న్యూ ఇయర్ లో హ్యాపీగా ఉండడానికి మీరేం చేయాలనుకుంటున్నారు?
సరిగ్గా ఏడాది క్రితం ఫుల్ జోష్తో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాం. కొత్త సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలి అని ఎన్నో ప్రణాళికలేసుకున్నాం.. ఇవేవీ వర్కవుట్ కాకుండా మన సంతోషాన్ని పూర్తిగా లాగేసుకుంది కరోనా మహమ్మారి. అనుకున్న పనులన్నింటికీ ఆటంకం కలిగించింది. ఇలా పనులు పూర్తికాక కొందరు, ఉద్యోగాలు పోయి మరికొందరు, తినడానికి తిండి లేక ఇంకొందరు.. ఈ ఏడాది ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. ఇలా ఈ కారణాలన్నీ అంతిమంగా మన మానసిక ఆరోగ్యం పైనే దెబ్బ కొట్టాయి. కొంతమందైతే ఈ పరిస్థితుల్ని భరించలేక ఆత్మహత్యల దాకా కూడా వెళ్లారు.
ఇన్ని జరిగినా ఇంకా కరోనా మన మధ్యే ఉంది. కొత్త రూపు దాల్చి మనపై విరుచుకుపడడానికి రడీగా ఉంది. మరి, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా ఉండడం ముఖ్యమంటున్నారు నిపుణులు.
ఈ క్రమంలో- కొత్త సంవత్సరంలో మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండడం కోసం మీరు తీసుకున్న నిర్ణయాలేమిటి? మీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటున్నారు..? కరోనా సృష్టించిన కల్లోలాన్ని అధిగమించి ఆనందంగా జీవించడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి..!
Also Read: ఈ అలవాట్లతో కొత్త ఏడాదంతా హ్యాపీగా ఉండచ్చు!