ఈ వార్త వింటే మీరు ‘దిల్ తో పాగల్ హై’ అనాల్సిందే..!
బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరుగాంచిన అలనాటి అగ్రకథానాయిక మాధురీ దీక్షిత్.. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తన కెరీర్‌కు కాస్త విరామమిచ్చి, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ అందాల అమ్మ.. ‘టోటల్ ఢమాల్’, ‘కళంక్’ వంటి సినిమాలతో మరోసారి అభిమానులను అలరించింది. ఈ క్రమంలో ప్రేక్షకులకు మరింత చేరువవడానికి త్వరలోనే డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టబోతోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆన్లైన్లో సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు వేదికగా మారి ఎనలేని ఆదరణ పొందుతున్న ‘నెట్‌ఫ్లిక్స్’లో నటిగా తను భాగం కాబోతున్నానని ప్రకటించింది మాధురి. ఇందులో భాగంగా కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో నటించేందుకు సిద్ధమైందీ బాలీవుడ్ బ్యూటీ. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా, మాధురీ దీక్షిత్, కరణ్ జోహర్ తమ తమ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ప్రకటించారు.