scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

మా ఇద్దరి మధ్య ఉన్నది అదే..!

Rahul sipligunz punarvi interview

ప్పటి వరకూ వారిద్దరూ కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ఒకరు వెండితెరపై సందడి చేస్తే, మరొకరు తెర వెనుక తనదైన శైలిలో పాటలు పాడుతూ యువతను హుషారెక్కించారు. ‘బిగ్‌బాస్‌’ ముందు వరకూ ఒకరి గురించి మరొకరికి పరిచయమే లేదు. అలాంటి వాళ్లు కలిసి ఒకే ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. కేవలం ఉండటమే కాదు.. ఇటు బుల్లితెర ప్రేక్షకులకు అటు నెటిజన్లకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. వాళ్లే గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌.. నటి పునర్నవి భూపాలం. తమ కెమిస్ట్రీతో ‘బిగ్‌బాస్‌3’లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు, అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో శభాష్‌ అనిపించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడుదొడుకులు, ఆనందపడ్డ క్షణాలు ఇలా ఎన్నో అనుభూతులను పంచుకున్నారు.

alithosardagarahul650-8.jpg

మీ ఇద్దరికీ పరిచయం ఎక్కడ?
రాహుల్‌: బిగ్‌బాస్‌’లోనే తొలిసారి కలిశాం. అంతకుముందు వరకూ మాకు పరిచయం లేదు. ఇంటిలోకి వచ్చాకే తనొక నటి అని తెలిసింది.
పునర్నవి: రాహుల్‌ పాటలు పాడతాడని తెలుసు. ప్రైవేటు ఆల్బమ్స్‌ చేస్తాడని విన్నా.

బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత పునర్నవిని చూడగానే ఏమనుకున్నావు?
రాహుల్‌: అరె! పోరి ఖతర్నాక్‌ ఉందిరా అనుకున్నా. (సరదాగా) మొదట్లో అసలు పరిచయం లేదు. నెమ్మదిగా ఫ్రెండ్స్‌ అయ్యాం.
పునర్నవి: మొదట్లో ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే ఎవరితోనైనా కలిసేందుకు నాకు టైమ్‌ పడుతుంది. అప్పుడే.. తను ‘ఎవరితోనూ మాట్లాడవా..’ అని అడిగేవాడు.

alithosardagarahul650-1.jpg

రాహుల్‌ను చూడగానే నీ మొదటి ఫీలింగ్‌ ఏంటి?
రాహుల్‌: హౌలాగాడు’ అనుకుని ఉంటుంది.(నవ్వులు)
పునర్నవి: నా సమాధానాలు కూడా నువ్వే చెప్పేస్తే ఎలా? చూడగానే కాస్త దిట్టంగా ఉన్నాడు. దూరంగా ఉండాలనుకున్నా. హేమగారి మీద అరిచిన తర్వాత ఇక బై బై అనుకున్నా.

మీ సొంతూరు ఏది?
పునర్నవి: నేను పుట్టి పెరిగింది తెనాలిలో. చదువంతా విజయవాడలో సాగింది. మా నాన్నగారిది అనంతపురం. ఆయన కూడా విజయవాడలో చదువుకుని అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చేశారు.
రాహుల్‌: నాది హైదరాబాదే.

alithosardagarahul650-3.jpg

ఏ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు?
పునర్నవి: ఉయ్యాల జంపాల’. నేను థియేటర్‌ స్టూడెంట్‌ని‌. ఇంటర్‌లో డ్రామాలు వేసేదాన్ని. ఒకరోజు ఆ సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌కు ఆడిషన్స్‌ జరుగుతున్నాయని మా అంకుల్‌ చెప్పడంతో సరదాగా వచ్చి సెలక్ట్‌ అయ్యా. సునీత పాత్రకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు నాకు 17ఏళ్లు.

రాహుల్‌ భవిష్యత్‌లో ఏమవుదామనుకుంటున్నావు?
రాహుల్‌: పాప్‌ సింగర్‌. బాలీవుడ్‌లో హనీసింగ్‌, తమిళ్‌లో హిప్‌హాప్‌. అలా తెలుగులో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా.

రాహుల్‌కు చాలా బద్ధకం.. టైమ్‌కు అసలు రాడు.. అని టాక్‌ దీనిపై మీరేమంటారు?
రాహుల్‌: బిగ్‌బాస్‌’ షో చూసిన తర్వాత అలా ముద్ర పడి ఉంటుంది. ఆ ఇంట్లో నా పని నేను చేసుకుని, ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌ చేసుకుంటూ ఉండేవాడిని. ఖాళీ సమయంలో బెడ్‌పై పడుకునేవాడిని. టాస్క్‌ సమయంలో ఆడేవాడిని.
పునర్నవి: అవును! అలాగే చేసేవాడు.

బాగా కష్టపడి ఇంటర్‌ చదివావట.
రాహుల్‌: చదవడానికి రెండేళ్లు. పాసవడానికి నాలుగేళ్లు. ఎంపీసీ తీసుకుని ఇలా చేశానని తెలిస్తే జనం నవ్వుతారని ఈ విషయం ఎక్కడా చెప్పను. ఆ తర్వాత దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశా.

alithosardagarahul650-10.jpg

మ్యూజిక్‌ వైపు రావాలని ఎందుకు అనిపించింది?
రాహుల్‌: చిన్నప్పుడు బాత్రూమ్‌లో కూర్చొని పాటలు పాడేవాడిని. ఒకరోజు మా నాన్న విని, ‘అరె.. వీడు పాటలు బాగానే పాడుతున్నాడు’ అని నన్ను ఎంకరేజ్‌ చేయడం మొదలు పెట్టారు. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, టైమ్‌ పాస్‌ కోసం పాటలు పాడించేవారు. నాకు చాలా సిగ్గెక్కువ. ఆ తర్వాత గజల్‌ సింగర్‌, మా గురువుగారు పండిట్‌ విఠల్‌రావుగారి దగ్గర చేర్చారు. ఏడేళ్ల పాటు గజల్స్‌ నేర్చుకుని నెమ్మదిగా ప్లేబ్యాక్‌ సింగింగ్‌ మొదలు పెట్టా. నాని హీరోగా చేసిన ‘స్నేహితుడా’లో ఒకపాట, నాగచైతన్య ‘జోష్‌’లో ‘కాలేజీ బుల్లోడా..’ మరో పాట పాడా.

మీకు మంచి పేరు తీసుకొచ్చిన పాటలేవి?
రాహుల్‌: చాలా పాటలు పాడా. అయితే, ఈ పాట నేనే పాడానని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తెరపై పేర్లు కనిపిస్తాయి కానీ, మనం కనిపించం కదా! (మధ్యలో ఆలీ అందుకుని..‘మీ మొదటి సినిమా సీతాకోక చిలుక కదా’ అని అడుగుతారు. కానీ, అంతకుముందు నేను ఏడు సినిమాల్లో నటించా.) ఆ తర్వాత కీరవాణిగారి దగ్గర చేరా. కోరస్‌తో మొదలైన నా పాటల ప్రస్థానం ఇలా సాగుతోంది. ‘ఈగ’ టైటిల్‌ సాంగ్‌లో నా గొంతు వినిపిస్తుంది. ఆ తర్వాత ‘దమ్ము’లో ‘వాస్తు బాగుందే..’ పాటలు పాడను. కీరవాణిగారు నాకు గాడ్‌ఫాదర్‌ లెక్క. ఆ తర్వాత మణిశర్మగారు, తమన్‌ అన్నా.. దేవిశ్రీ ప్రసాద్‌గారు ఇలా పలువురు సంగీత దర్శకుల సారథ్యంలో పాడుతూ వచ్చా.

alithosardagarahul650-11.jpg

సిప్లి అంటే ఇంటిపేరా?
రాహుల్‌: అవును సిప్లి గంజ్‌ అనేది ఇంటి పేరు. మా కుటుంబం క్షౌరవృత్తి(బార్బర్‌) చేసేది. మా తండ్రి హాంకాంగ్‌లో శిక్షణ తీసుకున్నారు. నేను న్యూయార్క్‌లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకుని మధ్యలో వచ్చేశా.

హైదరాబాద్‌లో బెస్ట్‌ సెలూన్‌ షాప్‌ పెట్టాలని చెప్పారు. ఇలా చెప్పుకొనేందుకు ఏమైనా నామోషీ ఫీలవుతున్నారా?
రాహుల్‌: కులవృత్తిని మరిచినవాడు అసలు మనిషే కాదు. నేను గర్వంగా ఫీలవుతున్నా. ఒక మనిషిని అందంగా తీర్చిదద్దడమనేది ఒక కళ. మా బ్యూటీషియన్స్‌ లేకపోతే, ఎవరికీ హెయిర్‌ కటింగ్‌లు ఉండేవి కావు.. మేమే అందంగా ఉండేవాళ్లం (నవ్వులు)

మీ ఇద్దరి గురించి సోషల్‌ మీడియాలో నిక్‌నేమ్‌లు ఉన్నాయి తెలుసా. పునర్నవిని పులిహోర రాణి అంటున్నారు?
రాహుల్‌: నన్ను కదా! పులిహోర రాజా అని పిలిచేవారు.
పునర్నవి: బహుశా నీ నుంచి నాకు మారిందేమో(నవ్వులు)

టాలెంట్‌.. గ్లామర్‌ ఉన్నా ఎందుకు సక్సెస్‌ కాలేకపోయారు?
పునర్నవి: నాకు చదువు కూడా ముఖ్యం. ఇన్నేళ్ల పాటు నేను ఏం చేశానో దాని పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఎక్కడా బాధపడింది లేదు. ఎందుకంటే 17ఏళ్లకు నేను కెరీర్‌ను మొదలు పెట్టా. నా జీవితాన్ని కోల్పోకూడదనుకున్నా. అటువంటి సమయంలో నచ్చిన స్క్రిప్ట్‌లు మాత్రమే చేశా. ఈ కొద్ది సమయాన్ని నేను అపజయంగా భావించను. ఇంకా సమయం ఉందనుకుంటున్నా. నా జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది.

alithosardagarahul650-9.jpg

నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా, మీ తండ్రికి హార్ట్ ఎటాక్‌ వచ్చింది. మీకు ఎప్పుడు తెలిసింది?
రాహుల్‌: బిగ్‌బాస్‌’ హౌస్‌ నుంచి బయటకు వచ్చాకే తెలిసింది. చాలా బాధపడ్డా. నా తల్లిదండ్రులు వాళ్ల ప్రాణాలకంటే నాకు ఎక్కువ విలువ ఇచ్చారు. అంతకుమించి గ్రేట్‌ పేరెంట్స్‌ ఎక్కడ ఉంటారు. నాకు మొదట ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు.. ఆ తర్వాతే గుడిలో ఉన్న దేవుళ్లు. నేను గుడికి పెద్దగా వెళ్లను. మనల్ని కన్నవాళ్లని చక్కగా చూసుకుంటే సరిపోతుంది. వాళ్ల కడుపున పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన మూడో రోజున మా తండ్రికి గుండె పోటు వచ్చింది. నా ఫ్రెండ్స్‌ చాలా మంది నాకు చెప్పడానికి ప్రయత్నించారు. కానీఅమ్మవాళ్లు ఒప్పుకోలేదు. అంతకుమించిన ప్రేమ ఎక్కడ ఉంటుంది. ‘మా అబ్బాయి గేమ్‌కు ఇబ్బంది కలగకూడదు. చాలా చక్కగా ఆడుతున్నాడు’ అనుకొని వాళ్లు చెప్పలేదు.

alithosardagarahul650-6.jpg

సాధారణంగా అమ్మాయిలకు కోపం ఎక్కువ ఉంటుంది? కానీ, నీకు ఇంకాస్త ఎక్కువట.
పునర్నవి: కేవలం తిడతానంతే.. బూతులు మాట్లాడను. (నవ్వులు) నా సొంతవాళ్లు అనుకున్నప్పుడు ‘ఏంటిరా వెధవా’ అంటూ చాలా క్లోజ్‌గా మాట్లాడతా. చాలా మొండిదాన్ని. పుట్టినప్పటి నుంచి ఉంది. చాలా కంట్రోల్‌ చేసుకుంటున్నా. కానీ, నేనింతే.

నీ లైఫ్‌లో ఒక లవ్‌ ఉందని, అది ఫెయిల్‌ అయిందని విన్నాం. ఎంతవరకూ నిజం?
పునర్నవి: దాన్ని లవ్‌ ఫెయిల్యూర్‌ అని చెప్పలేం. తను నా క్లోజ్‌ ఫ్రెండ్‌. నన్ను చాలా ఇష్టపడ్డాడు. కెరీర్‌లో సెటిల్‌ కాకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. నేనే వద్దనుకున్నా. ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయాం. కొన్ని విభేదాలు వచ్చాయి. అదే సమయంలో నేను అమెరికా వెళ్లిపోయా. నేను వచ్చే సరికి ఈస్టర్‌ సందర్భంగా శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో తను చనిపోయాడని తెలిసింది. అతను నా మనసుకు చాలా దగ్గరైన వ్యక్తి. మనిషి ఉన్నప్పుడు అతని విలువ తెలియదు. ఎవరి జీవితంలోనైనా కొన్ని జ్ఞాపకాలు ఉండిపోతాయి. నాకూ అంతే. నేను చాలా ఎమోషనల్‌. నా స్నేహితులనుకున్న వారికోసం ఎన్ని త్యాగాలైనా చేస్తా. అతను లేడని తెలిసేసరికి చాలా కుంగిపోయా. అదే సమయంలో ‘బిగ్‌బాస్‌’ ఆఫర్‌ వచ్చింది. జీవితంలో కొత్త మార్పు అనుకొని ఒప్పుకొన్నా.

alithosardagarahul650-5.jpg

బిగ్‌బాస్‌’ హౌస్‌ నుంచి వచ్చేశాక ఫ్రెండ్స్‌ నుంచి ఇప్పటికీ కాల్స్‌ వస్తున్నాయా? వాళ్లని కలుస్తున్నారా?
రాహుల్‌: ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతున్నారు.
పునర్నవి: మేం నలుగురం మంచి ఫ్రెండ్స్‌(పునర్నవి, రాహుల్‌, వరుణ్‌, వితిక) ఇంట్లో మా సపోర్ట్‌తోనే రాహుల్‌ టాస్క్‌ల్లో గెలిచానని చెప్పాడు.
రాహుల్‌: నేను ప్రతి ఇంటర్వ్యూలో చెబుతా. సహాయం చేసిన వాళ్లను మర్చిపోయే టైపు కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటా.

బిగ్‌బాస్‌’ హౌస్‌లో మీకూ శ్రీముఖికి ఎందుకు పడలేదు?
రాహుల్‌: అది ఒక రియాల్టీ షో. జనాలకు ఎలాంటి ఇంప్రెషన్‌ ఉంటుందో దాన్నే అందరూ పైకి చూపిస్తారు. ఆమెతో నాకు ఎలాంటి గొడవలూ లేవు. అంతకుముందు తను నాకు ఫ్రెండ్‌. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత చివరి వరకూ నా ఫ్రెండ్‌గా ఉంటుందనుకున్నా. కానీ, ఆమె సెపరేట్‌ అయిపోయి, మిగిలిన వాళ్లు ఫ్రెండ్స్‌ అయ్యారు. పరిస్థితులు అలా వచ్చాయి. నేను కొన్నిసార్లు తప్పు చేస్తే, తను కొన్నిసార్లు తప్పు చేసింది. తప్పొప్పులు సహజం. మనిషి అనేవాడు చేస్తుంటాడు. మా ఇద్దరి మధ్య చర్చ వచ్చినప్పుడు ఇద్దరం గట్టిగా మాట్లాడేవాళ్లం. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీలేదు.

alithosardagarahul650-4.jpg

హౌస్‌లోకి వెళ్లకముందు ఎంతమంది అమ్మాయిల హృదయాలు దోచుకున్నావ్‌?
రాహుల్‌: నా ముఖానికి ఏ పోరి అయిన పడుతుందా? (నవ్వులు)

బిగ్‌బాస్‌’తో మంచి పేరొచ్చింది. ఎవరైనా దర్శకుడు వచ్చి, ‘రాహుల్‌ నా సినిమాకు మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేస్తావా’ అంటే ఏం చెబుతావు?
రాహుల్‌: అంతకన్నా అదృష్టం వేరే ఉంటుందా? సినిమాకు వచ్చే సరికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద హీరో కాకపోయినా మ్యూజిక్‌ హిట్‌ కావచ్చు. మరికొన్ని సార్లు పెద్ద హీరో సినిమా అయినా, మ్యూజిక్‌ యావరేజ్‌గా ఉండవచ్చు. అప్పుడు హీరో కోసం ఫ్యాన్స్‌ ఆ పాటలు వింటారు. కానీ, నాకు ఎలాంటి గుర్తింపు లేని సమయంలోనే నేను చేసిన పాటలకు లక్షల వ్యూస్‌ వచ్చాయి. సినిమా ఛాన్స్‌ వస్తే, తెలుగు ప్రేక్షకులకు మంచి మ్యూజిక్‌ ఇస్తా.

alithosardagarahul650-2.jpg

చిన్నప్పుడు ఎవరో ఇంటికి వెళ్లి ‘ఒరేయ్‌.. బయటకు రా రా’ అన్నావట.
పునర్నవి: మా కజిన్‌ని. నా దగ్గరి నుంచి ఏదో తీసుకుని వెళ్లిపోయాడు. దాంతో వాళ్ల ఇంటికి వెళ్లి ‘ఒరేయ్‌.. బయటకు రారా.. ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి’ అని గట్టిగా అరిచా. మా వీధిలో నేనే ఫేమస్‌. ప్రతి వాళ్ల ఇంటికీ వెళ్లి తినేసి వచ్చేదాన్ని. నా కోసం మా అమ్మమ్మ వెతుక్కుంటూ ఉండేది.(నవ్వులు)

మీ ఇద్దరి మీదా రకరకాల రూమర్స్‌ ఉన్నాయి? దానిపై మీ అభిప్రాయం?
రాహుల్‌: బిగ్‌బాస్‌’లో దాదాపు 15మంది ఉన్నాం. అప్పుడు కొందరి అభిరుచులు కలుస్తాయి. నేను, పునర్నవి, వరుణ్‌, వితిక కలిసి ఉండేవాళ్లం. టాస్క్‌లు సాయంత్రం వేళలో ఉంటాయి. ఉదయం ఖాళీగా ఉంటాం. దీంతో సరదాగా మాట్లాడుకునే వాళ్లం. సాధారణంగా అమ్మాయి కనపడితే అబ్బాయిలు పొగుడుతుంటారు. అదే జరిగింది. ఏదో ఫన్‌ కోసం చేసింది అదంతా