మీ లాక్డౌన్ అనుభవాలను మాతో పంచుకోండి!
మొన్నటిదాకా ‘అబ్బా.. ఎప్పుడెప్పుడు సెలవు పెట్టుకుందామా.. ఈ పని ఒత్తిడి నుంచి కాస్త విశ్రాంతి తీసుకుందామా..’ అని ఎదురుచూశాం. మన దురదృష్టమో, అదృష్టమో తెలియదు కానీ.. కరోనా పుణ్యమాని ఒకటా, రెండా ఏకంగా 21 రోజుల పాటు గడప దాటకుండా ఇంట్లోనే ఉండాలంటూ కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. ఇక ఇప్పుడేమో అటు బయటికి వెళ్లలేక, ఇటు ఇంట్లో బోర్ కొట్టినా కాలు నిలపలేక సతమతమైపోతున్నారు చాలామంది. అయితే ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల్ని కళ్లకద్దుకొని.. తమ భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేసుకునే వారు కొందరైతే.. తమ అభిరుచులకు పదును పెడుతూ ఎన్నో నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటున్నారు మరికొందరు. ఇంకొందరేమో సినిమాలు చూస్తూ, ఇంట్లో వాళ్లతో గడుపుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు.
మరి, ఈ లాక్డౌన్ సెలవుల్ని మీరెలా గడుపుతున్నారు?మీ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారా? ఆరోగ్యం-ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నారా? కుటుంబంతో గడుపుతూ అనుబంధాన్ని పెంచుకుంటున్నారా? మీ పిల్లలకు మీరే గురువుగా మారి వారికి నచ్చిన స్కిల్ నేర్పిస్తున్నారా? లేదంటే ఈ సమయమంతా వినోదానికే కేటాయిస్తున్నామంటారా? ఇలా ఈ లాక్డౌన్ సమయంలో మీరు నేర్చుకున్న పాఠాలు, మీకెదురైన అనుభవాలను, అనుభూతులను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి. ఎవరింట్లో వాళ్లు ఉన్నా ఒకరికొకరం తోడున్నామన్న భావనను అందరికీ కలిగించండి..!