నటించినవి కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అందాల తార ప్రగ్యా జైస్వాల్. 'కంచె', 'ఓం నమో వేంకటేశాయ', 'నక్షత్రం'.. వంటి చిత్రాలతో ఎవర్గ్రీన్ పాపులారిటీని సంపాదించుకుంది. ఉత్తరాదిలోనే పుట్టిపెరిగినా దక్షిణాది తారగా, అందులోనూ తెలుగమ్మాయేనేమో అన్నంత సహజంగా తన పాత్రల్లో ఒదిగిపోయి చక్కటి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా.. తన ట్రెండీ ఫ్యాషనబుల్ లుక్స్‌ని సోషల్‌మీడియాలో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందీ లవ్లీ గర్ల్. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా #AskPragya అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిమానులతో ముచ్చటించింది ప్రగ్య. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి..
మీకు నచ్చిన కొటేషన్?
ప్రగ్య: “పైకి చాలా నిదానంగా, ప్రశాంతంగా కనిపిస్తూనే తన లోపల ఉన్న అనంతమైన శక్తితో ప్రవాహానికి ఎదురీదే బాతు లాగా ఉండాలి”.
మీరు ఎక్కువ సేపు ఎక్కడ గడపాలనుకుంటారు?
ఎ)జిమ్ బి)కిచెన్ సి)షూటింగ్ స్పాట్ డి)అభిమానుల గుండెల్లో
పైవన్నీ
మీరు వరుసగా సినిమాల్లో ఎందుకు నటించడం లేదు? స్క్రీన్‌పై మిమ్మల్ని మిస్సవుతున్నాం. ‘కంచె’లో మీ నటనను మరిచిపోలేకపోతున్నాం...
ధన్యవాదాలు! మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను.
మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం(అభిమానులు).. మరి మీరు?
చెప్పలేనంత!! మీరే ఈ ప్రపంచంలో ‘బెస్ట్’ ఫ్యాన్స్! (లవ్ ఎమోజీ జత చేస్తూ)
మీ ముఖంపై చిరునవ్వు తెప్పించే విషయం?
రుచికరమైన ఆహారం
లాక్డౌన్లో మీరు చేసిన ది ‘బెస్ట్’ పని ఏంటి?
వంట నేర్చుకోవడం.
మీ క్వారంటైన్లో ఏం నేర్చుకున్నారు?
బనానా చాక్లెట్ కేక్
ప్రస్తుతం మీ జీవనశైలి ఎలా ఉంది?
వర్కౌట్.. వంట చేయడం.. ఇల్లు శుభ్రం చేసుకోవడం.. కొత్త విషయాలు తెలుసుకోవడం.
‘అల వైకుంఠపురములో..’సినిమా చూశారా?
చూశా. నాకు నచ్చింది. అల్లు అర్జున్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు.
ఇప్పుడు ఏ వెబ్‌సిరీస్ చూస్తున్నారు?
ది లాస్ట్ కింగ్డమ్
టాలీవుడ్ గురించి ఒక్క మాట?
నా ఇల్లు.
టీ లేదా కాఫీ?రెండింటిలో ఏది ఇష్టం!
టీ.
పబ్జీ ఇష్టామా? లూడోనా?
లూడో.
సమంత గురించి ఒక్కమాట చెప్పండి?
స్ఫూర్తిదాయకురాలు!
నాగార్జునతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
అద్భుతం.. ఆయన ఓ గొప్ప నటుడే కాదు వ్యక్తి కూడా.
మీ డ్రీమ్ రోల్? ఏ దర్శకుడితో కలిసి పనిచేయాలి అనుకుంటున్నారు?
ఎస్.ఎస్. రాజమౌళి సర్. సంజయ్ లీలా భన్సాలీ.
నటి కాకపోతే ఏం చేసేవారు?
లాయర్
మరి నటి ఎలా అయ్యారు?
చిన్నతనంలో నటి కావాలి అనుకోలేదు. కాలేజీలో మోడలింగ్ చేస్తున్నప్పుడు అనుకున్నా.
మీ అందమైన చర్మ రహస్యం?
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. టోనింగ్ చేసుకోవడం. మాయిశ్చరైజర్ వాడటం. ఎక్కువ నీరు తాగడం.
రజనీకాంత్ గురించి చెప్పండి?
ఆయన లెజెండ్.
పవన్‌కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి?
నిజమైన నాయకుడు
ఇండస్ట్రీలో ప్రాంక్ చేయాలనుకుంటే ఎవరికి మీద చేస్తారు?
రానా
కరోనా ప్రభావం ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తుందనుకుంటున్నారా?
కొవిడ్-19 కారణంగా లాక్డౌన్ తర్వాత ప్రపంచం మారిపోతుంది. ప్రతి రంగంపైనా దీని ప్రభావం ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రభుత్వ నిబంధనల కన్నా కూడా స్వీయ నియంత్రణే కీలక పాత్ర పోషిస్తుంది.