సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

'కీర్తి'లా దారి తప్పకూడదంటే పేరెంట్స్ ఏం చేయాలి?

goodparentingkeerthi1.jpg

మద్యానికి బానిసై చుట్టపు చూపుగా ఇంటికొచ్చే తండ్రి, కన్న కూతురి కంటే సంపాదనకే విలువిచ్చే తల్లి.. ఇలా మంచి చెడులు తెలుసుకునే కౌమార దశలో తల్లిదండ్రుల నిరాదరణకు గురై.. ఇద్దరు ప్రియుల వలలో చిక్కుకొని, కన్నతల్లినే కడతేర్చి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కీర్తి కథ తెలియని వారుండరేమో! ఈ ఉదంతంతో తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ దేశంలోని తల్లిదండ్రులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిల్లలకు కన్న వారి ప్రేమానురాగాలు, అండదండలు దక్కకపోతే వారిలో నేర ప్రవృత్తి పెరిగిపోయి ఇలాంటి ఘటనలే జరుగుతాయని కొందరు అభిప్రాయ పడితే.. ఇలాంటి పిల్లల బలహీనతల్ని సొమ్ము చేసుకొని పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టే వారు మన చుట్టూనే ఉంటారని మరికొందరంటున్నారు.. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి పిల్లలు అపకీర్తి మూటగట్టుకోకూడదంటే చిన్నతనం నుంచే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల అండదండలు, ఆదరాభిమానాలు ఉండాలని ఇంకొందరు తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.

goodparentingkeerthi2.jpg
మరి, ఈ ఉదంతంపై మీ స్పందనేంటి? పిల్లల్ని సమాజంలో మంచి నడవడిక కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే వారితో పేరెంట్స్ ఎలా మెలగాలి? అటు వ్యక్తిగతంగా, ఇటు చదువు పరంగా.. ఏ విషయంలోనైనా సరే.. వారు దారి తప్పకుండా ఉండాలంటే ఎదిగే పిల్లలకు పేరెంట్స్ ఎలాంటి విషయాలు నేర్పించాలి? ఈ క్రమంలో ఇతర తల్లిదండ్రులకు మీరిచ్చే పేరెంటింగ్స్ టిప్స్ ఏంటి?
'వసుంధర.నెట్' వేదికగా మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలను అందరితో పంచుకోండి.. మీరిచ్చే టిప్స్ మరెంతోమంది తల్లిదండ్రులకు కొత్త విషయాలు తెలియజేయడమే కాదు.. వారి పిల్లలకూ ఉపయోగపడతాయి.

ఈ 'కీర్తి' దారి తప్పడానికి కారణమెవ్వరు?

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

All Topics