మీ జీవితంలో వెలుగులు నింపిన ‘ఆదర్శ మూర్తి’ ఎవరు?
ఎలాగైతే కొవ్వొత్తి తనని తాను దహించుకుంటూ లోకానికి వెలుగునిస్తుందో.. మహిళ కూడా అనునిత్యం తనను తాను మలచుకుంటూ కుటుంబ బాధ్యతలకు అంకితమవుతుంది. అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఇల్లాలిగా.. ఇలా తన జీవితంలోని ప్రతి దశనూ తన కుటుంబానికే ధారపోస్తుంది. అనుక్షణం కుటుంబ సభ్యుల సంక్షేమాన్నే కాంక్షిస్తుంది. అంతేనా.. తనలోని శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తూ తానొక అబల కాదు.. సబల అని ప్రపంచానికి చాటుతుంది. నలుగురికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇలా స్త్రీ అంటేనే ఒక మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత, ఆదర్శ మూర్తి.
మరి, మీ జీవితంలోనూ ఇలాంటి స్ఫూర్తిదాయక మహిళలున్నారా? అయితే వారు మీకు ఎలా ఆదర్శంగా మారారు? వారిలో మిమ్మల్ని బాగా ప్రేరేపించిన అంశమేంటి?
‘వసుంధర.నెట్’ వేదికగా మీ అనుభవాలు, అనుభూతుల్ని అందరితో పంచుకోండి. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మన జీవితంలో వెలుగులు నింపిన అలాంటి మహిళల్ని, వారు చూపిన మార్గాన్ని మరోసారి స్మరించుకోవడం సందర్భోచితం.