మీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి??

ప్రేమ.. రెండక్షరాల పదం.. రెండు గుండెల లయ. మనసుకు మనసుకు మధ్య వారధిగా నిలిచి ఆ రెండు మనసుల్ని ఏకం చేసే ఈ అందమైన భావనను వ్యక్తపరచుకోవడానికి చాలామంది దృష్టిలో ‘ప్రేమికుల దినోత్సవ’మే ఓ మంచి తరుణం. పాశ్యాత్య సంస్కృతిలో పుట్టినా క్రమక్రమంగా అన్ని దేశాలకూ విస్తరించిన ఈ ప్రత్యేకమైన రోజున తమ మనసుకు నచ్చిన వారికి మెచ్చిన బహుమతి అందిస్తూ తమ మనసులోని ప్రేమను వ్యక్తపరుస్తుంటారు ప్రేమపక్షులు.
మరి, అలాంటి అమర ప్రేమికుల్లో మీరూ ఒకరా? అయితే ఈ వేలంటైన్స్ డే మీకెంత ప్రత్యేకం? అసలు ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుపుకోవడానికి ‘వేలంటైన్స్ డే’ లాంటి ప్రత్యేక సందర్భాలు అవసరమేనా? ప్రేమకు మీరిచ్చే అసలైన నిర్వచనం ఏమిటి? ఈ ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా ‘ప్రేమ’పై మీ విలువైన అభిప్రాయాలను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి.