scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

పెళ్లికి ముందే ఆ శుభవార్త చెప్పేశారు!

Celebrities Who Became Pregnant Before Marriage

రెండు హృదయాలను కలిపే అందమైన బంధం ప్రేమ. పెళ్లితో అది నిండు నూరేళ్ల అనుబంధమవుతుంది. అలాంటి అనుబంధం సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే ఇద్దరు ముగ్గురైనప్పుడే! అయితే పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. అయితే రాన్రానూ పాశ్చాత్య పోకడలు మన దేశం వారిపైనా ప్రభావం చూపడం, ఇతర దేశాలకు చెందిన సినీ తారలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడంతో.. పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. ఇందుకు తాజా ఉదాహరణ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రియురాలు, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌. ఈ ఏడాది తొలి రోజే ఉంగరాలు మార్చుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈ ముద్దుల జంట.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నటాషానే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. ఆపై వివాహబంధంతో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

నటాషా స్టాంకోవిచ్‌

View this post on Instagram

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on


ఈ ఏడాది మనందరికీ సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తున్నాడు డ్యాషింగ్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా. కొత్త సంవత్సరం మొదటి రోజునే తన ప్రేయసి, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌ను మనందరికీ పరిచయం చేసిన హార్దిక్‌.. అదే రోజున సముద్ర జలాల సాక్షిగా తన ఇష్టసఖి వేలికి ఉంగరం తొడిగి తనదాన్ని చేసుకున్నాడు. ఆపై ఇటీవలే తాను త్వరలో తండ్రిని కాబోతున్నట్లు ప్రకటించి మరోసారి షాకిచ్చాడీ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న నటాషాతో దిగిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న హార్దిక్‌ క్యాప్షన్‌ రూపంలో ఈ తీపి వార్తను అందరితో పంచుకున్నాడు.


‘నటాషాతో కలిసి నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. త్వరలో మా ప్రయాణం మరింత అపురూపంగా మారనుంది. మా ఇద్దరి జీవితాల్లోకి మరో చిన్నారి రాబోతోంది. మా బుజ్జాయికి ఆహ్వానం పలికేందుకు మేమెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. అందుకోసం మీ ఆశీర్వాదాలు, దీవెనలు మాకు కావాలి..’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడీ హ్యాండ్‌సమ్‌. ఇదే ఫొటోను నటాషా కూడా ఇన్‌స్టాలో పంచుకుంటూ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ కోరింది. ఇదే పోస్టులో మరో ఫొటోలో సంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోయారీ లవ్లీ కపుల్‌. అయితే వీరిద్దరూ పూల దండలు వేసుకొని ఉండడంతో ఈ లాక్‌డౌన్‌లో సింపుల్‌గా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఈ క్యూట్‌ కపుల్‌ గానీ, వారి కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ప్రకటించలేదు.


కల్కి కొచ్లిన్‌

View this post on Instagram

A post shared by Kalki (@kalkikanmani) on


‘మార్గరిటా విత్‌ ఏ స్ట్రా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు ఆ సినిమాకు గాను జ్యూరీ విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ కల్కి కొచ్లిన్‌. తన జీవితంలో జరిగే ఏ విషయాన్నైనా సూటిగా, నిర్భయంగా చెప్పే ఈ బోల్డ్‌ బ్యూటీ.. తన ప్రేమ విషయాన్ని, ఆపై తాను పెళ్లికి ముందే తల్లిని కాబోతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇజ్రాయెల్‌కు చెందిన పియానిస్ట్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నానని గతేడాది సెప్టెంబర్‌లో బయటపెట్టిన ఈ సుందరి.. ఆ తర్వాత కొన్నాళ్లకు తాను తల్లిని కాబోతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా పంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ప్రెగ్నెన్సీ అనేది వివిధ అనుభవాల, అనుభూతుల సమ్మేళనం. ఇది నా ఇష్టాయిష్టాలేంటో నాకు తెలియజేస్తుంది. ఈ సమయంలో నేను నాకు ఇష్టమైన సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నా. అప్పుడప్పుడూ నా నిర్ణయాలు కూడా మారిపోతున్నాయి.. ఇది నాకెంతో క్రేజీగా అనిపిస్తోంది..’ అంటూ తన అనుభవాలను అందరితో పంచుకుందీ సుందరి.

View this post on Instagram

A post shared by Kalki (@kalkikanmani) on


ఆపై ఎప్పటికప్పుడు తన అనుభవాలను, గర్భిణిగా తాను పాల్గొన్న ఫొటోషూట్స్‌ ఫొటోలను, ఈ సమయంలో తన డైట్‌, ఫిట్‌నెస్‌ టిప్స్‌.. వంటివన్నీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తొమ్మిది నెలల్లోనే అమ్మతనంలోని మాధుర్యమేంటో తెలిసిందంటూ చెప్పకనే చెప్పిందీ సుందరి.

View this post on Instagram

A post shared by Kalki (@kalkikanmani) on


ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 7న ‘సఫో’ అనే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఈ మిల్కీ బేబ్‌.. తన చిన్నారికి సంబంధించిన ప్రతి క్షణాన్నీ ఫొటోలో బంధించి వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
అయితే 2011లో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌తో పెళ్లి పీటలెక్కిన కల్కి.. 2015లో ఆయనతో విడిపోయింది.


గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌

View this post on Instagram

A post shared by Arjun (@rampal72) on


బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో అర్జున్‌ రాంపాల్‌.. దక్షిణాఫ్రికాకు చెందిన మోడల్‌, నటి అయిన గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరి అనుబంధానికి గుర్తుగా గతేడాది జులైలో పండంటి కొడుకు పుట్టాడు. అయితే గ్యాబ్రియెల్లా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని అర్జున్‌ అప్పట్లో సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ మురిసిపోయాడు.

View this post on Instagram

A post shared by Arjun (@rampal72) on


గర్భిణిగా ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ గ్యాబ్రియెల్లాను ప్రేమగా గుండెలకు హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ కండల వీరుడు.. ‘నీతో కలిసి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు చాలా హ్యాపీగా ఉంది.. త్వరలో ఓ బుజ్జి బేబీకి జన్మనివ్వబోతున్న ఈ బేబీకి థ్యాంక్యూ..!’అంటూ తన ప్రేయసిపై ఉన్న ప్రేమనంతా రంగరించి స్వీట్‌ న్యూస్‌ చెప్పాడీ బాలీవుడ్‌ హీరో. ఇక ఇప్పుడు తమ కొడుకుతో గడుపుతూ ఆ మధురానుభూతులను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారీ లవ్లీ కపుల్‌.

View this post on Instagram

A post shared by Arjun (@rampal72) on


అయితే అర్జున్‌ 1998లోనే మోడల్‌ మెహర్‌ జెస్సియాని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు మహిక, మైరా.. అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వివిధ కారణాల రీత్యా రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకుందీ జంట.


అమీ జాక్సన్‌


‘పూలనే కునుకేయమంటా.. తను వచ్చెనంటా..’ అంటూ తన అందచందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బ్రిటిష్‌ బ్యూటీ అమీ జాక్సన్‌. ‘ఎవడు’, ‘ఐ’, ‘రోబో 2.0’ చిత్రాల్లో నటించి భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లికి ముందే గర్భం ధరించి తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్రిటన్‌ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో గత కొంత కాలంగా డేటింగ్‌ చేస్తోన్న అమీ.. బ్రిటన్‌లో మాతృ దినోత్సవం (మార్చి 31న) సందర్భంగా గతేడాది ఈ స్వీట్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson) on


ఓ సాయంత్రం సూర్యాస్తమయ వేళ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ తన నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతుండగా క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్న ఈ భామ.. ‘నేను గర్భం ధరించానన్న విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఈ రోజు మాతృ దినోత్సవం. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుంది..! నేను ప్రస్తుతం గర్భవతినన్న విషయం తెలియజేయడానికి రూఫ్‌టాప్‌ పైకి ఎక్కి గట్టిగా అరవాలన్నంత ఆనందంగా ఉంది నాకు! ఈ ప్రపంచంలో అన్నింటికంటే నువ్వే నాకు ఎక్కువ. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆతృతతో నా మనసంతా నిండిపోయింది. అమ్మ ప్రేమే ఈ సృష్టిలో స్వచ్ఛమైనది.. నిజమైనది..’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చిందీ బ్రిటిష్‌ సుందరి.

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson) on


ఇలా తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన కొన్ని రోజులకు ఈ ముద్దుల జంట నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్‌లో ఆండ్రియాస్‌ అనే ముద్దుల బాబుకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ.. ఇక అప్పటి నుంచి తన చిన్నారి ఆలనా పాలనలోనే మునిగితేలుతోంది. ఈ క్రమంలో తన బాబుతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోందీ బ్రిటిష్‌ అందం.


కొంకణా సేన్‌ శర్మ

View this post on Instagram

A post shared by Konkona Sensharma (@konkona) on


విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్‌ అందాల తార కొంకణా సేన్‌ శర్మ. 2007లో నటుడు రణ్‌వీర్‌ షోరేతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అతనిని రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆరు నెలలకే వీరికి కొడుకు పుట్టడంతో.. కొంకణ పెళ్లికి ముందే గర్భం ధరించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయినా ఈ విషయం గురించి బయటపెట్టడానికి ఇష్టపడలేదీ జంట. అయితే 2015లోనే విడిపోయిన ఈ కపుల్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకుల కోసం అప్లై చేసుకోవడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.


వీరు కూడా!

View this post on Instagram

A post shared by Neha Dhupia (@nehadhupia) on


* బాలీవుడ్‌ నటీనటులు నేహా ధూపియా-అంగద్‌ బేడీలు కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆపై 2018, మే 10న రహస్యంగా వివాహం చేసుకోవడం, అదే ఏడాది నవంబర్‌ 18న ఈ జంటకు పాపాయి పుట్టడంతో.. పెళ్లికి ముందే నేహ గర్భం దాల్చిందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

View this post on Instagram

A post shared by Amrita Arora (@amuaroraofficial) on


* బాలీవుడ్‌ నటి అమృతా అరోరా కూడా షకీల్‌ లడక్‌తో తన పెళ్లి విషయాన్ని సడన్‌గా బయటపెట్టి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆపై కొన్నాళ్లకు తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించే సరికి.. అమృత గర్భం ధరించడం వల్లే వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు అజాన్‌, రయాన్‌ అనే ఇద్దరు కొడుకులున్నారు.
* బోనీని పెళ్లి చేసుకునే నాటికి శ్రీదేవి ఏడు నెలల గర్భిణి. పెళ్లికి ముందే తమ ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టిన అతి కొద్ది మంది నాయికల్లో శ్రీ ఒకరు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లు వీరి ప్రేమకు ప్రతిరూపాలు.

View this post on Instagram

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on


* వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్‌ చేసిన అలనాటి అందాల తార నీనా గుప్తా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన వివియన్‌కు దూరమైన నీనా.. తన కూతురు మసాబా గుప్తాను సింగిల్‌ మదర్‌గానే పెంచాలనుకుంది. ఇప్పుడు మసాబా దేశంలోనే పేరు మోసిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అన్న విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by @shrutzhaasan on


* కమల్‌ హాసన్‌-సారికల ప్రేమాయణానికి గుర్తుగా శృతీ హాసన్‌ పుట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు (1988లో) పెళ్లి పీటలెక్కిందీ జంట. పెళ్లి తర్వాత వీరికి అక్షరా హాసన్‌ జన్మించింది. 2004లో కమల్‌-సారికలు విడాకులు తీసుకున్నారు.
ఇలా పెళ్లికి ముందే మాతృత్వంలోకి అడుగుపెట్టడంపై మీరేమనుకుంటున్నారు? మారుతున్న కాలం, ఆలోచనా ధోరణులతో పాటు సంస్కృతీ సంప్రదాయాలు కూడా మారుతున్నాయా? భారతీయ సమాజంలో ఇలాంటి నయా పోకడలకు మద్దతు లభిస్తుందా? ఇలాంటి ఆలోచనా ధోరణి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మీ అభిప్రాయాలను కింది కామెంట్‌ బాక్స్‌ ద్వారా పంచుకోండి.

women icon@teamvasundhara
pregnant-shreya-ghoshal-shares-pics-from-surprise-baby-shower

శ్రేయా ఘోషల్ సీమంతం వేడుకలు చూశారా?

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన స్వరంతో సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది శ్రేయా ఘోషల్‌. ‘జల జల జలపాతం’ అంటూ ప్రస్తుతం మనందరి మదిని మీటుతోన్న ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ త్వరలోనే తల్లిగా తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయిందీ అందాల గాయని. పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఆమె బేబీ షవర్‌ (సీమంతం) ఫంక్షన్‌ వేడుకగా జరిగింది. శ్రేయ సన్నిహితులు, స్నేహితుల ఆధ్వర్యంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-recalls-the-hate-she-received-after-covid-diagnosis

అప్పుడు కరోనా కంటే వాళ్ల కామెంట్లే నన్ను ఎక్కువగా బాధపెట్టాయి!

సాఫీగా సాగిపోతున్న మన జీవితాల్లోకి కోరుకోని అతిథిలా వచ్చింది కరోనా. కనికరం లేకుండా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. అదే సమయంలో భయం పేరుతో మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మంటగలిపిందీ మహమ్మారి. ఇప్పుడు కరోనాకు భయపడడం కాస్త తగ్గింది కానీ సరిగ్గా ఏడాది క్రితం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సమయాన అక్కడక్కడా జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. చాలా ప్రాంతాల్లో కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపడం, వారి కుటుంబ సభ్యులను అవమానాలకు గురిచేయడం లాంటి సంఘటనల గురించి మనకు తెలిసిందే.

Know More

women icon@teamvasundhara
mira-rajput-interacting-with-instagram-fans-and-held-thisorthat-session

అదంటే ఎక్కువ ఇష్టం.. ఆ విషయం షాహిద్‌కి కూడా తెలుసు!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి అయిన ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్లను మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఆమెను 2.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడంతో పాటు...వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘దిస్‌ ఆర్‌ దట్‌’ సెషన్‌ను నిర్వహించింది మీరా. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dia-mirza-clarification-over-her-pregnancy-getting-married

అందుకే అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేకపోయాను!

‘బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ అన్న మాటలకు సరిగ్గా సరిపోతుంది బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా. సామాజిక అంశాలు, మహిళల సమస్యలపై తనదైన శైలిలో స్పందించే తెగువే ఆమెకు ఆ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిందీ అందాల తార. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్న దియా తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చిందా? అన్న సందేహాలు చాలామందిలో తలెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌, విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు, నెటిజన్లు లేవనెత్తిన పలు సందేహాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
actress-and-tv-host-hariteja-blessed-with-a-baby-girl-in-telugu
women icon@teamvasundhara
from-yoga-to-ghar-ka-khaana-shilpa-shetty-reveals-20-things-she-loves

ఈ 20 నాకెంతో ఇష్టం!

శిల్పా శెట్టి...ఈ పేరు తలచుకోగానే సన్నజాజి తీగ లాంటి నాజూకైన శరీరాకృతి, అందమైన రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. వయసు పెరుగుతోన్నా వన్నె తరగని ఈ అందాల రాణి పూర్తి స్థాయి సినిమాలో నటించి సుమారు పద్నాలుగేళ్లు గడిచాయి. అయినా తన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదంటే అందుకు ప్రధాన కారణం సోషల్‌ మీడియానే అని చెప్పుకోవచ్చు. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలతో పాటు.. తాను పాటించే ఆహార, ఫిట్‌నెస్‌ నియమాల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం ఈ సొగసరికి అలవాటు. అందుకు తగ్గట్టే సామాజిక మాధ్యమాల్లో శిల్పను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
miss-india-finalist-diksha-singh-to-contest-up-panchayat-poll

ఈ అందాల రాణి అందుకే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందట!

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మున్సిపాలిటీ, పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ తారలు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేస్తూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంచాయతీ ఎన్నికల బరిలో దిగింది. 2015మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన ఆమె.. పలు వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. మరి అలాంటి అందాల రాణి పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kirti-kulhari-announces-separation-from-husband-saahil-sehagal-after-5-years-of-marriage
women icon@teamvasundhara
these-star-kids-are-making-a-splash-on-social-media-in-telugu

women icon@teamvasundhara
meet-geeta-a-52-years-teacher-turned-lingerie-model-who-is-redefining-beauty-standards

ఈ వయసులో లో దుస్తుల మోడలింగ్‌ ఎందుకంటే!

చూడగానే ఆకట్టుకునే అందం... సొగసైన శరీరాకృతి... పొడవాటి కేశ సౌందర్యం... ఇలా నవ యవ్వనంతో మెరిసిపోయే యువ అందాలనే తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా, అంబాసిడర్లుగా నియమించుకుంటాయి దుస్తుల తయారీ సంస్థలు. యువతులు, మధ్య వయసు మహిళలు, వృద్ధులు... ఏ వయసు వారి దుస్తులకైనా యువతులనే ప్రచారకర్తలుగా తీసుకుంటాయి. వయసు ప్రతిపాదికన మోడల్స్‌ను తీసుకునే సంస్థలు ఎక్కడా కనిపించవు. ఈ క్రమంలో ‘నా వయసు వారి లో దుస్తులకు నా వయసు వారినే మోడల్స్‌గా ఎందుకు నియమించకూడదు’ అనే ఓ సరికొత్త ఆలోచనను రేకెత్తించింది ముంబయికి చెందిన 52 ఏళ్ల గీత. లో దుస్తుల మోడలింగ్‌లో దూసుకెళుతోన్న ఆమె లింగరీ మోడలింగ్‌పై ఆన్‌లైన్‌ వేదికగా ఒక ఉద్యమమే చేస్తున్నారు. ఇంతకీ ఎవరామె ఎందుకీ ఉద్యమం చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-on-how-failed-marriages-impacted-her-children

నేను చేసిన తప్పులు నా కూతురు అస్సలు చేయదు!

స్వశక్తితో సొంత కాళ్లపై నిలబడినా... వ్యక్తిగతంగా ఎంత ఎత్తుకు ఎదిగినా విడాకులు తీసుకున్న స్త్రీలంటే ఈ సమాజంలో కాస్త చిన్నచూపు ఉంటుంది. వాళ్లేదో తప్పు చేశారన్నట్లుగా చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితాన్ని వారి పిల్లలకు ముడిపెడుతూ సూటిపోటి మాటలతో అవమానాలకు గురిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో తాను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా నేటికీ తాను, తన పిల్లలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నామంటోంది ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీ. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ బుల్లితెరను ఏలుతోన్న ఈ ముద్దుగుమ్మ రెండుసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం సింగిల్ మదర్‌గానే కొనసాగుతోన్న ఆమె.. ఓవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈక్రమంలో తన విడాకుల వ్యవహారం, పిల్లలపై దాని ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
rubina-dilaik-opens-up-about-her-mental-health-issues-in-telugu

అప్పుడు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను!

డిప్రెషన్... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుందీ సమస్య. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, వ్యక్తిగత, ఆర్థికపరమైన సమస్యలు, పని ఒత్తిడి... వంటి ఎన్నో కారణాలు డిప్రెషన్‌ తలెత్తడానికి దోహదం చేస్తాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే దీనిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఈ నేపథ్యంలో మానసిక ఆందోళనతో గతంలో తన మదిలోనూ ఆత్మహత్య ఆలోచనలు మెదిలాయంటోంది ‘ఛోటీ బహూ’ రుబీనా దిలాయిక్‌. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ముగిసిన బిగ్‌బాస్‌-14 సీజన్‌లోనూ విజేతగా అవతరించింది. తద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా డిప్రెషన్‌తో తనకెలాంటి గడ్డు పరిస్థితులెదురయ్యాయో అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
ankita-lokhande-shares-casting-couch-experience-in-telugu

సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో కాంప్రమైజ్‌ కావాలన్నాడు!

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ రాణించాలంటే ఎన్నో ముళ్ల దారులు దాటాల్సి ఉంటుంది. అవకాశమొస్తే కాటేయాలని చూసే ఎన్నో మృగాలు ఆ దారిలో కాచుకుని ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుని తెరపై కనిపించి, అభిమానులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందాలంటే అంత సులభమేమీ కాదు. ఈక్రమంలో చాలామందిలాగే తానూ ఎన్నో ముళ్లదారులను దాటాకే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నానంటోంది బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే. దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రేయసిగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆమె కెరీర్‌ ప్రారంభంలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడ్డానంటోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకెదురైన కొన్ని చేదు అనుభవాలను అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-says-she-had-it-hard-as-a-teenager-as-she-would-stammer-and-was-on-the-heavier-side

అప్పట్లో ఆ కామెంట్లను తట్టుకోలేకపోయాను!

కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిల్ని చూడగానే కొంతమంది వెంటనే ‘అబ్బ ఎంత లావుగా ఉంది’ అంటూ నవ్వుకోవడం, హేళన చేయడం చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... బొద్దుగా ఉన్న వాళ్లు సరదాకి ఏదైనా ఫొటో షేర్ చేస్తే చాలు... కామెంట్ల రూపంలో అసభ్యకర మాటలు, దూషణలు కనిపిస్తుంటాయి. ఇలాంటి మాటలతో ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా తానూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. అయితే సమాజంలో అన్ని విషయాలను సహనంతో ఎదుర్కొన్నానని, తన పిల్లలకు కూడా అదే నేర్పిస్తానంటూ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిందీ సూపర్‌ మామ్.

Know More

women icon@teamvasundhara
geeta-basra-harbhajan-expecting-second-child-in-july

మరోసారి అమ్మను కాబోతున్నా!

అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నామని తెలియగానే కలిగే ఆనందం అనిర్వచనీయం. ఇక మొదటిసారి పేరెంట్స్‌గా మారిన జంటలు... మరోసారి తల్లిదండ్రులయ్యేసరికి మరింత ఆనందోత్సాహాలకు, భావోద్వేగానికి గురవుతుంటారు. తమ సంతోషాన్ని అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా-టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇప్పటికే హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ సందర్భంగా త్వరలోనే తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్.

Know More

women icon@teamvasundhara
actress-varalakshmi-and-vijayalalitha-in-alitho-saradaga-chat-show

ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు..!

వారిద్దరూ విభిన్న పరిస్థితుల మధ్య వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు చెల్లెలిగా మెప్పిస్తే.. మరొకరు ప్రత్యేక పాత్రలు, స్పెషల్‌ సాంగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలెన్నో పోషించారు. అద్భుత అభినయంతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న వారే సీనియర్‌ నటీమణులు వరలక్ష్మి, జయలలిత. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తోన్న వీరు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు.. ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి, ఆ సరదా సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sunitha-takes-instagram-to-counter-trolls-on-women’s-day

మీరు నిందిస్తారు.. అండగా నిలవరు.. అయినా క్షమిస్తా!

రాజ్యాంగం అందించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను అడ్డుపెడ్డుకుంటూ కొంతమంది అవసరం లేకపోయినా ఇతరుల జీవితాల్లోకి తొంగిచూస్తుంటారు. తాము ఎలా ఉన్నా సరే... వారిని మాత్రం నోటికొచ్చినట్లు ఆడిపోసుకుంటుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమంది నెటిజన్లు ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. ప్రత్యేకించి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను టార్గెట్‌ చేసుకుని, వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్ చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత కూడా సోషల్‌ మీడియాలో ఎన్నోసార్లు నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ పెద్దగా వాటిపై స్పందించని ఈ స్టార్‌ సింగర్‌ తాజాగా నోరు విప్పింది. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ కారణంగా తానెలా ఆవేదన చెందానో అందరితో షేర్‌ చేసుకుంది. అదే సందర్భంలో అకారణంగా తనను ఆడిపోసుకున్న వారికి సున్నితంగా సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
singer-shreya-ghoshal-announces-first-pregnancy-with-this-adorable-post

నేను అమ్మను కాబోతున్నా!

మహిళలకు అమ్మతనానికి మించి మరే విషయం అమితానందాన్ని ఇవ్వదు. అందుకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన మహిళలందరూ ఎప్పుడెప్పుడు అమ్మగా ప్రమోషన్‌ పొందుదామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక కడుపులో నలుసు పడిందని తెలిసిన మరుక్షణం వారి ఆనందానికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తోంది అందాల సింగర్ శ్రేయాఘోషల్. తన శ్రావ్యమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ సింగర్‌ త్వరలో అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను అందరితో షేర్‌ చేసుకున్న ఆమెకు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Know More