కరోనాతో మీరెలా సహజీవనం చేస్తున్నారు?
కరోనా వచ్చింది.. లాక్డౌన్ తెచ్చింది. దీంతో అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, వేడుకలు వాయిదా వేసుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. అవకాశం ఉన్న వారు ఇంటి నుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఇలా స్వీయ నిర్బంధంలోనే దాదాపు రెండు నెలలు గడిచాయి. అయినా కరోనా మనల్ని వెంటాడడం ఆపలేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ వైరస్ మనల్ని నీడలా తరుముతూనే ఉంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాతో మనకు సహజీవనం తప్పదంటూ ప్రభుత్వం దశల వారీగా సడలింపులు ఇస్తోంది.
ఈ నేపథ్యంలో చాలామంది మళ్లీ తమ ఉద్యోగాలకు తిరిగి హాజరవుతున్నారు. వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఇన్నాళ్లూ ఆగిపోయిన జీవితాన్ని మళ్లీ నిదానంగా ప్రారంభిస్తున్నారు.
మరి, కరోనా లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా తిరిగి మీ జీవితాన్ని ఎలా ప్రారంభించారు? ఈ వైరస్‌తో మీరెలా సహజీవనం చేస్తున్నారు? మీ దైనందిన జీవితంలో, వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు-చేర్పులు చేసుకున్నారు? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? మీ అనుభవాలను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి. నలుగురికీ ఉపయోగపడే చక్కటి సలహాలతో స్ఫూర్తిదాయకంగా నిలవండి!