ఫ్యాషన్ షోలు, అవార్డ్స్ సెలబ్రేషన్స్.. అంటూ వరస కార్యక్రమాలతో బాలీవుడ్ తారా లోకం బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇటీవలే లాక్మే ర్యాంప్‌పై హొయలొలికించిన అందాల భామలు.. ఫిలింఫేర్ అవార్డ్స్‌లో తమదైన స్టైల్స్‌తో రెడ్ కార్పెట్‌ని హీటెక్కించారు. తాజాగా ‘నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్-2020’ ప్రదానోత్సవంలో తమ డిఫరెంట్ అటైర్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మతులు పోగొట్టారు. నైకా ఆధ్వర్యంలో ఫెమినా నిర్వహించిన ఈ అవార్డ్స్ ప్రదానోత్సవం సందర్భంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో అభిమానులకు కనువిందు చేశారు. అటు అవార్డులతో మురిసిపోతూ.. ఇటు తమ ఫ్యాషనబుల్ లుక్స్‌తో అదరగొట్టిన బాలీవుడ్ అందాల తారలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
* యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఛపాక్’లో మాలతిగా అలరించిన దీపిక ‘పవర్ఫుల్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. యనీనా కోచర్ నుండి ఎంచుకున్న క్లీవేజ్ నెక్లైన్ బ్లాక్ గౌన్‌లో స్టైల్ గాడెస్‌లా మెరిసింది రాణీ పద్మావతి. తను జత చేసిన డైమండ్ జ్యుయలరీ తన లుక్‌కి హైలైట్‌గా నిలిచింది.
* ‘జీరో’ మూవీ తర్వాత సినిమాలకు విరామం ప్రకటించి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోన్న అనుష్క.. ఈ అవార్డ్స్ సెలబ్రేషన్స్‌లో ‘బ్యూటీ ఐకాన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైంది. డిజైనర్ స్వప్నిల్ షిండే రూపొందించిన మెటాలిక్ ప్లంజింగ్ నెక్లైన్ థై-హై స్లిట్ గౌన్‌లో సెక్సీ బేబ్లా హొయలొలికించింది అనుష్క.
* ఇటీవలే ‘KAY’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన కత్రినా.. ‘బ్యూటీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్’గా ఎన్నికైంది. అవార్డు అందుకోవడానికి అలెక్స్ పెర్రీ ఫ్యాషన్ స్టోర్ నుండి ఎంచుకున్న వైట్ కలర్ డ్రేప్డ్ థై-హై స్లిట్ గౌన్‌లో ముస్తాబైంది క్యాట్. లూజ్ హెయిర్, షైనీ మేకప్‌తో తన లుక్‌ని ముగించింది.
* కేవలం రెండంటే రెండే సినిమాలతో స్టార్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోనంతగా ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది అనన్యా పాండే. ఫిలింఫేర్లో ‘ఉత్తమ నూతన నటి’గా ఎంపికైన ఈ అందాల తార.. నైకా ఫెమినా అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఎగ్జైటింగ్ ఫ్రెష్ ఫేస్’గా అవార్డును అందుకుంది. ప్రముఖ ఫ్యాషనర్ అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన లావెండర్ కలర్ మెటాలిక్ షార్ట్ గౌన్‌లో క్యూట్ బేబీలా ఉంది అనన్య. సింపుల్ స్టడ్స్, పింక్ బ్లష్ మేకప్, పోనీ హెయిర్ తన లుక్‌ని మరింత అందంగా తీర్చిదిద్దాయని చెప్పచ్చు.
* సౌత్ ఇండియా బ్యూటీ శృతి హాసన్ రెడ్ కార్పెట్‌పై తన లుక్‌తో అదరగొట్టింది. డిజైనర్ స్వప్నిల్ షిండే డిజైన్ చేసిన పెర్ల్ ఎంబ్రాయిడరీ షార్ట్ డ్రస్‌ని ధరించింది. పఫ్ స్లీవ్స్ తన అటైర్కి ప్రధాన ఆకర్షణ అని చెప్పచ్చు. వెట్ హెయిర్, మ్యాచింగ్ హీల్స్, థిక్ లిప్స్‌తో తన లుక్‌ని పూర్తిచేసింది.
* అవార్డ్స్ ఫంక్షన్స్‌లో ఎప్పుడూ డిఫరెంట్ లుక్‌లో తళుక్కుమనే రియా చక్రవర్తి ఈసారి కూడా తనదైన స్టైల్లో హాజరై అందరినీ ఆకట్టుకుంది. పంకజ్, నిధి డిజైనర్ ద్వయం రూపొందించిన గోల్డెన్ మొజాయిక్ థై-హై స్లిట్ గౌన్‌లో గోల్డెన్ స్టార్లా మెరిసింది. అభరణాలేవీ ధరించకపోయినా... మెస్సీ పోనీ, చూడచక్కని మేకప్‌తో స్టైలిష్ లుక్‌ని సొంతం చేసుకుంది రియా.
*అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్లో.. దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ కార్యక్రమంలో ఏంజెల్లా మెరిసింది. ఎన్యతర్ స్టూడియో నుండి ఎంపిక చేసుకున్న వైట్ కలర్ షిమ్మరీ థై-హై స్లిట్ గౌన్ని ధరించిందీ అందాల భామ. ఫుల్ స్లీవ్స్, డ్రేప్డ్ హై-నెక్ స్టైల్ తన డ్రస్‌కి అదనపు హంగులద్దాయని చెప్పచ్చు. సింపుల్ ఇయర్రింగ్స్, పింక్ బ్లష్ మేకప్, మెస్సీ హెయిర్‌స్టైల్‌తో చూపరులను కట్టిపడేసిందీ దిల్లీ అందం.
* రెడ్ కార్పెట్‌పై రెడ్ లుక్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఆహనా కుమ్రా. రెడ్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్‌లో ఎర్ర గులాబీలా తళుక్కుమంది. తన డ్రస్‌కి పూర్తి అపోజిట్ వైట్ స్టోన్ నెక్లెస్, స్టడ్స్‌ని జత చేసింది. గోల్డెన్ హీల్స్, పోనీ, రెడ్ లిప్స్ తన లుక్‌కి సరిగ్గా నప్పాయని చెప్పచ్చు.
* అవార్డు ఫంక్షన్స్‌లో వెరైటీ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకునే అదా శర్మ.. ఫెమినా అవార్డ్స్‌లో కూడా డిఫరెంట్ స్టైల్లో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. వైట్ కలర్ సింగిల్ షోల్డర్ థై-హై స్లిట్ కటౌట్ గౌన్‌లో హాజరైన ఈ తార.. తన కళ్ల చుట్టూ, భుజంపై, చేతిపై గెలాక్సీ మేకప్‌తో అందరిలోకీ డిఫరెంట్‌గా ముస్తాబైంది. తన మేకప్‌కి తగ్గట్టుగా తన జుట్టు అంచులకు అదే కలరింగ్ ఇచ్చి సూపర్బ్ అనిపించుకుంది.
* ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నా.. బ్లాక్-వైట్ కాంబో ఎవర్గ్రీన్ అని చెప్పచ్చు. అటువంటి ఓ అందమైన లుక్‌లో అవార్డ్స్ ఫంక్షన్లో తళుక్కుమంది అదితీ రావ్ హైదరీ. వైట్ మెర్మైడ్ కట్ స్కర్ట్‌పై బ్లాక్ కలర్ ఫ్లోరల్ త్రెడ్ ఎంబ్రాయిడరీ తన డ్రస్ లుక్‌కి స్పెషల్ టచ్ ఇచ్చిందని చెప్పచ్చు. దానికి జతగా మ్యాచింగ్ జాకెట్‌ని జోడించింది. ఆర్నమెంట్స్ ధరించకుండా.. సింపుల్ మేకప్‌తో తన లుక్‌ని ముగించింది.