scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

ఇప్పుడాపేర్లు చెబితే వాళ్లింట్లో భూకంపమే!

Actress Anjali  in Alitho saradaga a celebrity chat show

ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..!’ అని ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సీత’గా సుస్థిర స్థానం సంపాదించుకుంది అంజలి. ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘సీత’ గానే గుర్తుండిపోతుందీ అచ్చమైన తెలుగందం. దీంతో పాటు ‘షాపింగ్‌ మాల్‌’, ‘జర్నీ’, ‘మసాలా’, ‘గీతాంజలి’, ‘బలుపు’, ‘శంకరా భరణం’, ‘డిక్టేటర్‌’, ‘చిత్రాంగద’ తదితర చిత్రాల్లో అభినయించి ఆకట్టుకుందీ అందాల తార. తమిళంలోనూ పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవడం విశేషం. ‘సిలకలూరి చింతామణి’ అంటూ తెలుగులో చివరగా ‘సరైనోడు’తో చిందులేసిన అంజలి ‘నిశ్శబ్దం’ సినిమాతో త్వరలోనే మరోసారి మన ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఆంధ్రా అందం.. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సరదాగా పంచుకుంది.

anjalialithosaradagaghg650-10.jpg

ఆలీ: హలో బాల త్రిపుర సుందరి ఎలా ఉన్నారు?

అంజలి: (నవ్వులు) ఈ పేరుతో నన్ను అస్సలు ఎవరూ పిలవరు. అది మా నాన్నమ్మగారి పేరు. దానికి అంజలి చేర్చి నాకు పేరు పెట్టారు. అయితే, నాన్నమ్మని పేరు పెట్టి పిలిచే ధైర్యం లేకపోవడంతో ఆమె ముద్దు పేరు బేబీ కావడంతో నన్ను కూడా చిన్నప్పటి నుంచి బేబీ అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇంట్లో అందరూ నన్ను అదే పేరుతో పిలుస్తారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. కానీ, మీరు తెలుగమ్మాయి అయి ఉండి, నేరుగా చెన్నై ఎందుకు వెళ్లారు?

అంజలి: ఇక్కడ నా పాఠశాల చదువు పూర్తయిన తర్వాత మా పిన్ని వాళ్లింట్లో చదువుకునేందుకు చెన్నై వెళ్లిపోయా. అక్కడే మోడలింగ్‌ స్టార్ట్‌ చేశా. అలా నాకు తొలి సినిమా అవకాశం వచ్చింది. నాకు మంచి పేరు వచ్చింది.

మీ సొంతూరు ఏది?

అంజలి: నేను నర్సాపూర్‌లో పుట్టా. రాజోల్‌లో పెరిగా. ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయా.

anjalialithosaradagaghg650-2.jpg

కాలేజ్‌లో ఉండగా, ఒక అబ్బాయి ప్రపోజ్‌ చేస్తే రాఖీ కట్టేశారట!

అంజలి: నా వెనకాల తిరుగుతున్నాడని, రాఖీ కట్టి వదిలేశా. (నవ్వులు)

తమిళ ఇండస్ట్రీలో నటిస్తుండగా హీరోలు, దర్శకులు ఎవరైనా ప్రపోజల్స్‌ చేశారా?

అంజలి: ప్రపోజల్స్‌ ఉంటాయి కదా! ఆ హీరోలందరికీ ఇప్పుడు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు పేరు చెబితే వాళ్లింట్లో భూకంపం వస్తుంది.

మోడలింగ్‌ చేస్తుండగా సినిమా అవకాశం ఎలా వచ్చింది?

అంజలి: నా మొదటి చిత్రం ‘కట్టర్దు తమిళ్‌’. ఈ సినిమా ఆఫీస్‌.. మా ఇల్లు ఒకే వీధిలో ఉండేవి. నేను రోజూ డ్యాన్స్‌ క్లాస్‌కు వెళ్లి వచ్చేదాన్ని. ఆ సమయంలో వాళ్లకు ఒక యంగ్‌ హీరోయిన్‌ కావాల్సి వచ్చింది. నేను రోజూ డ్యాన్స్‌ క్లాస్‌కు వెళ్లడం ఆ సినిమా దర్శకుడు చూస్తూ ఉండేవారట. ఒకరోజు వాళ్ల మేనేజర్‌ను పంపి, ‘ఆసక్తి ఉంటే ఆడిషన్‌కు రమ్మనండి’ అని చెప్పారట. నేను వెళ్లా. అప్పటికి నాకు తమిళ్‌ కూడా పెద్దగా రాదు. కెమెరా ముందు ఎలా నటించాలో కూడా తెలియదు. ‘మీ యాక్టింగ్‌ నాకు నచ్చింది. మిగిలిన విషయాలు నిర్మాతతో మాట్లాడుకోండి’ అని అన్నారు. అలా నాకు తొలి సినిమా అవకాశం వచ్చింది.

ఆ తర్వాత ఎన్ని తమిళ సినిమాలు చేశారు?

అంజలి: దీని తర్వాత ‘షాపింగ్‌ మాల్‌’ చేశా. ఆ తర్వాత ‘జర్నీ’ మంచి హిట్టయింది.

anjalialithosaradagaghg650-8.jpg

షాపింగ్‌మాల్‌’ చేస్తుండగా సీక్రెట్‌ కెమెరాలు పెట్టి షూట్‌ చేశారట!

అంజలి: ఒక షాప్‌లో పనిచేసే సేల్స్‌గర్ల్ - బాయ్‌ మధ్య జరిగే ప్రేమ కథ. దాని కోసం ఒక సెట్‌ వేశారు. అందులో 80రోజులు షూటింగ్‌ చేశాం. దానికి కొనసాగింపుగా రంగనాథ స్ట్రీట్‌లో షూట్‌ చేయాల్సి వచ్చింది. దీంతో దర్శకుడు నాకు కొన్ని వస్తువులు ఇచ్చి జనాల్లో కలిసిపోయి అమ్ముకుని రమ్మన్నారు. అప్పటికి నేను ఒక సినిమాలో మాత్రమే నటించి ఉండటంతో పెద్దగా ఎవరికీ తెలియలేదు. దాంతో నేను ఆ వస్తువులను అమ్మాను. సినిమా రియలిస్టిక్‌గా రావడానికి అలా చేశారు. దాదాపు వారం రోజులు పాటు ఇలాగే షూటింగ్‌ జరిగింది.

ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో నటించారు?

అంజలి: తమిళ్‌, తెలుగు కలిపి దాదాపు 46 సినిమాలు. తెలుగులో సుమారు 15. కన్నడలో రెండు, మలయాళంలో రెండు సినిమాల్లో నటించా.

మంచి గుర్తింపు ఎక్కడ వచ్చింది?

అంజలి: తమిళంలో వచ్చింది. ఎందుకంటే వాళ్లే నన్ను పరిచయం చేశారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ ‘సీత’ను ఎవరూ మర్చిపోలేరు.

anjalialithosaradagaghg650-14.jpg

సీత’లాగా మీరు ఏమైనా కష్టాలు పడ్డారా?

అంజలి: లేదు. కష్టాలనేవి జీవితాన్ని బట్టి ఉంటాయని అనుకుంటున్నా. అలా జరిగి ఉంటే, ‘సీతమ్మ వాకిట్లో..’ అవగానే నాకు కష్టాలు మొదలవ్వాలి.

మసాలా’ సమయంలో అంజలి కనిపించకుండా పోయింది. ఎక్కడకు వెళ్లిపోయింది? ఎవరి కోసం వెళ్లింది?

అంజలి: ఎవరి కోసమూ వెళ్లలేదు. నా కోసమే నేను వెళ్లా. నాకు బ్రేక్‌ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. చాలా ఎత్తుపల్లాలు చవి చూశా. ఆ సమయంలో నాకు బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. దాన్ని సమన్వయం చేసుకోలేకపోయా. అందుకే విరామం తీసుకోవాలని అనుకున్నా. దానికి తోడు కొన్ని కుటుంబ సమస్యలు కూడా ఉండటంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా. అయితే నేను ఎవరితోనో వెళ్లి పోయానని అప్పట్లో కొన్ని వెబ్‌సైట్లు రాశాయి. అలాంటిది ఏమీలేదు. (నవ్వులు)

anjalialithosaradagaghg650-3.jpg

తెలుగులో ఎవరెవరితో నటించారు?

అంజలి: వెంకటేష్‌గారితో రెండు, బాలకృష్ణగారితో ఒకటి, రవితేజతో మరొకటి నటించా. యంగ్‌ హీరోలతో చేయకపోవడానికి కారణాలేవీ లేవు. నాకంటూ కొన్ని ఐడియాలున్నాయి. పది సినిమాలు ఒకేసారి చేయడం కంటే, ఒక చక్కని మూవీ చేస్తే 10ఏళ్ల పాటు గుర్తుండిపోతుందని నా నమ్మకం. నా మొదటి సినిమా చేస్తుండగా, ఒక పెద్ద హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చింది. అయితే, ‘ఈ సినిమా పూర్తయిన తర్వాతే అది చేయండి’ అని దర్శకుడు అన్నారు. అప్పుడు నేను పెద్ద హీరో సినిమా చేసి ఉంటే, మంచి పేరు వచ్చేదేమో. కానీ, ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. ‘కట్టర్దు తమిళ్‌’ చేయడం వల్ల ‘షాపింగ్‌మాల్‌’, ‘జర్నీ’ సినిమా అవకాశాలు వచ్చాయి. ఉదాహరణకు ఇప్పటికీ ‘సీత’ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆ సమయంలో ‘సీత’పాత్ర చేయకుండా నాలుగు సినిమాల్లో నటించినా, మీకెవరికీ నేను గుర్తుండను.

తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్‌ ఉందా?

అంజలి: తప్పకుండా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. అతి తక్కువ కాలంలో నా పేరు అందరికీ తెలిసింది. నేను కొన్నిరోజులు కనిపించకుండా పోయినప్పుడు కూడా నాకు ఇండస్ట్రీ నుంచి చాలా మంచి సహాయం అందింది. ఆ సమయంలో వెంకటేశ్‌, స్రవంతి రవికిషోర్‌గారి నుంచి మంచి సహకారం లభించింది. ఇప్పుడు ఆ సమస్యలేవీ లేవు. చాలా హ్యాపీగా ఉన్నా.

anjalialithosaradagaghg650-12.jpg

ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అంజలి: తెలుగులో ‘నిశ్శబ్దం’ చేశా. నేను, అనుష్క, మాధవన్‌ ఇందులో నటించాం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటివరకూ చేయని పాత్ర ఇందులో చేస్తున్నా. ఆ లుక్‌ కోసం చాలా కష్టపడ్డా. ఫిట్‌గా కనిపించేందుకు ఎక్కువ సమయం జిమ్‌లో సాధన చేసేదాన్ని. ఈ సినిమాపై నాకు మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ సమయం ఈ సినిమాలో కనిపిస్తా. ఇక తమిళంలో కొన్ని సినిమాలు ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నాయి.

ఇంత అందమైన అంజలి ఎందుకు దెయ్యాల సినిమాల్లో నటిస్తోంది?

అంజలి: నాకూ తెలియదు. అలా కలిసొచ్చింది. ‘గీతాంజలి’ నా మొదటి హారర్‌ మూవీ. అప్పటివరకూ అలాంటి సినిమా చేయలేదు. ఆసక్తిగా ఉంటుందని ఒప్పుకొన్నా. కోన వెంకట్‌గారు రచయితగా పనిచేసిన ‘బలుపు’ సినిమాలో నటించా. ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించిన తర్వాత చేసిన సినిమా ‘గీతాంజలి’.

ఏ సినిమా నుంచి డబ్బింగ్‌ చెప్పటం ప్రారంభించారు?

అంజలి: నా మొదటి సినిమా నుంచి నేనే డబ్బింగ్‌ చెప్పుకొంటున్నా. ‘కట్టర్దు తమిళ్‌’ సమయానికి నాకు అస్సలు తమిళం రాదు. అందులోని ఒక పాటకు కొన్ని పదాలు నన్ను చెప్పమంటే చెప్పా. దాంతో నా వాయిస్‌ వాళ్లకు నచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పుకొన్నా. నా కెరీర్‌లో ఒక తమిళ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పలేకపోయా. బయట షూటింగ్‌లకు వెళ్తే, నా గొంతుతోనే నన్ను గుర్తుపట్టేస్తుంటారు.

మీరెంత మంది?

అంజలి: ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క, నేను. అక్క న్యూస్‌రీడర్‌. ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటారు.

anjalialithosaradagaghg650-6.jpg

యోగా చేయడంలో మీరు ‘జూనియర్‌ రాందేవ్‌ బాబా’ అని అంటారు.. నిజమేనా?

అంజలి: ఏరియల్‌ యోగా చేస్తున్నా. ఖాళీ సమయంలో కూడా చిన్న చిన్న వర్కవుట్‌లు చేస్తుంటా.

ప్రస్తుతం ఎక్కడ సెటిల్‌ అయ్యారు?

అంజలి: హైదరాబాద్‌. నాకు ఇక్కడ ఉండటం చాలా ఇష్టం.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?
అంజలి: ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు అవ్వాలి కదా! ఆ తర్వాత ఆ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తా. పైగా నాకంటే ముందు మా అన్నయ్య ఉన్నారు.

anjalialithosaradagaghg650-4.jpg

ఒక దర్శకుడిని బాగా ఏడిపించారట!

అంజలి: (నవ్వులు) నేను కలిసి పనిచేసిన దర్శకుల్లో చాలామందిని ఆటపట్టిస్తుంటా. అవన్నీ చెబితే నా పరువు పోతుంది. సముద్రఖనిగారితో కలిసి ‘నాడోడిగల్‌2’ చేశా. అయితే, అప్పటికే సముద్రఖనిగారు చాలా కాలం నుంచి నాకు తెలుసు. సెట్‌లో నా గొంతు తప్ప ఎవరిదీ వినిపించదు. అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా అందరూ నావైపే చూపిస్తారు. అయితే, సముద్రఖని నన్ను తిట్టకుండా నాతో కలిసి గొడవ చేసిన వారిని తిట్టేవారు. కుర్చీలు లాగేయడం, మైక్‌ తీసుకుని యాక్షన్‌.. కట్‌లు చెప్పడం ఇలా అల్లరి బాగా చేసేదాన్ని.

anjalialithosaradagaghg650-9.jpg

జర్నీ’ సినిమా అంత హిట్టవుతుందని అనుకున్నారా?

అంజలి: అస్సలు అనుకోలేదు. అది మురుగదాస్‌గారు నిర్మించిన తొలి సినిమా. మొదట షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఫర్వాలేదు బాగానే ఆడుతుంది అనిపించింది. కానీ, ఇంత భారీ విజయాన్ని నమోదు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నేను నటించిన సినిమాల్లో కాస్త టఫ్‌ రోల్‌ ఇది.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేస్తున్నప్పుడు భయం వేసిందా?

అంజలి: మొదటి రెండు, మూడు రోజులు చెమటలు పట్టేశాయి. ఎందుకంటే నా ఫస్ట్‌ సీన్లు అన్నీ, వెంకటేశ్‌గారు, ప్రకాష్‌రాజ్‌గారు, జయసుధగారితో.. ఆ తర్వాత మహేశ్‌ వచ్చారు. నేను భయపడుతుంటే, వెంకీ సర్‌ వచ్చి ‘నీకు వచ్చినట్లు చెయ్‌. అస్సలు భయపడవద్దు’అని ప్రోత్సహించారు. ‘ఆ అమ్మాయికి మీరు డైలాగ్‌లు చెప్పొద్దు. ఆమె చెప్పిన డైలాగ్‌లను యాడ్‌ చేసుకోండి. ఎందుకంటే ఆ యాస బాగుంది’ అని డైరెక్టర్‌ శ్రీకాంత్‌ వాళ్ల టీమ్‌కు చెప్పేవారు. దాంతో నాకు స్వేచ్ఛ లభించినట్లు ఉండేది.

anjalialithosaradagaghg650-13.jpg

బాలకృష్ణతో నటించడం ఎలా అనిపించింది?

అంజలి: ఆయనతో నటిస్తుంటే చాలా భయం వేసేది. సెట్‌లో ఆయన చాలా కూల్‌గా ఉంటారు.

రియల్‌ లైఫ్‌లో ఒక దెయ్యం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందట!

అంజలి: నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా! ఇంతకుముందు నేను వేరే ఇంట్లో ఉండేదాన్ని. అక్కడ నాకు భయం వేసేది. దెయ్యం సినిమా చేసి వచ్చిన తర్వాత ధైర్యంగా పడుకునేదాన్ని. ఆ తర్వాత మళ్లీ ఆరు నెలలకు భయం వేసేది. కొన్ని రోజులు అర్ధరాత్రి నిద్ర పట్టక హోటల్‌కు వెళ్లి నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి.

మీ జీవితంలో చాలా ఇబ్బందులు పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?

అంజలి: ప్రతి ఒక్కరికీ ఎత్తు పల్లాలు ఉంటాయి. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ వల్ల బయటకు వెళ్లి మళ్లీ వచ్చినప్పుడు ‘అంజలి పని అయిపోయింది’ అన్నారు. అయితే ‘గీతాంజలి’ తర్వాత మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కన్నా ముందు అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డా.

మీకు బాగా పేరు తెచ్చిన సినిమా ఏది?

అంజలి: నా తొలి సినిమా ‘కట్టర్దు తమిళ్‌’కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘జర్నీ’.

anjalialithosaradagaghg650-11.jpg

మీరు ఏయే వంటలు బాగా చేస్తారు?

అంజలి: మటన్‌ బిర్యానీ, ఆమ్లెట్‌, ఎగ్‌ ప్రాన్‌ కర్రీ, దోసె బాగా చేస్తా. నాకు వంట చేయడం అంటే ఇష్టం. ఇడ్లీ అంటే నాకు బాగా ఇష్టం.

మీ ఫేవరెట్‌ హీరో, హీరోయిన్‌ ఎవరు?

అంజలి: ఫేవరెట్‌ హీరో ఎవరూ లేరు. కానీ, శ్రీదేవిగారంటే నాకు బాగా ఇష్టం.

women icon@teamvasundhara
how-these-celebrities-beat-lockdown-blues?

మళ్లీ మంచిరోజులొస్తాయి.. అప్పటిదాకా ఇలా బిజీగా ఉందాం..!

సాధారణంగా వృత్తిఉద్యోగాలు చేసే వారికి వారానికి కనీసం ఒకట్రెండు రోజులైనా సెలవులుంటాయి. అదే సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఆ సమయం కూడా దొరకదు. సినిమా వాళ్లు నెలల తరబడి షూటింగ్స్‌కి, క్రీడాకారులు ప్రాక్టీస్‌కు సమయం వెచ్చించాల్సిందే! అలాంటి వారికి అరుదుగా, అనుకోకుండా లాక్‌డౌన్ పేరుతో బోలెడంత ఖాళీ సమయం దొరికే సరికి తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఇంకా టోర్నమెంట్లు, షూటింగులు మొదలు కాకపోవడంతో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తమ అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. భారత యువ షూటర్‌ మనూ భాకర్‌ కూడా ఈ ఖాళీ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు నచ్చిన పనులు చేస్తున్నానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన సినీ తారలు, క్రీడాకారిణులు ఏం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-jaya-bhattacharya-food-packets-and-essentials-to-needy-amid-lockdown

కరోనా అంతమైనా నా సేవను మాత్రం ఆపను!

అప్పటిదాకా హాయిగా ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయి కొందరు బాధపడుతుంటే.. తినడానికి తిండి కూడా కరవై ఆకలితో అలమటిస్తోన్న వారు ఎందరో! ఇక ఇలాంటి కష్ట కాలంలో మూగ జీవాల వెతలు ఎవరికీ పట్టవు. కానీ ఈ గడ్డు కాలంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు.. అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటున్నారు బాలీవుడ్‌ నటీమణి జయా భట్టాచార్య. బుల్లితెరపై పలు సీరియళ్లలో, వెండితెరపై కీలక పాత్రల్లో నటించి మెప్పించిన జయ.. ఈ లాక్‌డౌన్‌లో నలుగురికి సహాయపడుతూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. అంతేకాదు.. తన సేవలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా తన సేవల్ని ఇలాగే కొనసాగిస్తానంటోన్న ఈ నటీమణి గురించి, ఆమె చేస్తోన్న సేవల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara