మీ ‘సంక్రాంతి’ సంబరాలు పంచుకోండి!

నట్టింట కాలుపెట్టే పాడిపంటల సిరులు, పుట్టింట దీపం పెట్టే ఆడపడుచుల సందళ్లు, రంగవల్లులతో రంగులు పులుముకున్న వాకిళ్లు, ముగ్గులకు అందాన్నిచ్చే గొబ్బిళ్లు, ఆకాశమే హద్దుగా సాగే గాలిపటాల పోటీలు.. పట్టణవాసుల్ని పల్లెలకు తరలించే ఈ సంబరాల సంక్రాంతి రోజున తెలుగు ఆడపడుచుల సొగసు-సోయగం వర్ణనకు అతీతం. పట్టుచీరలు, పావడాల వయ్యారాలతో తెలుగు లోగిళ్లన్నీ పండగ శోభను రెట్టిస్తాయి. ఆ అందాల్ని ఫొటోలు, వీడియోల్లో బంధిస్తూ మెరిసి మురిసిపోతాయి. మరి, ఇలాంటి చలి పండగను ఈసారి మీరెలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? తెలుగందం ఉట్టిపడేలా ఎలాంటి అటైర్లో ముస్తాబవ్వాలనుకుంటున్నారు? ఇంటికొచ్చే అతిథుల కోసం ఏయే వంటకాల్ని సిద్ధం చేస్తున్నారు? ఇలా మీ సంక్రాంతి వేడుకల్ని అక్షరీకరించి ‘వసుంధర.నెట్’ వేదికగా మాతో పంచుకోండి.. మీ పండగ సరదాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ బంధుమిత్రులకు తెలియజేయండి.