సుమక్క ఎనర్జీ సీక్రెట్ ఇదేనట!
గలగల పారే సెలయేరుల్లాంటి మాటలు, సందర్భానికి తగినట్లుగా సంధించే హాస్యఛలోక్తులు, ముఖంపై చెరగని చిరునవ్వుతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది స్టార్ యాంకర్ సుమ కనకాల. తాను స్టేజీ మీదకు అడుగుపెట్టిందంటే అటు ప్రేక్షకుల్లో, ఇటు టీవీల ముందు కూర్చున్న మహిళామణుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. మరి, మనలో ఇంతటి ఎనర్జీని బూస్టప్ చేస్తోన్న మన సుమక్క ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ఆ రహస్యాన్ని ఇటీవలే బయటపెట్టిందీ సూపర్బ్ యాంకర్. అంతేనా.. తాను ఇంత అందంగా, యాక్టివ్‌గా ఉండడానికి తాను పాటించే ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లే కారణమని చెబుతూ తన డైట్ సీక్రెట్స్‌ని ఓ వీడియోలో భాగంగా పంచుకుంది సుమ. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..