కరోనా అందరి జీవితాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర్నుంచి బిజీ లైఫ్‌స్టైల్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఇంట్లో వాళ్లతో గడపడం దాకా.. అందరూ సరికొత్త అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు విభిన్న అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా తమ లాక్డౌన్ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంలో అందరికంటే ముందుంటున్నారు మన ముద్దుగుమ్మలు. సినిమా షూటింగ్స్ వాయిదా పడడంతో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అందాల తారలు.. పోస్టులు, ఫొటోలు, వీడియోలు, ఛాటింగ్స్ రూపంలో తమ అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ అందాల భామ సోనాక్షీ సిన్హా ఇటీవలే ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #SonaSays అనే హ్యాష్‌ట్యాగ్ వేదికగా నిర్వహించిన ఈ ఆన్లైన్ ఛాటింగ్‌లో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఫ్యాన్స్ ముందుంచింది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
మీ స్ట్రెస్ బస్టర్స్ ఏవి?
పెయింటింగ్, నా స్నేహితులు, Gabruuuuuuu (సోనాక్షీ పెట్)
ఇకపై మీరు మూడే మూడు ఆహార పదార్థాలు తినాల్సి వస్తే.. ఏవి ఎంచుకుంటారు?
మార్గరిటా పిజ్జా, షెజ్వాన్ నూడుల్స్, పప్పన్నం
మీ తర్వాతి చిత్రం?
భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
లాక్డౌన్లో కొత్త వంటకాలేమైనా ట్రై చేశారా?
వంటగదినంతా చిందరవందర చేశా.
క్వారంటైన్ రోజుల్ని ఎలా ఉపయోగించుకోవాలంటారు?
కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనుల్ని పూర్తి చేయచ్చు. ఇంటి పనుల్లో పాలు పంచుకోవచ్చు. ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా గడపడం మంచిది. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నా. పెయింటింగ్ వేస్తున్నా.. ఈ అభిరుచిని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. అలాగే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పాజిటివ్‌గా ఉండడం కూడా ముఖ్యమే.
మీరు ఉదయాన్నే నిద్ర లేస్తారా?
అస్సలు లేవను.
ఈసారి మీ పుట్టినరోజు ఎలా జరుపుకొన్నారు? ఇలా ఇంతకుముందెప్పుడైనా బర్త్‌డే చేసుకున్నారా?
కరోనా వల్ల ఈసారి నా పుట్టినరోజు చాలా సింపుల్‌గా జరిగింది. గతంలో ఇలా ఎప్పుడూ చేసుకోలేదు.
మీ సినిమా పాత్రలు మీ నిజ జీవితంపై ప్రభావం చూపుతాయా?
నా క్యారక్టరే నా సినిమా పాత్రలను ప్రభావితం చేస్తుంది.
మీ ఎత్తు ఎంత?
దీనిపై చాలా ఊహాగానాలున్నాయి.. నిజానికి నేను చాలా ఎత్తుంటా!
మీ ఫ్యాన్స్ గురించి ఒక్కమాటలో..?
అందుకు ఒక్క మాట సరిపోదు.. మూడు ముక్కల్లో చెబుతా.. టూ మచ్ లవ్ (మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా..) నా వెంటే ఉండి నన్ను సపోర్ట్ చేస్తోన్న వారందరికీ పేరుపేరునా థ్యాంక్స్.

మీ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ (కళ్లు, చెవులు మూసుకొని.. తెలుపు రంగు టీషర్ట్‌పై I'm Listening అని రాసుంటుంది) వెనకున్న అర్థమేంటి?
ట్రోల్స్‌కి నేను అలా స్పందిస్తానని అర్థం. (అంటే.. విమర్శలొచ్చినా పట్టించుకోనని దాని అర్థం అంటూ చెప్పకనే చెప్పిందీ బ్యూటీ)
మీకే గనుక సూపర్ పవర్ ఉంటే ఏం చేస్తారు?
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి నన్ను నేను కాపాడుకుంటా.
ఇంటి భోజనం, ఫాస్ట్ ఫుడ్.. వీటిలో మీకు ఏది ఇష్టం?
ఇంటి భోజనమే అన్నింటికంటే సూపర్ ఫుడ్.
సోనా కాకుండా మీ ముద్దుపేర్లేంటి?
సోనా బేబీ, సోనూ, Sonz, Son, So, S
క్వారంటైన్లో మానసిక ఒత్తిడితో సతమతమైపోతున్న వారికి మీరిచ్చే సలహా?
పాజిటివ్‌గా ఉండండి, దృఢంగా ఉండండి.. త్వరలోనే అంతా సర్దుకుంటుంది.
ఏ హాలీవుడ్ సినిమా ఫ్రాంఛైజీలో మీరు భాగం కావాలనుకుంటున్నారు?
కిల్ బిల్ ఫ్రాంఛైజీ లేదంటే ఓషన్స్ సిరీస్.
మీకు కాబోయే వాడిలో ఎలాంటి లక్షణాలుండాలి?
నన్ను నవ్వించాలి, నిజాయతీగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి..
మీరు చిన్నతనంలో బాగా ఇష్టపడిన కార్టూన్ క్యారక్టర్స్ ఏంటి?
టామ్ అండ్ జెర్రీ, స్వాట్ క్యాట్స్, జానీ బ్రావో, డెక్స్టర్స్ లాబొరేటరీ.
ఈ లాక్డౌన్లో మీ కొత్త అసైన్మెంట్ ఏంటి? దాని గురించి చెప్పండి.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం రీమా కగ్టీ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌లో నటిస్తున్నా. అదొక సత్తా ఉన్న పాత్ర. దాని కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నా.
మీకు సంబంధించిన మీ ఫేవరెట్ ఫొటో ఏది?
తాను చిన్నతనంలో దిగిన ఓ బబ్లీ క్యూట్ ఫొటోను పోస్ట్ చేసింది సోనా బేబీ.
‘ఫోర్స్-3’లోనూ జాన్ అబ్రహాం సరసన మిమ్మల్ని చూడబోతున్నామా?
ఇందులోనూ నేనుంటానని ఆశిస్తున్నా. ‘ఫోర్స్-2’ నాకు ఎన్నో గొప్ప అనుభవాలను పంచింది.
మీరు ఏ దర్శకులతో పని చేయాలనుకుంటున్నారు?
రాజు హిరానీ సర్, రోహిత్ శెట్టి.. వాళ్ల సినిమాలంటే పడి చచ్చిపోతా.
ఈ ఏడాది ‘ఘూమ్కేతు’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెరిసిన సోనా.. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్ సరసన ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో నటిస్తోంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది.