ఈ తరం నటీమణుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి త్రిష. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. 1999లో వచ్చిన ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. కేవలం నాలుగేళ్లలో ఏడు తమిళ చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ చెన్నై చిన్నది.. రెండో చిత్రం ‘వర్షం’తో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇక అప్పటి నుంచి త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి భారతీయ సినీ పరిశ్రమలో మేటి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది త్రిష.
ఇలా ఒక నటిగానే కాదు.. జంతు ప్రేమికురాలిగానూ ఈ ముద్దుగుమ్మ మనందరికీ పరిచయమే. ఈ క్రమంలోనే మూగజీవాల పరిరక్షణ కోసం ‘పెటా’తో చేతులు కలిపిన త్రిష.. పెటా గుడ్‌విల్ అంబాసిడర్‌గానూ కొనసాగుతోంది. అంతేకాదు.. తన పెట్స్‌తో దిగిన ఫొటోల్ని, వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. మే 4 న త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఆసక్తికర పోస్ట్‌లపై ఓ లుక్కేద్దామా..?
ఈ ప్రేమ అనంతమైనది..
అమ్మతో నేను..
ఇంత అందమైన ప్రపంచాన్ని నాకు చూపించినందుకు ధన్యవాదాలు నాన్నా.. హ్యాపీ ఫాదర్స్ డే!
నా పిల్లలతో..!
ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు..!
స్వచ్ఛ భారత్‌లో నేను సైతం..
రేయింబవళ్లు షూటింగ్‌లతో అలసిసొలసిన త్రిష..
నా ప్రాణ స్నేహితులతో..!
నాకు మేకప్ ఎవరు వేశారో చెప్పుకోండి చూద్దాం..!
వర్కింగ్ డే, హాలిడేతో సంబంధం లేదు.. ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఎప్పుడూ మనకు సమయముంటుంది.
చాలా అద్భుతంగా చేశావు.. రేవతి.!
నా మనసును తాకిన సినిమాల్లో ‘అతడు’ ఒకటి. ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇంతటి ఉత్తమ పాత్రను అందించినందుకు త్రివిక్రమ్ గారికి, సహ నటుడిగా వ్యవహరించిన మహేష్ బాబుకు నా కృతజ్ఞతలు..
దేన్నైనా సాధించగలిగే శక్తిసామర్థ్యాలు మీకున్నాయి.. మీరు చేయాల్సిందల్లా వాటిని ఉపయోగించుకోవడమే!
‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటే ఇదేనేమో!
నాకు ఆశ్చర్యం కలిగినప్పుడల్లా.. ఇలా నవ్వుతుంటాను..
నాకు దక్కిన ఆశీర్వాదాలను (అవార్డులను) లెక్కిస్తున్నాను. ‘96’ కు ‘11’, ‘హే జ్యూడ్’కు ‘3’ అవార్డులు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.
ఈ దశాబ్దంలో ఇదే ఆఖరిది!
దీనికి క్యాప్షన్ ఇవ్వండి..!
నాకు దక్కిన గౌరవమిది!
వెలుతురుని చూసినప్పుడు మీలో ఉన్న భయాలన్నీ మటుమాయమైపోతాయి.
ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే.. ప్రేమ, పెళ్లికి సంబంధించి అప్పట్లో ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. ఓ వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం కూడా జరిగిందని కోలీవుడ్ కోడై కూసింది. అయితే కొన్ని రోజులకే ఆ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. మరి నిజ జీవితంలో ఈ అందాల బొమ్మ పెళ్లి కూతురిగా ఎప్పుడు ముస్తాబవుతుందో వేచి చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిసారి రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ సినిమాలో నటించిన ఈ చిన్నది.. ప్రస్తుతం ‘రాంగీ’, ‘పొన్నియిన్ సెల్వన్’లతో పాటు మరిన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్లు గడుస్తోన్నా చెక్కుచెదరని అందంతో నేటి నటీమణులకు పోటీనిస్తూ తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఈ ముద్దుగుమ్మకు మనమూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా..!
హ్యాపీ బర్త్‌డే త్రిష..!