అందరికీ హలో..! చాలామంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. నేను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నాను. నేను మీకు ఓ విషయంపై క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఐసొలేషన్‌కి, క్వారంటైన్‌కి తేడా ఉంది. నేను మొదట చేసిన పోస్ట్ కూడా అదే. దాన్ని కొంతమంది సరిగా అర్ధం చేసుకోకుండా వివిధ మాధ్యమాల్లో నా ఆరోగ్యంపై రకరకాలుగా రాశారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ని వారు చూడకపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యారు. దయచేసి ఎవరైతే వెబ్సైట్, యూట్యూబ్‌లో సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారో, వారు వాస్తవాలను చెక్ చేసుకుని, సరిగా అర్థం చేసుకొని, సరైన సమాచారాన్ని ఇస్తే బాగుంటుంది.
నేను ఈ రోజు రెండు అంశాలపై మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి భయం, పక్షపాతం; రెండోది మన బాధ్యతలు.. కొవిడ్ అందరికీ వచ్చే అవకాశం ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. మన చుట్టుపక్కల వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. మనం రిస్క్‌లో ఉన్నామన్న విషయం తెలిసిందే. వస్తే ఏం చేయాలి? భయం, పక్షపాతం లేకుండా మనమందరం ఎలా ముందుకు వెళ్లాలనేది మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని నేను నమ్ముతున్నాను. అందుకోసం మనకు కానీ, మన చుట్టు పక్కల వారికి ఎవరికైనా వైరస్ వచ్చినా ఆ విషయం దాచకుండా, మనం తీసుకునే చర్యలు వాళ్లకు భరోసా, సహాయం చేసే విధంగా ఉండాలి. అంతేకానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఇది నా మొదటి పాయింట్.
పెద్దవాళ్లు, ఆరోగ్యం బాగాలేని వాళ్లు కొవిడ్ బారిన పడకుండా మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ల గురించి మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఇక నా విషయానికొస్తే.. నేను వ్యాయామం చేస్తాను.. పౌష్టికాహారం తీసుకుంటాను.. మిడిల్ ఏజ్‌లో ఉన్నాను.. నాలాంటి వాళ్లు ఎలాంటి లక్షణాలు లేని క్యారియర్స్‌గా ఉండచ్చు. వైరస్ రావచ్చు. అది తెలియకుండానే వచ్చి వెళ్లి పోవచ్చు. అది అంత పెద్ద విషయం కాదు.
ఐసొలేషన్ ఎందుకంటే...? ఇక- ఐసొలేషన్ ఎందుకూ అంటే- నేను పని చేసినప్పుడు.. నా సెట్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఇది సాధారణమైన విషయం. ఇక నుంచి మీరు పనిచేయడానికి బయటకు వెడితే.. ప్రతి పదిమందిలో ఒకరికి వైరస్ ఉందన్న విషయం మీకు వారు చెప్తే కానీ తెలియదు. తెలియకుండా మీ చుట్టు పక్కల ఎంతమంది ఉన్నారో? కాబట్టి, వాళ్లు టెస్ట్ చేయించుకొని.. నాకు పాజిటివ్ వచ్చిందని చెప్పి.. ప్రైమరీ కాంటాక్ట్‌లో ఎంతమంది ఉన్నారో వారికి సమాచారం ఇస్తే వారు దేవుళ్లు! ఎందుకంటే వాళ్లు చేసిన ఆ ఒక్క పని వల్ల నేను జాగ్రత్తగా ఉండగలుగుతున్నాను. ఏదైనా సందేహం వస్తే నా ఫిజీషియన్‌తో మాట్లాడగలుగుతున్నాను. అన్నింటికంటే పెద్ద విషయం ఏంటంటే.. తెలియకుండా అజ్ఞానంతో అందరినీ కలిసేసి చుట్టుపక్కల వ్యాప్తి చేయడం కంటే.. పనికి వెళ్లకుండా, షాపులకు వెళ్లకుండా, పబ్లిక్‌లో తిరగకుండా ఇలా హ్యాపీగా మన ఇంట్లో, మన గదిలో, మన వాళ్ల మధ్యలోఒక్క రెండు వారాలు ఉంటే ఏమవుతుంది..? నేను అలాగే హ్యాపీగా ఉన్నాను.
రూమార్స్ని నమ్మద్దు ! ఎందుకు ఐసొలేషన్? అని అందరూ అడుగుతున్నారు... కాబట్టి వారికి మళ్లీ క్లారిటీ ఇస్తున్నాను. నా సెట్లో నేను వర్క్ చేసిన ఇద్దరు సహోద్యోగులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి.. నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఇద్దరూ పెద్దవాళ్లు కాబట్టి.. వాళ్లను రిస్క్‌లో పడేయకుండా ఉండాలి. బయటకు వచ్చి 'నేను బాగానే ఉన్నాను.. నాకు ఏమీ లేదు..' అనుకుని; కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా ధీమాగా నలుగురిలో తిరిగేసి.. మిగతా వారికి అంటించాలన్న ఉద్దేశం నాకు లేదు. రిస్క్ శాతం 50-50 ఉండచ్చు. కానీ నేను రిస్క్ తీసుకోదలచుకోలేదు కాబట్టి.. నన్ను నేను ఐసొలేట్ చేసుకున్నాను. ఇప్పటికి నేను ఐసొలేషన్‌లో ఉండి ఏడు రోజులు అయ్యింది. ఒకవేళ లక్షణాలు బయటపడితే, నాలో వైరస్ ఉన్నట్టయితే తప్పకుండా అందరికీ తెలియజేస్తాను. మీరు దయచేసి రూమర్స్‌ని, గాసిప్స్‌ని.. ఎక్కడెక్కడో విన్నటువంటి వాటిని నమ్మకుండా ఒరిజినల్ సోర్స్‌తో చెక్ చేసుకుని వాటినే నమ్మండి అని కోరుతున్నాను. ఒకవేళ నాకు పాజిటివ్ వస్తే తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. ఇంకో వారం రోజులు ఇంటి దగ్గరే ఉంటాను. తర్వాత వర్క్ మొదలుపెడతాను. వర్క్‌లోనూ జాగ్రత్తపడతాను. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు.. గుర్తు పెట్టుకోండి.. 'ఒక్కరోజు ఐసొలేషన్ లో ఉన్నాను. కరోనా నా దగ్గరకి రాదు..' అని అనుకోవడానికి లేదు. వర్క్ చేసిన ప్రతిసారీ మేం ఈ రిస్క్ తీసుకొని మరీ బయటకు వెళ్తున్నాం.. ప్రతిసారీ జాగ్రత్తగా ఉంటాం. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరమూ జాగ్రత్తగా ఉంటూ వైరస్‌ను ఎదుర్కొందాం.. స్టే సేఫ్!
|