రేపిస్టులకు ఎలాంటి శిక్ష సరైనది?
మార్కెట్కు వెళ్లి ఇంటికి తిరిగొస్తోన్న బాలికను కాపు కాసి మరీ కాటేశారు ఐదుగురు కామ పిశాచులు.
ఇద్దరు పిల్లల తల్లి తనకూ తల్లిలాంటిదేనన్న విచక్షణ మరిచి ఆ చిన్నారుల ముందే కీచక పర్వానికి ఒడిగట్టారు ఇద్దరు మృగాళ్లు!
దేశం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఆడవారినే తప్పుపడుతోంది సమాజం. అప్పటికే శరీరంపై అయిన గాయానికి తోడు ‘ఆడపిల్లకు అంత రాత్రి పూట బయట ఏం పని?’, ‘మగ తోడు లేకుండా ఒంటరిగా వెళ్తే ఇలాంటివే జరుగుతాయి’ అంటూ నలుగురూ అనే సూటిపోటి మాటలు తూటాల్లా వారి గుండెలకు గుచ్చుకుంటున్నాయి.
ఇలా అత్యాచార ఘటనలు వెలుగు చూసిన ప్రతిసారీ నిందితులకు వేసే శిక్షల గురించి చర్చకు రావడం సహజమే. ఇటీవలే పాకిస్థాన్లో ఓ తల్లిపై జరిగిన ఇలాంటి అమానవీయ ఘటన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ ‘ఇలాంటి నీచమైన వ్యక్తులను ఉరి తీయడం లేదంటే పురుషత్వం కోల్పోయేలా (క్యాస్ట్రేషన్) చేయడమే సరైన శిక్ష’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరి, ఇలాంటి మృగాళ్లకు ఏ శిక్ష విధిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పక్కన పెట్టి.. బాధిత మహిళల్నే నిందించడం ఎంత వరకు సమంజసం?
మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి.. అత్యాచారాలకు వ్యతిరేకంగా మీ గళాన్ని వినిపించండి!
Also Read:
రేపిస్టులకు అక్కడ వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?