సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

Æ®¾-©ãjÊ ®¾«Ö-ÊÅŒy¢ ƒ¢éÂ-X¾Ûpœ¿Õ?

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

కాలం మారింది పరిస్థితులూ మారాయి ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. కానీ ఇంఅా చాలా చోట్ల పగ్గాలు మగవాడి చేతిలోనే ఉంటున్నాయి. తనకన్నా ఆడదానికి తెలివెక్కువ అన్న విజ్ఞానాన్ని అతనెలాగా జీర్ణించుకోలేకపోతున్నాడు. దానికి వంత పాటగా యాచకో యాచక శత్రుః అన్నట్లు ఆడవారిని ఆదవారు పొగడరు సరికదా వాళ్ళాయన చెసి ఆవిడ పేరు పెడుతున్నాడు అన్న మాటలు జారుతారు.మార్పుకు నడుంకట్టాల్సింది మాతృమూర్తులే.చిన్నప్పుడు పెంపకంలో ఆడపిల్ల దేంట్లోనూ తక్కువ కాదని,అలాగే మగపిల్లవాడికి ఆడదాన్ని ఎలా గౌరవించాలో ఆమె చెయ్యలేని పని లేదన్న విషయం అవగాహన కలిగించాలి.మగవారి దృక్పధంలో మార్పు రావాలి. స్త్రీ అన్నది గౌరవించాల్సిన వ్యక్తి కానీ తన కోర్కెకు బలయ్యే ఆటబొమ్మ కాదన్న జ్ఞానం కలగిననాడే స్త్రీకి స్వేచ వచ్చినట్లు,అప్పుడే స్త్రీకి మగవాడితో సమానత్వం వచ్చినట్లు. ఏరోజైతే ఆడది తనను ఏ క్రూర మృగాలూ వేటాడవన్న ధీమాని పొందగలిగిన నాడు మహిళాదినోత్సవానికి సార్ధకత చేకూరుతుంది సుజల గంటి (అనురాధ) రచయిత్రి

sujala ganti, hyderabad -kondapur
answer

టెక్నాలజీ ఎంత వృద్ధి చెందినా ఆడవారి జీవితాలలో మాత్రం ఆశించినంత మార్పు రావడం లేదు. వారిని కట్టుబాట్లు పేరు తో ఇంటి బాధ్యతలతో కట్టి పడేస్తుంది ఈ సమాజం. పురుషుడితో సమానముగా సంపాదిస్తున్న ఆర్ధిక స్వాతంత్ర్యం వుండటం లేదు స్తీలకి. తరతరాలుగా పాతుకుపోయిన మూఢ నమ్మకాలకి ఆడది బలైపోతూనే వుంది. మార్పు రావాలి. కాదు - మనమే తీసుకురావాలి. ప్రతి స్త్రీ తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకోవాలి. ఈనాడు గవర్నమెంట్ కుడా ఎన్నో రకాలుగా స్త్రీలకి తమ ప్రతిభని నిరుపించుకొనే అవకాశాల్ని కల్పిస్తుంది. ప్రతి మహిళా చదువుకోవాలి. ఆర్ధికంగా స్థిరపడాలి. ఎవరి అండదండలు లేకుండా కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలో వుంచాగాలిగేది ఒక్క మహిళా మాత్రమే. ప్రతి స్త్రీ తన ఇంటి పనులకి, పిల్లల పెంపకం తోనే ఆగిపోకూడదు. బాద్యతలన్ని మోసే క్రమంలో తన జీవితాన్నే పణంగా పెడుతుంది స్త్రీ . తను ఎదగాలి. ఎదురయ్య అవరోదాల్ని ధైర్యంగా ఎదిరించాలి. దానికి కుటుంబ సభ్యుల సహకారం కూడా చాల అవసరం. తను చేసే పని మంచిది, పదిమందికి ఉపయోగ పడుతుంది అన్నప్పుడు ఎన్ని కష్టాలొచ్చిన వెనకడుగు వేయకూడదు. మనమీద మనకి నమ్మకం వుండాలి. ఎదుటివారికి నమ్మకాన్ని కలిగించాలి. అవసరం అయితే కుటుంబ సభ్యులని ఒప్పించాలి. అంతేగాని ఎప్పుడు నిరాసపదకూడదు. తల్లిదండ్రులు కూడా కొడుకుని, కూతురిని సమానంగా చూడాలి. ఒకరు ఎక్కువ - ఒకరు తక్కువ కాదని చెప్పాలి. ఆడ మగ అని కాకుండా మనిషిని మనిషిలా చూడటం నేర్పించాలి. అలా ప్రతి ఇంటిలో జరిగితే , ఆడవారి జీవితాలలోనే కాకుండా, సమాజంలోనే ఎన్నో మంచి మార్పులు వస్తాయి.

VARALAKSHMI, BOWENPALLY, SECUNDERABAD
answer

"మహిళా సమానత్వం" అనే పదానికి ఎందరో ఎన్నో నిర్వచనాలిచ్చారు. నా దృష్టిలో పదవుల్లో భాగం పంచి ఇవ్వడమో, పక్కనే కూర్చి వేయటమో, సమాన వేతనం ఇవ్వడమో ఇవన్నీ కాదు. ఇవి భౌతికమైనవి. మనస్సు మూలాల్లోంచి వ్యక్తమయ్యే సమ ఆదరణే అన్నింటికన్నా ప్రధానం. అయినా స్త్రీలు ఏదో ముష్టి వారిలాగా సమంగా చూడండి అని అడుక్కోవడం ఏంటి? అధికంగా చూడమని అడగాలి నిజంగా మనం చేస్తున్న సేవలకి. కాదని చెప్పమనండి ఎవర్నైనా? బిడ్డ కడపులో పడ్డపట్నుంచి ఎంత యాతన. ఏదీ తినలేం, తాగలేం. కూర్చోలేము, పడుకోలేము. నిలబడలేము. ఒకటే తిప్పేయడం, కడుపులో నొప్పి, పైగా గర్భంలో తన్నడం. ఏదైనా తిందామంటే లోపలి బిడ్డకు ఏం చేస్తుందో అనే భయంతో త్యాగాలు. ప్రసవయాతన, బిడ్డ బయటకు వచ్చే క్షణంలో అనుభవించే నొప్పులు, సర్జరీ చేయించుకున్నాకా వెన్నెముక పటుత్వాన్ని కోల్పోయి భావి జీవితం అంతా నరకప్రాయం. పుట్టిన దగ్గర్నుంచి కంటిమీద కునుకు లేకుండా ప్రతిరోజు ఆలనపాలన. రాత్రిళ్లు నిద్దరపోకుండా బిడ్డ యోగక్షేమాలు. అశుద్ధాన్ని సైతం, కక్కి పోస్తే, విసర్జిత పదార్థాలను కూడా ఏవగించుకోకుండా ఎంత చేస్తాం? ఒక మహిళ ఒక జీవితకాలంలో ఒక బిడ్డకు చేసే దానిలో ఇప్పటిదాకా చెప్పింది 2శాతం మాత్రమే? అదే బిడ్డకు, ఇతర బిడ్డలకు జీవితాంతం ఎంత చేస్తాము? ఇంక భార్యగా, అక్కగా, చెల్లిగా ఇంకా ఎన్నిపాత్రల్లో ఎంతెంత చేస్తాము? ఇంత చేస్తే ప్రతిఫలం దక్కేది ఏమిటి? వయస్సోస్తే బయటకు వెళితే మృగాళ్ల చూపుల వేట, తూటాల వంటి మాటలు, ఆఘ్రాణించేయాలనే స్వభావం, పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి, ఇంట పనిచేయాలి? మన పనిగంటలు 24 గంటలూ......... ఓ తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాలి ఓ భార్యగా సేవలు అందించాలి ఓ కుమార్తెగా సాయపడాలి ఓ కోడలిగా బాగోగులు చూడాలి మనమో గడియారం, మనం అందర్నీ మేలుకొలిపే అలారం మనమో వంటమనుషులం మనమో సేవకురాలం పిల్లలని చదివించే ఉపాధ్యాయులం వండి వార్చే వంటమనుషులం ఇంటిల్లపాదికి వడ్డించే వెయిటర్లం జబ్బు చేస్తే సేవ చేసే నర్సులం అందరికీ మనమో సహాయకులం ఇంటికి కావలిదారులం మనమే సెలవులు లేని సౌకర్యప్రదాతలం ఆఫీసులోనే తప్ప మనకి ఇంట్లో సిక్‌ లీవ్స్‌ ఉండవు ఇంటి మొత్తానికి చేసే సేవలకు ఎర్న్‌డ్‌ లీవ్స్‌ లేవు ఫోన్‌లో ఆదేశాలు తీసుకుని పాటించే వ్యక్తులం చివరగా మహిళలు అంటే ఉప్పులా సమపాళ్లలో ఉంటే ఎవరూ గుర్తించని వాళ‌్లం మన సేవలు లేనప్పుడే గుర్తుకు వచ్చే మనుషులం ఇదీ సగటు భారతీయ మహిళల ఆవేదన. మగవాడికి కృతజ్ఞత అనేది నిజంగా ఉంటే స్త్రీని చూడాగానే రెండు చేతులు జోడించాలి. ఆ సంస్కారబలాన్ని పెంచేలా కేజీ చదువు నుంచి పీజీ వరకూ పాఠ్యాంశాలు పెట్టాలి. ఆడవారిని అవమానపరిస్తే కఠిన శిక్షలు విధించాలి. -డా.రేణుక, ఫిజియోథెరపిస్టు, వనస్థలిపురం, 99893-08782

Dr.Renuka, Hyderabad

All Topics