సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

ఇకనైనా అకృత్యాలు ఆగుతాయా?

doescrimessopnowDF1.jpg

ఆమె అమాయకురాలు.. నోరులేని మూగజీవాలకు చికిత్స చేసి వాటికి ప్రాణం పోసే దయార్థ్ర హృదయురాలు.. అలాంటి అభం శుభం తెలియని ‘దిశ’ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు మృగాళ్లు. ‘దిశ’ హత్యోదంతంతో తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్‌ భారతావని కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఆ నలుగురు కామాంధులకు ఉరే సరి అంటూ నినదించింది.

doescrimessopnowDF2.jpg

అన్యాయంగా ‘దిశ’ను పొట్టనబెట్టుకున్న మదగజాల గుండెలు చీల్చుతూ న్యాయాన్ని గెలిపించారు తెలంగాణ పోలీసులు. సీన్‌ రీకస్ట్రక్షన్‌లో భాగంగా దిశను హత్యాచారం చేసిన చోటే ఆ కామ పిశాచుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడంతో సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘న్యాయం గెలిచింది’, ‘దిశకు ఇదే నిజమైన నివాళి’, ‘ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ పేరుతో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్‌’, ‘రేపిస్టులకు ఇలాంటి కఠిన శిక్షలు అమలు చేస్తేనే మరొకరు ఇలా చేయడానికి భయపడతారు..’ అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

doescrimessopnowDF3.jpg

మరి, రేపిస్టులకు ఇలాంటి శిక్షలు విధిస్తే నిజంగానే ఆడపిల్లలపై జరిగే అకృత్యాలు ఆగుతాయా? ఇకనైనా మగాళ్ల భయం లేకుండా మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలరా? వారి భద్రతకు సమాజం భరోసా ఇవ్వగలదా? మహిళలపై అఘాయిత్యాలను పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? ఎంతటి కఠినతరమైన చట్టాలు తీసుకురావాలి? వీటన్నింటిపై మీ మదిలో మెదిలే భావాలకు ‘వసుంధర.నెట్‌’ వేదికగా అక్షర రూపమివ్వండి. మీ విలువైన అభిప్రాయాలను అందరితో పంచుకోండి.

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

All Topics