scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

అమ్మను కనీసం కౌగిలించుకోలేకపోయా!

Shweta basu Prasad shared her Mental Stress During Lock down

రోజంతా ఇంటికే పరిమితమవడం.. భవిష్యత్తు గురించి బెంగ.. రోజంతా ఖాళీగా కూర్చోవడం వల్ల మదిలో మెదిలే లేనిపోని ఆలోచనలు.. వెరసి ఈ లాక్‌డౌన్‌ సెలవులు ఎందుకొచ్చాయిరా బాబోయ్‌ అనేలా ఉంది చాలామంది పరిస్థితి. మరి, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం వల్ల సురక్షితంగా ఉంటామా అనే అనుమానాలతో మరింతగా రెట్టింపయ్యే భయం.. ఇలాంటి ఆలోచనలు, భయాలు, ఒత్తిళ్లతో మీరే కాదు.. మేమూ సతమతమవుతున్నామంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఈ లాక్‌డౌన్‌ వేళ తాము ఎదుర్కొంటోన్న మానసిక సమస్యల గురించి పంచుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు పాటించే చిట్కాలను వివరిస్తూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతున్నారీ తారలు. మరి, ప్రస్తుతం చాలామంది మానసిక పరిస్థితిని ప్రతిబింబిస్తోన్న వారి మాటలను, మనసులోని భావాలను మనమూ తెలుసుకుందాం రండి..

View this post on Instagram

#shukranu screening!

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

అమ్మను కనీసం కౌగిలించుకోలేకపోయా!

శ్వేతా బసు ప్రసాద్‌.. పలు సినిమాల్లో తన నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ లాక్‌డౌన్‌లో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లు చెబుతోంది. తన ప్రస్తుత పరిస్థితి గురించి పంచుకుంటూ.. ‘నా జీవితంలో మొదట్నుంచి నా తల్లిదండ్రులతో ఉన్నాను.. ఆ తర్వాత రోహిత్‌ మిట్టల్‌తో నా వివాహం జరిగింది. 2019 డిసెంబర్‌లో రోహిత్‌తో విడాకులు తీసుకున్నాను. ఇక అప్పట్నుంచి నేను ఒంటరిగానే ఉంటున్నా. అంతేకాదు.. నాకంటూ కాస్త సమయం కేటాయించుకోవాలనుకున్నా. అయితే అంతలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం మానసికంగా కష్టంగా అనిపిస్తోంది. అందుకే దీన్నుంచి బయటపడడానికి నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేకాదు.. ఈ పరిస్థితి గురించి మానసిక నిపుణులతో మాట్లాడాను. వీడియో కౌన్సెలింగ్‌ ఇవ్వమని అడిగాను. నా మానసిక ఆరోగ్యం గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మరింతగా కుంగిపోవాలనుకోవడం లేదు. నేనే కాదు చాలామంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు నా మానసిక వైద్యులు తెలిపారు.

View this post on Instagram

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

నిజానికి గతంలో నాకెదురైన ఒత్తిళ్ల నుంచి విముక్తి పొందడానికి నేను డిసెంబర్‌ నుంచే కౌన్సెలింగ్‌ తీసుకోవడం ప్రారంభించాను. రెండు సెషన్స్‌ పూర్తి చేశాను.. అంతా బాగుందనుకున్నాను. కానీ మళ్లీ ఇప్పుడు నేను కాస్త ఆందోళనకు గురవుతున్నాను. ఈ విషయం గురించే మానసిక నిపుణులతో మళ్లీ మాట్లాడాను. ఇలాంటి సందర్భంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అన్నింటికంటే ముఖ్యం. మనం మన మానసిక స్థితిపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే నేను మొబైల్‌ వాడకాన్ని తగ్గించాను. ఒకవేళ మొబైల్‌ని ఎక్కువగా వాడితే.. దానివల్ల తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటానేమోనని భయంగా ఉంది.

View this post on Instagram

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

ఒకరోజు మా అమ్మ, అన్నయ్య నన్ను చూడడానికి నా ఫ్లాట్‌ దగ్గరికొచ్చారు. కానీ ఈ కరోనా కారణంగా.. వారిని ఇంట్లోకి ఆహ్వానించకుండా నేనే కిందకి వెళ్లి 5 అడుగుల దూరంలో నిలబడి వారితో ఓ 10 నిమిషాలు మాట్లాడాను. వాళ్లతో అలా దూరంగా నిలబడి మాట్లాడడం చాలా కష్టంగా అనిపించింది. కనీసం అమ్మని కౌగిలించుకోలేకపోయాను. ఈ పరిస్థితి త్వరగా చక్కదిద్దమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను..’ అంటూ ఈ లాక్‌డౌన్‌ సమయంలో తాను పడుతోన్న మానసిక వేదనను బయటపెట్టింది శ్వేత.



ఆ రోజులు గుర్తొస్తున్నాయి!

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala) on

మనీషా కోయిరాలా.. అండాశయ క్యాన్సర్‌ బారిన పడి దాన్ని జయించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుత లాక్‌డౌన్‌ రోజులు తనకు క్యాన్సర్‌ చికిత్స తీసుకున్నప్పటి రోజులను గుర్తుచేస్తున్నాయంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా తాను ఎదుర్కొంటోన్న మానసిక ఒత్తిళ్ల గురించి ఇలా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘నేను న్యూయార్క్‌లో క్యాన్సర్‌ చికిత్స చేయించుకునే రోజుల్లో.. 6 నెలల పాటు నా అపార్ట్‌మెంట్‌లో బందీ అయిపోయా. ఇప్పటి రోజులతో పోలిస్తే అప్పటి రోజులు చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడు రెండు నెలల పాటు మనం స్వీయ నిర్బంధంలో ఉన్నా కూడా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనీసం కొన్నిరోజుల తర్వాతైనా పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం కలుగుతోంది. ఈ సమయంలో మనకు చాలా బోర్‌గా ఉందని, ఈ క్రమంలోనే ఒత్తిళ్లకు గురవుతున్నామని నాకు అర్థమవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితిని మనం అర్థం చేసుకుని మన గతం నుండి లేదా మన చుట్టూ జరుగుతోన్న పరిణామాల నుండి ప్రేరణ పొందాలి.

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala) on

మనం మన రోగనిరోధక శక్తిపై దృష్టి పెట్టాలి. డాక్టర్స్‌ చెప్పినట్లుగా.. సమతుల ఆహారం తీసుకోవాలి.. అవసరమైతే ఆహారంతో పాటు.. ఫుడ్‌ సప్లిమెంట్స్‌ కూడా తీసుకోవాలి. అలాగే చేతులు పదే పదే శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. చేతులతో ముఖాన్ని తాకకుండా జాగ్రత్తపడడం కూడా అంతే ముఖ్యం. నేను కూడా ఎప్పటికప్పుడు నా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాను. అయితే ఈ విషయంలో నేను కాస్త అతిగా వ్యవహరిస్తున్నానని మా అమ్మ నన్ను వారిస్తోంది.

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala) on

ఇక ప్రస్తుతం నా మానసిక ఆందోళనల్ని ఎదుర్కోవడానికి ఇంటి పనుల్లో బిజీ అవడంతో పాటు రాయడం కూడా మొదలుపెట్టాను. చూద్దాం.. చివరికి నా రాతలు పుస్తకంగా మారతాయో లేదంటే స్క్రీన్‌ప్లే అవుతుందో..! ఇక నాకు ప్రకృతితో సమయం గడపడమంటే చాలా ఇష్టం. తద్వారా నా మనసుకు ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది. అయినా అప్పుడప్పుడూ నేను, మా అమ్మ ఆందోళనకు గురవుతున్నాం. ఇక దాన్నుంచి బయటపడడానికి ఇద్దరం కలిసి బోలెడన్ని విషయాలు మాట్లాడుకోవడం, కలిసి సినిమాలు చూడడం వంటివి చేస్తుంటాం..’ అంటూ ఓవైపు తన మానసిక ఆందోళనల గురించి చెబుతూనే.. మరోవైపు వాటిని అధిగమించడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను వివరించింది మనీషా. ఇలా తన ఫ్యాన్స్‌లో ప్రేరణ నింపిందీ బాలీవుడ్‌ బ్యూటీ.



ముందు బాగానే అనిపించింది.. కానీ..!

View this post on Instagram

A post shared by Maanvi Gagroo (@maanvigagroo) on

బాలీవుడ్‌ నటి మాన్వీ గగ్రూ కూడా తన లాక్‌డౌన్‌ ఒత్తిడి గురించి ఇలా పంచుకుంది. ‘లాక్‌డౌన్‌ ప్రకటించక ముందు నుంచే నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. సాధారణంగా షూటింగ్స్‌ జరిగే సమయంలో మన చుట్టూ చాలా గందరగోళాలు నెలకొంటాయి. కాబట్టి కనీసం షూటింగ్స్‌ లేనప్పుడైనా ఇంట్లో ఉండాలి. అలాగే ఒంటరిగా ఉన్నా సౌకర్యంగా ఉండడం నేర్చుకోవాలి. నేను ఇంట్లో గడపడానికి చాలా ఇష్టపడతాను. అందుకే లాక్‌డౌన్‌ గురించి వినగానే రిలాక్స్‌ అవడానికి సమయం దొరికిందనిపించింది.

View this post on Instagram

A post shared by Maanvi Gagroo (@maanvigagroo) on

ఇలా లాక్‌డౌన్‌ మొదట్లో ఇంత సమయం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా. అయితే ఒక రెండు-మూడు రోజులు గడిచిన తర్వాత.. నా మనసులో ఆందోళన మొదలైంది. వలస కార్మికులు పడుతోన్న బాధల గురించి వార్తలు చూసినప్పుడు నాకు ఏడుపొచ్చేసేది. అప్పుడే నా మనసు అదుపు తప్పింది. వెంటనే నేను నా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడాను. వారు నన్ను సముదాయించారు. నేను చాలా భయాందోళనలకు గురయ్యాను. కానీ అతి కొద్ది సమయంలోనే నా మనసు కాస్త నెమ్మదించింది.

View this post on Instagram

A post shared by Maanvi Gagroo (@maanvigagroo) on

ఈ క్రమంలో రోజూ లేచిన దగ్గర నుండి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఇంతకు ముందు కంటే ఇప్పుడు నా వ్యాయామాల విషయంలో మరింత క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాను. గతంలో అయితే నేను ఎప్పుడెప్పుడు జిమ్‌కి వెళ్లడం మానేద్దామా అనుకునేదాన్ని. ఒక్కోసారైతే నా ట్రెయినర్‌తో ఈ వ్యాయామం రేపు చేద్దాంలే అంటూ సాకులు చెప్పేదాన్ని. కానీ ఇప్పుడలా చేయడం లేదు. ఒక్కోసారి తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేస్తున్నా. ఇక ఫుడ్‌ విషయానికొస్తే.. ముందులాగా అన్నీ దొరికే పరిస్థితి ఇప్పుడు లేదు. దీనివల్ల అసలు మన ఆహారపుటలవాట్లేంటో గ్రహించే అవకాశం దొరికింది. తద్వారా మనల్ని మనం మార్చుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే దిశగా ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయం..’ అంటూ ఈ లాక్‌డౌన్‌ ఒత్తిడిని అధిగమించేందుకు బోలెడన్ని టిప్స్‌ చెప్పుకొచ్చింది మాన్వీ.

చూశారుగా... ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి సెలబ్రిటీలు ఫాలో అవుతోన్న కొన్ని టిప్స్‌ ఏమిటో! మరి, మీరు కూడా ఈ ప్రతికూల సమయంలో లేనిపోని విషయాలకు ఆందోళన చెందుతూ.. మీ పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చుకోకండి.. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి..! అలాగే ఈ సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని మీరెలా అధిగమిస్తున్నారో ‘వసుంధర.నెట్‌’ వేదికగా మాతో పంచుకోండి.. మరికొందరిలో స్ఫూర్తి నింపండి..!





women icon@teamvasundhara
i-will-kill-my-sons-if-they-hurt-anybody-says-shefali-shah

అమ్మాయిలను అలా చేస్తే మా అబ్బాయిలకు కూడా అదే శిక్ష వేస్తా!

‘దిల్లీ క్రైమ్’... గత వారం రోజుల నుంచి బాగా వినిపిస్తోన్న పేరు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ గతేడాది ఓటీటీలో విడుదలైంది. ఆ సమయంలో బాగుందనే ప్రశంసలు తప్ప అందులో నటించిన నటీనటుల గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ చిత్రం ఎమ్మీ అవార్డు గెలుచుకుందో అందులో నటించిన ఒక క్యారక్టర్... ఆ పాత్ర పోషించిన నటి పేర్లు బాగా మార్మోగిపోతున్నాయి. మహేశ్‌బాబు, హృతిక్‌రోషన్‌ లాంటి సెలబ్రిటీలు ఆమె అభినయాన్ని అభినందిస్తున్నారు. ఆ క్యారక్టర్‌ పేరు డీసీపీ వర్తికా చతుర్వేది కాగా... ఆ పాత్ర పోషించిన నటి షెఫాలీ షా.

Know More

women icon@teamvasundhara
manushi-chhillar-reveals-why-she-decided-to-go-vegetarian

అలా చేయమని నన్నెవరూ బలవంతపెట్టలేదు!

తల్లిదండ్రులు చేసే పనులను పిల్లలూ అనుకరిస్తారంటారు.. వారి అలవాట్లు చిన్నారుల పైనా ప్రభావితం చూపుతాయంటారు. అలా తన తల్లిదండ్రుల ఆహారపుటలవాట్లు తన పైనా ప్రభావం చూపాయంటోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్. 2017లో ప్రపంచ సుందరిగా అవతరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మానుషి.. మహిళా సాధికారతకు కృషి చేస్తూ తన మంచి మనసును సైతం చాటుకుంటోంది. అంతేనా.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే ఈ చక్కనమ్మ.. ఈ క్రమంలో తాను పాటించే చిట్కాలను సైతం సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఫ్యాన్‌్ులో స్ఫూర్తి నింపుతుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ తన ఆరోగ్యకరమైన జీవనశైలి వెనకున్న మరో సీక్రెట్‌ని బయటపెట్టిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
meghan-markle-says-she-had-miscarriage

అప్పుడే నా కడుపులోని బిడ్డ ఇక లేదని అర్థమైపోయింది!

అమ్మతనం... ఆడవారికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. మాతృత్వంతో మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ నవ మాసాల ప్రయాణమనేది ప్రతి మహిళకు ఓ పెను సవాలే. గర్భం దాల్చినా దురదృష్టవశాత్తూ చాలామందికి అది నిలవకపోవచ్చు. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఈ క్రమంలో తానూ గర్భశోకంతో తల్లడిల్లానంటూ చెప్పుకొచ్చింది బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ సతీమణి మేగన్‌ మార్కల్. రెండోసారి గర్భం ధరించాక కడుపులోనే బిడ్డను పోగొట్టుకున్నానంటూ వాపోయింది. ఈ సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని అందరితో షేర్‌ చేసుకుందీ యువరాణి.

Know More

women icon@teamvasundhara
singer-neha-bhasin-reveals-she-was-molested-at-the-age-of-10

పదేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను!

లైంగిక వేధింపులు... ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా సమాజంలోని ఆడపిల్లలందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. సాధారణ అతివలే కాదు... కొందరు సెలబ్రిటీలూ ఈ సమస్యలను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. అయితే వీటి బారిన పడి మానసిక కుంగుబాటుకు లోనయ్యే వారు కొందరైతే... తమ చేదు అనుభవాల గురించి ధైర్యంగా బయటకు చెప్పి ఇతర మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేవారు మరికొందరు. ఈ రెండో కోవకే చెందుతుంది ప్రముఖ సింగర్‌ నేహాభాసిన్‌. హుషారైన పాటలు పాడుతూ యువతలో ఉత్సాహం నింపే ఈ స్టార్‌ సింగర్‌ పదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటోంది. ఆ తర్వాత కూడా మరికొన్నిసార్లు ఈ సమస్య బారిన పడ్డానంటోంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిందీ ట్యాలెంటెడ్‌ సింగర్.

Know More

women icon@teamvasundhara
sona-mohapatra-recalls-advice-wear-dupatta-properly-after-harassed

‘ఎక్స్‌పోజింగ్‌ చేయకుండా చున్నీ సరిగా వేసుకోండి’ అన్నాడు!

సాధారణంగా మహిళలపై ఏవైనా అఘాయిత్యాలు, అరాచకాలు జరిగితే అందుకు మహిళనే బాధ్యురాలిగా చేస్తుంటారు. దీంతో చాలా సందర్భాల్లో మహిళలు మౌనమే సమాధానంగా మిన్నకుండిపోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. తప్పొప్పులు ఎవరివో సామాజిక మాధ్యమాల సాక్షిగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలో సున్నితమైన ఇలాంటి విషయాల్లో బాధితులనే తప్పుపట్టడం సరికాదంటోంది బాలీవుడ్ సింగర్‌ సోనా మహాపాత్ర. ఈ సందర్భంగా #IneverAskForIt ఛాలెంజ్‌ పేరుతో బాధితులనే బాధ్యులుగా చేసిన సంఘటనల గురించి నిర్మొహమాటంగా స్పందించాలంటూ పిలుపునిస్తోంది.

Know More

women icon@teamvasundhara
mona-singh-speaks-of-freezing-her-eggs-says-my-mother-was-so-happy-when-she-heard

పిల్లల కోసం పెళ్లికి ముందే అలా చేశా!

అమ్మాయిలకు పెళ్లి కాస్త ఆలస్యమైతే చాలు.. ‘పెళ్లెప్పుడూ?’ అంటారు. అదే పెళ్లైతే ‘పిల్లల్నెప్పుడు కంటావ్‌?’ అని అడుగుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు మనలాంటి వారికే కాదు.. సెలబ్రిటీలకూ కామనే! అయితే పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి వయసుతో సంబంధం లేదంటోంది బాలీవుడ్‌ నటి మోనా సింగ్‌. తన 39 ఏళ్ల వయసులో ఫిల్మ్‌ మేకర్‌ శ్యామ్‌ రాజగోపాలన్‌ను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లికి ఇదే సరైన సమయమని చెబుతోంది. అంతేకాదు.. పెళ్లికి ముందే తన అండాల్ని భద్రపరచుకున్నానంటూ బోల్‌్ిగా మాట్లాడిన మోనా.. పెళ్లి, పిల్లల గురించి సమాజం ఎలా ఆలోచిస్తుందన్న విషయాల గురించి తన మనసులోని మాటల్ని నిర్మొహమాటంగా బయటపెట్టింది.

Know More

women icon@teamvasundhara
nireekshana-fame-archana-in-alitho-saradaga-chat-show

రెండు క్లోజప్‌లు తీసి మొహంలో కళ లేదన్నారు!

‘ఆకాశం ఏనాటిదో...అనురాగం ఆనాటిది’ అంటూ ‘నిరీక్షణ’ సినిమాలో భానుచందర్‌తో కలిసి ఆడిపాడారు అర్చన. ఆ సినిమాలో మాటల్లో చలాకీ తనం, చూపుల్లో అమాయకత్వం కలగలిపిన గిరిజన యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారామె. ఆ తర్వాత ‘లేడీస్ టైలర్‌’, ‘మట్టి మనుషులు’, ‘దాసి’, ‘భారత్‌ బంద్‌’.. లాంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగు తక్కువ అంటూ తొలినాళ్లలో నటిగా తిరస్కరణకు గురైన ఆమె... వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈ అందాల తార సుమారు పాతికేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి కెమెరా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సరదాగా షేర్‌ చేసుకున్నారు అర్చన.

Know More

women icon@teamvasundhara
celebrities-pour-birthday-wishes-for-tennis-star-sania-mirza

హ్యాపీ బర్త్‌డే మిర్చి మమ్మీ!

సానియా మీర్జా... క్రికెట్‌ను మాత్రమే ఆరాధించే మన దేశంలో టెన్నిస్‌కు విశేష గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారిణి. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో పాటు డబుల్స్ విభాగంలో వరల్డ్‌ నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఈ టెన్నిస్‌ క్వీన్‌ తన ఆటతీరుతో టెన్నిస్‌ కోర్టుకే అందం తెచ్చింది. మెటర్నిటీ బ్రేక్‌ కారణంగా రెండేళ్లు దూరమైనా మళ్లీ టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టి అదరగొడుతోన్న ఈ టెన్నిస్‌ సెన్సేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులున్నారు. ఈ క్రమంలో తాజాగా (నవంబర్ 15) 34వ వసంతంలోకి అడుగుపెట్టిందీ హైదరాబాదీ సంచలనం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమదైన శైలిలో సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Know More

women icon@teamvasundhara
who-is-maria-thattil?-indian-origin-woman-crowned-miss-universe-australia-2020
women icon@teamvasundhara
cinema-celebrities-in-karwachauth-celebrations

women icon@teamvasundhara
anaita-shroff-adajania-shares-her-experiences-on-playing-kajol’s-friend-in-ddlj

అప్పుడు అక్కడ షారుఖ్‌ నా కోసమే ఎదురుచూస్తున్నాడనుకున్నా!

నటన అంటే ఇష్టమున్న వాళ్లు సినిమా అవకాశాల కోసం పరితపించిపోతుంటారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే చిన్న పాత్రలో అవకాశమొచ్చినా ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది అసలు నటన గురించి తెలియకపోయినా, చిత్ర పరిశ్రమతో సంబంధం లేకపోయినా నటించే అవకాశం తలుపు తడితే.. అదీ స్టార్‌ నటీనటుల సరసన అయితే.. ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదా! అలాంటి అరుదైన అవకాశమే తనను వరించిందంటోంది బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ అనైతా ష్రాఫ్‌ అదజానియా. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ గురించి బొత్తిగా తనకు తెలియదని, అలాంటి సమయంలో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి హిట్‌ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమంటోంది. ఈ చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు అనైతా.

Know More

women icon@teamvasundhara
amrita-rao-confirms-her-pregnancy-in-telugu

కరోనా గురించి కడుపులో ఉన్న నా బేబీకి కూడా తెలిసిపోయిందేమో!

అమ్మతనం ఓ అద్భుతం. గర్భం ధరించడం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటారు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది అమృతా రావు. ‘అతిథి’ సినిమాలో మహేశ్‌ సరసన నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార త్వరలోనే తల్లి కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నానంటూ తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
what-is-in-my-box-?-anchor-suma-kanakala-shares-her-diet-secrets-through-a-video

సుమక్క ఎనర్జీ సీక్రెట్‌ ఇదేనట!

గలగల పారే సెలయేరుల్లాంటి మాటలు, సందర్భానికి తగినట్లుగా సంధించే హాస్యఛలోక్తులు, ముఖంపై చెరగని చిరునవ్వుతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల. తాను స్టేజీ మీదకు అడుగుపెట్టిందంటే అటు ప్రేక్షకుల్లో, ఇటు టీవీల ముందు కూర్చున్న మహిళామణుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. మరి, మనలో ఇంతటి ఎనర్జీని బూస్టప్‌ చేస్తోన్న మన సుమక్క ఎనర్జీ సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ఆ రహస్యాన్ని ఇటీవలే బయటపెట్టిందీ సూపర్బ్‌ యాంకర్‌. అంతేనా.. తాను ఇంత అందంగా, యాక్టివ్‌గా ఉండడానికి తాను పాటించే ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లే కారణమని చెబుతూ తన డైట్‌ సీక్రెట్స్‌ని ఓ వీడియోలో భాగంగా పంచుకుంది సుమ. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-actress-shikha-malhotra-tests-covid-19-positive-and-shares-her-experiences-about-fighting-with-this-virus

కరోనా ఇంకా మన చుట్టూనే ఉంది.. 'ఏం కాదులే' అనుకోవద్దు!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా లెక్కచేయకుండా ఉచితంగా సేవ చేయడానికి కదులుతూ తమలోని సేవాభావాన్ని, మంచి మనసును ప్రపంచానికి చాటుతున్నారు మరికొందరు మహిళలు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది - బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా. నర్సింగ్‌ కోర్సు చదువుతూనే నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవకే ఓటేసింది. ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా ముంబయిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా కరోనా బాధితులను కంటికి రెప్పలా కాచుకుంటోన్న ఆమె.. తాజాగా వైరస్‌ బారిన పడింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆస్పత్రిలో చేరిన శిఖ.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తనకు ఎదురవుతోన్న అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూనే.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కరోనా జాగ్రత్తలు చెబుతూ అందరినీ అలర్ట్‌ చేస్తోందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
niti-taylor-reveals-she-tied-knot-parikshit-in-august-in-telugu

ఇప్పుడు ‘హలో హజ్బెండ్‌’ అని గట్టిగా కేకలు వేయగలను!

ఎనిమిదేళ్ల క్రితం ‘మేం వయసుకు వచ్చాం’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది నీతి టేలర్‌. ఆ సినిమాలో ‘దిల్’ అనే ముస్లిం యువతి పాత్రలో కుర్రకారు మనసులను కొల్లగొట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘పెళ్లి పుస్తకం’, ‘లవ్‌డాట్‌ కామ్‌’ అనే సినిమాల్లో సందడి చేసిన ఈ అందాల తార ఆ తర్వాత బాలీవుడ్‌ బుల్లితెరకు వెళ్లిపోయింది. పలు సీరియళ్లు, మ్యూజిక్ వీడియోలతో మెప్పించి టెలివిజన్‌ స్టార్‌గా మారిపోయింది. ఇలా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆగస్టులో తన చిరకాల స్నేహితుడు పరీక్షిత్‌ బవాతో కలిసి పెళ్లిపీటలెక్కినట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిందీ ముద్దుగుమ్మ. తద్వారా తన అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా నీతి టేలర్ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

Know More

women icon@teamvasundhara
sharukh-khan-daughter-suhana-khan-inspirational-social-media-post-on-end-colourism

‘నల్ల పిల్లి’ అని హేళన చేసేవారు..!

‘చూడ్డానికి తెల్లగా ఉండాలి.. ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా ఉండాలి.. ఐదున్నర అడుగుల ఎత్తుండాలి.. దానికి తగ్గ చక్కటి శరీర సౌష్టవం ఉండాలి.. అప్పుడే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్లు లెక్క!’... ఇదీ అందం గురించి ఇప్పటికీ సమాజంలో చాలామందికి ఉండే అభిప్రాయం. వీటిలో ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా చుట్టూ ఉండే వారు ఆమెపై విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోల్స్‌, బాడీ షేమింగ్‌ కామెంట్లు మరీ మితిమీరిపోతున్నాయి. సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌ తప్పట్లేదు. అయితే వీటిని పంచుకోకుండా తమలోనే దాచుకునే వారు కొందరైతే.. తాము ఎదుర్కొన్న మాటల తూటాల్ని నలుగురితో పంచుకొని బాడీ షేమింగ్‌ని అణచివేయాలని ధైర్యంగా ముందుకొచ్చే వారు మరికొందరు.

Know More

women icon@teamvasundhara
allu-arjun-wishes-wife-sneha-reddy-on-her-birthday-shares-an-adorable-pic

ఇలా ఎప్పటికీ నీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నా!

టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహల జంట కూడా ఒకటి. తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్‌. ఇక సినిమాలతో పాటు కుటుంబానికి అంతే ప్రాధాన్యమిస్తాడు బన్నీ. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. ఈ క్రమంలో తాజాగా తన భార్య పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడీ స్టైలిష్‌ స్టార్. ఈ సందర్భంగా కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఓ పార్టీ ఏర్పాటు చేసిన బన్నీ... తన జీవిత భాగస్వామితో కేక్‌ కట్‌ చేయించాడు.

Know More

women icon@teamvasundhara
me-and-irrfan-wanted-to-have-a-daughter-desperately-says-sutapa-sikdar

అప్పుడు మాకు అమ్మాయే పుట్టాలని కోరుకున్నాం!

ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు...చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. ఇక ఇంట్లో కూతురు పుట్టిందంటే ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’, ‘మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది’ అని అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇలా ఆనందాలు కురిపించే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తమకూ ఓ ఆడపిల్ల పుడితే బాగుండేదని... తన భర్త కూడా ఇదే కోరుకున్నాడంటోంది దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సతీమణి సుతపా సిక్దార్‌. ఈ క్రమంలో ‘డాటర్స్‌ డే’ ను పురస్కరించుకుని ఆమె ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-shares-tips-that-help-her-with-pcos-in-new-post

ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!

పీసీఓఎస్‌/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్‌ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్‌, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్‌ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-who-was-shooting-for-mere-dad-ki-dulhan-tests-covid-19-positive

అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకున్నా.. ఇప్పుడు బాగానే ఉన్నా!

బయటికెళ్తే కరోనా వస్తుందన్న భయం.. ఇంట్లోనే ఉంటే ఓ రకమైన మానసిక ఒత్తిడి.. ప్రస్తుతం చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ కరోనా వచ్చినా దాన్నుంచి కోలుకుంటామో, లేదోనన్న టెన్షన్‌తో అనుక్షణం భయపడిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం వారి కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. అలాంటి వారిలో పలువురు నటీమణులు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఇటీవలే తనకు కొవిడ్‌ నిర్ధారణ అయిందని, అయితే ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ క్రమంలో తాను పాటిస్తోన్న పలు జాగ్రత్తల్ని కూడా పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
vithika-sheru-shares-about-her-depression-through-a-heart-touching-video

అది కరోనా కన్నా ప్రమాదకరమైంది!

తామెలా ఉన్నామో చూసుకోకుండా ఇతరుల్ని కామెంట్‌ చేయడం, విమర్శించడం చాలామందికి అలవాటు. ఇలాంటివి ఎదుటివారిని బాధపెడతాయేమోనన్న కనీస ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు కొంతమంది. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోలింగ్‌కి హద్దే ఉండదు. ఇక ఇలా తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా వదిలేసే వారు కొందరైతే.. వాటి మూలంగా కలిగిన బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లే వారు మరికొందరు. ఈ రెండో జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ వితికా షేరు. గతేడాది ఓ రియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌కి తట్టుకోలేకపోయానని, అవి క్రమంగా తనని కుంగదీశాయంటూ తన మనసులోని ఆవేదనను ఓ సుదీర్ఘ వీడియో రూపంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో తాను రూపొందించిన ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
malaika-arora-shares-her-experience-after-beating-corona-in-telugu

ఆ జాగ్రత్తలే నన్ను కరోనా నుంచి కోలుకునేలా చేశాయి!

కరోనా మహమ్మారి బారిన పడి దాన్నుంచి కోలుకున్నారంటే ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడిపోతున్నారంతా! ఆ సంతోషంలోనే తమ కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా కూడా ప్రస్తుతం అంతకుమించిన ఆనందంలోనే తేలియాడుతోంది. ఇందుకు కారణం ఆమె వైరస్‌ను జయించడమే! ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందిన ఆమెకు తాజా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. దీంతో ఎన్నో రోజుల తర్వాత తన గది నుంచి బయటకొచ్చానంటూ విజయ దరహాసాన్ని ప్రదర్శిస్తోన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బాలీవుడ్‌ బేబ్‌. అంతేకాదు.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలనూ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది మలైకా. మరి, ఈ ముద్దుగుమ్మ తన కొవిడ్‌ జర్నీ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
singer-chinmayi-sripada-records-song-dedications-to-raise-funds-for-the-needy

వారికోసం 3 వేల పాటలు.. 85 లక్షలు.. దటీజ్ చిన్మయి!

తన శ్రావ్యమైన స్వరంతో సంగీత ప్రియుల్ని అలరించే బ్యూటిఫుల్‌ సింగర్‌ చిన్మయీ శ్రీపాద. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై స్పందించే ఈ గాయని.. తన సేవా భావంతోనూ అశేష అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే తన సంగీత కళను ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సేవ కోసమే వినియోగిస్తోందీ సూపర్‌ సింగర్‌. తన ప్రియమైన అభిమానులు అడిగిన పాటలు పాడుతూ, వారికి విషెస్‌ చెబుతూ లక్షల కొద్దీ విరాళాలు సేకరిస్తోందీ ముద్దుగుమ్మ. ఇలా పోగైన మొత్తాన్ని ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగిస్తోంది. ఇలా మరోసారి తన సేవాభావంతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల గాయని.

Know More

women icon@teamvasundhara
here-is-the-lesson-tejaswi-madivada-learnt-from-covid-19-in-telugu

ఎవరి కోసమో నేనెందుకు మారాలి?!

ఎవరినైనా చూస్తే చాలు.. వారిలో ఏం లోపముందా? అనే వెతుకుతుంటాయి చాలామంది కళ్లు. ఇక నిజంగానే వారి శరీరాకృతిలో ఏదైనా లోపమున్నా, చర్మ ఛాయ తక్కువగా ఉన్నా.. ఏదో ఒక మాట అనేదాకా ఊరుకోవు వాళ్ల నోళ్లు! అసలు ముందు వాళ్లు ఎలా ఉన్నారో చూసుకోకుండా, ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందేమో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా ఇతరుల శరీరాకృతి, అందం గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి బాడీ షేమింగ్‌కు తాను కూడా బాధితురాలినే అంటోంది టాలీవుడ్‌ భామ తేజస్వీ మదివాడ. దీని కారణంగా తాను ఎంతో బాధను అనుభవించానని, అయితే ఇతరుల కోసం మనం మారాల్సిన అవసరం లేదని ఆలస్యంగా గ్రహించానని చెబుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తన కోసం తాను సమయం కేటాయించుకోవడం వల్ల బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది ఈ ఐస్‌క్రీమ్‌ బ్యూటీ..

Know More

women icon@teamvasundhara
indian-model-paula-accuses-bollywood-director-of-sexual-harassment-when-she-was-17

ఆఫర్‌ కావాలంటే దుస్తులు విప్పమన్నాడు!

పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలన్న మహిళల ఆశయాన్ని ఆసరాగా చేసుకుని, తమ అవసరాలు తీర్చుకోవాలని చూసే మగవాళ్లు ప్రతి రంగంలోనూ ఉన్నారు. సినీ రంగమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే చిత్ర సీమలో ఉన్న ఇలాంటి కొందరు మగాళ్ల ఆగడాలను బయటపెట్టే క్రమంలో తెరమీదకొచ్చిందే ‘మీటూ ఇండియా’ ఉద్యమం. ఎక్కడో అమెరికన్‌ చిత్ర పరిశ్రమలో మొదలైన ‘మీటూ’ దావానలంలా విస్తరిస్తూ మనదాకా చేరింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమంలో భాగంగా ఎందరో సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. మరెందరో మహిళా సెలబ్రిటీలు తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెట్టారు. అయితే అది అక్కడితో సమసిపోలేదు. ఇప్పటికీ కొంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెడుతూనే ఉన్నారు. అలా తాజాగా ప్రముఖ భారతీయ మోడల్‌ పౌలా మీటూ ఉద్యమాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. తన కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెబుతూ ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
celebrities-shares-their-pcos-struggles-and-experiences-in-telugu

మాకూ పీసీఓఎస్ ఉంది.. అయినా దాచుకోలేదు.. కుంగిపోలేదు..!

‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్‌.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్‌ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
padma-lakshmi-shows-how-50-is-the-new-30-in-her-birthday-post

ఇంకా 30లోనే ఉన్నట్లుంది!

పద్మాలక్ష్మి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ప్రముఖ మాజీ మోడల్‌. ప్రస్తుతం అమెరికన్‌ టీవీ ఛానల్స్‌లో టాప్‌ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అందాల తార మంచి రచయిత్రి కూడా. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఈ ప్రవాస భారతీయురాలు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం మహిళల్లో స్ఫూర్తి కలిగించే పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టిన పద్మ... తన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
amitabh-bachchan’s-grand-daughter-navya-naveli-nanda-opens-up-about-struggle-with-anxiety-seeking-therapy

సిగ్గు పడకండి.. అలాంటప్పుడు బయటికి చెప్పుకోండి..!

మనసులో ఎంత బాధున్నా బయటికి చెప్పరు చాలామంది. ఒకవేళ తమ సమస్య గురించి నలుగురికీ చెప్తే ఎక్కడ పలుచనైపోతామో, నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే వారితో వెనకడుగు వేయిస్తుంది. ఇలా చేస్తే ఆ బాధ తీవ్రత క్రమంగా పెరిగి పెరిగి మన మనసునే తొలిచేసే స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. ఇలా పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ జబ్బు ఇప్పుడు చాలామంది పాలిట శాపంగా పరిణమిస్తోంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు. ఇలా తాము ఎదుర్కొన్న మానసిక సమస్య గురించి బయటికి చెప్పి సామాన్యుల్లో ధైర్యాన్ని నింపిన అందాల తారలు ఎంతోమంది! ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా. గత కొంత కాలంగా యాంగ్జైటీతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దాన్నుంచి విముక్తి పొందేందుకు థెరపీ తీసుకుంటున్నానంటూ ఈ మానసిక వ్యాధి నుంచి బయటపడే మార్గాల్ని చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపిందీ క్యూటీ.

Know More