scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

ఆ పాత్ర చేయడం కంటే గంజి తాగడమే బెటర్‌ అనిపించింది!

Senior actress Tulasi in Ali tho saradaga

తులసి... నడక నేర్చుకునే వయసులోనే నటన నేర్చుకున్న ఆమె ‘శంకరా భరణం’ సినిమాతోనే తన నట ప్రతిభను నిరూపించుకున్నారు. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా మొదటి ఇన్నింగ్స్‌లోనే ఎందరో అగ్రనటుల మెప్పు పొందిన ఆమె...రెండో ఇన్నింగ్స్‌లో మెయిన్‌ హీరోయిన్‌గా అదే అగ్రనటులతో ఆడిపాడి అలరించారు. ప్రస్తుతం మూడో ఇన్నింగ్స్‌లోనూ ‘అమ్మ’ పాత్రలకు ప్రాణం పోస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానులు అందుకుంటున్నారు. ఇలా నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో అభినయించి అలరించిన ఈ సీనియర్‌ నటీమణి తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. నాటి నుంచి నేటివరకు మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ వేదికగా పంచుకున్నారు.!
మిమ్మల్ని ఏమని పిలవాలి? శివమణి తులసి అని పిలవాలా?
తులసి: నన్ను ఎప్పుడూ ‘తులసి’ అనే పిలుస్తారుగా, అలాగే పిలవండి. శివమణి పేరు మధ్యలో వచ్చి చేరింది(నవ్వులు).
శివమణిని ఎక్కడ కలిశారు?
తులసి: ఆయన దర్శకత్వం వహించిన ఓ సినిమాలో అతిథి పాత్ర చేయమని అడిగారు. దేవరాజుగారు హీరో.. నిరోషా హీరోయిన్‌. ‘దేవరాజుగారి చిన్నప్పటి పాత్రకు తల్లిగా తులసి అయితే బాగుంటారు’ అని నన్ను పిలిపించారు. ఎందుకంటే అప్పటికే నేను కన్నడలో కాస్త ఫేమస్‌. అలా ఆయన పరిచయమయ్యారు.(మధ్యలో ఆలీ అందుకుని.. శివమణి అంటే డ్రమ్స్‌ వాయించే శివమణి కాదు.. దర్శకత్వం చేసే శివమణి ఇంకొకరు ఉన్నారు) అందరూ అదే అనుకుంటున్నారు. డ్రమ్‌ కాదు.. డైరెక్టర్‌(నవ్వులు).

tulasialithosaradaga650-5.jpg
మీకెంతమంది పిల్లలు?
తులసి: ఒక కొడుకు. ప్రస్తుతం గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.
మీ సొంతూరు ఏది?
తులసి: నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. అమ్మ వాళ్లది తాడేపల్లిగూడెం. తాతయ్యకు మా అమ్మ ఒక్కరే కూతురు. ఆమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేది. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా చెన్నై వచ్చేశారు. రావడంతోనే చెన్నైలో ఇల్లు కొనేశారు. అలా స్థిరపడిపోయారు. నాన్న బిజినెస్‌ చేసేవారు. నాకు మూడేళ్ల వయసు ఉండగా, ఆయన చనిపోయారు. అప్పట్నుంచి అన్నీ అమ్మే చూసుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. నా లోకం మొత్తం ఆవిడే. ఆమె చేసిన దాన ధర్మాల వల్లే మా కుటుంబం ఈ స్థాయిలో ఉంది. అందరికీ ఇవ్వడం ఆమే నేర్పించారు. నీకు సరిపోయినంత నువ్వు తీసుకుని, మిగిలినది పంచమని చెబుతూ ఉండేవారు. ఆ రోజుల్లో మా ఇంట్లో పనిచేసే వాళ్లకు ఏడు ఇళ్లు కట్టించి ఇచ్చారు.
మీకు మూడు నెలల వయసు ఉండగా, ఓ సినిమాలో చిన్న పాప క్యారెక్టర్‌ అవసరమైతే, ‘తులసిని పెట్టండి’ అని ఒక పెద్ద నటి చెప్పారట!
తులసి: ఇంకెవరు? మహానటి సావిత్రిగారు. అమ్మకు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆవిడ. నేను పుట్టినప్పుడు ఆమె బిజీగా ఉండటంతో చూడటానికి రాలేదు. ఆ తర్వాత మూడు నెలలకు వచ్చారు. ఎంఎస్‌ రెడ్డిగారి ‘భార్య’ సినిమాలో బాబు పాత్రకు నన్ను తీసుకున్నారు. తొలిసారే అబ్బాయిగా నటించా(నవ్వులు)

tulasialithosaradaga650-3.jpg
ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్ని సినిమాల్లో నటించారు?
తులసి: తెలుగు, తమిళం, మలయాళం, హిందీ కలిపి దాదాపు 120 సినిమాల్లో నటించాను.

‘శంకరాభరణం’ కాకుండా ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాత్ర ఏది?
తులసి: ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’తో నాకు మంచి పేరు వచ్చింది. నేను బాగా డ్యాన్స్‌ చేస్తానని అందరూ మెచ్చుకునేవారు. ఆ తర్వాత బాగా పేరు తీసుకొచ్చింది ‘సీతామహాలక్ష్మి’. అందులో నాది అబ్బాయి పాత్ర. అలా అబ్బాయిగా దాదాపు 73 సినిమాల్లో నటించా. కరుణానిధిగారు రాసిన కథ ‘వండిగర్‌ మగన్‌’లోనూ నేను అబ్బాయిగా నటించా.
చాలామందికి ఫస్ట్‌ ఇన్నింగ్స్‌.. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఉంటాయి. మీరేంటి మూడో ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నారు.
తులసి: (నవ్వులు) మన పని మనం చేసుకుంటూ, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా క్రమశిక్షణతో ఉంటే చాలు. ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గా ఉండచ్చు. ముఖ్యంగా ఎదుటివారిని చూసి ఈర్ష్య పడకుండా ఉంటే చాలు.
సావిత్రితో కలిసి నటించారా?
తులసి: ఎంఎస్‌ రాజుగారి తండ్రి ‘ముకద్దర్‌ కా సికందర్‌’ రీమేక్‌ హక్కులు కొనుక్కొన్నారు. అందులో ‘ఓ సాథీరే..’ పాటలోని ఓ పాత్ర నాతో వేయించారు. ఆ సినిమా అనగానే, నన్ను ఫిక్స్‌ చేసేసుకున్నారు. అలా సావిత్రిగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది.

tulasialithosaradaga650-1.jpg
మనిద్దరం (ఆలీ) ఎప్పుడు కలిశామో తెలుసా?
తులసి: ‘నెలవంక’ సినిమా సందర్భంగా కలిశాం. (ఆలీ సమాధానం చెబుతూ.. కాదు.. శోభన్‌బాబు గారి ‘దేవుడు మావయ్య’ సినిమా షూటింగ్‌లో కలిసి పని చేశాం. మధ్యలో ‘శంకరాభరణం’ ఆఫర్‌ వస్తే వెళ్లిపోయారు. అదొక పెద్ద ఇష్యూ అయింది. మీ స్థానంలో బెంగళూరు నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చి రీషూట్‌ చేశారు. ఆ సినిమాలో శోభన్‌బాబు గారు, సావిత్రి గారు, జగ్గయ్య, ఛాయాదేవి, పద్మనాభం వంటి పెద్ద నటులు ఉన్నారు. మరోవైపు తులసి, ఆలీ, బేబీ వరలక్ష్మి, బేబీ రాణి, బేబీ సరస్వతి, సాయి కుమార్‌ తమ్ముడు రవిశంకర్‌, బేబీ గౌరీ ఇలా పిల్లలంతా అందులో నటించాం. ఆ సినిమా తర్వాత వాణిశ్రీ గారి వివాహం జరిగింది. దీంతో ఆ సినిమా ఏడాది పాటు వాయిదా పడింది. ఈ గ్యాప్‌లో మీరు వెళ్లిపోయారు)
తులసి: నాకు ‘నెలవంక ఎందుకు గుర్తుంది అంటే.. అప్పటికే మేము నటించడం మొదలు పెట్టాం. నువ్వు(ఆలీ) ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌వి. జంధ్యాల గారు నిన్ను విపరీతంగా పొగిడేవారు. ‘వీడు మామూలోడు కాదు. ఏలేస్తాడు’ అని కెమెరామెన్‌ గోపాలరెడ్డి గారితో చెబుతుండేవారు. (వెంటనే ఆలీ అందుకుని.. అప్పుడు మనం షూటింగ్‌ పూర్తి చేసుకుని గోదావరి నదిలో పడవపై వస్తుంటే విపరీతమైన వర్షం కురిసింది. పడవ మునిగిపోతుందేమో అనుకున్నాం. ఏదో దేవుడు మనల్ని కాపాడాడు.)

tulasialithosaradaga650-12.jpg
‘శంకరాభరణం’ విజయాన్ని ఎలా ఆస్వాదించారు?
తులసి: సినిమా సక్సెస్‌ కావడం ఒకెత్తయితే. ఆ విజయోత్సవ కార్యక్రమాలను రెండేళ్ల పాటు నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా ప్రశంసలతో ముంచెత్తేవారు. విశ్వనాథ్‌ గారితో పాటు వేదికపై చివరిలో నాకూ ఒక కుర్చీ వేసేవారు. అంత ప్రాధాన్యం ఉన్న పాత్రని అప్పుడు నాకు తెలియదు.

tulasialithosaradaga650-6.jpg
ఏ సినిమా ద్వారా తొలిసారి విశ్వనాథ్‌ గారితో కలిసి పనిచేశారు?
తులసి: ‘సీతామహాలక్ష్మి’. మురారి గారి ఆఫీస్‌లో నాకు ట్రైనింగ్‌ ఇచ్చారు. సినిమా 175రోజులు (సిల్వర్‌ జూబ్లీ) ఆడటంతో మురారి గారు ఇంటికి పిలిచి బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి నా కెరీర్‌లో బంగారం వస్తూనే ఉంది.
ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు? ఎన్ని సినిమాల్లో నటించారు?
తులసి: 1967. ఇప్పటివరకూ దాదాపు 378 సినిమాల్లో నటించా. పెళ్లయిన తర్వాత దాదాపు పదేళ్లు విరామం తీసుకున్నా. హీరోయిన్‌గా నా తొలి సినిమా ‘శుభలేఖలు’.
పెద్ద హీరోలతో ఏ సినిమాలు చేశారు?
తులసి: బాలకృష్ణగారితో ‘డిస్కో కింగ్‌’ చేశా. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా బాలయ్య చాలా సింపుల్‌గా ఉంటారు. నాకు మంచి స్నేహితులు. ఇటీవల కలిసినప్పుడు ‘ఎలా ఉన్నారు సర్‌’ అంటే ‘ఏయ్‌ తులసి.. నన్ను సర్‌.. అంటావేంటి’ అంటూ చాలా సరదాగా మాట్లాడారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. సుమన్‌తో ‘కంచు కవచం’ చేశా.
మీ వల్ల ఒక వ్యక్తి ఇప్పుడు స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరా వ్యక్తి?
తులసి: రఘుబాబు. అయితే, నా వల్ల ఈ స్థాయికి వచ్చాడని నేను చెప్పను. వాళ్ల బ్యానర్‌తో తను నిర్మించిన చిత్రంలో నేను నటించా. రఘు మంచి యాక్టర్‌ అని ఎప్పుడూ నాకు ఒక ఫీలింగ్‌ ఉండేది. వాళ్ల కుటుంబమంతా బాగా పరిచయం. తను వాయిస్‌లను మిమిక్రీ చేస్తాడు. ‘నువ్వు తప్పకుండా మంచి నటుడివి అవుతావు’ అని చెబుతుండే దానిని. అలా ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఒక సినిమాలో కూడా నటించాం.
గౌతమ్‌ మేనన్‌ ఆయన పుట్టినరోజుకు మీకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పించుకుంటారట!
తులసి: నేను ఎవరినైనా తొలిసారి కలిసినప్పుడు నా మాట తీరు వల్ల ‘మీరంటే మాకు ఇష్టం మేడమ్‌’ అని చెబుతుంటారు. అలా గౌతమ్‌ను కలిసినప్పుడు నేను చాలా పాజిటివ్‌గా మాట్లాడటం నచ్చింది. నేను కూడా ఆయనలో ఆ పాజిటివిటీని చూశా.

tulasialithosaradaga650-10.jpg
‘డార్లింగ్‌’ చేస్తుంటే ఒక షాట్‌లో ప్రభాస్‌ చెవి పట్టుకుని డైలాగ్‌ చెప్పారట!
తులసి: అవును! నాకు క్లోజప్ షాట్‌ పెట్టి ప్రభాస్‌ కనిపించేలా డైలాగ్‌ చెప్పమన్నారు. అలా చెప్పగానే నేను కంగుతింటానని అనుకున్నారు. ఎలా చేస్తానా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కెమెరా రోల్‌ అనగానే, ప్రభాస్‌ చెవి పట్టుకుని నా ముఖానికి దగ్గరగా తీసుకొచ్చి డైలాగ్‌ చెప్పా. అంతే అందరూ చప్పట్లు కొట్టారు. వందల సినిమాల్లో నటించడం వల్ల వచ్చే అనుభవం అది.
ఛారిటీ ఏమైనా ప్రారంభించారా?
తులసి: కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. అవన్నీ చెప్పుకొంటే బాగుండదు. ఎవరికైనా సాయం చేయాలని అనిపిస్తే, వెంటనే చేస్తా.
ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?
తులసి: నేను బెంగళూరులో ఉండేదాన్ని. మా అబ్బాయి చెన్నైలో ఉండటంతో నేనూ అక్కడికి వచ్చేశా.
మీరు ఫేస్‌ చూసి జాతకాలు చెబుతారట! నేను(ఆలీ) అమెరికా అధ్యక్షుడిని ఎప్పుడవుతానో చెబుతారా?
తులసి: నేనేమీ జాతకాలు చెప్పను. ఇండియా ప్రెసిడెంట్‌ కావు..ఇంకా అమెరికా ఎందుకు?(నవ్వులు) నేను అందరి మంచి కోరుకుంటా. అందుకే ఎదుటివాళ్లకు మంచి జరగాలని నేను అనుకున్నప్పుడు అది జరిగితే వాళ్లు సంతోషంగా ఫీలవుతారు.

tulasialithosaradaga650-7.jpg
సాధారణంగా ఒక అబ్బాయి.. అమ్మాయిని చూస్తే.. మొదట ప్రపోజ్‌ చేయడం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించడం.. పెళ్లి చేసుకోవడం చాలా సమయం పడుతుంది. కానీ, మీరేంటి ఉదయం చూసుకుని, మధ్యాహ్నం ప్రేమించుకుని, సాయంత్రం పెళ్లి చేసుకున్నారట!
తులసి: ఏదైనా జరగాలంటే చిటికెలో అయిపోవాలి. అలాగే నా పెళ్లి కూడా అయిపోయింది. నేను సాయిబాబా భక్తురాలిని. నా పుట్టినరోజున తాతయ్య సాయిబాబా ఫొటో ముద్రించిన కార్డులను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. వాటిని ప్రతి యూనిట్‌లోనూ పంచేదాన్ని. అలా రెండో మూడో మిగిలితే శివమణిగారికి ఇచ్చా. మధ్యాహ్నం భోజనానికని ఆయన ఇంటికి వెళ్లి నేను ఇచ్చిన ఫొటోను పూజ గదిలో పెట్టారు. అనంతరం షూటింగ్‌కు వచ్చేటప్పుడు తాళి తీసుకొచ్చారు. సాయంత్రం పేకప్‌ చెప్పగానే నాకు విషయం చెప్పడంతో, వెళ్లి పెళ్లి చేసుకున్నాం. ఆయన ఇప్పటివరకూ దాదాపు 27 సినిమాలు డైరెక్ట్‌ చేశారు. ప్రస్తుతం నటిస్తున్నారు.
శంకరాభరణం’ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ‘తులసి’ అని చెప్పేవారట నిజమేనా?
తులసి: ఆ సమయంలో చరణ్‌ పుట్టాడు. ‘శంకరాభరణం’లో తెరపై నేను పాడుతుంటే, నన్నే ఆయన కొడుకు అనుకునేవారు.
ఒక పాత్ర కోసం మీ దగ్గరకు ఓ డైరెక్టర్‌ వచ్చి రూ.10వేలు ఇస్తే, మూడు రోజుల వరకూ ఆ డబ్బులను కనీసం ముట్టుకోకుండా నిర్మాతను పిలిచి తీసుకెళ్లిపోమన్నారట!
తులసి: హిందీలో ‘ఇన్సాఫ్‌ కా తరాజు’ సినిమా కోసం నన్ను సంప్రదించారు. ఆరోజుల్లో అది పెద్ద సెన్సేషన్‌. పద్మినీ కొల్హాపురి గారు చేశారు. ఆ పాత్ర నన్ను చేయమన్నారు. ఆ సమయంలో డబ్బు అవసరం ఉన్నా, ఒళ్లంతా చూపించేందుకు నాకు ఇష్టం లేదు. అందరి ముందు అలా నిలబడి చేయడం అవసరమా? అనిపించింది. ఇంట్లో వాళ్లు కూడా బలవంతం చేయలేదు. ‘ఆలోచించి నిర్ణయం తీసుకో. మనకు డబ్బు అవసరం ఉంది’ అని మా పెద్దనాన్న చెప్పారు. ‘నేను చేయను’ అని చెప్పాను. ‘మనం అప్పుడప్పుడూ గంజి తాగి బతుకుతున్నాం కదా. ఆ గంజే మరో రెండు రోజులు తాగుతానేమో. ఇలా శరీరం చూపించే పాత్రను చేయలేను’ అని అన్నాను. ఆ పాత్రను చేయకపోవడమే నాకు మంచిదయింది.

tulasialithosaradaga650-2.jpg

మీది స్థితిమంతుల కుటుంబమే కదా! మరి గంజితాగే పరిస్థితి ఎందుకు వచ్చింది?
తులసి: మా అమ్మ చాలా అమాయకురాలు. పనివాళ్లను పెట్టుకుని కుటుంబాన్ని నడపటం సాధ్యమయ్యే పనికాదు. చాలా డబ్బు ఖర్చయిపోయింది. బయటవాళ్లకు దానధర్మాలు చేసేవారు. మరోవైపు మా అత్తగారి కుటుంబం కూడా చాలా చిన్నది. వాళ్లకు రెండు ఆవులు ఉండేవి. ఆవిడ ఇంకొకరి ఇంట్లో పనిచేసేవారు. ఆ కుటుంబం నుంచి శివమణి వచ్చారు. ఆయన నచ్చారు. పెళ్లి చేసుకున్నా. ఆయన్నే ఎందుకు చేసుకున్నానంటే.. షూటింగ్‌ సమయంలో ఆయన సిగరెట్‌ తాగుతుంటే నాకు దగ్గు వచ్చింది. వెంటనే ఆయన సిగరెట్‌.. లైటర్‌ కూడా పడేశారు. ఒక మనిషికున్న సిగరెట్‌ అలవాటును మానుకోవడం సాధారణమైన విషయం కాదు. ఆ తర్వాత మళ్లీ సిగరెట్‌ ముట్టుకోలేదు. అలా నచ్చేశారు.
మీ తాతగారిని అడగకుండా ఇందిరాగాంధీ అడుగు కూడా వేసేవారు కాదని అప్పట్లో అనుకునేవారు నిజమేనా?
తులసి: ఇందిరాగాంధీ గారికి మా తాతగారు ఆధ్యాత్మిక సలహాదారు. జాతకాలు చెప్పేవారు. 37ఏళ్ల పాటు దిల్లీలో ఉన్నారు. ఆమె బయటకు వెళ్లాలంటే తాతగారిని సలహా అడిగేవారు. అయితే, ఆమె చనిపోయే రెండేళ్ల ముందు తాత చెన్నై వచ్చేశారు.
తులసి హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి మీ తలపొగరు కారణమని అప్పట్లో అనేవారు? మీరు దీన్ని ఒప్పుకొంటారా?
తులసి: నేను హీరోయిన్‌ కావాలని అనుకోలేదు. ఒక స్థాయి వరకూ మాత్రమే హీరోయిన్‌ను కావాలని అనుకున్నా. ఆ స్థాయి దాటితే కష్టాలు మొదలవుతాయి. తల పొగరు నాకు లేదు. ప్రతి మనిషికీ వాంట్(want), నీడ్‌(need) అనేవి రెండు ఉంటాయి. నేను నీడ్‌ని కాస్త తక్కువగా కోరుకున్నా. డబ్బులు కావాలనుకుంటే ఆ పదివేలు తీసుకుని ఒళ్లు చూపించేదాన్ని కదా! పాత్రల ఎంపిక విషయంలో చాలా స్పష్టతతో ఉన్నా.
మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని ప్రపోజల్స్‌ ఏవీ రాలేదా?
తులసి: చాలా వచ్చాయి. వాటిల్లో నాలుగైదు పెద్ద సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లంతా సింగర్లు, యాక్టర్లు.

tulasialithosaradaga650-8.jpg
ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసి, మళ్లీ ఆ హీరో పక్కనే హీరోయిన్‌గా చేసే అవకాశం శ్రీదేవి, తులసిలకు మాత్రమే దక్కిందనుకుంటా!
తులసి: అవును! చంద్రమోహన్‌గారి పక్కన అలా నటించా.
‘చందమామ’లో ఆహుతి ప్రసాద్‌ క్యారెక్టర్‌లో మిమ్మల్ని అనుకున్నారట!
తులసి: తొలుత అమ్మ పాత్రను గయ్యాళిగా అనుకున్నారు. అందుకు నేనైతే బాగుంటుందని వంశీగారు భావించారు. కానీ, నాకు కుదరలేదు. దాంతో ఆ పాత్రను మార్చేసి, ఆహుతి ప్రసాద్‌గారికి ఆ క్యారెక్టర్‌ ఆపాదించారు. అసలు ఆ సినిమాలో అమ్మ పాత్రనే తీసేశారు. ‘నక్షత్రం’, ‘శశిరేఖా పరిణయం’ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి.
ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం!
తులసి: కొరటాల శివ. రాజమౌళిగారితో పనిచేయలేదు కానీ, ఆయన సినిమాల్లో నటించాలని ఉంది. పూరి గారి సినిమాల్లోని పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఒకసారి మా అబ్బాయికి ఏదో అవసరం గురించి ఫోన్‌ చేస్తే..వెంటనే చేస్తానని చెప్పారు.
బాపు-రమణలు చాలా తక్కువ మాట్లాడతారు! అదే సెట్‌లో తులసి ఉంటే బాగా మాట్లాడేవారట!
తులసి: నాతో చాలా సరదాగా మాట్లాడేవారు. వాళ్ల పక్కనే నాకూ కుర్చీ వేసేవారు. బాపుగారి ఫైల్స్‌ను నేను పట్టుకుని సెట్‌లో తిరుగుతూ ఉండేదాన్ని.
ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు!
తులసి: మలయాళంలో మోహన్‌లాల్‌ గారితో చేస్తున్నా. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్నా. ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి పాత్రను నన్ను దృష్టిలో పెట్టుకునే రాశారు. ఎందుకంటే తమిళంలో తల్లి పాత్రలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. కానీ, వాళ్ల బడ్జెట్‌ దృష్ట్యా నేను చేయకపోవడం వల్ల వేరే వాళ్లను తీసుకున్నారు. ఎప్పుడు కలిసినా ఈ విషయాన్ని నాకు చెబుతూనే ఉంటారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేను.

women icon@teamvasundhara
how-these-celebrities-beat-lockdown-blues?

మళ్లీ మంచిరోజులొస్తాయి.. అప్పటిదాకా ఇలా బిజీగా ఉందాం..!

సాధారణంగా వృత్తిఉద్యోగాలు చేసే వారికి వారానికి కనీసం ఒకట్రెండు రోజులైనా సెలవులుంటాయి. అదే సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఆ సమయం కూడా దొరకదు. సినిమా వాళ్లు నెలల తరబడి షూటింగ్స్‌కి, క్రీడాకారులు ప్రాక్టీస్‌కు సమయం వెచ్చించాల్సిందే! అలాంటి వారికి అరుదుగా, అనుకోకుండా లాక్‌డౌన్ పేరుతో బోలెడంత ఖాళీ సమయం దొరికే సరికి తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఇంకా టోర్నమెంట్లు, షూటింగులు మొదలు కాకపోవడంతో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తమ అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. భారత యువ షూటర్‌ మనూ భాకర్‌ కూడా ఈ ఖాళీ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు నచ్చిన పనులు చేస్తున్నానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన సినీ తారలు, క్రీడాకారిణులు ఏం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-jaya-bhattacharya-food-packets-and-essentials-to-needy-amid-lockdown

కరోనా అంతమైనా నా సేవను మాత్రం ఆపను!

అప్పటిదాకా హాయిగా ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయి కొందరు బాధపడుతుంటే.. తినడానికి తిండి కూడా కరవై ఆకలితో అలమటిస్తోన్న వారు ఎందరో! ఇక ఇలాంటి కష్ట కాలంలో మూగ జీవాల వెతలు ఎవరికీ పట్టవు. కానీ ఈ గడ్డు కాలంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు.. అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటున్నారు బాలీవుడ్‌ నటీమణి జయా భట్టాచార్య. బుల్లితెరపై పలు సీరియళ్లలో, వెండితెరపై కీలక పాత్రల్లో నటించి మెప్పించిన జయ.. ఈ లాక్‌డౌన్‌లో నలుగురికి సహాయపడుతూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. అంతేకాదు.. తన సేవలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా తన సేవల్ని ఇలాగే కొనసాగిస్తానంటోన్న ఈ నటీమణి గురించి, ఆమె చేస్తోన్న సేవల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
payal-ghosh-and-parno-mittra-opens-about-fighting-depression

సమస్య పంచుకోండి.. భారం దించుకోండి!

ఒత్తిడి, ఆందోళన... ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగా కుంగదీస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుంటాయీ మానసిక రుగ్మతలు. వీటిని భరించలేక ఒకనొక సమయంలో చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా ఈ సమస్యతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తాము కూడా డిప్రెషన్‌ బాధితులమేనంటూ పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తమకెదురైన గడ్డు పరిస్థితుల గురించి ధైర్యంగా చెప్పడమే కాకుండా.. వాటినెలా అధిగమించారో వివరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘ప్రయాణం’ ఫేం పాయల్‌ ఘోష్‌, బెంగాలీ నటి పార్నో మిత్రా కూడా తమ డిప్రెషన్‌ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
kushboo-and-shamita-shetty-opens-about-fighting-depression

డిప్రెషన్‌ మమ్మల్ని కూడా కుంగదీసింది... కానీ కసితో పోరాడాం!

మానసిక ఆందోళన... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, పలు ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి.. వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తడానికి దోహదం చేస్తున్నాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ ఆరోగ్య సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే ఒకానొక సమయంలో వీటిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. అందుకు తాజా నిదర్శనమే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం. బాలీవుడ్‌తో పాటు సినిమా పరిశ్రమను కుదిపేసిన అతడి మరణం అందరికీ షాక్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో మానసిక ఒత్తిడి కారణంగా గతంలో తమ మదిలోనూ ఇలాంటి ఆలోచనలు మెదిలాయంటున్నారు ప్రముఖ తారలు ఖుష్బూ, షమితా శెట్టి. ఈ సందర్భంగా వీరిద్దరూ సోషల్‌ మీడియా వేదికగా డిప్రెషన్‌కు సంబంధించిన తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
actors-who-died-mysteriously-at-young-age

ఎంత కష్టం వచ్చిందో.. అర్థాంతరంగా తనువు చాలించేశారు..!

అందం, డబ్బు, స్టార్‌ స్టేటస్‌...ఇవన్నీ మనిషి బతకడానికి సరిపోవంటూ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌(34) అకాల మరణం మరోసారి రుజువు చేసింది. వెండితెరపై ‘ధోనీ’గా మెప్పించిన ఈ యంగ్‌ హీరో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తద్వారా తన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు..అందరినీ శోకసంద్రంలో ముంచి స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆకట్టుకునే అందం, డబ్బు, అభిమానులు, గొప్ప పేరు...ఇలా అన్నీ ఉన్న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో సెలబ్రిటీల జీవితం పూలపాన్పేమీ కాదని మరోసారి నిరూపితమైంది. అయితే గతంలో సుశాంత్‌ మాదిరిగానే కొందరు తారలు అర్థాంతరంగా తనువు చాలించారు. అయినవాళ్లకు శోకాన్ని మిగిల్చారు. అలా చిన్న వయసులోనే మరణించిన కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
manjula-opens-about-her-depression-and-shares-about-her-shattered-dreams

ఆ రెండూ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి!

‘షో’.. సినిమాతో ఇటు నటిగా, అటు నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైంది మంజుల. తన నట ప్రతిభతో జాతీయ అవార్డుతో పాటు పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. ఈక్రమంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కూతురిగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సత్తా చాటిన ఆమె తాజాగా తన పేరు మీద ఓ వెబ్‌సైట్‌ను, యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఈమేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో మొదటి వీడియో పోస్ట్‌ చేసిన ఆమె.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-became-pregnant-before-marriage

పెళ్లికి ముందే ఆ శుభవార్త చెప్పేశారు!

రెండు హృదయాలను కలిపే అందమైన బంధం ప్రేమ. పెళ్లితో అది నిండు నూరేళ్ల అనుబంధమవుతుంది. అలాంటి అనుబంధం సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే ఇద్దరు ముగ్గురైనప్పుడే! అయితే పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. అయితే రాన్రానూ పాశ్చాత్య పోకడలు మన దేశం వారిపైనా ప్రభావం చూపడం, ఇతర దేశాలకు చెందిన సినీ తారలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడంతో.. పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. ఇందుకు తాజా ఉదాహరణ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రియురాలు, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌. ఈ ఏడాది తొలి రోజే ఉంగరాలు మార్చుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈ ముద్దుల జంట.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నటాషానే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. ఆపై వివాహబంధంతో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tahira-kashyap-pens-about-her-cancer-scars

ఆ మచ్చల్ని దాచద్దు.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి!

క్యాన్సర్‌... మందు లేని ఈ మహమ్మారి గురించి ఎంతోమంది భయపడుతుంటారు. అయితే ఈ భయాన్ని పటాపంచలు చేస్తూ చాలామంది సెలబ్రిటీలు ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో విజయం సాధించి తమ లాంటి క్యాన్సర్‌ బాధితులకు ఆదర్శంగా నిలిచారు. అందులో ఒకరు బాలీవుడ్‌ క్రియేటివ్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌ తహీరా కశ్యప్‌. రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడినా ఆమె మానసిక స్థైర్యంతో ఆ మహమ్మారిని అధిగమించింది. చికిత్స సమయంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ఫొటోలు, అనుభవాలను షేర్‌ చేసుకున్న ఈ ట్యాలెంటెడ్‌ రైటర్‌ ఆ తర్వాత కూడా తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం లాంటివి చేస్తోంది. ఈక్రమంలో ‘నేషనల్‌ క్యాన్సర్‌ సర్వైవర్స్‌ డే’ను పురస్కరించుకుని మరొక స్ఫూర్తిదాయక పోస్టుతో మన ముందుకొచ్చిందీ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sonakshi-sinha-twitter-chat-with-fans

అతడు ఆరడుగులుండాలి.. నన్ను నవ్వించాలి!

కరోనా అందరి జీవితాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర్నుంచి బిజీ లైఫ్‌స్టైల్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఇంట్లో వాళ్లతో గడపడం దాకా.. అందరూ సరికొత్త అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు విభిన్న అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా తమ లాక్‌డౌన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడంలో అందరికంటే ముందుంటున్నారు మన ముద్దుగుమ్మలు. సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అందాల తారలు.. పోస్టులు, ఫొటోలు, వీడియోలు, ఛాటింగ్స్‌ రూపంలో తమ అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ అందాల భామ సోనాక్షీ సిన్హా ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #SonaSays అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ ఛాటింగ్‌లో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఫ్యాన్స్‌ ముందుంచింది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-akkineni-samantha-chitchat-with-fans-in-twitter

ఇప్పటికే మూడు పచ్చళ్ల బాటిళ్లను అవగొట్టేశాను!

ఓవైపు సినిమాలతో మాయ చేస్తూ...మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. పెళ్లయ్యాక నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల తార లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. భర్త నాగచైతన్యతో కలిసి కసరత్తులు, వంటలు చేస్తోంది. అనంతరం ఆ విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది. ఈక్రమంలో తాజాగా ట్విట్టర్‌ అభిమానులతో ముచ్చటించింది సామ్‌. సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి సామ్‌, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
crime-patrol-actress-preksha-mehta-committed-suicide-left-a-chilling-suicide-note

కలలు చెదిరాక ఇక బతకలేనంటూ..!

కరోనా.. ఎందరో ఆశలు, ఆశయాలు, కన్న కలలకు గండి కొట్టింది. ప్రతి ఒక్కరినీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోన్న ఈ మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారు కొందరైతే, ఉపాధి అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తోన్న వారు మరికొందరు. మనలాంటి సామాన్యులే కాదు.. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే కొందరు సినీ తారలు, బుల్లితెర నటీనటులు సైతం గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈక్రమంలో బాలీవుడ్‌ బుల్లితెర నటి ప్రేక్షా మెహతా తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది.

Know More

women icon@teamvasundhara
dia-mirza-diana-penty-aditi-rao-hydari-takes-a-stand-against-period-shaming-undertakes-the-red-dot-challenge

‘ఎర్ర చుక్క’ పెట్టి మరీ దాని గురించి మాట్లాడదాం !

నెలసరి.. మనలో నెలనెలా జరిగే ఈ సహజ ప్రక్రియ దేవుడు మనకు ప్రసాదించిన వరం లాంటిది. కానీ ఇప్పటికీ దీన్నో శాపంలా భావించే వారు మన చుట్టూనే ఎందరో ఉన్నారు. తాము నెలసరిలో ఉన్నామని బయటికి చెప్పకుండా గుసగుసలాడడం, సైగలు చేయడం వంటివి చేస్తుంటారు చాలామంది అమ్మాయిలు. అంతేకాదు.. శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనడానికి కూడా సిగ్గుపడుతుంటారు కొందరు.. ఇక మరికొందరైతే పిరియడ్స్‌ వచ్చిన వారిని వంటింట్లోకి రానివ్వకపోవడం, ఇంట్లో ఏ వస్తువులను తాకనివ్వకుండా.. వారిని అంటరాని వాళ్లలా చూస్తుంటారు. ఇక ఈ సమయంలో ప్రమాదమని తెలిసినా శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనే స్థోమత లేక గుడ్డ వంటివి వాడే వారూ ఉన్నారు. ఫలితంగా వ్యక్తిగత పరిశుభ్రత లోపించి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా పిరియడ్స్‌ విషయంలో చాలామందిలో ఉన్న ఇలాంటి మూఢనమ్మకాలను పారదోలి, నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఏటా మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. మహిళలు-అమ్మాయిల్లో నెలసరి అపోహల్ని తొలగించడానికి, పిరియడ్స్‌ విషయంలో అందరిలో అవగాహన పెంచడానికి యూనిసెఫ్‌ ఇండియా ఈ ఏడాది ఓ సరికొత్త ఛాలెంజ్‌తో మన ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఈ కార్యక్రమంలో భాగం చేసి మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది. మరి, మరి ఇంతకీ ఆ ఛాలెంజ్‌ ఏమిటో, అందులో పాల్గొన్న కొందరు ముద్దుగుమ్మలు నెలసరి గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
konidela-upasana-innovative-dress-gone-viral

భవిష్యత్తు ఇలాంటి ఫ్యాషన్లదే!

మెగా కోడలిగా, రామ్‌ చరణ్‌ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఉపాసన కొణిదెల. అపోలో ఆస్పత్రిలోని హెల్త్‌కేర్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. నలుగురికి ఉపయోగపడే ఏ విషయమైనా అందరితో షేర్‌ చేసుకునే ఉపాసన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, కుకింగ్‌కు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే ఆమె తాజాగా మరో వినూత్న ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఫ్యాబ్రిక్‌, లేటెక్స్‌ వ్యర్థాలతో రూపొందించిన దుస్తులు ధరించి సోషల్‌ మీడియాలో ఫొటోను పోస్ట్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
here-are-the-celebrities-who-are-attending-online-courses-during-lockdown
women icon@teamvasundhara
celebrities-no-make-up-photos-during-lockdown

మేకప్‌ లేకుండానే..!

సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా నిన్నటి వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ 4.0లో మరికొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక షూటింగ్‌ లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే సినీ తారలు కూడా చాలా రోజులు ఇళ్లకే పరిమితమయ్యారు. వీళ్లు కూడా స్వయంగానే ఇంటి పనులు చేసుకుంటున్నారు. ఇక ఎప్పుడూ మేకప్‌తో ఉండే ముద్దుగుమ్మలు కూడా ఇంట్లోనే ఉండడంతో ఎలాంటి మేకప్‌ లేకుండా ఉంటున్నారు. అయితే చాలామంది సినీతారలు మేకప్‌ లేకుండా బయట ప్రపంచానికి పెద్దగా కనిపించరు. కానీ కొంతమంది హీరోయిన్లు ఎలాంటి మేకప్‌ లేకుండా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. తమ అందం సహజమైందని నిరూపిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
tollywood-actress-pragya-jaiswal-chit-chat-with-fans-in-twitter

లాక్‌డౌన్‌లో నేను చేసిన ‘బెస్ట్‌’ పని అదే..!

నటించినవి కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అందాల తార ప్రగ్యా జైస్వాల్. 'కంచె', 'ఓం నమో వేంకటేశాయ', 'నక్షత్రం'.. వంటి చిత్రాలతో ఎవర్‌గ్రీన్ పాపులారిటీని సంపాదించుకుంది. ఉత్తరాదిలోనే పుట్టిపెరిగినా దక్షిణాది తారగా, అందులోనూ తెలుగమ్మాయేనేమో అన్నంత సహజంగా తన పాత్రల్లో ఒదిగిపోయి చక్కటి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా.. తన ట్రెండీ ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని సోషల్‌మీడియాలో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందీ లవ్లీ గర్ల్‌. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా #AskPragya అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిమానులతో ముచ్చటించింది ప్రగ్య. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
sen-cherishing-interview-with-her-daughters
women icon@teamvasundhara
interesting-instagram-posts-of-actress-sai-pallavi

ఆ క్షణం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది..!

‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల..’ ‘ఫిదా’ సినిమాలోని ఈ డైలాగ్తో కుర్రకారు మనసుల్ని దోచేసింది అందాల తార సాయిపల్లవి. మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రంలో ‘మలర్’ పాత్రలో నటించి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపుకి తిప్పుకుంది. అనతి కాలంలోనే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ బ్యూటీ. పాత్ర ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ.. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తోందీ మలయాళీ ముద్దుగుమ్మ. ఐదేళ్ల సినీ కెరీర్లో పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ రౌడీ బేబీ.. మే 9 సాయిపల్లవి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఈ క్యూట్‌ బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, వాటికి తానిచ్చిన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
interesting-instagram-posts-of-actress-rai-laxmi

మిమ్మల్ని ఇష్టపడే వాళ్లనే.. మీరూ ఇష్టపడండి!

తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది అందాల తార రాయ్‌ లక్ష్మీ. ‘కాంచనమాల కేబుల్‌ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బాలీవుడ్‌లోనూ నటించిన ఈ బ్యూటీ.. సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫొటోలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. మే 5న లక్ష్మీ రాయ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తను పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు, వాటికి ఇచ్చిన ఆసక్తికరమైన క్యాప్షన్‌లపై ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
interesting-instagram-posts-of-actress-trisha

ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు..!

ఈ తరం నటీమణుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి త్రిష. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. 1999లో వచ్చిన ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. కేవలం నాలుగేళ్లలో ఏడు తమిళ చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ చైన్నై చిన్నది.. రెండో చిత్రం ‘వర్షం’తో ఒక్కసారిగా టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇక అప్పటి నుంచి త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి భారతీయ సినీ పరిశ్రమలో మేటి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది త్రిష.

Know More

women icon@teamvasundhara
here-is-the-list-of-bollywood-beauties-who-are-working-from-home

మేమూ ఇంటి నుంచి పనిచేస్తున్నాం!

కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ వల్ల తమ వృత్తిగత జీవితానికి బ్రేక్‌ పడకూడదన్న ఉద్దేశంతో చాలామంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు కూడా ఈ కొత్త పని సంస్కృతికి శ్రీకారం చుట్టాయి. అయితే మనమే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ముద్దుగుమ్మలు కూడా ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి నుంచే తమ వృత్తిగత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చక్కటి పని వాతావరణాన్ని ఏర్పరచుకొని మనందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పాఠాలు నేర్పుతున్నారు. మరి ఇంతకీ వాళ్లెవరు? వాళ్లు చేస్తోన్న పనులేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
lock-down-rashmika-mandana-insta-chit-chat-with-fans

అలా అయితే జీవితాంతం క్వారంటైన్‌లో ఉండేదాన్నేమో!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే టాలీవుడ్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యేలా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అశేష అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవలే ‘భీష్మ’ సినిమాలో నితిన్‌ సరసన ‘వాట్‌ ఏ బ్యూటీ’ అనిపించుకున్న ఈ కన్నడ బేబ్‌.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఎంతో క్యూట్‌గా, సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ చూద్దామా!

Know More

women icon@teamvasundhara
corona-virus-kanika-kapoor-tops-list-of-celebrities-searched-for-during-lock-down

లాక్‌డౌన్‌ సమయంలో ఈమె గురించే తెగ వెతికారట!

కనికా కపూర్‌...కరోనా వైరస్‌ మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న సెలబ్రిటీ పేరు. అప్పటివరకు కేవలం బాలీవుడ్‌ సింగర్‌గా మాత్రమే పేరున్న ఆమె కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతూ వచ్చింది. లండన్‌ నుంచి వచ్చిన ఆమె పలు వేడుకల్లో పాల్గొనడం, వాటికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకావడం, ఆ తర్వాత ఆమె కరోనా బారిన పడడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోయింది. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కనిక ఆరోగ్య పరిస్థితి ఒక్కో దశలో విషమించిందంటూ వార్తలొచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా కోలుకుందామె. అలా కరోనా కారణంగా అందరి నోళ్లలో నానిన కనిక తాజాగా ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ నెల రోజుల లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఇండియన్‌ సెలబ్రిటీ’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందీ బ్యూటిఫుల్‌ సింగర్‌. ప్రముఖ సెర్చింజన్‌ సంస్థ ‘యాహూ ఇండియా’ ప్రకటించిన ఈ లిస్టులో ఆమె ప్రియాంక చోప్రా, రజనీకాంత్‌ లాంటి సూపర్‌ స్టార్లను వెనక్కి నెట్టి మరీ టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
lock-down-pillow-challenge-see-these-viral-celebrity-photos

దిండ్లలో ఒదిగిపోతున్న అందాల భామలు!

లాక్‌డౌన్‌ కారణంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమవడంతో ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలో ఎవరికీ పాలుపోవట్లేదు. దీంతో కాలక్షేపం కోసం ఒక్కొక్కరూ ఒక్కో దారిని వెతుక్కుంటున్నారు. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మునుపెన్నడూ లేని విధంగా ఇంత ఖాళీ సమయం దొరకడంతో ఎంచక్కా ఇంటిపట్టునే ఉంటూ రకరకాల ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. లాక్‌డౌన్‌ మొదలైన దగ్గర్నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన బోలెడన్ని ఛాలెంజ్‌లను మనం చూసే ఉంటాం. ఇదే విధంగా - ‘పిల్లో ఛాలెంజ్‌’ పేరుతో మరో కొత్త ఛాలెంజ్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటీ ఛాలెంజ్‌? దీన్ని ఎవరెవరు స్వీకరించారు? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
sobhita-dhulipala-takes-stunning-self-timed-photos-for-shoot-amid-lock-down

నా కొత్త ఫ్రెండ్‌ సహకారంతో ఈ ఫొటోలు తీసుకున్నా!

సాధారణంగా మ్యాగజైన్‌ ఫొటోషూట్‌ అంటే ఎవరెవరుంటారు? అందమైన మోడల్స్‌, స్టైలిష్‌ ఫొటోగ్రాఫర్స్‌, ఫ్యాషన్‌ డిజైనర్స్‌, మేకప్‌ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌, లైట్‌బాయ్స్‌... ఇలా చాలామంది ఈ బృందంలో ఉంటారు. వీరందరూ ఎంతో కష్టపడితే కానీ అందమైన ఫొటోలు రావు. అయితే లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లతో పాటు ఫొటోషూట్స్‌కి కూడా కళ్లెం పడింది. ఈ అసాధారణ పరిస్థితుల్లోనూ ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం అందమైన ఫొటోషూట్‌ తీయించుకుంది శోభితా ధూళిపాళ్ల. మరి లాక్‌డౌన్‌ కాలంలో ఈ ఫొటోషూట్‌ తనకు ఎలా సాధ్యమైందనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Know More

women icon@teamvasundhara
anasuya-bharadwaj-chit-chat-with-fans-during-quarantine

పెళ్లి మన జీవితాన్ని ఇంకా బెటర్‌గా మార్చాలి!

అనసూయా భరద్వాజ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సినిమా స్టార్స్‌తో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించు కుందీ క్రేజీ యాంకర్‌. బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే.. వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ అందాల తార. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన అనసూయ.. అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటోంది. తాజాగా #askanasuya పేరుతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్‌ వేదికగా సమాధానాలు చెప్పిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌.. ఇంతకీ, ఆ ప్రశ్నలేంటి? దానికి అను చెప్పిన సమాధానాలేంటో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
masaba-gupta-shares-her-experience-on-her-father-viv-richards-genes

నా శరీరంతో ప్రేమలో పడేందుకు చాలా ఏళ్లు పట్టింది!

సాధారణంగా అందమంటే ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనం ఇస్తుంటారు. తెల్లగా ఉంటేనే అందమని కొందరంటే... సన్నజాజి తీగలా, చక్కని కొలతలతో కూడిన శరీర సౌష్టవముంటేనే అసలైన సౌందర్యమని మరికొందరంటారు. చాలామంది అమ్మాయిలు కూడా అందం విషయంలో ఇవే ప్రామాణికమనుకుంటారు. తమకు ఈ లక్షణాలు లేవని, లావుగా ఉన్నామని, ఛాయ తక్కువగా ఉందంటూ తమలో తామే కుంగిపోయే అమ్మాయిలూ లేకపోలేదు. అయితే ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి, తాము ఎలా ఉన్నా సరే.. తమను తాము అంగీకరించాలని ఎంతోమంది సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు. బాడీ షేమింగ్‌కు సంబంధించి తమ అనుభవాలను పంచుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా కూడా అదే విషయం చెప్పుకొచ్చింది. తన శరీర సౌష్టవం కారణంగా తాను బాల్యంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరిస్తూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది మసాబా.

Know More

women icon@teamvasundhara
shweta-basu-prasad-shared-her-mental-stress-during-lock-down

అమ్మను కనీసం కౌగిలించుకోలేకపోయా!

రోజంతా ఇంటికే పరిమితమవడం.. భవిష్యత్తు గురించి బెంగ.. రోజంతా ఖాళీగా కూర్చోవడం వల్ల మదిలో మెదిలే లేనిపోని ఆలోచనలు.. వెరసి ఈ లాక్‌డౌన్‌ సెలవులు ఎందుకొచ్చాయిరా బాబోయ్‌ అనేలా ఉంది చాలామంది పరిస్థితి. మరి, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం వల్ల సురక్షితంగా ఉంటామా అనే అనుమానాలతో మరింతగా రెట్టింపయ్యే భయం.. ఇలాంటి ఆలోచనలు, భయాలు, ఒత్తిళ్లతో మీరే కాదు.. మేమూ సతమతమవుతున్నామంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఈ లాక్‌డౌన్‌ వేళ తాము ఎదుర్కొంటోన్న మానసిక సమస్యల గురించి పంచుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు పాటించే చిట్కాలను వివరిస్తూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతున్నారీ తారలు. మరి, ప్రస్తుతం చాలామంది మానసిక పరిస్థితిని ప్రతిబింబిస్తోన్న వారి మాటలను, మనసులోని భావాలను మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
here-are-the-experiences-of-celebrities-who-got-cured-from-corona

కరోనా కోరల నుంచి అలా బయటపడ్డాం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. వీరిలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘మాకు కరోనా లక్షణాలున్నాయి’ అంటూ ప్రపంచానికి ధైర్యంగా ప్రకటించిన సెలబ్రిటీలలో ప్రముఖ హాలీవుడ్‌ జంట రీటా-విల్సన్‌, టామ్‌ హాంక్స్ కూడా ఉన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి ప్రారంభ దశలో ఉండగానే తమలో ఈ వైరస్‌ లక్షణాలున్నాయని గమనించిన వీళ్లు ఆలస్యం చేయకుండా చికిత్స కోసం వెంటనే ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ లో గడిపిన టామ్‌, రీటా జంట.. ఆ వ్యాధి నుంచి కోలుకొని మార్చి 29న తమ ఇంటికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వ్యాధికి సంబంధించి తన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ ద్వారా పంచుకుంది రీటా.

Know More

women icon@teamvasundhara
heroine-nidhi-agarwal-twitter-chat-with-her-fans

నేను ప్రశాంతంగా ఉండడానికి కారణమదే!

‘మున్నా మైఖేల్’ అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. అనంతరం నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది. ఇక రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోందీ భామ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ వేళ లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతోంది నిధి. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం అభిమానులతో టచ్లోనే ఉంటోన్న ఈ బ్యూటీ.. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ క్రమంలో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలు.. వాటికి నిధి ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు మీకోసం...

Know More

women icon@teamvasundhara
hina-khan-teaches-how-to-prepare-re-usable-face-mask-at-home

హీనాను ఫాలో అయిపోదాం.. ఇంట్లోనే మాస్క్‌ తయారుచేద్దాం..!

కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధి కావడం వల్ల బయటకు వెళ్లిన ప్రతిసారీ ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరిగా మారింది. ఇలా అందరికీ మాస్క్‌లు అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాటికి కొరత ఏర్పడింది. దీని వల్ల డాక్టర్లకు, నర్సులకు, చికిత్స పొందుతున్న వారికి మాస్క్‌లు సరిపడక ఇబ్బంది పడుతున్నారు. దీనిని పరిష్కరించడానికి సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మాస్క్‌లను సొంతంగా ఇంటిలో తయారుచేసుకోమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంట్లోనే మాస్కుల్ని ఎలా తయారుచేసుకోవాలో తెలియజేసే వీడియోల్ని సైతం పోస్ట్‌ చేస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. తాజాగా బుల్లితెర స్టార్‌ హీనా ఖాన్‌ కూడా అదే పనిచేసింది. ఇంట్లో తానే స్వయంగా మాస్క్‌ను తయారుచేసిన వీడియోను తన అభిమానులతో పంచుకుంది. మరి, హీనా మాస్క్‌ తయారీ గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

Know More