ఈ శీర్షిక ద్వారా మా నిపుణులు మరింత చక్కటి సూచనలు/ సలహాలు ఇవ్వాలంటే మీ క్లోజప్,
లాంగ్ షాట్, సైడ్ యాంగిల్ ఫొటోలతో పాటు ఒక వీడియోను కూడా మాకు పంపించాలి. వీటిలో
మీ క్లోజప్ ఫొటోను ఇస్తూ, నిపుణులు మీకు చెప్పిన సలహాలు/ సూచనలను వసుంధర
కుటుంబం వెబ్‌సైట్లో, 'నేనెలా ఉన్నా?' శీర్షికలో ప్రచురిస్తాం.
మీరు ఈ శీర్షికకు మీ ఫొటోలు/ వీడియోలు పంపుతున్నారంటే వాటిని మా వెబ్‌సైట్లో
ప్రచురించడానికి మీ పూర్తి అంగీకారం మాకు తెలియజేసినట్లే. ఇందులో వాదోపవాదాలకు
ఎలాంటి అవకాశం ఉండదు.
నిబంధనలు, ప్రమాణాలకు లోబడి పంపిన ఫొటోలు/ వీడియోలు మాత్రమే పరిగణనలోకి
తీసుకోబడతాయి.
మిమ్మల్ని సంప్రదించడానికి వీలుగా సరైన చిరునామా, ఫొటో, తప్పకుండా ఇవ్వాలి. వివరాలన్నీ
సక్రమంగా ఉన్నట్లయితేనే నిపుణులు సలహాలు అందించడం జరుగుతుంది.
నిపుణులు పాఠకులకు ఇచ్చే సలహాలు/ సూచనలు కేవలం సమాచారం కోసం మాత్రమే.
వాటిని పాఠకులు పాటించాలా? వద్దా? అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. నిపుణుల
సూచనలను సహృదయంతో తీసుకోవాలి. నిపుణులు మీ అందచందాలపై చేసే వ్యాఖ్యలు
మీ ఉపయోగం కొరకే కానీ మిమ్మల్ని కించపరచడానికి కాదని గమనించాలి. నిపుణుల
సలహాలను పాటించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే వాటికి మా వెబ్‌సైట్
ఎలాంటి బాధ్యతా వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, వాదోపవాదాలకు
అవకాశం ఉండదు. సౌందర్య చికిత్సలు చేయించుకోవాలన్నట్లయితే, అది నిపుణుల ఆధ్వర్యంలో
జరగడం మంచిది. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
నిపుణుల సూచనలు/ సలహాల కోసం మీరు పంపే ఫొటోలు 500కేబీ నుంచి 1 ఎంబీ లోపు పరిమాణంలో
ఉన్నవై ఉండాలి. తప్పనిసరిగా జేపీజీ ఫార్మాట్‌లో పంపాలి. వీడియోలు --- పరిమాణంలో
పంపించాలి.
ఈ శీర్షికకు ఫొటోలు/ వీడియోలు పంపే వ్యక్తులకు, వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం
ఉండదు. ఒకవేళ మీ ఫొటోలు/ వీడియోలు మీ ప్రమేయం లేకుండా వేరే వ్యక్తులు పంపించినా..
వాటి ద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తినా.. మా వెబ్‌సైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు
బాధ్యత వహించదు.
ఒకవేళ అటువంటి పరిస్థితులేవైనా ఎదురైనప్పుడు మా దృష్టికి తీసుకొస్తే,
వాటిని పరిశీలించి సదరు ఫొటోలు/ వీడియోలు తీసేయడానికి అవకాశం ఉంటుంది.
ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఈ శీర్షిక/ నియమ నిబంధనలను సవరించడానికి, రద్దు
చేయడానికి వెబ్‌సైట్ నిర్వాహకులకు పూర్తి హక్కులున్నాయి.
ధ్రువీకరణ
పైన తెలిపిన నియమ నిబంధనలను నేను పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాను. వాటన్నిటికీ
కట్టుబడి ఉండటానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా సంపూర్ణ అంగీకారంతో
మాత్రమే నా ఫొటోలు/ వీడియో పంపిస్తున్నాను. నేను అప్‌లోడ్ చేసే ఫొటోలు/ వీడియోలు,
వివరాలను ప్రచురించడానికి వసుంధర కుటుంబం వెబ్‌సైట్ నిర్వాహకులకు నా
హృదయపూర్వక ఆమోదాన్ని తెలియజేస్తున్నాను.
పైన తెలిపిన నియమ నిబంధనల్లో ఏ అంశాన్నీ వివాదం చేయనని హామీ ఇస్తూ వాగ్దానం చేస్తున్నాను.
ఈ శీర్షికకు సంబంధించి నేను ఇచ్చిన వివరాలన్నీ పూర్తిగా వాస్తవాలేనని, వేటినీ వక్రీకరించలేదని
ఇందుమూలంగా ధ్రువీకరిస్తున్నాను.