scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

హాయ్ మిర్చీ.. హ్యాపీ బర్త్ డే !

Interesting Facts about Sania Mirza

భారత క్రీడా చరిత్రలో నం.1 టెన్నిస్ క్రీడాకారిణిగా వెలుగొందిన ధృవతార సానియా మీర్జా. తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్.. ఆసియా కామన్వెల్త్‌, ఆఫ్రో-ఏషియన్ లాంటి పోటీల్లో 14 పతకాలు (అందులో 6 స్వర్ణాలు).. మొదలైనవి గెలుచుకోవడంతో పాటు డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే నం. 1 స్థానంలో నిలిచిన తొలి భారత క్రీడాకారిణి సానియా. తను సాధించిన ఈ ఘనత తనకంత సులభంగా రాలేదు. దీని వెనుక ఎంతో కృషి, దీక్ష, పట్టుదల ఉన్నాయి. ఒక దశలో సానియాను చూసి మన దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను టెన్నిస్ వైపు ప్రోత్సహించే వారంటే.. తను సాధించిన విజయాలు ఎంతమందికి స్ఫూర్తినిచ్చాయో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 15న సానియా పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..!

saniamirzabirthdayspl650-18.jpg

ఆరేళ్ల వయసు నుంచే..!

1986, నవంబర్ 15న ముంబైకి చెందిన ఇమ్రాన్ మీర్జా, నసీమా మీర్జా దంపతులకు జన్మించింది సానియా. తనకు ఆనమ్ మీర్జా అనే ఓ చెల్లెలు కూడా ఉంది. సానియా జన్మించిన కొంతకాలానికే తన ఫ్యామిలీ హైదరాబాద్‌లో స్థిరపడింది. తన చదువంతా హైదరాబాద్‌లోనే జరిగింది. సానియా హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తనకు చిన్నతనం నుంచే టెన్నిస్, క్రికెట్, స్విమ్మింగ్‌లపై ఆసక్తి ఎక్కువ. ఈ మూడింటిలో నుంచి టెన్నిస్‌ను తన కెరీర్‌గా ఎంచుకొన్న సానియా.. ఆరేళ్ల వయసు నుంచే దానిపై దృష్టి సారించింది.

saniamirzabirthdayspl650-21.jpg

తండ్రే కోచ్‌గా మారాడు..!

తన కూతురికి టెన్నిస్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన ఇమ్రాన్ సానియాకు టెన్నిస్‌లో శిక్షణ ఇప్పించడానికి నిజాం క్లబ్‌కి తీసుకెళ్లారు. అయితే అక్కడ కోచ్ సానియాకు శిక్షణ ఇవ్వడానికి నిరాకరించడంతో తానే కోచ్‌గా మారారు. ఆ తర్వాత రోజర్ ఆండర్‌సన్ సానియాకు కోచ్‌గా ఉన్నారు. టోర్నమెంట్లలో ఆడటం ప్రారంభించిన తర్వాత స్పాన్సర్లు దొరికే వరకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇమ్రాన్. సానియా పోటీల్లో పాల్గొంటోన్న తొలి రోజుల్లో తన ఆట తీరును చూసి ఓ ప్రముఖ షూ కంపెనీ తనకు స్పాన్సర్‌షిప్ ఇచ్చి ప్రోత్సహించడం విశేషం.

saniamirzabirthdayspl650-16.jpg

తన స్త్టెలే వేరు..!

మొదటినుంచీ సానియా ఆటతీరు చాలా చురుగ్గా ఉండేది. తన ప్రత్యర్థి మీదికి టెన్నిస్ బంతిని బాణంలా సంధించేదీ రాకెట్ గర్ల్. అందుకే తనకు 'పవర్‌ఫుల్ ఫోర్‌హ్యాండ్ ప్లేయర్' అనే పేరు కూడా ఉంది. కోర్టులో ఏ మూలకైనా బంతిని వేగంగా, బలంగా పంపగలిగే శక్తి సానియా సొంతం. తన కెరీర్ ప్రారంభంలోనే సింగిల్స్ గేమ్‌లో టాప్ ప్లేయర్లకు సవాళ్లు విసిరేది. సింగిల్స్‌లో ఎన్నో విజయాలు అందుకొన్న సానియా తన ఆటతీరుతో సింగిల్స్ కంటే కూడా డబుల్స్‌లో బాగా రాణించచ్చని గమనించి తన దృష్టిని డబుల్స్ ఆటవైపుకు మళ్లించింది. ఇలా టీనేజ్‌లో జూనియర్ ప్లేయర్‌గా ఉన్నప్పుడే సానియా 10 సింగిల్స్, 13 డబుల్స్ టైటిల్స్‌ని అందుకోవడం విశేషం.

saniamirzabirthdayspl650-17.jpg

కోర్టులో 'హిట్' పెయిర్ వారే..!

2003లో సానియా ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారింది. టెన్నిస్ డబుల్స్‌లో ఆడడం ప్రారంభించిన తర్వాత సానియా సృష్టించిన ప్రభంజనాలు, అందుకున్న విజయాలు.. అన్నీ ఇన్నీ కావు. 2003లో 'వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ గర్ల్స్ డబుల్స్' టైటిల్‌ను తన పార్ట్‌నర్ అలీసాతో కలిసి సాధించింది సానియా. 2004లో విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) టైటిల్‌ను దక్కించుకుంది. ఈ టైటిల్ అందుకొన్న తొలి భారతీయురాలిగా సానియా చరిత్రకెక్కింది. 2005లో డబ్ల్యూటీఏ సానియాను 'బెస్ట్ న్యూకమర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారంతో సత్కరించడం విశేషం. 2009లో ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతితో కలిసి తన తొలి గ్రాండ్ స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్)ను సానియా గెలుచుకొంది. ఆ తర్వాత ఈ టెన్నిస్ క్వీన్ విజయాల పరంపర కొనసాగుతూ వచ్చింది. మహిళల డబుల్స్‌లో స్విస్ ప్లేయర్ మార్టినా హింగిస్‌తో జత కట్టిన సానియా.. 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లతో పాటు 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకొంది. దీంతో టెన్నిస్ కోర్టులో వీరిద్దరూ సక్సెస్‌ఫుల్ పెయిర్‌గా మన్ననలందుకున్నారు.

అరుదైన ఘనతలెన్నో..

saniamirzabirthdayspl650-19.jpg


* 2003 నుంచి సింగిల్స్‌లో రిటైర్మెంట్ ఇచ్చేంత వరకు, అంటే.. 2013 వరకు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా నం.1 స్థానంలోనే కొనసాగడం విశేషం.

* 1 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అందుకున్న తొలి భారతీయ టెన్నిస్ ప్లేయర్ కూడా సానియానే.

* తను సాధించిన విజయాలకు గాను భారత ప్రభుత్వం సానియాను 2004లో 'అర్జున', 2006లో 'పద్మశ్రీ', 2015లో 'రాజీవ్ ఖేల్ రత్న', 2016లో 'పద్మభూషణ్' అవార్డులతో సత్కరించడం విశేషం.

* 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానియాను 'రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్'గా నియమించింది.

* 2014లో ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం సానియాను దక్షిణ ఆసియా నుంచి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది.

* 2015లో బీబీసీ ప్రకటించిన '100 మంది స్ఫూర్తిదాయక మహిళల' జాబితాలో సానియా చోటు సంపాదించుకుంది.

రాకెట్ రాణి..!

saniamirzabirthdayspl650-11.jpg

తన కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన క్రమాన్ని సానియా ఓ పుస్తకంగా రాసింది. దీనికి 'ఏస్ ఎగైనెస్ట్ ఆడ్స్' అనే టైటిల్‌ను పెట్టింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ 'సానియా మన దేశ కీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఆమె 'రాకెట్ రాణి'. మన దేశంలో అమ్మాయిలందరూ సానియాను ఆదర్శంగా తీసుకోవాలి' అంటూ ఈ టెన్నిస్ క్వీన్‌పై ప్రశంసలు కురిపించారు.

వైవాహిక బంధం..!

saniamirzabirthdayspl650-8.jpg


2010, ఏప్రిల్ 12న పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇస్లాం ఆచారం ప్రకారం జరిగిన వీళ్ల వివాహ వేడుకకు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా నిలిచింది. ఈ దంపతులకు గతేడాది అక్టోబర్ 30న బాబు జన్మించాడు. తనకు 'ఇజాన్ మీర్జా మాలిక్' అని నామకరణం చేసిందీ జంట.

saniamirzabirthdayspl650-23.jpg

బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం టెన్నిస్‌కు బ్రేక్ చెప్పిన సానియా ప్రస్తుతం తన కొడుకు ఆలనా పాలనా చూసుకోవడంలో బిజీగా ఉంది. అంతేకాదు, త్వరలోనే మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తోందీ స్టార్ ప్లేయర్.

ఫిట్‌నెస్ గోల్స్

View this post on Instagram

Day 4- Getting into it .. and it was all bout strength training with a bit of cardio since I still needed to drop weight but also needed to be strong for my sport .. it consisted of - 2 km warm up on tread mill followed by a lot of stretches and exercises to loosen my lower back and hips .since my body was adapting to so much exercise after a while needed to make sure I stay injury free .. Bench press - 4 sets of 10 (try and increase weight with every set and decrease reps) Lat pull downs - 4 sets x 12 reps Forward moving jumps 4 sets x 12 reps Glutal kick backs - 4 sets x12 reps Dead lifts - I started with 15 kilos 4 sets Assisted push up - 4 sets of 12 Body weight squats - 4 sets of 20 Ski abs - 4 sets of 24 Burpees - 4 sets of 8 leg press - 4 sets x 6 And finally 20 mins of running cool down on 9 km .. it’s all bout muscle memory , when I started I didn’t think I could do any of it but you’ll be amazed how quickly the muscle, body and mind adapt to exercise 🙃 #mummahustles

A post shared by Sania Mirza (@mirzasaniar) on


ఫిట్‌నెస్ విషయంలో సానియా చాలా జాగ్రత్తలు తీసుకొంటుంది. తన ప్రెగ్నెన్సీ సమయంలో కూడా జాగింగ్, స్విమ్మింగ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు టెన్నిస్ కూడా ఆడేదీ ప్లేయర్. తన కొడుకు ఇజాన్‌కు జన్మనిచ్చిన తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 26 కిలోల బరువు తగ్గి తిరిగి ఫిట్‌గా మారి, తనేంటో మరోసారి నిరూపించుకొంది సానియా. ఆ సమయంలో తను చేసిన వర్కవుట్లకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటి చొప్పున ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది.

సోషల్ మీడియా స్టార్..!

saniamirzabirthdayspl650-20.jpg

సానియా ఆటకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తరచూ టచ్‌లోనే ఉంటుంటుంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్ చేస్తుంటుంది. అందుకే తనకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే..! సానియా ఫాలోవర్ల సంఖ్య ఫేస్‌బుక్‌లో 12 మిలియన్లు, ఇన్‌స్టాలో 5.8 మిలియన్లు, ట్విట్టర్‌లో 9.1 మిలియన్లు ఉండడం విశేషం.

టెన్నిస్ క్రీడలో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సానియా తిరిగి కోర్టులోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను షురూ చేసిన ఈ టెన్నిస్ మామ్.. తన కెరీర్‌లో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్‌డే టెన్నిస్ స్టార్..!





women icon@teamvasundhara
how-these-celebrities-beat-lockdown-blues?

మళ్లీ మంచిరోజులొస్తాయి.. అప్పటిదాకా ఇలా బిజీగా ఉందాం..!

సాధారణంగా వృత్తిఉద్యోగాలు చేసే వారికి వారానికి కనీసం ఒకట్రెండు రోజులైనా సెలవులుంటాయి. అదే సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఆ సమయం కూడా దొరకదు. సినిమా వాళ్లు నెలల తరబడి షూటింగ్స్‌కి, క్రీడాకారులు ప్రాక్టీస్‌కు సమయం వెచ్చించాల్సిందే! అలాంటి వారికి అరుదుగా, అనుకోకుండా లాక్‌డౌన్ పేరుతో బోలెడంత ఖాళీ సమయం దొరికే సరికి తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఇంకా టోర్నమెంట్లు, షూటింగులు మొదలు కాకపోవడంతో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తమ అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. భారత యువ షూటర్‌ మనూ భాకర్‌ కూడా ఈ ఖాళీ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు నచ్చిన పనులు చేస్తున్నానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన సినీ తారలు, క్రీడాకారిణులు ఏం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-jaya-bhattacharya-food-packets-and-essentials-to-needy-amid-lockdown

కరోనా అంతమైనా నా సేవను మాత్రం ఆపను!

అప్పటిదాకా హాయిగా ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయి కొందరు బాధపడుతుంటే.. తినడానికి తిండి కూడా కరవై ఆకలితో అలమటిస్తోన్న వారు ఎందరో! ఇక ఇలాంటి కష్ట కాలంలో మూగ జీవాల వెతలు ఎవరికీ పట్టవు. కానీ ఈ గడ్డు కాలంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు.. అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటున్నారు బాలీవుడ్‌ నటీమణి జయా భట్టాచార్య. బుల్లితెరపై పలు సీరియళ్లలో, వెండితెరపై కీలక పాత్రల్లో నటించి మెప్పించిన జయ.. ఈ లాక్‌డౌన్‌లో నలుగురికి సహాయపడుతూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. అంతేకాదు.. తన సేవలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా తన సేవల్ని ఇలాగే కొనసాగిస్తానంటోన్న ఈ నటీమణి గురించి, ఆమె చేస్తోన్న సేవల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
payal-ghosh-and-parno-mittra-opens-about-fighting-depression

సమస్య పంచుకోండి.. భారం దించుకోండి!

ఒత్తిడి, ఆందోళన... ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగా కుంగదీస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుంటాయీ మానసిక రుగ్మతలు. వీటిని భరించలేక ఒకనొక సమయంలో చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా ఈ సమస్యతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తాము కూడా డిప్రెషన్‌ బాధితులమేనంటూ పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తమకెదురైన గడ్డు పరిస్థితుల గురించి ధైర్యంగా చెప్పడమే కాకుండా.. వాటినెలా అధిగమించారో వివరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘ప్రయాణం’ ఫేం పాయల్‌ ఘోష్‌, బెంగాలీ నటి పార్నో మిత్రా కూడా తమ డిప్రెషన్‌ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
kushboo-and-shamita-shetty-opens-about-fighting-depression

డిప్రెషన్‌ మమ్మల్ని కూడా కుంగదీసింది... కానీ కసితో పోరాడాం!

మానసిక ఆందోళన... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, పలు ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి.. వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తడానికి దోహదం చేస్తున్నాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ ఆరోగ్య సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే ఒకానొక సమయంలో వీటిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. అందుకు తాజా నిదర్శనమే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం. బాలీవుడ్‌తో పాటు సినిమా పరిశ్రమను కుదిపేసిన అతడి మరణం అందరికీ షాక్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో మానసిక ఒత్తిడి కారణంగా గతంలో తమ మదిలోనూ ఇలాంటి ఆలోచనలు మెదిలాయంటున్నారు ప్రముఖ తారలు ఖుష్బూ, షమితా శెట్టి. ఈ సందర్భంగా వీరిద్దరూ సోషల్‌ మీడియా వేదికగా డిప్రెషన్‌కు సంబంధించిన తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
actors-who-died-mysteriously-at-young-age

ఎంత కష్టం వచ్చిందో.. అర్థాంతరంగా తనువు చాలించేశారు..!

అందం, డబ్బు, స్టార్‌ స్టేటస్‌...ఇవన్నీ మనిషి బతకడానికి సరిపోవంటూ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌(34) అకాల మరణం మరోసారి రుజువు చేసింది. వెండితెరపై ‘ధోనీ’గా మెప్పించిన ఈ యంగ్‌ హీరో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తద్వారా తన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు..అందరినీ శోకసంద్రంలో ముంచి స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆకట్టుకునే అందం, డబ్బు, అభిమానులు, గొప్ప పేరు...ఇలా అన్నీ ఉన్న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో సెలబ్రిటీల జీవితం పూలపాన్పేమీ కాదని మరోసారి నిరూపితమైంది. అయితే గతంలో సుశాంత్‌ మాదిరిగానే కొందరు తారలు అర్థాంతరంగా తనువు చాలించారు. అయినవాళ్లకు శోకాన్ని మిగిల్చారు. అలా చిన్న వయసులోనే మరణించిన కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
manjula-opens-about-her-depression-and-shares-about-her-shattered-dreams

ఆ రెండూ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి!

‘షో’.. సినిమాతో ఇటు నటిగా, అటు నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైంది మంజుల. తన నట ప్రతిభతో జాతీయ అవార్డుతో పాటు పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. ఈక్రమంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కూతురిగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సత్తా చాటిన ఆమె తాజాగా తన పేరు మీద ఓ వెబ్‌సైట్‌ను, యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఈమేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో మొదటి వీడియో పోస్ట్‌ చేసిన ఆమె.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-became-pregnant-before-marriage

పెళ్లికి ముందే ఆ శుభవార్త చెప్పేశారు!

రెండు హృదయాలను కలిపే అందమైన బంధం ప్రేమ. పెళ్లితో అది నిండు నూరేళ్ల అనుబంధమవుతుంది. అలాంటి అనుబంధం సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే ఇద్దరు ముగ్గురైనప్పుడే! అయితే పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. అయితే రాన్రానూ పాశ్చాత్య పోకడలు మన దేశం వారిపైనా ప్రభావం చూపడం, ఇతర దేశాలకు చెందిన సినీ తారలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడంతో.. పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. ఇందుకు తాజా ఉదాహరణ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రియురాలు, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌. ఈ ఏడాది తొలి రోజే ఉంగరాలు మార్చుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈ ముద్దుల జంట.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నటాషానే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. ఆపై వివాహబంధంతో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tahira-kashyap-pens-about-her-cancer-scars

ఆ మచ్చల్ని దాచద్దు.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి!

క్యాన్సర్‌... మందు లేని ఈ మహమ్మారి గురించి ఎంతోమంది భయపడుతుంటారు. అయితే ఈ భయాన్ని పటాపంచలు చేస్తూ చాలామంది సెలబ్రిటీలు ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో విజయం సాధించి తమ లాంటి క్యాన్సర్‌ బాధితులకు ఆదర్శంగా నిలిచారు. అందులో ఒకరు బాలీవుడ్‌ క్రియేటివ్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌ తహీరా కశ్యప్‌. రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడినా ఆమె మానసిక స్థైర్యంతో ఆ మహమ్మారిని అధిగమించింది. చికిత్స సమయంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ఫొటోలు, అనుభవాలను షేర్‌ చేసుకున్న ఈ ట్యాలెంటెడ్‌ రైటర్‌ ఆ తర్వాత కూడా తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం లాంటివి చేస్తోంది. ఈక్రమంలో ‘నేషనల్‌ క్యాన్సర్‌ సర్వైవర్స్‌ డే’ను పురస్కరించుకుని మరొక స్ఫూర్తిదాయక పోస్టుతో మన ముందుకొచ్చిందీ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sonakshi-sinha-twitter-chat-with-fans

అతడు ఆరడుగులుండాలి.. నన్ను నవ్వించాలి!

కరోనా అందరి జీవితాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర్నుంచి బిజీ లైఫ్‌స్టైల్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఇంట్లో వాళ్లతో గడపడం దాకా.. అందరూ సరికొత్త అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు విభిన్న అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా తమ లాక్‌డౌన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడంలో అందరికంటే ముందుంటున్నారు మన ముద్దుగుమ్మలు. సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అందాల తారలు.. పోస్టులు, ఫొటోలు, వీడియోలు, ఛాటింగ్స్‌ రూపంలో తమ అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ అందాల భామ సోనాక్షీ సిన్హా ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #SonaSays అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ ఛాటింగ్‌లో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఫ్యాన్స్‌ ముందుంచింది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
actress-akkineni-samantha-chitchat-with-fans-in-twitter

ఇప్పటికే మూడు పచ్చళ్ల బాటిళ్లను అవగొట్టేశాను!

ఓవైపు సినిమాలతో మాయ చేస్తూ...మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. పెళ్లయ్యాక నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల తార లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. భర్త నాగచైతన్యతో కలిసి కసరత్తులు, వంటలు చేస్తోంది. అనంతరం ఆ విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది. ఈక్రమంలో తాజాగా ట్విట్టర్‌ అభిమానులతో ముచ్చటించింది సామ్‌. సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి సామ్‌, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
crime-patrol-actress-preksha-mehta-committed-suicide-left-a-chilling-suicide-note

కలలు చెదిరాక ఇక బతకలేనంటూ..!

కరోనా.. ఎందరో ఆశలు, ఆశయాలు, కన్న కలలకు గండి కొట్టింది. ప్రతి ఒక్కరినీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోన్న ఈ మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారు కొందరైతే, ఉపాధి అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తోన్న వారు మరికొందరు. మనలాంటి సామాన్యులే కాదు.. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే కొందరు సినీ తారలు, బుల్లితెర నటీనటులు సైతం గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈక్రమంలో బాలీవుడ్‌ బుల్లితెర నటి ప్రేక్షా మెహతా తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది.

Know More

women icon@teamvasundhara
dia-mirza-diana-penty-aditi-rao-hydari-takes-a-stand-against-period-shaming-undertakes-the-red-dot-challenge

‘ఎర్ర చుక్క’ పెట్టి మరీ దాని గురించి మాట్లాడదాం !

నెలసరి.. మనలో నెలనెలా జరిగే ఈ సహజ ప్రక్రియ దేవుడు మనకు ప్రసాదించిన వరం లాంటిది. కానీ ఇప్పటికీ దీన్నో శాపంలా భావించే వారు మన చుట్టూనే ఎందరో ఉన్నారు. తాము నెలసరిలో ఉన్నామని బయటికి చెప్పకుండా గుసగుసలాడడం, సైగలు చేయడం వంటివి చేస్తుంటారు చాలామంది అమ్మాయిలు. అంతేకాదు.. శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనడానికి కూడా సిగ్గుపడుతుంటారు కొందరు.. ఇక మరికొందరైతే పిరియడ్స్‌ వచ్చిన వారిని వంటింట్లోకి రానివ్వకపోవడం, ఇంట్లో ఏ వస్తువులను తాకనివ్వకుండా.. వారిని అంటరాని వాళ్లలా చూస్తుంటారు. ఇక ఈ సమయంలో ప్రమాదమని తెలిసినా శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనే స్థోమత లేక గుడ్డ వంటివి వాడే వారూ ఉన్నారు. ఫలితంగా వ్యక్తిగత పరిశుభ్రత లోపించి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా పిరియడ్స్‌ విషయంలో చాలామందిలో ఉన్న ఇలాంటి మూఢనమ్మకాలను పారదోలి, నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఏటా మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. మహిళలు-అమ్మాయిల్లో నెలసరి అపోహల్ని తొలగించడానికి, పిరియడ్స్‌ విషయంలో అందరిలో అవగాహన పెంచడానికి యూనిసెఫ్‌ ఇండియా ఈ ఏడాది ఓ సరికొత్త ఛాలెంజ్‌తో మన ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఈ కార్యక్రమంలో భాగం చేసి మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది. మరి, మరి ఇంతకీ ఆ ఛాలెంజ్‌ ఏమిటో, అందులో పాల్గొన్న కొందరు ముద్దుగుమ్మలు నెలసరి గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
konidela-upasana-innovative-dress-gone-viral

భవిష్యత్తు ఇలాంటి ఫ్యాషన్లదే!

మెగా కోడలిగా, రామ్‌ చరణ్‌ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఉపాసన కొణిదెల. అపోలో ఆస్పత్రిలోని హెల్త్‌కేర్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. నలుగురికి ఉపయోగపడే ఏ విషయమైనా అందరితో షేర్‌ చేసుకునే ఉపాసన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, కుకింగ్‌కు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే ఆమె తాజాగా మరో వినూత్న ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఫ్యాబ్రిక్‌, లేటెక్స్‌ వ్యర్థాలతో రూపొందించిన దుస్తులు ధరించి సోషల్‌ మీడియాలో ఫొటోను పోస్ట్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
celebrities-no-make-up-photos-during-lockdown

మేకప్‌ లేకుండానే..!

సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా నిన్నటి వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ 4.0లో మరికొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక షూటింగ్‌ లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే సినీ తారలు కూడా చాలా రోజులు ఇళ్లకే పరిమితమయ్యారు. వీళ్లు కూడా స్వయంగానే ఇంటి పనులు చేసుకుంటున్నారు. ఇక ఎప్పుడూ మేకప్‌తో ఉండే ముద్దుగుమ్మలు కూడా ఇంట్లోనే ఉండడంతో ఎలాంటి మేకప్‌ లేకుండా ఉంటున్నారు. అయితే చాలామంది సినీతారలు మేకప్‌ లేకుండా బయట ప్రపంచానికి పెద్దగా కనిపించరు. కానీ కొంతమంది హీరోయిన్లు ఎలాంటి మేకప్‌ లేకుండా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. తమ అందం సహజమైందని నిరూపిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
tollywood-actress-pragya-jaiswal-chit-chat-with-fans-in-twitter

లాక్‌డౌన్‌లో నేను చేసిన ‘బెస్ట్‌’ పని అదే..!

నటించినవి కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అందాల తార ప్రగ్యా జైస్వాల్. 'కంచె', 'ఓం నమో వేంకటేశాయ', 'నక్షత్రం'.. వంటి చిత్రాలతో ఎవర్‌గ్రీన్ పాపులారిటీని సంపాదించుకుంది. ఉత్తరాదిలోనే పుట్టిపెరిగినా దక్షిణాది తారగా, అందులోనూ తెలుగమ్మాయేనేమో అన్నంత సహజంగా తన పాత్రల్లో ఒదిగిపోయి చక్కటి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా.. తన ట్రెండీ ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని సోషల్‌మీడియాలో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందీ లవ్లీ గర్ల్‌. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా #AskPragya అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిమానులతో ముచ్చటించింది ప్రగ్య. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
interesting-instagram-posts-of-actress-sai-pallavi

ఆ క్షణం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది..!

‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల..’ ‘ఫిదా’ సినిమాలోని ఈ డైలాగ్తో కుర్రకారు మనసుల్ని దోచేసింది అందాల తార సాయిపల్లవి. మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రంలో ‘మలర్’ పాత్రలో నటించి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపుకి తిప్పుకుంది. అనతి కాలంలోనే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ బ్యూటీ. పాత్ర ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ.. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తోందీ మలయాళీ ముద్దుగుమ్మ. ఐదేళ్ల సినీ కెరీర్లో పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ రౌడీ బేబీ.. మే 9 సాయిపల్లవి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఈ క్యూట్‌ బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, వాటికి తానిచ్చిన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
interesting-instagram-posts-of-actress-rai-laxmi

మిమ్మల్ని ఇష్టపడే వాళ్లనే.. మీరూ ఇష్టపడండి!

తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది అందాల తార రాయ్‌ లక్ష్మీ. ‘కాంచనమాల కేబుల్‌ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బాలీవుడ్‌లోనూ నటించిన ఈ బ్యూటీ.. సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫొటోలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. మే 5న లక్ష్మీ రాయ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తను పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు, వాటికి ఇచ్చిన ఆసక్తికరమైన క్యాప్షన్‌లపై ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
interesting-instagram-posts-of-actress-trisha

ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు..!

ఈ తరం నటీమణుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి త్రిష. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. 1999లో వచ్చిన ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. కేవలం నాలుగేళ్లలో ఏడు తమిళ చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ చైన్నై చిన్నది.. రెండో చిత్రం ‘వర్షం’తో ఒక్కసారిగా టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇక అప్పటి నుంచి త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి భారతీయ సినీ పరిశ్రమలో మేటి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది త్రిష.

Know More

women icon@teamvasundhara
here-is-the-list-of-bollywood-beauties-who-are-working-from-home

మేమూ ఇంటి నుంచి పనిచేస్తున్నాం!

కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ వల్ల తమ వృత్తిగత జీవితానికి బ్రేక్‌ పడకూడదన్న ఉద్దేశంతో చాలామంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు కూడా ఈ కొత్త పని సంస్కృతికి శ్రీకారం చుట్టాయి. అయితే మనమే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ముద్దుగుమ్మలు కూడా ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి నుంచే తమ వృత్తిగత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చక్కటి పని వాతావరణాన్ని ఏర్పరచుకొని మనందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పాఠాలు నేర్పుతున్నారు. మరి ఇంతకీ వాళ్లెవరు? వాళ్లు చేస్తోన్న పనులేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
lock-down-rashmika-mandana-insta-chit-chat-with-fans

అలా అయితే జీవితాంతం క్వారంటైన్‌లో ఉండేదాన్నేమో!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే టాలీవుడ్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యేలా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అశేష అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవలే ‘భీష్మ’ సినిమాలో నితిన్‌ సరసన ‘వాట్‌ ఏ బ్యూటీ’ అనిపించుకున్న ఈ కన్నడ బేబ్‌.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఎంతో క్యూట్‌గా, సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ చూద్దామా!

Know More

women icon@teamvasundhara
corona-virus-kanika-kapoor-tops-list-of-celebrities-searched-for-during-lock-down

లాక్‌డౌన్‌ సమయంలో ఈమె గురించే తెగ వెతికారట!

కనికా కపూర్‌...కరోనా వైరస్‌ మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న సెలబ్రిటీ పేరు. అప్పటివరకు కేవలం బాలీవుడ్‌ సింగర్‌గా మాత్రమే పేరున్న ఆమె కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతూ వచ్చింది. లండన్‌ నుంచి వచ్చిన ఆమె పలు వేడుకల్లో పాల్గొనడం, వాటికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకావడం, ఆ తర్వాత ఆమె కరోనా బారిన పడడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోయింది. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కనిక ఆరోగ్య పరిస్థితి ఒక్కో దశలో విషమించిందంటూ వార్తలొచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా కోలుకుందామె. అలా కరోనా కారణంగా అందరి నోళ్లలో నానిన కనిక తాజాగా ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ నెల రోజుల లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఇండియన్‌ సెలబ్రిటీ’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందీ బ్యూటిఫుల్‌ సింగర్‌. ప్రముఖ సెర్చింజన్‌ సంస్థ ‘యాహూ ఇండియా’ ప్రకటించిన ఈ లిస్టులో ఆమె ప్రియాంక చోప్రా, రజనీకాంత్‌ లాంటి సూపర్‌ స్టార్లను వెనక్కి నెట్టి మరీ టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
lock-down-pillow-challenge-see-these-viral-celebrity-photos

దిండ్లలో ఒదిగిపోతున్న అందాల భామలు!

లాక్‌డౌన్‌ కారణంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమవడంతో ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలో ఎవరికీ పాలుపోవట్లేదు. దీంతో కాలక్షేపం కోసం ఒక్కొక్కరూ ఒక్కో దారిని వెతుక్కుంటున్నారు. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మునుపెన్నడూ లేని విధంగా ఇంత ఖాళీ సమయం దొరకడంతో ఎంచక్కా ఇంటిపట్టునే ఉంటూ రకరకాల ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. లాక్‌డౌన్‌ మొదలైన దగ్గర్నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన బోలెడన్ని ఛాలెంజ్‌లను మనం చూసే ఉంటాం. ఇదే విధంగా - ‘పిల్లో ఛాలెంజ్‌’ పేరుతో మరో కొత్త ఛాలెంజ్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటీ ఛాలెంజ్‌? దీన్ని ఎవరెవరు స్వీకరించారు? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
sobhita-dhulipala-takes-stunning-self-timed-photos-for-shoot-amid-lock-down

నా కొత్త ఫ్రెండ్‌ సహకారంతో ఈ ఫొటోలు తీసుకున్నా!

సాధారణంగా మ్యాగజైన్‌ ఫొటోషూట్‌ అంటే ఎవరెవరుంటారు? అందమైన మోడల్స్‌, స్టైలిష్‌ ఫొటోగ్రాఫర్స్‌, ఫ్యాషన్‌ డిజైనర్స్‌, మేకప్‌ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌, లైట్‌బాయ్స్‌... ఇలా చాలామంది ఈ బృందంలో ఉంటారు. వీరందరూ ఎంతో కష్టపడితే కానీ అందమైన ఫొటోలు రావు. అయితే లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లతో పాటు ఫొటోషూట్స్‌కి కూడా కళ్లెం పడింది. ఈ అసాధారణ పరిస్థితుల్లోనూ ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం అందమైన ఫొటోషూట్‌ తీయించుకుంది శోభితా ధూళిపాళ్ల. మరి లాక్‌డౌన్‌ కాలంలో ఈ ఫొటోషూట్‌ తనకు ఎలా సాధ్యమైందనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Know More

women icon@teamvasundhara
anasuya-bharadwaj-chit-chat-with-fans-during-quarantine

పెళ్లి మన జీవితాన్ని ఇంకా బెటర్‌గా మార్చాలి!

అనసూయా భరద్వాజ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సినిమా స్టార్స్‌తో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించు కుందీ క్రేజీ యాంకర్‌. బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే.. వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ అందాల తార. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన అనసూయ.. అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటోంది. తాజాగా #askanasuya పేరుతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్‌ వేదికగా సమాధానాలు చెప్పిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌.. ఇంతకీ, ఆ ప్రశ్నలేంటి? దానికి అను చెప్పిన సమాధానాలేంటో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
masaba-gupta-shares-her-experience-on-her-father-viv-richards-genes

నా శరీరంతో ప్రేమలో పడేందుకు చాలా ఏళ్లు పట్టింది!

సాధారణంగా అందమంటే ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనం ఇస్తుంటారు. తెల్లగా ఉంటేనే అందమని కొందరంటే... సన్నజాజి తీగలా, చక్కని కొలతలతో కూడిన శరీర సౌష్టవముంటేనే అసలైన సౌందర్యమని మరికొందరంటారు. చాలామంది అమ్మాయిలు కూడా అందం విషయంలో ఇవే ప్రామాణికమనుకుంటారు. తమకు ఈ లక్షణాలు లేవని, లావుగా ఉన్నామని, ఛాయ తక్కువగా ఉందంటూ తమలో తామే కుంగిపోయే అమ్మాయిలూ లేకపోలేదు. అయితే ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి, తాము ఎలా ఉన్నా సరే.. తమను తాము అంగీకరించాలని ఎంతోమంది సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు. బాడీ షేమింగ్‌కు సంబంధించి తమ అనుభవాలను పంచుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా కూడా అదే విషయం చెప్పుకొచ్చింది. తన శరీర సౌష్టవం కారణంగా తాను బాల్యంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరిస్తూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది మసాబా.

Know More

women icon@teamvasundhara
shweta-basu-prasad-shared-her-mental-stress-during-lock-down

అమ్మను కనీసం కౌగిలించుకోలేకపోయా!

రోజంతా ఇంటికే పరిమితమవడం.. భవిష్యత్తు గురించి బెంగ.. రోజంతా ఖాళీగా కూర్చోవడం వల్ల మదిలో మెదిలే లేనిపోని ఆలోచనలు.. వెరసి ఈ లాక్‌డౌన్‌ సెలవులు ఎందుకొచ్చాయిరా బాబోయ్‌ అనేలా ఉంది చాలామంది పరిస్థితి. మరి, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం వల్ల సురక్షితంగా ఉంటామా అనే అనుమానాలతో మరింతగా రెట్టింపయ్యే భయం.. ఇలాంటి ఆలోచనలు, భయాలు, ఒత్తిళ్లతో మీరే కాదు.. మేమూ సతమతమవుతున్నామంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఈ లాక్‌డౌన్‌ వేళ తాము ఎదుర్కొంటోన్న మానసిక సమస్యల గురించి పంచుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు పాటించే చిట్కాలను వివరిస్తూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతున్నారీ తారలు. మరి, ప్రస్తుతం చాలామంది మానసిక పరిస్థితిని ప్రతిబింబిస్తోన్న వారి మాటలను, మనసులోని భావాలను మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
here-are-the-experiences-of-celebrities-who-got-cured-from-corona

కరోనా కోరల నుంచి అలా బయటపడ్డాం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. వీరిలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘మాకు కరోనా లక్షణాలున్నాయి’ అంటూ ప్రపంచానికి ధైర్యంగా ప్రకటించిన సెలబ్రిటీలలో ప్రముఖ హాలీవుడ్‌ జంట రీటా-విల్సన్‌, టామ్‌ హాంక్స్ కూడా ఉన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి ప్రారంభ దశలో ఉండగానే తమలో ఈ వైరస్‌ లక్షణాలున్నాయని గమనించిన వీళ్లు ఆలస్యం చేయకుండా చికిత్స కోసం వెంటనే ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ లో గడిపిన టామ్‌, రీటా జంట.. ఆ వ్యాధి నుంచి కోలుకొని మార్చి 29న తమ ఇంటికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వ్యాధికి సంబంధించి తన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ ద్వారా పంచుకుంది రీటా.

Know More

women icon@teamvasundhara
heroine-nidhi-agarwal-twitter-chat-with-her-fans

నేను ప్రశాంతంగా ఉండడానికి కారణమదే!

‘మున్నా మైఖేల్’ అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. అనంతరం నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది. ఇక రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోందీ భామ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ వేళ లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతోంది నిధి. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం అభిమానులతో టచ్లోనే ఉంటోన్న ఈ బ్యూటీ.. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ క్రమంలో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలు.. వాటికి నిధి ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు మీకోసం...

Know More

women icon@teamvasundhara
hina-khan-teaches-how-to-prepare-re-usable-face-mask-at-home

హీనాను ఫాలో అయిపోదాం.. ఇంట్లోనే మాస్క్‌ తయారుచేద్దాం..!

కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధి కావడం వల్ల బయటకు వెళ్లిన ప్రతిసారీ ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరిగా మారింది. ఇలా అందరికీ మాస్క్‌లు అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాటికి కొరత ఏర్పడింది. దీని వల్ల డాక్టర్లకు, నర్సులకు, చికిత్స పొందుతున్న వారికి మాస్క్‌లు సరిపడక ఇబ్బంది పడుతున్నారు. దీనిని పరిష్కరించడానికి సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మాస్క్‌లను సొంతంగా ఇంటిలో తయారుచేసుకోమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంట్లోనే మాస్కుల్ని ఎలా తయారుచేసుకోవాలో తెలియజేసే వీడియోల్ని సైతం పోస్ట్‌ చేస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. తాజాగా బుల్లితెర స్టార్‌ హీనా ఖాన్‌ కూడా అదే పనిచేసింది. ఇంట్లో తానే స్వయంగా మాస్క్‌ను తయారుచేసిన వీడియోను తన అభిమానులతో పంచుకుంది. మరి, హీనా మాస్క్‌ తయారీ గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tollywood-star-manchu-lakshmi-interesting-posts-during-quarantine

నిత్యం బిజీబిజీగా గడిపే మనకు ఇదొక చెక్‌ పాయింట్‌!

లాక్‌డౌన్‌.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని బహుశా ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. కానీ కరోనా కారణంగా మనం అటువంటి రోజుల్ని చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు తమ ఇళ్లలో ఉంటూనే అభిమానులకు తమ విలువైన సందేశాలను అందిస్తూ.. స్వీయ నిర్భంధం సమయంలో వారెలా గడుపుతున్నారో అందరితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ బ్యూటీ మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఇదే పనిలో ఉంది. ఇంట్లో తాను స్వీయ నిర్బంధం పాటిస్తూనే తన అభిమానులకు కరోనా జాగ్రత్తలు చెబుతోంది లక్ష్మి. అంతేనా.. అమ్మలందరికీ పేరెంటింగ్‌ పాఠాలు కూడా చెబుతోందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లో ఉంటోన్న చిచ్చర పిడుగుల్ని అదుపు చేయడానికి కొన్ని టిప్స్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ అందాల అమ్మ. మరి, ఈ మంచు బ్యూటీ చెప్పిన ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
neha-sharma-insta-chit-chat-with-fans

women icon@teamvasundhara
celebrities-donates-to-save-people-from-corona

మనమంతా కలిసికట్టుగా ఈ యుద్ధాన్ని జయిద్దాం..!

కరోనా నుంచి మానవాళిని రక్షించేందుకు యావత్‌ ప్రపంచం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి తగిన వైద్య సేవలు అందించేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యపై పోరాడేందుకు కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఈ క్రమంలో తమకు తోచిన నగదును ‘ప్రధాని సహాయ నిధి’కి విరాళంగా ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందించేందుకు సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ముందుకొస్తుండడం విశేషం. ఈ ఆపద సమయంలో దేశ ప్రజలకు అండగా నిలుస్తూ వాళ్లు తమ మంచి మనసును చాటుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
singer-shweta-pandit-shares-her-experience-quarantine-in-italy

అంబులెన్స్‌ సైరన్‌ వింటూనే నిద్రపోతున్నా.. నిద్రలేస్తున్నా..!

చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఇటలీ పాలిట పెనుశాపంగా మారింది. ప్రపంచంలో అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆ దేశంలో ప్రస్తుతం కొవిడ్‌-19 కరాళ నృత్యం చేస్తోంది. దీని కారణంగా ఆ దేశంలో ఇప్పటికే సుమారు 12 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా దాటికి అక్కడ రోజుకు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదులుతుండగా, వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఆధ్వాన్నంగా మారడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం ఇటలీకి వెళ్లిన ప్రముఖ భారతీయ గాయని శ్వేతా పండిట్‌ కూడా అలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ దేశం నుంచి స్వదేశానికి తిరిగొచ్చే అవకాశం గత కొన్ని రోజుల క్రితం వరకు ఉన్నప్పటికీ తన వల్ల ఇక్కడి వారు ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో అక్కడే ఆగిపోయింది శ్వేత. దీంతో ప్రస్తుతం అక్కడే స్వీయ నిర్బంధంలో ఉంటోన్న ఆమె అక్కడి భయానక పరిస్థితులను, తన సెల్ఫ్‌ క్వారంటైన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
kanika-emotional-post-about-her-kids-and-family

ఈసారైనా నెగెటివ్‌ రావాలని కోరుకుంటున్నా..!

కరోనా వైరస్‌ ఎవ్వరినీ వదిలి పెట్టట్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. మార్చి 9న లండన్‌ నుంచి ముంబై వచ్చిన కనిక.. అక్కడి నుంచి కాన్పూర్‌, లక్నో వెళ్లింది. అక్కడ ఓ విందులో ప్రముఖులతో పాల్గొంది. ఆ తర్వాత కరోనా లక్షణాలతో బాధపడడంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న కనిక తాజాగా ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్‌ అందరినీ ఒకింత భావోద్వేగానికి గురిచేస్తోంది.

Know More

women icon@teamvasundhara
emma-watson-shares-tips-to-spend-qurantine-time

వీళ్ల కోసం నేను స్వీయ నిర్బంధంలో ఉంటున్నా..!

కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలకు ఇది ఓ అరుదైన అవకాశమనే చెప్పాలి. దీంతో ఈ లాక్డౌన్ సమయాన్ని వాళ్లు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది సెలబ్రిటీలు ఇంటి పనులు చేయడంలో నిమగ్నమైతుంటే.. కొంతమంది మాత్రం ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కాలక్షేపం కోసం చేయగలిగే పనుల గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ భామ ఎమ్మా వాట్సన్ కూడా ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కొన్ని మార్గాల గురించి చెబుతోంది. అవేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
manila-pradhan-bags-supermodel-of-the-year-title

ఈ విజయం కల కాదు.. అంతకుమించి !

అందాల పోటీలు అనగానే అనాదిగా వస్తున్న కొన్ని మూస ప్రమాణాలు అతివల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా తెల్లగా ఉంటేనే అందమని, పొడవైన వెంట్రుకలు, చక్కని శరీర సౌష్టవముంటేనే అసలైన సౌందర్యమన్న భావనలు వారిని వెంటాడుతుంటాయి. అయితే అందమంటే రంగు, రూపులో ఉండదని..ఆలోచనలు, ఆత్మవిశ్వాసంలో ఉంటుందని ఇప్పటికే చాలామంది అందాల రాణులు నిరూపించారు. ఈ కోవకే చెందుతుంది సిక్కింకు చెందిన మనీలా ప్రధాన్‌. ‘అందమంటే ఇదే.. సౌందర్యమంటే ఇలాగే ఉండాలి’ అన్న మూస ధోరణులను బద్దలు కొడుతూ ఎంటీవీ ‘సూపర్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచిందీ 21ఏళ్ల సుందరి. చూడడానికి అచ్చం చైనీస్‌ యువతిలాగా కనిపించే ఈ అందాల రాణి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
bollywood-celebrities-insta-posts-on-raising-the-awareness-about-corona-virus

కరోనా కాటు వేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట! రోజురోజుకీ కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్లు కనీసం తుమ్మినా, దగ్గినా అది కరోనా వల్లనేమో అనే ఆలోచనే ముందుగా మన మనసులోకొస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మన దేశంలో కూడా రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైరస్‌ పట్ల అవగాహన తెచ్చేందుకు ప్రభుత్వాలు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు సైతం కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుంటున్నారు. వివిధ పోస్టులు, వీడియోలను షేర్‌ చేస్తూ ‘కరోనాకు భయపడద్దు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండం’టూ స్ఫూర్తి నింపుతున్నారు. ఈ లిస్టులో తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియంక చోప్రా, అందాల భా