అవార్డుల ఫంక్షనైనా.. సినిమా ఫంక్షనైనా.. అభిమానుల కేరింతల మధ్య జరుగుతుంటే అందరిలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కానీ తాజాగా జరిగిన ‘జీ సినీ అవార్డ్స్ 2020’ ప్రదానోత్సవం మాత్రం ప్రేక్షకులు లేకుండానే పూర్తయింది. కొవిడ్-19 ఎఫెక్టే ఇందుకు ప్రధాన కారణం. అలాగని ఆ వేడుకకు హాజరయ్యే బాలీవుడ్ భామలు మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా తమవైన ఫ్యాషనబుల్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఒకరిని మించిన ఫ్యాషన్స్ మరొకరు ఫాలో అవుతూ రెడ్ కార్పెట్‌ని హీటెక్కించారు. నఖశిఖపర్యంతం ఫ్యాషనబుల్‌గా, ట్రెండీగా ముస్తాబై దర్శనమిచ్చారు. మరి, ఈ అవార్డుల వేడుకలో ఎవరెవరు ఎలా మెరిశారో తెలుసుకుందామా..!!
View this post on Instagram
🦋
A post shared by Rakul Singh (@rakulpreet) on
* టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. సరికొత్త లుక్‌లో ముస్తాబై ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైంది. డిజైనర్ షేహ్లా ఖాన్ డిజైన్ చేసిన లైట్ పర్పుల్ కలర్ డ్రేప్డ్ శారీ లుక్‌లో తళుక్కుమంది రకుల్. దానికి మ్యాచింగ్ హాల్టర్ నెక్ ర్యాప్ బ్లౌజ్‌ని జత చేసింది. మెడలో ఎమరాల్డ్ లేయర్డ్ నెక్లెస్, మెటాలిక్ హీల్స్ తన లుక్‌ని మరింత హైలైట్ చేశాయని చెప్పచ్చు.
* నటనా ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అందాల తారల్లో తాప్సీ పన్ను ఒకరు. రివెంజ్ స్టోరీతో రూపొందిన ‘బద్లా’ చిత్రానికి గాను జీ అవార్డుల వేడుకల్లో భాగంగా ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకుందీ దిల్లీ భామ. తానెయా కనుజా రూపొందించిన బ్లాక్ కలర్ లేస్ డిజైన్ గౌన్‌లో వావ్ అనిపించే లుక్‌ని సొంతం చేసుకుందీ సొట్టబుగ్గల బ్యూటీ. సింపుల్ మ్యాచింగ్ స్టడ్స్, సిల్వర్ హీల్స్, రెడ్ లిప్‌స్టిక్ తన లుక్‌కి మరిన్ని వన్నెలద్దాయని చెప్పచ్చు.
* కృతి సనన్ లుక్‌ని చూసిన ఎవరైనా సరే.. కాసేపలాగే కన్నార్పకుండా చూస్తూ ఉండాల్సిందే.. శంతను, నిఖిల్ డిజైనర్ ద్వయం రూపొందించిన డార్క్ గ్రీన్ కలర్ కటౌట్ గౌన్‌లో దేవకన్యను తలపించింది కృతి. క్లీవేజ్ నెక్‌లైన్‌కి ఫ్రిల్ డిజైన్ ఫినిషింగ్ తన డ్రస్ లుక్‌ని మరింత అందంగా తీర్చిదిద్దిందని చెప్పచ్చు. మ్యాచింగ్ కలర్ ఐ-షాడో, బన్ హెయిర్ స్టైల్, డ్యాంగిల్ ఇయర్‌రింగ్స్‌తో తన లుక్‌ని సంపూర్ణం చేసిందీ అందాల రాశి.
* నట వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినా.. తన స్టైల్, యాక్టింగ్‌తో అందరి మెప్పు పొందింది పటౌడీ ప్రిన్సెస్ సారా అలీఖాన్. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తన స్టన్నింగ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది సారా. ఫ్యాషనర్ జార్జ్ చక్రా రూపొందించిన బేబీ పింక్ కలర్ థై-హై స్లిట్ షీర్ గౌన్‌లో ముస్తాబైంది. స్ట్రాప్‌లెస్ డిజైన్, ఎద భాగంలో టై లుక్, ఫెదరీ డిజైన్ తన డ్రస్ హైలైట్స్ అని చెప్పచ్చు. ఆభరణాలేవీ ధరించకపోయినా.. పోనీ హెయిర్, షైనీ మేకప్ తనకు పెట్టని ఆభరణాలుగా నిలిచాయని చెప్పుకోవచ్చు.
* నోరా ఫతేహీ.. ఎప్పటికప్పుడు తన అప్డేటెడ్ ఫ్యాషన్స్‌తో అందరినీ కట్టపడేస్తుంటుందీ తార. తాజాగా జరిగిన జీ అవార్డ్స్ ఫంక్షన్లో సైతం తన లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ చిన్నది. పర్పుల్ కలర్ షైనీ టైర్డ్ ఫ్లోర్ లెంత్ గౌన్ని ధరించి రెడ్ కార్పెట్‌ని రన్‌వేగా మార్చేసిందీ సుందరీ. సింగిల్ షోల్డర్ లుక్‌కి భుజాల దగ్గర డిజైన్ చేసిన హెవీ ఫ్లవర్ మోడల్ తన డ్రస్‌కి అదనపు హంగులద్దిందని చెప్పచ్చు. బన్ హెయిర్, చూడచక్కని మేకప్‌తో సూపర్బ్ అనిపించేలా ముస్తాబైందీ బాలీవుడ్ బ్యూటీ.
* బాలీవుడ్లో చేసింది రెండు సినిమాలే అయినా.. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనన్యా పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’లో తన నటనకు గాను ‘బెస్ట్ డెబ్యూ ఫీమేల్’గా తాజాగా జీ అవార్డును అందుకుంది అనన్య. బ్లాక్ డ్రస్‌లో అత్యద్భుతంగా తయారై అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైందీ యంగ్ యాక్ట్రెస్. సింగిల్ షోల్డర్ థై-హై స్లిట్ బ్లాక్ కలర్ షిమ్మరీ డ్రస్‌లో ఫ్యాషన్ దివాలా మెరిసిందీ బాలీవుడ్ బేబ్. ఆభరణాలేవీ లేకపోయినా.. మెస్సీ బన్, సింపుల్ మేకప్ తన లుక్‌కి సరిగ్గా నప్పాయని చెప్పచ్చు.
* వావ్.. వాట్ ఎ బ్యూటీ.. తారా సుతారియా లుక్‌ని చూసిన ఎవరైనా.. ఈ మాట అనకుండా ఉండలేరు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’లో అనన్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న తార ‘బెస్ట్ డెబ్యూ ఫీమేల్’ విభాగంలో అనన్యతో అవార్డును షేర్ చేసుకుంది. అంతేకాదు.. అనన్య లుక్‌కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ స్ట్రాప్‌లెస్ థై-హై స్లిట్ గౌన్ని ధరించి తళుక్కుమందీ ముద్దుగుమ్మ. బన్ హెయిర్, హెవీ స్టడ్స్, మ్యాచింగ్ బ్లాక్ కలర్ హీల్స్‌తో సింప్లీ సూపర్బ్ అనిపించుకుందీ ముద్దుగుమ్మ.
* రెడ్ కార్పెట్ ఈవెంట్లో రెడ్ డ్రస్ లేకపోతే సంపూర్ణమెలా అవుతుందనుకుందో.. ఏమో.. ఈ లోటును తన లుక్‌తో సంపూర్ణం చేసింది ‘మణికర్ణిక’ స్టార్ అంకితా లోఖండే. ‘OZEQO’ ఫ్యాషన్ స్టోర్ నుండి ఎంచుకున్న రెడ్ కలర్ సింగిల్ షోల్డర్ ఫ్లోర్ లెంత్ గౌన్‌లో అందరిలోకెల్లా డిఫరెంట్‌గా మెరిసింది అంకిత. ఎదభాగంలో రఫుల్ ఫినిషింగ్ తన డ్రస్‌కి హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. వెట్ హెయిర్, ట్రెండీ ఇయర్రింగ్స్, చక్కనైన మేకప్‌లో అందరినీ కట్టిపడేసిందీ అందాల భామ.
* విభిన్నమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సయానీ గుప్తా. ఫ్యాషన్ విషయంలో తనకెవరూ సాటిరారన్న విధంగా ముస్తాబై అందరి చూపునూ తనపై నిలిచేలా చేసుకుందీ బాలీవుడ్ అందం. న్యూడ్ కలర్ లేస్ షార్ట్ గౌన్‌లో సెక్సీ బేబ్లా ముస్తాబైందీ బ్యూటీ. నడుముకు ధరించిన మ్యాచింగ్ కలర్ బెల్ట్ తన లుక్‌ని మరింత హైలైట్ చేసిందని చెప్పచ్చు. మ్యాచింగ్ హీల్స్, వేవీ హెయిర్, షిమ్మరీ మేకప్.. తన డ్రస్‌కి సరిగ్గా నప్పాయని చెప్పచ్చు.
* ‘వాన’ చిత్రంలో తెలుగు తెరపై తొలకరి జల్లులా తళుక్కుమన్న ‘మీరా చోప్రా’.. జీ అవార్డ్స్ ఫంక్షన్లో ఏంజెల్లా మెరిసింది. యెల్లో కలర్ టల్లే గౌన్‌లో రాజకుమారిని తలపించేలా రెడ్ కార్పెడ్పై హొయలొలికించింది మీరా. ఎదభాగంలో కోర్సెట్ డిజైన్, అసిమెట్రిక్ లేయర్డ్ కట్ డిజైన్ తన డ్రస్‌ని అందంగా తీర్చిదిద్దాయని చెప్పచ్చు. బ్రేస్లెట్, హ్యాంగింగ్ ఇయర్రింగ్స్, సాఫ్ట్ కర్లీ హెయిర్, డెవీ మేకప్ తన లుక్‌ని సంపూర్ణం చేశాయి.