కరోనాతో యుద్ధం... మానసిక స్థైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
కరోనా సృష్టించిన కల్లోలం అడ్డూ అదుపూ లేకుండా ఇంకా కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తూ ఎందరో ప్రాణాలను కబళిస్తోంది...
అనుక్షణం భయం నీడలు వెంటాడుతున్నా బతుకు తెరువు కోసం బిక్కు బిక్కుమంటూనే బయటకు వెళ్లాల్సి వస్తోంది.. వృత్తి ఉద్యోగాలు నిర్వహించాల్సి వస్తోంది.. జీవితాన్ని కొనసాగించాల్సి వస్తోంది..
ఈ క్రమంలో- మనలో గూడు కట్టుకున్న భయాందోళనలను ఎలా అధిగమించాలి?
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో యుద్ధం చేస్తూనే జీవితాన్ని ఎలా కొనసాగించాలి?
ధైర్యంగా ఎలా ముందడుగు వేయాలి? మానసిక స్థైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
మీ సూచనలు, సలహాలను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి.
అలాగే- వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు అంతులేని ఆత్మ స్థైర్యంతో కరోనాని జయించిన యోధులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. మీకు తెలిసిన అలాంటి వారి విజయగాధలను కూడా పంచుకోండి..
కరోనా పై పోరులో మీ వంతు పాత్ర పోషించి, నలుగురికీ స్ఫూర్తిదాయకంగా నిలవండి! అందరిలోనూ మానసిక స్థైర్యాన్ని నింపండి!