అతివల మెడలో తళుక్కుమన్న ఆభరణాలు!
బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటుచేసిన ఆభరణాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఇందులో దేవతా ప్రతిమలు, గృహాలంకరణ వస్తువులు, వెండి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. "సుక్రా జ్యుయలరీ" పేరిట జరుగుతోన్న ఈ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పలువురు యువతులు ఆభరణాలు కొనుగోలు చేస్తూ, వాటిని ప్రదర్శిస్తూ, ధరిస్తూ సందడి చేశారు.