scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

ఎంత కష్టం వచ్చిందో.. అర్థాంతరంగా తనువు చాలించేశారు..!

Actors who died mysteriously at young age

అందం, డబ్బు, స్టార్‌ స్టేటస్‌...ఇవన్నీ మనిషి బతకడానికి సరిపోవంటూ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌(34) అకాల మరణం మరోసారి రుజువు చేసింది. వెండితెరపై ‘ధోనీ’గా మెప్పించిన ఈ యంగ్‌ హీరో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తద్వారా తన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు..అందరినీ శోకసంద్రంలో ముంచి స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆకట్టుకునే అందం, డబ్బు, అభిమానులు, గొప్ప పేరు...ఇలా అన్నీ ఉన్న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో సెలబ్రిటీల జీవితం పూలపాన్పేమీ కాదని మరోసారి నిరూపితమైంది. అయితే గతంలో సుశాంత్‌ మాదిరిగానే కొందరు తారలు అర్థాంతరంగా తనువు చాలించారు. అయినవాళ్లకు శోకాన్ని మిగిల్చారు. అలా చిన్న వయసులోనే మరణించిన కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి.!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌

View this post on Instagram

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

బిహార్‌ లోని పట్నాకు చెందిన సుశాంత్‌ బుల్లితెర నటుడిగా కెరీర్‌ ఆరంభించాడు. ‘పవిత్ర రిశ్తా’ సీరియల్‌తో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ‘కై పోచే’, ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టివ్‌ బొమ్‌కేష్‌ బక్షి’, ‘ఎం.ఎస్‌.ధోని..ద అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘రాబ్తా’, ‘వెల్‌కమ్‌ న్యూయార్క్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచారియా’, ‘చిచ్చోరే’ తదితర సినిమాల్లో నటించి అలరించాడు. ప్రత్యేకించి ‘ఎం.ఎస్‌.ధోనీ’ చిత్రంతో విశేష అభిమానులను సొంతం చేసుకున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో. ఇక గతేడాది వచ్చిన ‘చిచ్చోరే’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సో...కెరీర్‌ పరంగా సుశాంత్ ఫాంలోనే ఉన్నాడు. దీనితో పాటు అతనికి బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. లక్షలాది మంది అభిమానులున్న ఈ హీరోకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు. అయినా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మానసిక కుంగుబాటే అతని మరణానికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.


ప్రత్యూషా బెనర్జీyoungagedeathsincinema650-1.jpe

ప్రముఖ బుల్లితెర నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య సినీ రంగంలో పెద్ద కుదుపని చెప్పుకోవాలి. బాలికా వధు సీరియల్‌తో సినీ తారల కంటే ఫేమస్‌గా మారిన ప్రత్యూష 2016 ఏప్రిల్ 1న తన గదిలో ఉరి వేసుకొని కనిపించడం ఆమె కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభిమానులనూ కలచివేసింది. మొదట కేవలం ఆత్మహత్యగా భావించారు. అయితే ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగే ఆమెను హత్య చేసి ఉంటాడని తన తల్లిదండ్రులు ఆరోపించారు. దీనికి తగినట్లే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల మరణించినట్లు తేలింది. దీంతో పోలీసులు కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.


జియా ఖాన్

youngagedeathsincinema650-2.jpg

'నిశ్శబ్ద్' చిత్రంతో ఇండస్ట్రీలో హల్‌చల్ సృష్టించిన నటి జియా ఖాన్. అయితే 2013 జూన్ 3న ఆమె జుహులోని తన అపార్ట్‌మెంట్ బెడ్‌రూంలో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని కనిపించింది. పోలీసులు మొదట ఈ కేసును ఆత్మహత్యగా నిర్ధారించినా.. జియా తల్లి రబియా మాత్రం తన కూతురికి న్యాయం జరిగేవరకూ పోరాడేందుకు నిర్ణయించుకున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీపై అనుమానాలు వ్యక్తం చేసింది. దానికి తగినట్లే ఆరు పేజీల సూసైడ్ లెటర్ ఆమె గదిలో దొరకడంతో సూరజ్ పంచోలీపై కేసు నమోదైంది. అంతేకాదు.. ఆమె తన డైరీలో తామిద్దరి లివ్ ఇన్ రిలేషన్‌షిప్ గురించి, సూరజ్ వల్ల తాను పడిన బాధ గురించి రాసుకున్న మాటల ఆధారంగా కేసు నమోదు చేశారు. సీబీఐ ఆమెది ఆత్మహత్యగానే తేల్చినా.. రబియా ఖాన్ బ్రిటిష్ ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి తిరిగి పరీక్షలు చేయించి తన కూతురిది ఆత్మహత్య కాదని నిర్ధారించేలా చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.


ప్రత్యూష..

actresswhodiedearly650-07.jpg

'చెలియా చెలియా సింగారం.. చిటికెడు నడుమే వయ్యారం..' అంటూ కుర్రకారుని ఓ వూపు వూపిన తెలుగింటి అమ్మాయి ప్రత్యూష. 'రాయుడు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె 'సముద్రం', 'స్నేహమంటే ఇదేరా..'.. వంటి చిత్రాల్లో నటించింది. 'కలుసుకోవాలని..' చిత్రంతో తెలుగులో కథానాయికగా మొట్టమొదటి హిట్ అందుకుంది. సరిగ్గా ఇండస్ట్రీలో కథానాయికగా ఎదుగుతోన్న ఆ సమయంలోనే 2002, ఫిబ్రవరిలో ఆమె అకస్మాత్తుగా అనంతలోకాలకు తరలిపోయింది. ప్రేమలో విఫలం చెందిన కారణంగా తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని కొందరు అంటే; హత్య చేశారని ప్రత్యూష తల్లి ఆరోపించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోనూ ఆమెపై అత్యాచారం జరిపి వూపిరాడకుండా చేసి చంపినట్లు నిర్థరణ అయింది. మొత్తానికి కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన సమయంలో అందనంత ఎత్తుకి ఎగిరిపోయి అభిమానులకు అంతులేని బాధను మిగిల్చింది ప్రత్యూష.


ప్రియా రాజవంశ్

youngagedeathsincinema650-4.jpg

అలనాటి అందాల నటి ప్రియా రాజవంశ్. 'హీర్ రాంజా', 'హకీకత్' వంటి చిత్రాల్లో నటించిన ఆమె ప్రముఖ నిర్మాత, దర్శకుడు చేతన్ ఆనంద్‌ని వివాహమాడారు. అయితే ఆయనకు అప్పటికే ఒకసారి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. 1997లో ఆయన మరణం తర్వాత ఆయన ఆస్తిలో ప్రియకు కూడా కొంత వాటా వచ్చింది. 2000 సంవత్సరంలో ఆమె తన ఇంట్లో హత్యకు గురై కనిపించింది. మొదట్లో ఆమె హత్యకు గల కారణాలు అస్సలు కానరాలేదు. అయితే పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తుండగా ఓరోజు ఆమె రాసిన లేఖ కనిపించింది. అందులో చేతన్ కుమారులైన కేతన్ ఆనంద్, వివేక్ ఆనంద్‌లు ఆస్తి కోసం తనపై ఏదైనా అఘాయిత్యం తలపెట్టే అవకాశం ఉందని.. ఒకవేళ తాను అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారిని అనుమానించాలని ఆమె కోరింది. ఈ లేఖ ఆధారంగా కేసు విచారణ జరపగా.. వారిద్దరితో పాటు ఇద్దరు పని మనుషులు కలిసి ఆమెను హత్య చేసినట్లు తేలింది. వారికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.


సిల్క్ స్మిత

youngagedeathsincinema650-5.jpg

వడ్లపాటి విజయలక్ష్మి.. ఈ పేరు చెబితే ఎవరికీ ఆమె గుర్తుకురారు. కానీ సిల్క్ స్మిత పేరు చెబితే మాత్రం గుర్తుపట్టని వ్యక్తులు ఎవరూ ఉండరేమో.. ఒకప్పుడు సినిమాల్లో ప్రత్యేక గీతాలతో ఎంతో పాపులరైన నటి ఆమె. 450కి పైగా సినిమాల్లో నటించిన ఆమె 1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లో శవంగా కనిపించింది. చనిపోవడానికి ముందు రాత్రి తన స్నేహితురాలు, డ్యాన్సర్ అయిన అనురాధకు ఫోన్ చేసి వెంటనే తన ఇంటికి రావాలని.. తనను ఇబ్బంది పెడుతున్న ఓ విషయం గురించి ఆమెతో మాట్లాడాలనుకుంటున్నానని వెల్లడించింది స్మిత. అయితే రాత్రి కావడంతో తాను ప్రస్తుతం రాలేనని తన భర్త ఇంటికి వచ్చేవేళ కావడంతో మరుసటి రోజు ఉదయాన్నే వస్తానని ఆమె స్నేహితురాలు చెప్పిందట. మరుసటి రోజు ఉదయాన్నే ఆమె శవంగా కనిపించడంతో అందరూ నిర్ఘాంతపోయారు. డిప్రెషన్ వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కొందరు.. ఆమె హత్యకు గురైందని మరికొందరు భావిస్తారు.


దివ్యభారతి

youngagedeathsincinema650-6.jpg

సంచలనం సృష్టించిన సినీతారల మరణాల్లో ముందుగా గుర్తొచ్చేది దివ్యభారతి ఆత్మహత్యే.. 23 సంవత్సరాల వయసులోనే తన కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉన్న ఆమె ప్రముఖ దర్శకుడు, నిర్మాత సాజిద్ నదియద్‌వాలాను వివాహమాడింది. పెళ్లి తర్వాత నాలుగు బెడ్‌రూంల ఫ్లాట్‌ని కూడా కొనుగోలు చేసిందామె. 1993 ఏప్రిల్ 5న ముంబై తులసీ అపార్ట్‌మెంట్‌లోని తన ఇంట్లో కిటికీ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడిపోయిందామె. అయితే ఆమె మృతి ప్రమాదం కాదని హత్య అని కొందరు, ఆత్మహత్య అని మరికొందరు వ్యాఖ్యానించారు. మద్యం మత్తులో కిటికీ నుంచి తూలి కింద పడిపోయిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ తేల్చింది. అయితే ఆరోజు ఆ గదిలో ఏం జరిగిందో మాత్రం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.


పర్వీన్ బాబీ

youngagedeathsincinema650-8.jpg

'అమర్ అక్బర్ ఆంథోనీ', 'ఆరక్షణ్' వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన కనబర్చి అలనాటి తారగా అభిమానుల మనసులో నిలిచిపోయిన బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ. 1983లో ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి మాయమైందామె. అమెరికా, ఇతర దేశాల్లో ఆధ్యాత్మిక యాత్రలు చేశానని చెప్పుకొచ్చారామె. 1989లో ఆమె తిరిగి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె 'పారనాయిడ్ స్కిజోఫ్రేనియా' సమస్యతో ఇబ్బందిపడుతోందని సన్నిహితులు చెప్పేవారు. దీన్ని ఆమె ఎప్పుడూ ధృవీకరించలేదు. కానీ భారత్, ఇతర దేశాలకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలపై కేసు పెట్టి వారంతా తనను చంపాలనుకుంటున్నారని ఆరోపించారామె. అయితే ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కేసు వీగిపోయింది. 2005 జనవరిలో తన ఫ్లాట్‌లో శవంగా కనిపించారామె. అప్పటికే ఆమె చనిపోయి 72 గంటలు దాటడంతో మరణానికి అసలు కారణాలు తెలియరాలేదు. కాలికి సంబంధించిన గ్యాంగ్రీన్ సమస్య వల్లే ఆమె మరణించినట్లు వార్తలొచ్చినా అభిమానులు ఆమెదీ అనుమానాస్పద మరణంగానే భావిస్తారు.

వీరు కూడా!

* 1997లో మిస్ ఇండియా టైటిల్ గెలిచి మిస్ యూనివర్స్ పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచిన అందాల తార నఫీసా జోసెఫ్ఆమె ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో మునిగితేలిందిపెళ్లికి కూడా సిద్ధమయ్యాక అతడికి మరో పెళ్లయిందని తెలుసుకొని మొదటి భార్యకు విడాకులు ఇవ్వమని కోరిందిదీనికి అతడి నుంచి సమాధానం లేదుదీంతో ముంబైలోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుందిఅయితే ఇది ఆత్మహత్యాహత్యాఅన్నది మాత్రం నిర్ధారణ కాలేదు.

* 2002లో తమిళ నటి సిమ్రన్ చెల్లెలు నటి మోనల్ కూడా అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని కనిపించింది.

ప్రముఖ నటి తెలుగుతమిళ సినిమాల్లో ఎన్నో చిత్రాలు చేసిన ఫటాఫట్ జయలక్ష్మి తన కెరీర్ చక్కగా కొనసాగుతున్న రోజుల్లోనే ఆత్మహత్యకు పాల్పడిందివైవాహిక బంధం సరిగ్గా కొనసాగకపోవడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందాలేదా ఆమె భర్తే ఆమెను హత్య చేశాడాఅన్న విషయం నిర్ధారణ కాలేదు.

youngagedeathsincinema650-7.jpg

* ‘చిత్రం’, ‘నువ్వునేను’ ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాలతో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఉదయ్‌కిరణ్‌ 2014 జనవరి 5న తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడుకెరీర్‌ పరంగా వైఫల్యాలుఆర్థిక సమస్యలు వెంటాడడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయిఅయినా ఇప్పటికీ ఆయన మరణానికి అసలు కారణం తెలియలేదు.

* ‘ప్రేమికుల రోజు’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయిన కునాల్‌ సింగ్‌ 2008 ఫిబ్రవరి7న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడుఅయితే తన కుమారుడి శరీరంపై గాయాలు ఉన్నాయనిఇది ఆత్మహత్య కాదని ఆయన తల్లిదండ్రులు కేసు పెట్టారుఈ సంఘటన జరగడానికి కొన్ని నెలల ముందే కునాల్‌ చేతికి గాయం చేసుకునిఆత్మహత్యకు యత్నించారని విచారణలో తెలిసిందిచివరికి ఆయనది ఆత్మహత్యేనని సీబీఐ విచారణలో తేలింది.

women icon@teamvasundhara
bride-to-be-miheeka-bajaj-chooses-yellow-lehenga-sea-shell-jewellary-for-haldi-ceremony

భళ్లాల దేవుడి ఇష్ట సఖి.. మెరిసేను ‘పుత్తడి’ బొమ్మలా..!

‘తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన.. శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ’ అంటూ నవవధువు అందచందాల్ని పొగిడారో సినీ కవి. ఆ పోలికలకు ఏమాత్రం తగ్గకుండా కుందనపు బొమ్మలా ముస్తాబైంది మన భళ్లాలదేవుడికి కాబోయే భార్య మిహీకా బజాజ్‌. ఆగస్టు 8న రానా-మిహీకల వివాహ ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రోజుల ముందుగానే వధూవరుల ఇళ్లలో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు మొదలయ్యాయి. తాజాగా మిహీక ఇంట్లో నిర్వహించిన హల్దీ ఫంక్షన్‌లో కొత్త పెళ్లి కూతురు పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తులు-జ్యుయలరీతో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ పసుపు వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా

Know More

women icon@teamvasundhara
celebrity-siblings-in-entertainment-industry

వెండితెరనూ పంచుకున్నారు... ఈ సెలబ్రిటీ తోబుట్టువులు!

తోబుట్టువులంటే కేవలం ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని పంచుకోవడం మాత్రమే కాదు.. అవసరమైతే బాధ్యతల్లో భాగస్వాములై, ఒకరికొకరు సాయపడుతూ ఒకే కెరీర్‌లో కూడా కొనసాగొచ్చని చెబుతున్నారీ సెలబ్రెటీలు. ఇందులో కొందరు నటులుగా ప్రసిద్ధులైతే, మరికొందరు దర్శకులుగా, నిర్మాతలుగా.. ఇలా ఒకరికి మించి మరొకరు సినీరంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. అక్కను మార్గదర్శకురాలిగా తీసుకుని ముందుకు సాగుతున్న తమ్ముళ్లు కొందరైతే.. అన్నను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచిన చెల్లెళ్లు మరికొందరు. ఏదేమైనా వీరందరూ అనుబంధంతో పాటు 'వెండితెర'నూ సమానంగా పంచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 'రాఖీ పండగ' సందర్భంగా వెండితెరను వేదికగా చేసుకుని పలువిభాగాల్లో వెలిగిపోతున్న కొందరు సెలబ్రిటీ తోబుట్టువుల గురించి తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
naomi-osaka-hits-back-at-netizens-trolling-on-her-flaunting-swim-suit

నాకిప్పుడు 22 ఏళ్లు... నా దుస్తులపై మీ కామెంట్లు ఏంటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాకా తన దుస్తులపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన నెటిజన్లకు తగిన రీతిలో సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
celebrities-posts-black-and-white-photos-in-instagram

women icon@teamvasundhara
janhvi-kapoor-opens-about-nepotism-and-sexism-in-industry

ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు?

అతిలోక సుందరి ‘శ్రీదేవి’ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం ‘ధడక్‌’తోనే అందరి ప్రశంసలు అందుకొని ..అందంతో పాటు నటన కూడా తన డీఎన్‌ఏలోనే ఉందని నిరూపించుకుంది. నటనలో తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమె త్వరలో ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్ గర్ల్‌’ గా మన ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రియల్‌ కార్గిల్‌ గర్ల్‌ గుంజన్‌ సక్సేనాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ... తన వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-talks-body-positivity-in-an-instagram-video

ఎవరేమనుకుంటే మనకేంటి..? మనకు నచ్చినట్లుగా మనముందాం!

అమ్మతనం.. ఇది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం.. మహిళలుగా మనకు మాత్రమే దక్కిన గొప్ప వరం. అలాంటి అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే క్రమంలో కొంతమంది మహిళలు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు.. నలుగురితో పోల్చుకుంటున్నారు.. తమను తామే తక్కువ చేసి చూసుకుంటున్నారు.. కారణం.. అమ్మయ్యాక శరీరంలో కలిగిన మార్పులే! అయితే అలాంటి ఆందోళనలు, పోలికలు అనవసరమంటోంది బాలీవుడ్‌ అందాల అమ్మ సమీరా రెడ్డి. తనకూ ఇలాంటి సంఘటనలు బోలెడన్ని ఎదురయ్యాయని, ఎవరేమన్నా పట్టించుకోకుండా ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవాలని అమ్మలందరిలో పాజిటివిటీని నింపుతోంది. ఇటీవలే తల్లైన ఓ మహిళ తనకు పంపిన సందేశానికి బదులిస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది సమీర. ఇలా బాడీషేమింగ్‌ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చి అతివల్లో స్ఫూర్తి నింపుతోందీ బ్యూటిఫుల్‌ మామ్.

Know More

women icon@teamvasundhara
manisha-koirala-says-situation-during-corona-pandemic-seems-easy

women icon@teamvasundhara
rupali-ganguly-shares-her-experience-about-shootings-during-the-pandemic

అమ్మా.. మళ్లీ నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఆరునెలలు ఆగాలా?

స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం అంటూ మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది కరోనా. ఈ మహమ్మారి తీసుకొచ్చిన భయంతో కనీసం కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్‌ కారణంగా అత్యంత సన్నిహితులైనా, స్నేహితులైనా దూరంగా ఉంచుతున్నాం. ఇలా శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న ఈ మహమ్మారి తనను మరింత సతమతం చేస్తోందని వాపోతోంది బెంగాలీ నటి రూపాలీ గంగూలీ. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సీరియళ్లు, సినిమా షూటింగులకు ప్రభుత్వాలు అనుమతినివ్వడంతో మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతోందామె. అయితే కరోనా భయంతో తన కుటుంబ సభ్యులకు వీలైనంత దూరంగా ఉంటున్న ఆమె... తాజాగా తన ఆవేదన గురించి అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
rashi-kanna-and-manchu-lakshmi-completed-green-india-challenge

women icon@teamvasundhara
rashmi-sudheer-in-ali-tho-saradaga-show

ఈ విశ్వంలో నేను చూసిన గొప్ప అందం తనే...!

రష్మీ-సుధీర్‌...బుల్లితెరపై ‘జబర్దస్త్‌’ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సందడికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే ఈ జంట... తమ ఆన్‌స్ర్కీన్‌ కెమిస్ట్రీతో ఎలాంటి కార్యక్రమాన్నైనా రక్తి కట్టిస్తారు. డ్యాన్స్‌లు, జోకులతో అలరిస్తూ స్టేజిపై ఆహ్లాదకర వాతావరణం సృష్టిస్తారు. ఆన్‌స్ర్కీన్‌పై అద్భుత కెమిస్ట్రీతో అందరినీ అలరిస్తున్న ఈ ఇద్దరి గురించి, వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం గురించి వాళ్లంతట వాళ్లు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సుధీర్‌, రష్మీ ఇటీవల మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈక్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ హిట్‌పెయిర్‌ లాక్‌డౌన్‌ ముచ్చట్లు, వారి వృత్తిగత, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
actresses-who-affected-by-corona-virus-and-share-their-experiences

పాజిటివ్‌ వచ్చినా ‘పాజిటివ్‌’గానే ఉన్నాం!

పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా.. ఈ తేడాలేవీ కరోనా మహమ్మారికి తెలియవు.. కనికరం లేకుండా విరుచుకుపడడం తప్ప! అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. తమ సందేశాల ద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం వీరిద్దరూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలోనూ పలువురు ముద్దుగుమ్మలు ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసింది. అయితే తాము ఈ మహమ్మారి బారిన పడినప్పటికీ ఎంతో ధైర్యంగా ఉన్నామని, ఆత్మస్థైర్యమే కరోనాకు ఔషధమని సోషల్‌ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. మరికొందరు తాము కొవిడ్‌ను జయించిన అనుభవాలను అందరితో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌లో ధైర్యం నూరిపోశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ బారిన పడిన కొందరు ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-these-celebrities-beat-lockdown-blues?

మళ్లీ మంచిరోజులొస్తాయి.. అప్పటిదాకా ఇలా బిజీగా ఉందాం..!

సాధారణంగా వృత్తిఉద్యోగాలు చేసే వారికి వారానికి కనీసం ఒకట్రెండు రోజులైనా సెలవులుంటాయి. అదే సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఆ సమయం కూడా దొరకదు. సినిమా వాళ్లు నెలల తరబడి షూటింగ్స్‌కి, క్రీడాకారులు ప్రాక్టీస్‌కు సమయం వెచ్చించాల్సిందే! అలాంటి వారికి అరుదుగా, అనుకోకుండా లాక్‌డౌన్ పేరుతో బోలెడంత ఖాళీ సమయం దొరికే సరికి తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఇంకా టోర్నమెంట్లు, షూటింగులు మొదలు కాకపోవడంతో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తమ అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. భారత యువ షూటర్‌ మనూ భాకర్‌ కూడా ఈ ఖాళీ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు నచ్చిన పనులు చేస్తున్నానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన సినీ తారలు, క్రీడాకారిణులు ఏం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-jaya-bhattacharya-food-packets-and-essentials-to-needy-amid-lockdown

కరోనా అంతమైనా నా సేవను మాత్రం ఆపను!

అప్పటిదాకా హాయిగా ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయి కొందరు బాధపడుతుంటే.. తినడానికి తిండి కూడా కరవై ఆకలితో అలమటిస్తోన్న వారు ఎందరో! ఇక ఇలాంటి కష్ట కాలంలో మూగ జీవాల వెతలు ఎవరికీ పట్టవు. కానీ ఈ గడ్డు కాలంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు.. అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటున్నారు బాలీవుడ్‌ నటీమణి జయా భట్టాచార్య. బుల్లితెరపై పలు సీరియళ్లలో, వెండితెరపై కీలక పాత్రల్లో నటించి మెప్పించిన జయ.. ఈ లాక్‌డౌన్‌లో నలుగురికి సహాయపడుతూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. అంతేకాదు.. తన సేవలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా తన సేవల్ని ఇలాగే కొనసాగిస్తానంటోన్న ఈ నటీమణి గురించి, ఆమె చేస్తోన్న సేవల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
payal-ghosh-and-parno-mittra-opens-about-fighting-depression

సమస్య పంచుకోండి.. భారం దించుకోండి!

ఒత్తిడి, ఆందోళన... ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగా కుంగదీస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుంటాయీ మానసిక రుగ్మతలు. వీటిని భరించలేక ఒకనొక సమయంలో చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా ఈ సమస్యతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తాము కూడా డిప్రెషన్‌ బాధితులమేనంటూ పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తమకెదురైన గడ్డు పరిస్థితుల గురించి ధైర్యంగా చెప్పడమే కాకుండా.. వాటినెలా అధిగమించారో వివరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘ప్రయాణం’ ఫేం పాయల్‌ ఘోష్‌, బెంగాలీ నటి పార్నో మిత్రా కూడా తమ డిప్రెషన్‌ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
kushboo-and-shamita-shetty-opens-about-fighting-depression

డిప్రెషన్‌ మమ్మల్ని కూడా కుంగదీసింది... కానీ కసితో పోరాడాం!

మానసిక ఆందోళన... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, పలు ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి.. వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తడానికి దోహదం చేస్తున్నాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ ఆరోగ్య సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే ఒకానొక సమయంలో వీటిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. అందుకు తాజా నిదర్శనమే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం. బాలీవుడ్‌తో పాటు సినిమా పరిశ్రమను కుదిపేసిన అతడి మరణం అందరికీ షాక్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో మానసిక ఒత్తిడి కారణంగా గతంలో తమ మదిలోనూ ఇలాంటి ఆలోచనలు మెదిలాయంటున్నారు ప్రముఖ తారలు ఖుష్బూ, షమితా శెట్టి. ఈ సందర్భంగా వీరిద్దరూ సోషల్‌ మీడియా వేదికగా డిప్రెషన్‌కు సంబంధించిన తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
manjula-opens-about-her-depression-and-shares-about-her-shattered-dreams

ఆ రెండూ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి!

‘షో’.. సినిమాతో ఇటు నటిగా, అటు నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైంది మంజుల. తన నట ప్రతిభతో జాతీయ అవార్డుతో పాటు పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. ఈక్రమంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కూతురిగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సత్తా చాటిన ఆమె తాజాగా తన పేరు మీద ఓ వెబ్‌సైట్‌ను, యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఈమేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో మొదటి వీడియో పోస్ట్‌ చేసిన ఆమె.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-became-pregnant-before-marriage

పెళ్లికి ముందే ఆ శుభవార్త చెప్పేశారు!

రెండు హృదయాలను కలిపే అందమైన బంధం ప్రేమ. పెళ్లితో అది నిండు నూరేళ్ల అనుబంధమవుతుంది. అలాంటి అనుబంధం సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే ఇద్దరు ముగ్గురైనప్పుడే! అయితే పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. అయితే రాన్రానూ పాశ్చాత్య పోకడలు మన దేశం వారిపైనా ప్రభావం చూపడం, ఇతర దేశాలకు చెందిన సినీ తారలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడంతో.. పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. ఇందుకు తాజా ఉదాహరణ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రియురాలు, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌. ఈ ఏడాది తొలి రోజే ఉంగరాలు మార్చుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈ ముద్దుల జంట.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నటాషానే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. ఆపై వివాహబంధంతో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tahira-kashyap-pens-about-her-cancer-scars

ఆ మచ్చల్ని దాచద్దు.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి!

క్యాన్సర్‌... మందు లేని ఈ మహమ్మారి గురించి ఎంతోమంది భయపడుతుంటారు. అయితే ఈ భయాన్ని పటాపంచలు చేస్తూ చాలామంది సెలబ్రిటీలు ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో విజయం సాధించి తమ లాంటి క్యాన్సర్‌ బాధితులకు ఆదర్శంగా నిలిచారు. అందులో ఒకరు బాలీవుడ్‌ క్రియేటివ్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌ తహీరా కశ్యప్‌. రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడినా ఆమె మానసిక స్థైర్యంతో ఆ మహమ్మారిని అధిగమించింది. చికిత్స సమయంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ఫొటోలు, అనుభవాలను షేర్‌ చేసుకున్న ఈ ట్యాలెంటెడ్‌ రైటర్‌ ఆ తర్వాత కూడా తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం లాంటివి చేస్తోంది. ఈక్రమంలో ‘నేషనల్‌ క్యాన్సర్‌ సర్వైవర్స్‌ డే’ను పురస్కరించుకుని మరొక స్ఫూర్తిదాయక పోస్టుతో మన ముందుకొచ్చిందీ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sonakshi-sinha-twitter-chat-with-fans

అతడు ఆరడుగులుండాలి.. నన్ను నవ్వించాలి!

కరోనా అందరి జీవితాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర్నుంచి బిజీ లైఫ్‌స్టైల్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఇంట్లో వాళ్లతో గడపడం దాకా.. అందరూ సరికొత్త అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు విభిన్న అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా తమ లాక్‌డౌన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడంలో అందరికంటే ముందుంటున్నారు మన ముద్దుగుమ్మలు. సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అందాల తారలు.. పోస్టులు, ఫొటోలు, వీడియోలు, ఛాటింగ్స్‌ రూపంలో తమ అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ అందాల భామ సోనాక్షీ సిన్హా ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #SonaSays అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ ఛాటింగ్‌లో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఫ్యాన్స్‌ ముందుంచింది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-akkineni-samantha-chitchat-with-fans-in-twitter

ఇప్పటికే మూడు పచ్చళ్ల బాటిళ్లను అవగొట్టేశాను!

ఓవైపు సినిమాలతో మాయ చేస్తూ...మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. పెళ్లయ్యాక నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల తార లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. భర్త నాగచైతన్యతో కలిసి కసరత్తులు, వంటలు చేస్తోంది. అనంతరం ఆ విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది. ఈక్రమంలో తాజాగా ట్విట్టర్‌ అభిమానులతో ముచ్చటించింది సామ్‌. సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి సామ్‌, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
crime-patrol-actress-preksha-mehta-committed-suicide-left-a-chilling-suicide-note

కలలు చెదిరాక ఇక బతకలేనంటూ..!

కరోనా.. ఎందరో ఆశలు, ఆశయాలు, కన్న కలలకు గండి కొట్టింది. ప్రతి ఒక్కరినీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోన్న ఈ మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారు కొందరైతే, ఉపాధి అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తోన్న వారు మరికొందరు. మనలాంటి సామాన్యులే కాదు.. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే కొందరు సినీ తారలు, బుల్లితెర నటీనటులు సైతం గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈక్రమంలో బాలీవుడ్‌ బుల్లితెర నటి ప్రేక్షా మెహతా తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది.

Know More

women icon@teamvasundhara
dia-mirza-diana-penty-aditi-rao-hydari-takes-a-stand-against-period-shaming-undertakes-the-red-dot-challenge

‘ఎర్ర చుక్క’ పెట్టి మరీ దాని గురించి మాట్లాడదాం !

నెలసరి.. మనలో నెలనెలా జరిగే ఈ సహజ ప్రక్రియ దేవుడు మనకు ప్రసాదించిన వరం లాంటిది. కానీ ఇప్పటికీ దీన్నో శాపంలా భావించే వారు మన చుట్టూనే ఎందరో ఉన్నారు. తాము నెలసరిలో ఉన్నామని బయటికి చెప్పకుండా గుసగుసలాడడం, సైగలు చేయడం వంటివి చేస్తుంటారు చాలామంది అమ్మాయిలు. అంతేకాదు.. శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనడానికి కూడా సిగ్గుపడుతుంటారు కొందరు.. ఇక మరికొందరైతే పిరియడ్స్‌ వచ్చిన వారిని వంటింట్లోకి రానివ్వకపోవడం, ఇంట్లో ఏ వస్తువులను తాకనివ్వకుండా.. వారిని అంటరాని వాళ్లలా చూస్తుంటారు. ఇక ఈ సమయంలో ప్రమాదమని తెలిసినా శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనే స్థోమత లేక గుడ్డ వంటివి వాడే వారూ ఉన్నారు. ఫలితంగా వ్యక్తిగత పరిశుభ్రత లోపించి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా పిరియడ్స్‌ విషయంలో చాలామందిలో ఉన్న ఇలాంటి మూఢనమ్మకాలను పారదోలి, నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఏటా మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. మహిళలు-అమ్మాయిల్లో నెలసరి అపోహల్ని తొలగించడానికి, పిరియడ్స్‌ విషయంలో అందరిలో అవగాహన పెంచడానికి యూనిసెఫ్‌ ఇండియా ఈ ఏడాది ఓ సరికొత్త ఛాలెంజ్‌తో మన ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఈ కార్యక్రమంలో భాగం చేసి మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది. మరి, మరి ఇంతకీ ఆ ఛాలెంజ్‌ ఏమిటో, అందులో పాల్గొన్న కొందరు ముద్దుగుమ్మలు నెలసరి గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
konidela-upasana-innovative-dress-gone-viral

భవిష్యత్తు ఇలాంటి ఫ్యాషన్లదే!

మెగా కోడలిగా, రామ్‌ చరణ్‌ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఉపాసన కొణిదెల. అపోలో ఆస్పత్రిలోని హెల్త్‌కేర్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. నలుగురికి ఉపయోగపడే ఏ విషయమైనా అందరితో షేర్‌ చేసుకునే ఉపాసన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, కుకింగ్‌కు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే ఆమె తాజాగా మరో వినూత్న ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఫ్యాబ్రిక్‌, లేటెక్స్‌ వ్యర్థాలతో రూపొందించిన దుస్తులు ధరించి సోషల్‌ మీడియాలో ఫొటోను పోస్ట్‌ చేసింది.

Know More