సానియా ఇప్పుడు హాట్ మామా అయింది ! కొందరికి డార్లింగ్ కూడా అయింది ! క్రికెటర్ యువరాజ్ అయితే మిర్చీ అంటున్నాడు ! ఇలా ప్రియమైన మాటలు ఏవుంటే వాటికి కేరాఫ్‌గా మారిపోయింది సానియా. ఈ టెన్నిస్ సెన్సేషన్ బర్త్‌డే సందర్భంగా క్రికెటర్ యువరాజ్ సింగ్ నుంచి పరిణీతి చోప్రా వరకు పలువురు ప్రముఖులు ఇలా తమదైన శైలిలో సానియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
* 'నా ఫిట్‌నెస్‌కు స్ఫూర్తిగా నిలిచిన సానియాకు హ్యాపీ బర్త్ డే ! ఈరోజు నీతో లేనందుకు చింతిస్తున్నా.. త్వరలోనే జిమ్‌లో కలుద్దాం !' అంటూ ఉపాసన కొణిదెల ట్వీట్ పెట్టారు.
* పరిణీతి చోప్రా సానియాతో తనకున్న అనుబంధాన్ని ఉద్వేగంగా తెలుపుతూ 'ఐ లవ్ యు సానియా ! ఎందుకంటే... కల్పితంలో వాస్తవం నువ్వు.. ఆడంబరంలో నిరాడంబరత్వం నువ్వు.. కపటులలో స్వచ్ఛత నువ్వు.. నువ్వు నీలా ఉంటావ్.. నీ తెలివి... నువ్వు చూపే మర్యాద.. నీ హాస్యం అద్భుతం ! అన్నిటికంటే నన్ను నాలా ఉంచుతున్నందుకు ఐ లవ్ యు !'
* హాసిని జెనీలియా ట్వీట్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. నీకు అనంతమైన ప్రేమ... చలో.. లెట్స్ మీట్ !' అంటూ ఆహ్వానాన్ని పంపింది.
* బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ విష్ చేస్తూ.. 'ఒకరికొకరం స్నేహితులమైనందుకు సంతోషంగా ఉంది... నువ్వు వూహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నా.. హ్యాపీ బర్త్ డే' అంటూ తన ప్రేమను తెలిపారు.

* ఇక 'కాలా' కథానాయిక హ్యూమా ఖురేషీ సానియాకు విషెస్ చెబుతూ సానియా అందరికీ మెయిన్ హీరోయిన్ కావాలని ఆకాంక్షించారు.

* ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ సానియా ఎప్పుడూ నవ్వుతూ ఉండి తమను నవ్వించాలని కోరారు.
*పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేవుని ఆశీస్సులతో సానియా జీవితం అద్భుతంగా సాగాలని దీవించారు.
* క్రికెటర్ యువరాజ్ విష్ చేస్తూ... 'హాయ్ హాయ్ మిర్చీ.. నా ప్రియ నేస్తానికి అనంతమైన ప్రేమతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ చమత్కరించారు. అందుకు స్పందించిన సానియా యువరాజ్‌ను మోటూ (బొద్దు మనిషి) అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇలా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన సానియా ఈ పుట్టినరోజు చాలా అద్భుతంగా జరిగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.