నగరంలో ప్రొ-కబడ్డీ సందడి..
క్రీడాభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న కబడ్డీ ప్రీమియర్ లీగ్ 7వ సీజన్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్లో భాగంగా తెలుగు టైటాన్స్, యూ ముంబా మధ్య మొదటి మ్యాచ్ జరగ్గా, బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. కబడ్డీ మ్యాచ్ల దృష్ట్యా స్టేడియమంతా క్రీడాభిమానులతో సందడిగా మారింది. ఈ మ్యాచ్లను చూడడానికి నగర వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలువురు క్రీడాభిమానులు తరలి రావడం విశేషం.