కొత్త ఏడాది అవార్డుల సంబరం మొదలైంది.. బాలీవుడ్ స్టార్స్ తమ నటప్రతిభకు గుర్తింపుగా ఓవైపు అవార్డుల్ని అందుకుంటూనే.. మరోవైపు తమ ఫ్యాషనబుల్ లుక్స్‌తో రెడ్‌కార్పెట్‌ను హీటెక్కించారు. ఏటా ముంబై లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘లయన్స్ గోల్డ్ అవార్డ్స్’ ఈ ఏడాది కూడా తారల సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. బాలీవుడ్ సినిమా, సీరియల్స్‌కి సంబంధించిన తారా లోకమంతా ఒక్కచోట చేరడంతో వారి తళుకుబెళుకులు చూడడానికి సినీ అభిమానులకు రెండు కళ్లూ చాలలేదంటే అది అతిశయోక్తి కాదు. ఎప్పటిలాగే ఈ అవార్డుల ప్రదానోత్సవానికి కూడా అందాల తారలు ఓ రేంజ్లో ముస్తాబై అదరగొట్టేశారు. ఈ క్రమంలో అటు అవార్డులు అందుకోవడంతో పాటు.. ఇటు రెడ్ కార్పెట్‌పై తమ లవ్లీ లుక్స్‌తో చూపరులను కట్టిపడేశారు. మరి, ఎవరెవరు ఏయే అవార్డు అందుకున్నారు? ఎలా ముస్తాబయ్యారు? రండి తెలుసుకుందాం..
* బుల్లితెరపై ఎంతో పాపులారిటీ పొందిన తారల్లో హీనా ఖాన్ ఒకరు. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’తో మంచి గుర్తింపు సంపాదించిన ఈ బుల్లితెర బ్యూటీ ప్రస్తుతం ‘కసౌటీ జిందగీ కే 2’ సీరియల్లో నటిస్తోంది. అందులో కొమోలికా అనే ప్రతినాయిక పాత్రలో నటిస్తోన్న హీనా.. ఆ పాత్రలో తన అద్భుతమైన నటనకు గాను ‘ఉత్తమ ప్రతినాయిక’గా లయన్స్ గోల్డ్ అవార్డు అందుకుంది. పిచిక ఫ్యాషన్ హౌజ్ నుండి ఎంచుకున్న వైట్ ఆర్గంజా శారీలో తళుక్కుమందీ బుల్లితెర క్వీన్. న్యూడ్ మేకప్, ఇయడ్ స్టడ్స్, మెస్సీ బన్‌తో తన లుక్‌ని పూర్తిచేసిన ఈ క్యూటీ ఎంతో ట్రెండీగా మెరిసిపోయింది.
* ప్రపంచంలోనే వృద్ధ షూటర్లుగా పేరుపొందిన చంద్రో తోమర్, ప్రకాషీ తోమర్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సాండ్ కీ ఆంఖ్’. ఈ సినిమాలో చంద్రో తోమర్ పాత్రలో నటించి మెప్పించింది బబ్లీ గర్ల్ భూమి పడ్నేకర్. తన నటనకు గుర్తింపుగా లయన్స్ గోల్డ్ అవార్డుల్లో భాగంగా ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకుంది భూమి. బ్లాక్ అండ్ వైట్ అటైర్లో బాసీ లుక్‌లో ముస్తాబై ఈ అవార్డు అందుకున్న ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిందీ చక్కనమ్మ.
* ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి గాను ‘ఉత్తమ సహాయ నటి’గా లయన్స్ గోల్డ్ అవార్డు అందుకుంది బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్. డిజైనర్ అక్బర్ రూపొందించిన బ్లాక్ కలర్ థై-హై స్లిట్ బాడీ కాన్ గౌన్‌లో హాట్ బ్యూటీలా మెరిసింది అమైరా.
* స్వీడన్ భామ ఎల్లీ అవ్రామ్ తన అందంతో ‘మోస్ట్ గ్లామరస్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకుంది. సిల్వర్ కలర్ రఫుల్ షార్ట్ డ్రస్‌లో రెడ్‌కార్పెట్‌పై మెరిసిన ఈ విదేశీ అందం.. తన ట్రెండీ లుక్‌తో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.
* యువతను ఆకట్టుకుంటోన్న టి-సిరీస్ ఆల్బమ్ ‘యాద్ పియా కీ ఆనే లగీ..’ మ్యూజిక్ వీడియోలో తన అభినయానికి గుర్తింపుగా ‘ బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అవార్డును అందుకుంది దివ్యా కోస్లా కుమార్. జామెట్రిక్ ప్రింటెడ్ షార్ట్ డ్రస్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. రెడ్ కార్పెట్‌పై లేడీ బాస్‌ను తలపించింది.
* ‘మణికర్ణిక’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన అంకితా లోఖండే ‘ఉత్తమ అరంగేట్ర నటి’ (బెస్ట్ డెబ్యుటెంట్) అవార్డు దక్కించుకుంది. మెరూన్ కలర్ పోల్కా డాట్స్ శారీ గౌన్ని ధరించిన ఈ ముద్దుగుమ్మ.. దానికి జతగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను ధరించి రెడ్ కార్పెట్‌పై రెడ్ రోజ్‌లా విరబూసింది.
* ‘కుంకుమ్ భాగ్య’గా తెలుగులో ప్రసారమవుతోన్న ‘కుండలీ భాగ్య’ హిందీ సీరియల్‌కు విదేశాల్లో సైతం అభిమానులున్నారు. ఆ సీరియల్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సీరియల్ స్టార్ శ్రద్ధా ఆర్య ‘ఉత్తమ టీవీ నటి’గా అవార్డు అందుకుంది. రెడ్ కార్పెట్‌పై బ్లాక్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిందీ భామ. సింగిల్ షోల్డర్ బాడీ కాన్ గౌన్‌లో వావ్ అనిపించేలా ఉందీ ఫ్యాషన్ స్టార్.
* బుల్లితెర భామల్లో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న నటీమణుల్లో జెన్నిఫర్ వింగెట్ ఒకరు. ‘టీవీ ఐకాన్ ఫీమేల్’గా లయన్స్ గోల్డ్ అవార్డు పొందిందీ ఐకానిక్ యాక్ట్రెస్.
* బాలీవుడ్ బ్యూటీ కృతీ కర్బందా కూడా ఈ అవార్డుల వేడుకలో తన ఫ్యాషన్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఫ్యాషనర్ పాయల్ సింఘాల్ డిజైన్ చేసిన బ్లాక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ లాంగ్ గౌన్ని ధరించిన ఈ అందాల తార.. దానికి నప్పేట్లుగా అదే డిజైన్ నెట్ దుపట్టాను జత చేసి రెడ్ కార్పెట్‌ను హీటెక్కించింది.
* బాలీవుడ్ యంగ్ స్టార్ అనన్యా పాండే రెడ్ కార్పెట్‌పై రెడ్ లుక్‌లో అదరగొట్టింది. క్రేషా బజాజ్ రూపొందించిన రెడ్ కలర్ బీడెడ్, సీక్విన్ ఎంబ్రాయిడరీ షార్ట్ అవుట్‌ఫిట్‌లో ‘హాట్ బ్యూటీ ఆఫ్ ది డే’ అనిపించుకుందీ స్టార్ కిడ్.