈ మహమ్మారి తీసుకొచ్చిన భయంతో కనీసం కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్‌ కారణంగా అత్యంత సన్నిహితులైనా, స్నేహితులైనా దూరంగా ఉంచుతున్నాం. ఇలా శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న ఈ మహమ్మారి తనను మరింత సతమతం చేస్తోందని వాపోతోంది బెంగాలీ నటి రూపాలీ గంగూలీ. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సీరియళ్లు, సినిమా షూటింగులకు ప్రభుత్వాలు అనుమతినివ్వడంతో మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతోందామె. అయితే కరోనా భయంతో తన కుటుంబ సభ్యులకు వీలైనంత దూరంగా ఉంటున్న ఆమె... తాజాగా తన ఆవేదన గురించి అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
rashi-kanna-and-manchu-lakshmi-completed-green-india-challenge

women icon@teamvasundhara
rashmi-sudheer-in-ali-tho-saradaga-show

ఈ విశ్వంలో నేను చూసిన గొప్ప అందం తనే...!

రష్మీ-సుధీర్‌...బుల్లితెరపై ‘జబర్దస్త్‌’ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సందడికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే ఈ జంట... తమ ఆన్‌స్ర్కీన్‌ కెమిస్ట్రీతో ఎలాంటి కార్యక్రమాన్నైనా రక్తి కట్టిస్తారు. డ్యాన్స్‌లు, జోకులతో అలరిస్తూ స్టేజిపై ఆహ్లాదకర వాతావరణం సృష్టిస్తారు. ఆన్‌స్ర్కీన్‌పై అద్భుత కెమిస్ట్రీతో అందరినీ అలరిస్తున్న ఈ ఇద్దరి గురించి, వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం గురించి వాళ్లంతట వాళ్లు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సుధీర్‌, రష్మీ ఇటీవల మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈక్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ హిట్‌పెయిర్‌ లాక్‌డౌన్‌ ముచ్చట్లు, వారి వృత్తిగత, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
anchor-jhansi-clarifies-about-her-isolation-during-covid-pandemic
women icon@teamvasundhara
how-these-celebrities-beat-lockdown-blues?

మళ్లీ మంచిరోజులొస్తాయి.. అప్పటిదాకా ఇలా బిజీగా ఉందాం..!

సాధారణంగా వృత్తిఉద్యోగాలు చేసే వారికి వారానికి కనీసం ఒకట్రెండు రోజులైనా సెలవులుంటాయి. అదే సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఆ సమయం కూడా దొరకదు. సినిమా వాళ్లు నెలల తరబడి షూటింగ్స్‌కి, క్రీడాకారులు ప్రాక్టీస్‌కు సమయం వెచ్చించాల్సిందే! అలాంటి వారికి అరుదుగా, అనుకోకుండా లాక్‌డౌన్ పేరుతో బోలెడంత ఖాళీ సమయం దొరికే సరికి తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఇంకా టోర్నమెంట్లు, షూటింగులు మొదలు కాకపోవడంతో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తమ అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. భారత యువ షూటర్‌ మనూ భాకర్‌ కూడా ఈ ఖాళీ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు నచ్చిన పనులు చేస్తున్నానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన సినీ తారలు, క్రీడాకారిణులు ఏం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-jaya-bhattacharya-food-packets-and-essentials-to-needy-amid-lockdown

కరోనా అంతమైనా నా సేవను మాత్రం ఆపను!

అప్పటిదాకా హాయిగా ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయి కొందరు బాధపడుతుంటే.. తినడానికి తిండి కూడా కరవై ఆకలితో అలమటిస్తోన్న వారు ఎందరో! ఇక ఇలాంటి కష్ట కాలంలో మూగ జీవాల వెతలు ఎవరికీ పట్టవు. కానీ ఈ గడ్డు కాలంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు.. అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటున్నారు బాలీవుడ్‌ నటీమణి జయా భట్టాచార్య. బుల్లితెరపై పలు సీరియళ్లలో, వెండితెరపై కీలక పాత్రల్లో నటించి మెప్పించిన జయ.. ఈ లాక్‌డౌన్‌లో నలుగురికి సహాయపడుతూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. అంతేకాదు.. తన సేవలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా తన సేవల్ని ఇలాగే కొనసాగిస్తానంటోన్న ఈ నటీమణి గురించి, ఆమె చేస్తోన్న సేవల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
payal-ghosh-and-parno-mittra-opens-about-fighting-depression

సమస్య పంచుకోండి.. భారం దించుకోండి!

ఒత్తిడి, ఆందోళన... ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగా కుంగదీస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుంటాయీ మానసిక రుగ్మతలు. వీటిని భరించలేక ఒకనొక సమయంలో చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా ఈ సమస్యతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తాము కూడా డిప్రెషన్‌ బాధితులమేనంటూ పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తమకెదురైన గడ్డు పరిస్థితుల గురించి ధైర్యంగా చెప్పడమే కాకుండా.. వాటినెలా అధిగమించారో వివరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘ప్రయాణం’ ఫేం పాయల్‌ ఘోష్‌, బెంగాలీ నటి పార్నో మిత్రా కూడా తమ డిప్రెషన్‌ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

Know More