scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

మన సుమక్క ఫ్యాషన్స్‌ ‘కెవ్వు కేక’!

Television Star Anchor Suma Kanakala Style File

celeb-fashion.pngఅది టీవీ కార్యక్రమమైనా, ఆడియో ఫంక్షనైనా, ప్రి-రిలీజ్‌ ఈవెంట్‌ అయినా.. స్టేజీపై ఆమె సందడి చేయాల్సిందే!

టీవీలో తన కార్యక్రమం వస్తోందంటే చాలు.. ఇంట్లోని ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టీవీ ముందుకు చేరాల్సిందే!
సమయస్ఫూర్తికి హాస్యాన్ని జోడిస్తూ తను విసిరే పంచ్‌లు, ఛలోక్తులకు ఎవరి మోములోనైనా నవ్వుల పువ్వులు విరబూయాల్సిందే!
అలుపెరుగని మాటల ప్రవాహానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఆమె ఎక్కడుంటే అక్కడ మాటల పరవళ్లే. ఆ మాటల మాంత్రికురాలు మరెవరో కాదు.. మనందరం ‘సుమక్క’ అంటూ ఎంతో ప్రేమగా పిలిచే సుమ కనకాల.
పుట్టింది కేరళలోనే అయినా.. తెలుగులో ఎంతో స్పష్టంగా, గలగలా మాట్లాడే నైపుణ్యం సంపాదించుకొని అనతికాలంలోనే స్టార్‌ యాంకర్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది మన సుమక్క. ఇలా కేవలం తన మాటలతోనే కాదు.. విభిన్న షోలలో డిఫరెంట్‌ ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని ధరిస్తూ తనలోని ఫ్యాషన్‌ సెన్స్‌ను కూడా చాటుకుంటుందీ సూపర్బ్‌ యాంకర్‌. ఒక్కమాటలో చెప్పాలంటే.. తన కోసం తన షోలను మిస్‌ కాకుండా చూసే మహిళలు కొందరైతే.. తన ఫ్యాషన్స్‌ కోసమే తన ప్రోగ్రామ్స్‌ అన్నీ ఫాలో అయ్యే వారు మరికొందరు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. సోషల్‌ మీడియాలోనూ ఎంతో చురుగ్గా ఉండే ఈ స్టార్‌ మామ్‌.. ట్రెడిషనల్‌ దగ్గర్నుంచి మోడ్రన్‌ వరకు ఇలా తాను విభిన్న సందర్భాల్లో ధరించిన ఫ్యాషన్లను ఫొటోల్లో బంధించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటుంది. మరి, అలా మన సుమక్క వార్డ్‌రోబ్‌లో చోటుసంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

లేయర్డ్‌ ఫ్యాషన్‌..
స్కర్ట్‌.. ఇది ఓల్డ్‌ ఫ్యాషనే అయినా.. నేటి తరం అమ్మాయిల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకొని దానికి సరికొత్తగా ఆధునిక సొబగులద్దుతున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. అలా మన ముందుకొచ్చిందే లేయర్డ్‌ స్కర్ట్‌ స్టైల్‌ కూడా! అలాంటి స్టైలిష్‌ స్కర్ట్‌లో మెరిసిపోతోంది మన బుల్లితెర యాంకర్‌ సుమ. మెరూన్‌-పింక్‌ కాంబినేషన్‌లో రూపొందిన లేయర్డ్‌ స్కర్ట్‌ని ధరించి.. దానికి జతగా ట్రెండీ పెప్లమ్‌ టాప్‌ని జత చేసింది. ఇక తన టాప్‌కి డిజైన్‌ చేసిన లాంగ్‌ స్లిట్‌ కేప్‌ స్లీవ్స్‌ అన్నింటికంటే హైలైట్‌ అని చెప్పాలి. దానితోపాటు పెప్లమ్‌ టాప్‌పై సెల్ఫ్‌ కలర్‌ ఎంబ్రాయిడరీ తన టాప్‌కి సరికొత్త వన్నెలద్దింది. లాంగ్‌ హ్యాంగింగ్‌ ఇయర్‌వేర్‌, పోనీ హెయిర్‌ స్టైల్‌తో, న్యూడ్‌ మేకప్‌తో తన లుక్‌ని ముగించిన సుమక్క.. సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా మెరిసిపోయింది. వీటితోపాటు.. టైర్‌డ్‌ స్కర్ట్‌, రఫుల్‌ టాప్‌.. వంటి స్టైలిష్‌ దుస్తులు కూడా ప్రస్తుతం మగువల మదిదోచుకుంటున్నాయి. అలాగే ఇలాంటి లేయర్డ్‌ ఫ్యాషనబుల్‌ దుస్తులు పండగలు వంటి ట్రెడిషనల్‌ అకేషన్స్‌ దగ్గర్నుంచి పార్టీలు వంటి మోడ్రన్‌ అకేషన్స్‌ దాకా ఎలాంటి ఫంక్షన్స్‌కైనా ఇట్టే నప్పేస్తాయి. మరి ఆలస్యమెందుకు.. మీరు కూడా ఇలాంటి స్టైలిష్‌ స్కర్ట్‌ని మీ వార్డ్‌రోబ్‌లో చేర్చేసుకోండి!




View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

క్రాంట్రాస్ట్‌ కలర్స్‌..
రెడ్‌-గ్రీన్‌, బ్లాక్‌-వైట్‌.. ఇలా అపోజిట్‌ కలర్‌ కాంబినేషన్లను ధరించడం వల్ల స్టన్నింగ్‌ లుక్‌ని పొందవచ్చనడంలో సందహమే లేదు. ఫ్యాషన్‌ వరల్డ్‌లో ఎన్ని స్టైల్స్‌ మారినా, ఎన్ని సరికొత్త రంగులు ట్రెండింగ్‌లో ఉన్నా.. ఇలాంటి కాంట్రాస్ట్‌ కలర్‌ కాంబినేషన్‌ మాత్రం ఎవర్‌గ్రీనే! అలాంటి బ్రైట్‌ లుక్‌లో అదరగొడుతుంది మన ‘స్టార్‌ మహిళ’. రెడ్‌ కలర్‌ బెనారసీ ఫ్యాబ్రిక్‌ బుటా వర్క్‌ లాంగ్‌ గౌన్‌ని ఎంచుకున్న ఈ బ్యూటీ క్వీన్‌.. దానికి అపోజిట్‌ గ్రీన్‌ కలర్‌ అంచులు, స్లీవ్స్‌ అదనపు హంగులద్దాయని చెప్పుకోవచ్చు. ఇక తన అటైర్‌ను హైలైట్‌ చేస్తూ తను జత చేసిన ఎంబ్రాయిడరీ టిష్యూ సిల్క్‌ గ్రీన్‌ కలర్‌ దుపట్టా వావ్‌ అనిపించేలా ఉంది. దానితోపాటు తన నడుమును కట్టిపడేసిన సేమ్‌ కలర్‌ జ్యుయలరీ బెల్ట్‌ తన లుక్‌ను ద్విగుణీకృతం చేసిందని చెప్పడం అతిశయోక్తి కాదు. చివరగా నెక్‌పీస్‌, ఇయర్‌రింగ్స్‌, కంగన్‌ బ్యాంగిల్‌, చేతి గడియారం, షైనీ మేకప్‌.. వంటి యాక్సెసరీస్‌తో తన లుక్‌ని ముగించింది సుమక్క. ఇలా అపోజిట్‌ కలర్స్‌లో అటు అందంగా, ఇటు ట్రెడిషనల్‌గా మెరిసిపోవచ్చని తన అటైర్స్‌తో చెప్పకనే చెబుతోందీ స్టార్‌ యాంకర్‌. మరి, మీరూ ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ట్రెడిషనల్‌ కమ్‌ ట్రెండీగా కనిపించాలని ఉవ్విళ్లూరుతున్నారా? అయితే కాంట్రాస్ట్‌ కలర్‌ కాంబినేషన్‌ చీరలు, లెహెంగాలు, అనార్కలీలు.. వంటివి ఎంచుకుంటే ఫంక్షనేదైనా మీరే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తారు! అలాగే డ్రస్‌ సేమ్‌ కలర్‌ అయినా.. అపోజిట్‌ కలర్‌ జ్యుయలరీని జోడించినా అదుర్స్‌ అనిపించుకోవచ్చు.



View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

చీరపై కుర్తీ..
శారీ.. ఈ ట్రెడిషనల్‌ లుక్‌కి ఎన్నో రకాల స్టైల్స్‌ని జత చేస్తూ సరికొత్తగా మెరిసిపోతున్నారు నేటి తరం అతివలు. చీరలపై కోట్‌, కేప్‌లను ధరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవే కాదు.. కుర్తీలను కూడా జత చేయచ్చంటోందీ ‘క్యాష్‌’ స్టార్‌. తన లుక్‌ చూశాక ‘వావ్‌.. చీరను ఈ స్టైల్‌లో కూడా కట్టచ్చా’ అనిపించక మానదు. సిల్వర్‌ బోర్డర్‌తో కూడిన లైట్‌ సిమెంట్‌ కలర్‌ సిల్క్‌ శారీకి.. రెడ్‌ కలర్‌ ప్రింటెడ్‌ మిడ్‌-స్లిట్‌ కుర్తీని జత చేసిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌. హెవీ ఇయర్‌రింగ్స్‌తో తన జ్యుయలరీ లైన్‌ని ముగించిన సుమ.. సాఫ్ట్‌ కర్లీ హెయిర్‌, సింపుల్‌ మేకప్‌తో అదరగొట్టేసింది. ఇదే కాకుండా సైడ్‌ స్లిట్‌ కుర్తీ, ట్యూనిక్‌ టాప్స్‌, షార్ట్‌ కుర్తీలను కూడా చీరకు జోడించవచ్చు. మీరు వెళ్లే ఫంక్షన్‌లో ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌గా మెరిసిపోవాలనుకుంటే ఇలాంటి డిఫరెంట్‌ శారీ స్టైల్‌ని ఎంచుకున్నారంటే అందరూ మిమ్మల్నే ఫాలో అవుతారు.



View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

ఎవర్‌గ్రీన్‌.. లంగా-ఓణీ..!
లంగా-ఓణీ.. ప్రస్తుతం ప్రతి అమ్మాయీ వార్డ్‌రోబ్‌లో చోటుసంపాదించిన ఫ్యాషన్‌ ఇది. మనకు ట్రెడిషనల్‌ లుక్‌ని అందించడానికి ఎన్ని సరికొత్త ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా.. దీని ప్రత్యేకతే వేరు. అందరిలో మనల్ని ‘ది వన్ అండ్ ఓన్లీ’గా కనిపించేలా చేస్తుందీ ఫ్యాషన్‌. మరి అటువంటి క్లాసీ లుక్‌లోనే దర్శనమిచ్చింది అందాల సుమ. డిజైనర్‌ వీణ రూపొందించిన ఆరెంజ్‌ కలర్‌ బాందినీ ప్రింటెడ్‌ స్కర్ట్‌ని ఎంచుకున్న ఈ బుల్లితెర రాణి.. ఆరెంజ్‌-బ్లాక్‌ కాంబో బ్లౌజ్‌ని జతచేసింది. దానికి నప్పేట్లుగా బ్లాక్‌ బోర్డర్‌తో కూడిన యెల్లో కలర్‌ ఓణీని ధరించింది సుమ. ఇలా తన ట్రెడిషనల్‌ అటైర్‌కు టెంపుట్‌ జ్యుయలరీ, మ్యాచింగ్‌ కలర్‌ బ్యాంగిల్స్‌, కర్లీ హెయిర్‌, హైలైటింగ్‌ మేకప్‌తో వన్నెలద్దిందీ కేరళ కుట్టి. ప్రత్యేక సందర్భం ఏదైనా సరే.. అందరిలోకెల్లా మనమే హైలైట్‌గా నిలవాలంటే లంగా-ఓణీనే అందుకు చక్కటి ఎంపిక. ఇక లంగా-ఓణీ సింపుల్‌గా ఉన్నప్పటికీ కాంట్రాస్ట్‌ కలర్స్‌ని ఎంచుకుంటే అదుర్స్‌ అనే లుక్‌ మన సొంతమవుతుంది.



View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

బాల్‌ గౌన్‌లో.. బార్బీబొమ్మలా..
ఆర్గంజా గౌన్‌ని ధరించి అలా నడిచొస్తుంటే.. అచ్చం బొమ్మకి ప్రాణం వచ్చినట్లుంటుంది. అందులోనూ కాలేజ్‌లో జరిగే ప్రత్యేక ఫంక్షన్లకు అలా తయారై వెళ్లారంటే అందరూ మిమ్మల్ని చూసి అసూయపడాల్సిందే. అలాంటి డాల్‌ లుక్‌లో లవ్లీ బ్యూటీలా మెరిసిపోతుంది మనందరి ఫేవరెట్‌ యాంకర్‌. ఫ్యాషనర్‌ మిత్ర డిజైన్‌ చేసిన పింక్‌ కలర్‌ అసిమెట్రికల్‌ ఆర్గంజా గౌన్‌లో ముస్తాబైంది సుమ. గౌన్‌ మెడ దగ్గర, ఎదభాగంలో, స్లీవ్స్‌ దగ్గర డిజైన్‌ చేసిన గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌ సూపర్బ్‌ అని చెప్పచ్చు. లాంగ్‌ హ్యాంగింగ్‌ ఇయర్‌వేర్‌తో తన జ్యుయలరీ లుక్‌ని సింపుల్‌గా ముగించిందీ బుల్లితెర ఫ్యాషన్‌ స్టార్‌. నీట్‌ పోనీ, సింపుల్‌ మేకప్‌ తన లుక్‌కి బాగా నప్పాయని చెప్పచ్చు. బుట్టబొమ్మలా ముస్తాబవ్వాలనుకుంటే ఇలాంటి ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ బాల్‌ గౌన్స్‌ సరైన ఎంపిక. ఈవెనింగ్‌ ఫంక్షన్స్‌ లాంటి వాటికి ఇలాంటి లుక్‌లో హాజరైతే ఇక అదుర్సే..!



View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

ట్రెండీ కమ్‌ క్లాసీ స్టైల్‌..
గరారా.. షరారా.. ప్రస్తుతం ఏ అమ్మాయి నోటి వెంట విన్నా ఈ స్టైల్‌ మంత్రాన్నే జపిస్తు్న్నారు. వీటిలోనూ ఎన్నెన్నో డిఫరెంట్‌ స్టైల్స్‌ని ధరిస్తూ అదరగొడుతున్నారు. మన బుల్లితెర సూపర్‌ స్టార్‌ యాంకర్‌ సుమ కూడా అలాంటి ట్రెండీ-క్లాసీ అటైర్‌లో అదుర్స్‌ అనిపించేలా ముస్తాబైంది. గ్రే కలర్‌ గరారాకు సిల్వర్‌ కలర్‌ ఫినిషింగ్‌ అద్భుతం అని చెప్పచ్చు. గరారాకు నప్పేట్లుగా మ్యాచింగ్‌ కలర్‌ ఫుల్‌ స్లీవ్స్‌ షార్ట్‌ కుర్తీ, అదే కలర్‌ దుపట్టాని జత చేసింది సుమ. ఫింగర్‌ రింగ్‌, ఇయర్‌రింగ్స్‌తో తన జ్యుయలరీ స్టైల్‌ని సింపుల్‌గా ముగించిన ఈ స్టార్‌ యాంకర్‌.. బ్రెయిడెడ్‌ హెయిర్‌, బ్లష్‌ మేకప్‌తో ట్రెండీ కమ్‌ క్లాసీ బ్యూటీగా మెరిసిపోయింది. అటు ట్రెండీగా.. ఇటు క్లాసీ స్టార్‌గా మెరవాలంటే ఇలాంటి గరారా, షరారా స్టైల్‌ని ఎంచుకుంటే సరి. వీటికి జతగా క్రాప్‌టాప్‌ విత్‌ కేప్‌, షార్ట్‌ అనార్కలీ, లాంగ్‌ కుర్తీ లాంటివి బాగా నప్పుతాయి. కాబట్టి మీ శరీరాకృతిని బట్టి వాటిని ఎంచుకుని ఎలాంటి ప్రత్యేక సందర్భంలోనైనా షైనీ బేబీలా ముస్తాబైపోండి.

చూశారుగా.. అందాల యాంకర్‌ సుమ వార్డ్‌రోబ్‌లో చోటుసంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్స్‌ ఏంటో! ట్రెడిషనల్‌, మోడ్రన్‌, క్లాసీ.. ఇలా సకల ఫ్యాషన్ల కలబోత అయిన ఈ సూపర్బ్‌ యాంకర్‌ ఫ్యాషన్స్‌లో నుంచి మీకు నచ్చిన, మీ శరీరాకృతికి నప్పిన అటైర్స్‌ని ఎంచుకొని లవ్లీ బేబ్స్‌లా మెరిసిపోండి మరి!

గమనిక: వయసుతో పాటే తన అందం కూడా పెరుగుతుందేమో అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే..! అలా సినీ పరిశ్రమలో ఎవర్‌గ్రీన్‌ బ్యూటీగా పేరుగాంచిన సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ ‘త్రిష’ వార్డ్‌రోబ్‌ స్టైల్స్‌ గురించి తెలుసుకోవాలంటే ‘సెలబ్రిటీ స్టైల్‌ఫైల్‌’ శీర్షికలో ఫిబ్రవరి 10న ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసాన్ని చదవండి.





women icon@teamvasundhara
us-teen-peyton-monker-makes-covid-19-themed-prom-dress-viral-on-social-media

ఈ డ్రస్‌లో ‘కరోనా కథ’ దాగుంది!

సాధారణంగా మనం ఏదైనా పని ఫలానా సమయానికి చేయాలనుకుంటే అది అనుకున్న సమయంలో పూర్తవ్వాలి. ఒకవేళ ఏదైనా కారణంతో వాయిదా పడితే మనసంతా నిరుత్సాహం ఆవహిస్తుంది. మరే పనిపైనా ధ్యాస పెట్టలేం. కరోనా మహమ్మారి అడుగుపెట్టిన తర్వాత దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ వైరస్‌ ప్రభావంతో పెళ్లిళ్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఈవెంట్ల దాకా అన్నీ వాయిదా పడ్డాయి. దాంతో తమ తమ పనులు పూర్తికాక మానసిక వేదనకు గురవుతున్నారు చాలామంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పరిస్థితి నుంచి తేరుకొని తమ సృజనకు పదును పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. వారి ట్యాలెంట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల మన్ననలు అందుకుంటున్నారు. యూఎస్‌కు చెందిన పద్దినిమిదేళ్ల యువతి కూడా తాజాగా తన ప్రతిభతో నెట్‌ప్రియుల మనసు దోచుకుంటోంది. ఇంతకీ ఎవరా యువతి? తన క్రియేటివిటీకి అందరూ ఎందుకంతలా ఫిదా అవుతున్నారు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
fashionable-gym-wear-for-your-indoor-workout-amid-lockdown

ఈ జిమ్‌ వేర్‌తో ఇంట్లోనూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోదాం..!

ఫిట్‌నెస్‌ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది జిమ్‌. అయితే ఈ లాక్‌డౌన్‌లో జిమ్‌లన్నీ మూతపడడంతో అందరూ ఇంటినే చిన్న సైజు జిమ్‌గా మార్చేసుకొని సులభమైన కసరత్తులు చేసేస్తున్నారు. అయితే వర్కవుట్లు ఇంట్లో చేసినా, జిమ్‌కి వెళ్లినా సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తేనే ఇష్టంగా వ్యాయామాలు చేయగలం. అలాకాకుండా ఇంట్లోనే ఉంటున్నాం కదా.. ఏవైతే ఏంటి అని వర్కవుట్లకు ఉపక్రమిస్తే మనం ధరించిన దుస్తులు మనకు అసౌకర్యంగా ఉండడంతో పాటు చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టలేం. కాబట్టి ఇంట్లో ఉన్నా చక్కటి జిమ్‌ వేర్‌ని ధరించడం మంచిదంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా వర్కవుట్లు చేయాలన్న ఆసక్తి మనలో పెరగడంతో పాటు మనం స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చనేది వారి అభిప్రాయం. అందుకే మన బాలీవుడ్‌ బేబ్స్‌ కూడా స్టైలిష్‌ జిమ్‌ వేర్‌తో ఇంట్లోనే సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఎక్సర్‌సైజులు చేసేస్తున్నారు. మరి, వారు ధరించిన కొన్ని ఫ్యాషనబుల్‌ జిమ్‌ వేర్‌ అవుట్‌ఫిట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
different-fashionable-masks-for-women-in-this-corona-time

ఇలా స్టైలిష్‌గా ‘మాస్క్‌’ చుట్టేద్దాం !

ప్రత్యేక సందర్భం ఉన్నా, లేకపోయినా అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలోనే వేసుకునే డ్రస్‌ దగ్గర్నుంచి పెట్టుకునే యాక్సెసరీస్‌ వరకు అన్నీ మ్యాచింగ్‌గా, అందరికంటే విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి ఫ్యాషన్‌ ప్రియుల మనసెరిగి డిజైనర్లు కూడా సరికొత్త ఫ్యాషన్స్‌ని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో మన లైఫ్‌స్టైల్లో భాగమైన మాస్కుల్లోనూ సరికొత్త ఫ్యాషన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరి, ఇటు వైరస్‌ నుంచి మనకు రక్షణగా, అటు ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేసే అలాంటి కొన్ని డిఫరెంట్‌ ఫేస్‌ మాస్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
celebrities-wore-hazmat-suit-amid-of-covid-19-out-broke

సెలబ్రిటీల ‘కరోనా’ డ్రస్‌కోడ్‌ చూశారా?

కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోన్న మహమ్మారి. ఇలాంటి సమయాల్లో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండమంటున్నారు నిపుణులు. కానీ కొందరు వృత్తిరీత్యా, ముందుగానే షెడ్యూల్‌ చేసుకున్న పనులను వాయిదా వేసుకోలేక తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కొవిడ్‌-19 బారిన పడకుండా తమని తాము కాపాడుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో రకమైన మార్గా్న్ని ఎంచుకుంటున్నారు. అందుకు సెలబ్రిటీలు సైతం అతీతులేమీ కాదు. తాము ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు హాజరవడానికి ప్రయాణించక తప్పని పరిస్థితి వారిది. తాజాగా ఇద్దరు హాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ ప్రయాణంలో భాగంగా కాస్త వినూత్నంగా ఆలోచించి ధరించిన దుస్తులు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ దుస్తుల్లో వారిని చూసిన వారంతా ఇలా ఉన్నా కూడా ‘మీ ఫ్యాషన్‌ అదుర్స్‌‘, ‘మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, వారి విచిత్ర వేషధారణ విశేషాలేమిటో మనమూ తెలుసుకొని.. వీలైతే ఈ కరోనా స్పెషల్‌ ఫ్యాషన్‌ని పాటించేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
the-stylish-warbrobe-looks-of-mehreen-pirzada

ఫ్యాషన్స్‌లోనూ ‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’!

‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌..’ ఈ డైలాగ్‌ విన్న ఎవరికైనా ‘ఎఫ్‌2’ సినిమాలో తన క్యూట్‌ లుక్స్‌తో కుర్రకారు మతులు పోగొట్టిన మెహరీన్‌ పిర్జాదా గుర్తుకురాక మానదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ‘ఫిలౌరీ’ చిత్రంతో హిందీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆపై.. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘పంతం’, ‘ఎఫ్‌ 2’, ‘అశ్వథ్థామ’.. వంటి చిత్రాలతో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుందీ అందాల తార. ఈ క్యూట్‌ హనీ గర్ల్‌ యాక్టింగ్‌లోనే కాదు.. అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని పాటించడంలోనూ బెస్టే అని చెప్పచ్చు. ఈ విషయం తన వార్డ్‌రోబ్‌ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఫ్యాషన్‌ విషయంలో అమ్మాయిలందరికీ ఐకాన్‌గా నిలుస్తోన్న ఈ లక్కీ గర్ల్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా!

Know More

women icon@teamvasundhara
bollywood-stars-shined-at-zee-cine-awards-2020

రెడ్‌కార్పెట్‌పై ముద్దుగుమ్మల ఫ్యాషన్‌ పరేడ్‌!

అవార్డుల ఫంక్షనైనా.. సినిమా ఫంక్షనైనా.. అభిమానుల కేరింతల మధ్య జరుగుతుంటే అందరిలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కానీ తాజాగా జరిగిన ‘జీ సినీ అవార్డ్స్‌ 2020’ ప్రదానోత్సవం మాత్రం ప్రేక్షకులు లేకుండానే పూర్తయింది. కొవిడ్‌-19 ఎఫెక్టే ఇందుకు ప్రధాన కారణం. అలాగని ఆ వేడుకకు హాజరయ్యే బాలీవుడ్‌ భామలు మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా తమవైన ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. ఒకరిని మించిన ఫ్యాషన్స్‌ మరొకరు ఫాలో అవుతూ రెడ్‌ కార్పెట్‌ని హీటెక్కించారు. నఖశిఖపర్యంతం ఫ్యాషనబుల్‌గా, ట్రెండీగా ముస్తాబై దర్శనమిచ్చారు. మరి, ఈ అవార్డుల వేడుకలో ఎవరెవరు ఎలా మెరిశారో తెలుసుకుందామా..!!

Know More

women icon@teamvasundhara
the-style-file-of-mega-princess-niharika-konidela

ఈ ‘మెగా ప్రిన్సెస్‌’ క్రేజీ ఫ్యాషన్స్‌ చూశారా?

టాలీవుడ్‌లో వారసులు నట ప్రస్థానాన్ని కొనసాగించడం కామనే.. కానీ వారసురాళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టడం చాలా అరుదు. అలాంటి భావనలను చెరిపేస్తూ.. మెగా ఫ్యామిలీ నుంచి నట వారసురాలిగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది నిహారిక కొణిదెల. తన కొంటె నటనను ప్రదర్శిస్తూ ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుందీ మెగా ప్రిన్సెస్‌. ఆపై ‘ఒక మనసు’ అంటూ అందరి మనసులను గెలుచుకుందీ క్లాసిక్‌ బ్యూటీ. ఈ క్రమంలోనే ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’, ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ తెలుగు ప్రేక్షకుల మన్ననలందుకుంటోంది నిహారిక. ఇలా తన నటనతోనే కాకుండా.. తన ట్రెండీ ఫ్యాషన్స్‌తోనూ ఈ తరం అమ్మాయిల్ని ఆకట్టుకుంటోంది యంగ్‌ యాక్ట్రెస్‌. సందర్భానికి తగ్గట్లుగా అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని ఫాలో అవుతూ మెరిసిపోతున్న ఈ మెగా డాటర్‌.. అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయింది. మరి, తన వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
take-a-look-on-upasana-fashionable-wardrobe

ఈ స్టార్‌ లేడీ ఫ్యాషన్స్‌ చూశారా?

వ్యాపార దిగ్గజాల కుటుంబంలో పుట్టినా, మెగా ఫ్యామిలీలో మెట్టినా.. ఓ బిజినెస్ వుమన్‌గా, సమాజ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కొణిదెల వారి కోడలు పిల్ల ఉపాసన, నటుడు రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా.. ‘అపోలో’ లైఫ్‌ వైస్‌-చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాల్లోనూ భాగమవుతోందీ సుపర్‌ వుమన్‌. అంతేకాదు.. ఫిట్‌నెస్‌, ఆరోగ్యం పట్ల పకడ్బందీగా ఉండే ఈ మెగా వారి కోడలు.. ఈ అంశాల గురించి సోషల్‌ మీడియాలో పోస్టుల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. అంతేనా.. ఫ్యాషన్‌ విషయంలోనూ అప్‌డేటెడ్‌గా ఉంటుంది. తనకు నచ్చే, యువత మెచ్చే ఫ్యాషన్లు ఫాలో అవుతూ.. నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతుందీ మెగా డాటర్‌-ఇన్‌-లా. మరి, ఈ స్టార్‌ లేడీ ఫ్యాషనబుల్‌ వార్డ్‌రోబ్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
taapsee-rewearable-fashions-for-thappad-promotions

కమాన్‌.. సింగిల్‌ డ్రస్‌తోనే స్టైల్‌ మార్చేద్దాం !

ఈ ఫ్యాషన్‌ ప్రపంచంలో రోజురోజుకీ ఎన్నో సరికొత్త ఫ్యాషన్లు అప్‌డేట్‌ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకసారి ధరించిన దుస్తులు రెండోసారి ధరించడానికి అప్పుడప్పుడూ మనమే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటే.. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సాధారణంగా సెలబ్రిటీలు ఒకసారి ధరించిన దుస్తులు రెండోసారి రిపీట్‌ చేయడానికి ఇష్టపడరు. ప్రతిసారీ, ప్రతి సందర్భానికి అనుగుణంగా సరికొత్త ఫ్యాషన్స్‌లో మెరిసిపోవాలని కోరుకుంటారు. నిజానికి అమ్మాయిల సహజ స్వభావమే అంత అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్యాషన్‌ విషయంలో కొందరు అమ్మాయిలు ఒకసారి వేసుకున్న ఫ్యాషన్‌ని మరోసారి అదే స్టైల్‌లో కాకుండా.. డిఫరెంట్‌ స్టైల్‌లో తిరిగి వేసుకోవాలనుకుంటారు.. కానీ అదెలాగో తెలియక సతమతమైపోతుంటారు. అలాంటివారికి తన సరికొత్త లుక్స్‌తో ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతుంది బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి తాప్సీ. మొన్నటిదాకా ‘థప్పడ్‌’ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న ఈ భామ ఒకసారి ధరించిన అవుట్‌ఫిట్‌ని తిరిగి డిఫరెంట్‌ స్టైల్లో వేసుకొని తనలోని ఫ్యాషన్‌ సెన్స్‌ని చాటుతోంది.. అంతేకాదు.. #RePurpose #RepeatYourOutfits అనే హ్యాష్‌ట్యాగ్స్‌ పేర్లతో ఒకసారి ధరించిన దుస్తుల్ని మరోసారి విభిన్నంగా, ఫ్యాషనబుల్‌గా ఎలా ధరించాలో నేర్పుతోంది. తాజాగా ‘థప్పడ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ధరించిన కొన్ని రిపీటెడ్‌ స్టైల్స్‌ ఏంటో చూసేద్దామా??

Know More

women icon@teamvasundhara
melania-and-ivanka-trump-fashions-while-indian-tour

ఈ అందాల నెలవంకల ఫ్యాషన్లు ఎంత ప్రత్యేకమో !

ప్రపంచంలోని ఏ దేశ మహిళలకైనా.. భారతీయ దుస్తులు ఇట్టే నప్పేస్తాయని, వారు ఆ దుస్తుల్లో భువికి దిగొచ్చిన దేవకన్యల్లా అత్యద్భుతంగా కనిపిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం భారత పర్యటనలో బిజీబిజీగా గడుపుతోన్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, ఇవాంక ట్రంప్‌ ధరించిన ఫ్యాషన్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఓవైపు మోడ్రన్‌గా, హుందాగా కనిపిస్తూనే .. మరోవైపు వాటికి భారతీయ శైలిని అద్ది తమ ఫ్యాషన్‌ సెన్స్‌తో ఇక్కడి ఫ్యాషన్‌ ప్రియులను ఫిదా చేస్తున్నారీ అమెరికన్‌ లేడీస్‌. అంతేకాదు.. ఇలా తమవైన ఫ్యాషన్లతో భారతదేశంపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారీ పవర్‌ఫుల్‌ ఉమెన్‌. మరి, భారత పర్యటనలో భాగంగా తమ సింపుల్‌ కమ్‌ ఇండో-ట్రెడిషనల్‌ లుక్స్‌తో ఫ్యాషన్‌ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమెరికన్‌ అందాలు ధరించిన ఫ్యాషన్స్‌లో ఎన్నో ఆసక్తికర విశేషాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-nivetha-pethuraj

‘రాములో.. రాములా..’ తన ఫ్యాషన్స్‌తో ఆగం జేసిందిరో!

‘రాములో.. రాములా..’ ఈ పాట యువతను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరినీ అంతగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌లో తన సూపర్బ్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో పాటు ‘అల వైకుంఠపురములో’ తన నాటీ క్యారక్టర్‌తో మరోసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది తమిళ పొన్ను నివేదా పేతురాజ్‌. ‘ఒరు నాల్‌ కోథు’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ తమిళమ్మాయి.. ‘టిక్‌ టిక్‌ టిక్‌’తో విమర్శకుల ప్రశంసలందుకుంది. ‘మెంటల్‌ మదిలో’ చిత్రంతో తెలుగింట అడుగుపెట్టిన ఈ భామ.. ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’.. వంటి సినిమాలతో నటిగా తనదైన ముద్రవేసింది. ప్రస్తుతం తెలుగులో ‘రెడ్‌’ అనే చిత్రంలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తన స్టైలిష్‌ లుక్స్‌తోనూ సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. సందర్భాన్ని బట్టి ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోయే ఈ చిన్నది.. నేటితరం అమ్మాయిలందరినీ తన ఫ్యాషన్‌ మాయలో పడేస్తోంది. మరి, ఈ లవ్లీ బేబీ స్టైల్‌ సెన్స్‌ను చాటుతోన్న ఆ విభిన్న ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందామా..!!

Know More

women icon@teamvasundhara
the-iconic-red-carpet-looks-of-celebrities

ఈ గౌన్స్‌ని సిద్ధం చేయడానికి ఎన్ని గంటలు పట్టిందో తెలుసా!

రెడ్‌ కార్పెట్‌ లుక్‌ అంటేనే మన సినీ తారలు ప్రత్యేక శ్రధ్ధ వహిస్తారు. అందరిలోకీ తమ డ్రస్‌ స్పెషల్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ యువరాణుల్ని తలపించేలా ముస్తాబవుతారు. ‘ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ 2020’ ఫంక్షన్‌ ఇటీవల ముంబై వేదికగా గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్‌లో పలువురు బాలీవుడ్‌ తారలు అదిరిపోయే డ్రస్సింగ్‌ స్టైల్‌లో ‘వావ్‌’ అనిపించారు. అందరిలోకీ తన అద్భుతమైన రెడ్‌ అవుట్‌ఫిట్‌తో అవార్డ్స్‌ సెలబ్రేషన్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెలా. రెడ్‌ కార్పెట్‌పై రెడ్‌ డ్రస్‌లో హొయలు పోయిన ఈ సుందరి.. కూర్చున్నప్పుడు తన డ్రస్‌ దాదాపు 4 కుర్చీలను ఆక్రమించేసిందంటే అదెంత పెద్దగా ఉందో అర్ధమవుతుంది. అంతేకాదు.. ఈ అవుట్‌ఫిట్‌ని సిద్ధం చేయడానికి ఎంత సమయం పట్టిందో వింటే నోరెళ్లపెట్టకుండా ఉండలేరు. ఇలా ఎన్నో విశేషాలతో ఫ్యాషన్‌ ప్రియులను ఆశ్చర్యపరుస్తున్న ఊర్వశి డ్రస్‌ వివరాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-fourth-and-fifth-day-highlights-of-lakme-fashion-week-2020

దేవకన్యలు ‘లాక్మే ర్యాంప్‌’పై నడిచిన వేళ!

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మొదటి మూడు రోజుల ఫ్యాషన్స్‌ ఒకెత్తయితే, చివరి రెండు రోజుల ఫ్యాషన్స్‌ ఇంకో ఎత్తని చెప్పవచ్చు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ఫ్యాషన్‌ షోలో చివరి రెండు రోజులు ప్రముఖ ఫ్యాషనర్స్‌తో పాటు బాలీవుడ్‌ అగ్ర తారాలోకం ర్యాంప్‌పై తమ హొయలతో ఫైర్‌ పుట్టించారు. బాలీవుడ్‌ జీరో సైజ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ నుంచి రైజింగ్‌ స్టార్‌ తారా సుతారియా వరకు పలువురు బాలీవుడ్‌ బ్యూటీస్‌ తమ స్టైల్స్‌తో లాక్మే స్టేజ్‌ని ఫ్యాషన్ పరేడ్‌గా మార్చేశారు. మరి లాక్మే స్టేజ్‌పై ఫ్యాషనబుల్‌ అటైర్స్‌లో మెరిసిన ఈ మెరుపుతీగల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-big-boss-beauty-punarnavi-bhupalam

ఈ ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ పున్ను ఫ్యాషన్స్‌ చూశారా?

పదిహేడేళ్ల ప్రాయంలోనే వెండితెరపై అడుగుపెట్టింది తెలుగందం పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా తన చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ కుర్రది. ఆపై ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్ట గోడ’.. వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. ‘బిగ్‌ బాస్‌ - 3’తో ‘యాటిట్యూడ్‌ పున్ను’గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అయితే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోయినా తన బ్యూటిఫుల్‌ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొట్టింది. ప్రస్తుతం ‘సైకిల్‌’, ‘ఒక చిన్న విరామం’ వంటి సినిమాలతో మన ముందుకు రానున్న పున్ను.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన సినిమా కబుర్లతో పాటు తాను ధరించిన లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. ఇలా తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో నేటితరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తోన్న పున్ను వార్డ్‌రోబ్‌లో ఎలాంటి డిఫరెంట్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌ ఉన్నాయో ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-fashion-looks-of-lakme-fashion-week-2020

అందాల నెమళ్లు ర్యాంప్‌ వాక్‌ చేయడం ఎప్పుడైనా చూశారా?

ఫ్యాషన్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాషన్‌ పండగ ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ -2020’ ముంబయిలో అట్టహాసంగా జరుగుతోంది. ర్యాంప్‌పై తళుకులీనే దుస్తులతో హొయలొలికిస్తూ అందాల తారలు అదరగొడుతున్నారు. కేవలం సరికొత్త ఫ్యాషన్స్‌కి మాత్రమే కాదు.. వాటిని ధరించిన బాలీవుడ్‌ భామల అందచందాలకూ వేదికైందీ లాక్మే ఫ్యాషన్‌ ర్యాంప్‌. ప్రముఖ డిజైనర్స్‌ దగ్గర్నుంచి యంగ్‌ డిజైనర్స్‌ వరకు ఎందరో ఫ్యాషనర్లు తమ కొంగొత్త ఫ్యాషన్స్‌ని ఈ వేదికగా పరిచయం చేస్తుంటారు. ఇక వాటిని ధరించిన మన ముద్దుగుమ్మల సొగసు చూడతరమా!! మరి, ఈసారి లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఎవరెవరు ఏయే డిజైనర్‌ దుస్తుల్లో మెరిశారో చూసేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
red-is-the-best-outfit-for-valentines-day-2020

రెడ్‌ డ్రస్‌లో రెడ్‌ రోజ్‌లా మెరిసిపోండి..!

‘కోటి యుగాలైనా ప్రేమకు మాత్రం వయసైపోదు’.. అన్నాడో సినీ కవి. వయసు శరీరానికి మాత్రమే.. మనసులోని ప్రేమ ఎప్పుడూ నిత్య యవ్వనంగానే ఉంటుందనేది అందులో దాగున్న పరమార్థం. అలాంటి అందమైన ఫీలింగ్‌ను పంచుకోవడానికి, తమ ప్రియమైన వారిని కానుకలతో సర్‌ప్రైజ్‌ చేయడానికి ‘వేలంటైన్స్‌ డే’ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు లవర్స్‌. మరి, ఇలాంటి ప్రత్యేకమైన సందర్భంలో సమ్‌ వాట్‌ స్పెషల్‌గా కనిపించడం అమ్మాయిలకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణంగా ప్రేమికుల రోజంటే తమ మనసులోని భావాలను తమ డ్రస్‌తోనే తెలపాలనుకుంటారు అమ్మాయిలు. అందుకే ఈ రోజున ప్రేమను వ్యక్తం చేసే ఎరుపు రంగు డ్రస్‌కే ప్రాధాన్యమిస్తుంటారు. మీరూ అదే పనిలో ఉన్నారా? అయితే ప్రస్తుతం ఫ్యాషన్‌ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న విభిన్న ఎరుపు రంగు అటైర్స్‌పై ఓ లుక్కేయండి. మీకు నచ్చిన, నప్పిన రెడ్‌ డ్రస్‌లో రెడ్‌ రోజ్‌లా రడీ అయ్యి మీ సోల్‌మేట్‌కి మీ ప్రేమను చెప్పకనే చెప్పేయండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-evergreen-beauty-trisha

ఈ అందాల ‘నాయకి’ ఫ్యాషన్స్‌ అద్భుతః!

తమ వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ.. అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు కొందరు భామలు. అలాంటి దక్షిణాది తారల్లో ‘త్రిష’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1999 ‘మిస్‌ మద్రాస్‌’ పోటీల్లో విజేతగా నిలిచి.. అదే ఏడాది ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైందీ చెన్నై చంద్రం. ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన త్రిష.. ‘వర్షం’తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఆపై.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’, ‘బాడీగార్డ్‌’, ‘నాయకి’.. వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఇలా కేవలం తన నటనతోనే కాదు.. తన అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌తోనూ ఈతరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది త్రిష. ఈ క్రమంలో తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తన ఫ్యాషన్‌ సెన్స్‌ను చాటుకుంటోందీ చెన్నై బ్యూటీ. మరి, విభిన్న ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో నిండిపోయిన త్రిష వార్డ్‌రోబ్‌లోని కొన్ని ఫ్యాషన్ల గురించి మనమూ తెలుసుకుని ఫాలో అయిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
statement-jewellery-trends-for-the-marriage-occasion

ఈ నగలతో పెళ్లి కళ మీదే!

పండగ నెల దాటింది.. మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడి.. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటాం. అలాగని ఎన్ని పనులున్నా పెళ్లికి, ఇతర ఫంక్షన్లకు రడీ అవడం విషయంలో మాత్రం అస్సలు రాజీపడరు అమ్మాయిలు. పెళ్లి కూతురితో సమానంగా అన్ని పెళ్లి వేడుకల్లో ఆయా సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల్లో అందంగా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు డ్రస్‌ విషయంలో చూపించిన శ్రద్ధ వాటికి మ్యాచ్‌ చేసే జ్యుయలరీ విషయంలో చూపించకపోవచ్చు. నగలే కదా.. ఏదో ఒకటి మ్యాచ్‌ చేస్తే సరిపోతుందనుకుంటారు.. కానీ డ్రస్‌కు తగ్గట్లుగా నగలు వేసుకోకపోతే మీ లుక్‌ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరెంత అద్భుతమైన కలర్‌ కాంబినేషన్‌ దుస్తుల్ని ధరించినా వృథానే..! అందుకే ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల లేటెస్ట్‌ నగల డిజైన్స్‌ సందడి చేస్తున్నాయి. వాటిలో మీకు, మీ దుస్తులకు నప్పేట్లుగా, సందర్భానికి తగ్గట్లుగా నగల్ని ఎంచుకుంటే సూపర్బ్‌గా అదరగొట్టేయచ్చు. మరి, ప్రస్తుతం లేటెస్ట్‌ డిజైన్స్‌తో అమ్మాయిల మనసు లాగేస్తోన్న అలాంటి కొన్ని నగల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
eco-friendly-detachable-tote-bags

మసాబా డిజైన్‌ చేసిన ఈ డ్రస్సుల ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తోన్న సమస్యల్లో ‘మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం’ కూడా ఒకటి. మనిషి జీవనవిధానంలో ప్లాస్టిక్‌ అతి ముఖ్యమైన అంశంగా మారింది. భోజనం చేసే కంచం, మంచినీళ్లు తాగే బాటిల్‌, కూర్చునే కుర్చీ, పూలకుండీ, టూత్‌ బ్రష్‌, షాంపూ బాటిల్స్‌.. ఇలా ఒకటేమిటి మనిషికి అవసరమయ్యే దాదాపు అన్ని వస్తువుల్లో ప్లాస్టిక్‌ ఉంది. వీటిలో చాలావరకు వస్తువులు రీ-సైకిల్‌ చేయడానికి ఉపయోగపడితే.. కొన్నింటిని రీ-సైకిల్‌ చేయడం వీలు కాదు. వీటి వల్ల వాతావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అంతేకాదు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో కలిసి ఎన్నో సముద్ర జీవులు చనిపోవడానికి కారణమవుతున్నాయి. పైగా మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం వల్ల మనిషికి అనేక రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి.

Know More

women icon@teamvasundhara
nepal-sets-world-record-for-holding-the-highest-altitude-fashion-show-on-land

ఈ ఫ్యాషన్‌ షో ప్రత్యేకత ఏమిటో తెలుసా?

నేపాల్‌... భూకంపాలతో నిత్యం అల్లకల్లోలంగా ఉండే దేశం. అందుకే పక్కనే హిమాలయ పర్వతాలున్నా ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. అలాంటి దేశం ఒక్కసారిగా డిజైనర్లు రూపొందించిన దుస్తులు, మోడళ్ల హొయలతో సందడిగా మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్‌ ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ సమీపంలోని కాలాపత్తర్‌ వద్ద ఈ ఫ్యాషన్‌ షోను ఏర్పాటుచేశారు. సముద్ర మట్టానికి సుమారు 5,340మీటర్ల (17515 అడుగులు)ఎత్తులో ఈ ఫ్యాషన్‌ పరేడ్‌ నిర్వహించడం విశేషం. మరి అందనంత ఎత్తులో ఈ ఫ్యాషన్‌ షో ఎందుకు ఏర్పాటుచేశారు? అసలు మోడళ్లు అక్కడకు ఎలా చేరుకున్నారు? తదితర వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Know More

women icon@teamvasundhara
how-to-revamp-the-old-lehenga-in-different-styles

పాత లెహెంగాకు ఇలా కొత్త సొబగులద్దండి!

అమ్మాయిల వార్డ్‌రోబ్‌ని ‘పుష్పక విమానం’తో పోల్చచ్చు. ఎందుకంటే ఎన్ని దుస్తులు కొన్నా.. ఇంకా కొత్త వాటికి చోటుంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి ఎన్నో ఫ్యాషన్లకు చోటిచ్చే ఈ వార్డ్‌రోబ్‌లో అటు ట్రెడిషనల్‌, ఇటు మోడ్రన్‌తో పాటు ఈ రెండూ కలగలిపిన దుస్తులు సైతం ఉంటాయి. అయితే వీటిలో కొన్ని దుస్తుల్ని కొన్ని సార్లు వేసుకున్నాక పాతవైపోయాయని పక్కన పెట్టేయడం మనలో చాలామందికి కామనే. కొత్త ఫ్యాషన్లను చూసేసరికి అవి నచ్చకపోవడం ఓ కారణమైతే.. ఆ ఫ్యాషన్‌ ఇప్పుడు ఎవరూ వేసుకోవట్లేదంటూ పక్కన పడేయడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మనలో చాలామంది పక్కన పెట్టే ఫ్యాషన్స్‌లో లెహెంగాలూ ఉంటాయి. కొత్త కొత్త లెహెంగా మోడల్స్‌ పుట్టుకొచ్చే సరికి పాతవి చేదైపోతుంటాయి చాలామంది అమ్మాయిలకు. కానీ బుర్రకు కాస్త పదునుపెట్టి ఆలోచిస్తే పాత లెహెంగాల్లోనే సరికొత్తగా, ఫ్యాషన్‌ క్వీన్‌లా మెరిసిపోవచ్చు. అందుకు మనం చేయాల్సిందల్లా పాత లెహెంగాలకు కొత్త సొబగులద్దడమే.. అంటే పాత వాటికి కొత్త ఫ్యాషన్లను జతచేస్తే అందరి కంటే అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చు. పైగా పెళ్లిళ్ల సీజన్‌ కూడా ప్రారంభమైంది. కాబట్టి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న పాత లెహెంగాల్ని బయటికి తీయండి.. వాటికి ఇలాంటి సరికొత్త స్టైల్స్‌ని జతచేసి ఫ్యాషన్‌ గాడెస్‌లా మెరిసిపోండి..

Know More

women icon@teamvasundhara
the-celebrity-style-file-of-avunu-actress-poorna

ఈ ‘మహాలక్ష్మి’ క్లాసీ లుక్స్‌ మనమూ ఫాలో అవుదామా..!

వెండితెరపై కొందరు తారలు తమ గ్లామరస్‌ స్టైల్స్‌తో అదరగొడితే.. ఇంకొందరు తమ క్లాసీ లుక్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అటువంటి క్లాసీ స్టార్స్‌లో ఒకరు ‘పూర్ణ’. నాట్యంలో ప్రావీణ్యురాలైన పూర్ణ.. ఓ ప్రముఖ మలయాళ ఛానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ రియాల్టీ షోలో బుల్లితెర అరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే ఓ మలయాళ చిత్రంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుని వెండితెరకు పరిచయమైంది. ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రం ద్వారా తెలుగునాట అడుగుపెట్టి తన నటనకు మంచి మార్కులే వేయించుకుందీ బొద్దుగుమ్మ. ఆపై ‘సీమ టపాకాయ్‌’, ‘అవును’, ‘అవును 2’, ‘రాజు గారి గది’, ‘జయమ్ము నిశ్చయమ్ము రా’.. వంటి పలు చిత్రాలతో తెలుగమ్మాయేమో అనిపించేంతలా ప్రేక్షకులకు దగ్గరైందీ కేరళ కుట్టి. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా తన క్లాసీ లుక్స్‌తో అదరగొడుతుందీ భామ. ఇలా తాను ధరించిన అవుట్‌ఫిట్స్‌కు సంబంధించిన ఫొటోల్ని తన ఫ్యాన్స్‌తో పంచుకోకుండా ఉండలేదీ చక్కనమ్మ. ఈ నేపథ్యంలో ఈ క్లాసీ బ్యూటీ వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
the-star-shined-at-umang-2020

అదిరేటి ఫ్యాషన్‌ లుక్స్‌తో దడ పుట్టించారు!

ముంబై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ‘ఉమంగ్‌ ఫెస్టివల్‌’.. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరిగింది. పోలీస్‌ ఫోర్స్‌, పోలీస్‌ కుటుంబాల కోసం నిధుల్ని సమీకరించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఛారిటీ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటీనటులు పెద్ద ఎత్తున హాజరుకావడమే కాకుండా తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. అంతేకాదు.. రెడ్‌ కార్పెట్‌పై ఈ అందాల తారలు తమ ఫ్యాషన్‌ లుక్స్‌తో చేసిన హంగామా చూడడానికి రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. మరి, ‘ఉమంగ్‌ ఫెస్టివల్‌’లో వారి రెడ్‌ కార్పెట్‌ ఫ్యాషన్‌ పరేడ్‌ని మనమూ ఓ సారి చూసొద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
sara-ali-khan-style-file

ఈ పటౌడీ ప్రిన్సెస్‌.. ఓ ఫ్యాషన్‌ సెన్సేషన్‌!

సారా అలీ ఖాన్‌.. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ పటౌడీ ప్రిన్సెస్‌. తన మొదటి చిత్రం ‘కేదార్‌నాథ్‌’తో.. తనకు నట వారసత్వం ఉన్నప్పటికీ.. తానేంటో నిరూపించుకోగలనని తెలియజేసింది. ఆపై ‘సింబా’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని.. ప్రస్తుతం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’, ‘కూలీ నెం 1’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందీ అందాల భామ. ఇలా నటించింది రెండంటే రెండు సినిమాల్లోనే అయినా.. సీనియర్‌ నటులకేమాత్రం తీసిపోనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది సారా. ఇందుకు అసలు సిసలైన కారణం.. తన నటప్రతిభే కాదు.. తన ఫ్యాషన్‌సెన్స్‌ కూడా! ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్‌పై సందర్భమేదైనా విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తనదైన ఫ్యాషన్ లుక్స్‌తో ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయింది. ఇలా స్టైల్‌ సెన్సేషన్‌గా ఈ తరం అమ్మాయిల మనసుల్లో చోటుసంపాదించుకున్న ఈ పటౌడీ ప్రిన్సెస్‌ వార్డ్‌రోబ్‌లో ఏమేం ఫ్యాషన్స్‌ ఉన్నాయో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
kousalya-krishnamurthy-fame-aishwarya-rajesh-fashion-trends

ట్రెండీ ఫ్యాషన్స్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేస్తోంది!

ప్రస్తుతం దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటీమణుల్లో ‘ఐశ్వర్యా రాజేష్‌’ ఒకరు. ఓ తమిళ కామెడీ షోకి యాంకర్‌గా వ్యవహరించి తన కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వర్య.. ‘నీతాన అవన్‌’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’గా తెలుగునాట అడుగుపెట్టి తన క్రికెట్‌ బంతులతో అభిమానుల హృదయాలను క్లీన్‌బౌల్డ్‌ చేసిందీ తమిళమ్మాయి. ఆపై ‘మిస్‌మ్యాచ్‌’ సినిమాతో ఆకట్టుకుని.. ఇప్పుడు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ సరసన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ లో సువర్ణగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇలా తన ప్రతిభ కేవలం నటనలోనే అనుకుంటే పొరపాటే.. తన ఫ్యాషన్స్‌తోనూ నేటి తరం యువతుల మతులుపోగొడుతోందీ డస్కీ బ్యూటీ. మరి తన వార్డ్‌రోబ్‌లో చోటుదక్కించుకున్న క్రేజీ స్టైల్స్‌లోని కొన్ని డిఫరెంట్‌ లుక్స్‌ ఏంటో చూసేద్దామా..?

Know More

women icon@teamvasundhara
traditional-outfits-to-flaunt-your-style-this-sankranthi-2020

ఈ సంక్రాంతికి కాస్త ట్రెడిషనల్‌గా.. కాస్త మోడ్రన్‌గా..!

భోగభాగ్యాలనిచ్చే భోగి.. సిరి సంపదలను తెచ్చే సంక్రాంతి.. కష్టాలు తీర్చే కనుమ.. ఇలా ఎన్నో ఆనందాలతో కొత్త సంవత్సరంలో వస్తున్న మొదటి పండగకి ప్రతి తెలుగింటి లోగిలి అందమైన ముగ్గులతో ఆహ్వానం పలకడానికి సిద్ధమవుతోంది. మరి అంతటి గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ పండగకి మన తెలుగింటి ముద్దుగుమ్మలు ఇంకెంత అందంగా ముస్తాబవ్వాలనుకుంటారో కదా! ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగ సందర్భంగా ప్రతిరోజూ సరికొత్తగా మెరిసిపోవాలనుకుంటారు.. ఈ క్రమంలో అటు సంప్రదాయాన్ని పాటిస్తూనే.. ఇటు కాస్త ట్రెండీ టచ్‌ను జోడించాలనుకుంటున్నారు ఈ తరం అతివలు. అంతేకాదు.. అలాంటి సరికొత్త లుక్కున్న దుస్తుల్ని ఎంచుకుంటే ‘దివా ఆఫ్ ది ఫెస్టివల్‌’ మీరే అవుతారు కూడా! మరి అలా బుట్టబొమ్మలా తయారవ్వాలంటే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌ ఫ్యాషన్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
the-style-file-of-veteran-actress-madhuri-dixit

ఈ సౌందర్య దేవత అదిరేటి ఫ్యాషన్స్‌ మీరూ ట్రై చేయండి..!

‘ఏక్, దో, తీన్‌..’ అంటూ ఆనాటి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించినా.. ‘తాబా హో గయే’ అంటూ తన నాట్యంతో నేటి తరం హృదయాలను రంజింపజేయాలన్నా తనకే చెల్లింది. తన అందం, అభినయం, నాట్యంతో మెప్పించి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది గజగామిని మాధురి. మధ్యలో కాస్త విరామాన్ని ప్రకటించినా.. తిరిగి తన రాకతో నేటి తరం నాయికలను సైతం సవాలు విసురుతూ తన మాయతో ప్రేక్షకులని కట్టిపడేస్తోందీ అందాల తార. కేవలం తన నటనతోనే కాదు.. ఫ్యాషన్స్‌లో కూడా నేటి తరం నాయికలకు ఏ మాత్రం తగ్గకుండా తన లుక్స్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకొంటోందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ. సీనియర్‌ నటైనా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ స్టార్స్‌లో ఒకరిగా కొనసాగుతోన్న మాధురి.. తన ఫ్యాషన్‌ స్టిల్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ.. నేటి తరం అమ్మాయిలు సైతం తన ఫ్యాషన్స్‌కి ఫిదా అయ్యేలా చేస్తోంది. మరి అందరినీ అంతలా మైమరిపిస్తున్న తన వార్డ్‌రోబ్‌లోని కొన్ని ఫ్యాషన్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా..!

Know More

women icon@teamvasundhara
the-fashion-trends-of-2019

ఈ ఏడాది ఫ్యాషన్‌ ప్రియుల మది దోచేశాయ్‌!

ఫ్యాషన్‌.. ఈ విషయంలో నటీమణుల దగ్గర్నుంచి మనలాంటి సామాన్య మహిళల దాకా ఎవరూ రాజీపడరు. ఈ క్రమంలోనే విభిన్న అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని ట్రై చేస్తూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని తహతహలాడుతుంటారు. ఇలా ఫ్యాషన్‌ ప్రియుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్యాషన్‌ డిజైనర్లు కూడా ఏటికేడు కొత్త కొత్త ఫ్యాషన్లను సృష్టించడం మనకు తెలిసిందే. అలా ఈ ఏడాది కూడా కొన్ని ఫ్యాషన్లు మగువల వార్డ్‌రోబ్‌లో భాగమవుతూ వారి అందాన్ని రెట్టింపుచేయడంలో ముందు నిలిచాయి. మరి, ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలుకుతోన్న నేపథ్యంలో ఈ ఏటి మేటి ఫ్యాషన్‌ ట్రెండ్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
new-year-2020-outfit-ideas-inspired-by-celebrities

న్యూ ఇయర్‌ పార్టీలో ఈ అదిరేటి డ్రస్సు మీరేస్తే..!

హ్యాపీ న్యూ ఇయర్‌.. అంటూ దాదాపు వారం ముందు నుండే యువత కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పేందుకు సన్నద్ధమవుతారు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి విభిన్న ప్రదేశాలకు వెళ్లి కొత్త సంవత్సరాన్ని మరింత కొత్తగా స్వాగతించాలని.. ఇలా ఎన్నెన్నో ప్లాన్స్‌ వేస్తారు. మరి మామూలు ఫంక్షన్లంటేనే అందాల తారల్లా మెరిసిపోయే అమ్మాయిలు.. ఇక న్యూ ఇయర్‌ వేడుకలకు ఇంకెంత ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో చేసుకునే న్యూ ఇయర్‌ పార్టీలోనూ ట్రెండీ బ్యూటీలా అదరగొట్టేయాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. మరి మీరూ కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పే పార్టీలో జోష్‌తో పాటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ ఫాలో అవ్వాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
the-title-style-of-mr-majnu-beauty-nidhhi-agerwal

ఈ ‘ఇస్మార్ట్‌’ గర్ల్‌ ఫ్యాషన్స్‌ చూస్తే మతి పోవాల్సిందే!

‘ఐశ్వర్యారాయ్‌లా నా ఫొటో కూడా ఏదో ఒకరోజు హోర్డింగ్‌లో ఉంటుంది’.. అంటూ ఒక్కఛాన్స్‌ కోసం ఎదురుచూశానని చెప్తోంది నిధి అగర్వాల్‌. ఈ మాట వింటేనే తెలుస్తోంది నటి కావాలని తనెన్ని కలలు కన్నదో! తన ఎదురుచూపుల ఫలితంగా వచ్చిన ఆ ఒక్క ఛాన్స్‌ను ఏ మాత్రం వృథా చేసుకోలేదీ బెంగళూరు భామ. ‘మున్నా మాయికల్‌’ చిత్రంతో సినీ రంగానికి పరిచయమైన నిధి.. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది. ఆపై ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతోనే కాదు.. ఫ్యాషన్స్‌తో సైతం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెడుతోందీ కన్నడ కుట్టి. ప్రస్తుతం తెలుగునాట క్రేజీ స్టార్స్‌లో నిధి కూడా ఒకరు. తన అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని ఇన్‌స్టా వేదికగా ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ.. తన అభిమానులకు కనువిందు చేస్తోంది. ఈ క్రమంలో మనం కూడా ఈ మజ్ను ప్రియురాలి వార్డ్‌రోబ్ ఫ్యాషన్స్‌పై ఓ లుక్కేద్దామా!

Know More

women icon@teamvasundhara
style-guide-for-christmas-celebrations

ఈ క్రిస్మస్‌ ఫ్యాషన్స్‌తో బంగారు బొమ్మల్లా మెరిసిపోండి ..!

క్రిస్మస్‌.. ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఎంతో ఉత్సాహంగా, ఆత్రంగా ఏడాది కాలం పాటు ఎదురుచూసే పండగ ఇది. నిజానికి పండగ డిసెంబర్‌ చివరి వారంలో అయినా.. డిసెంబర్‌ మొదలవ్వగానే క్రిస్మస్‌ సంబరాలు కూడా మొదలైపోతాయి. ఇక పండగ దగ్గరపడుతూ ఉందంటే షాపింగ్‌ హడావిడి అంతా ఇంతా కాదు. ఇంటిని అలంకరించే వస్తువుల నుండి.. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఇచ్చే గిఫ్ట్స్‌ వరకు.. ఇలా చాలా వస్తువులు షాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. మరి ఈ క్రిస్మస్‌కి క్వీన్‌లా మెరిసిపోవడానికి డ్రస్‌ని సిద్ధం చేసుకున్నారా?అయ్యో ఇంకా లేదా! ఏ సందర్భానికి ఎలాంటివి ధరించాలో తేల్చుకోలేక తికమక పడుతున్నారా? అయితే మీ కన్‌ఫ్యూజన్‌కి ఈ కథనంతో చెక్‌ పెట్టేయండి. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే చదివేయండి!

Know More

women icon@teamvasundhara
actress-priyamani-stylefile

ఈ ‘యమదొంగ’ భామ ఫ్యాషన్స్‌తో మనసు దోచేస్తోంది..!

కొందరు ఎన్ని సినిమాలలో నటించినా.. కొన్ని సినిమాలు మాత్రం వారిని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేస్తాయి. అలా ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’.. వంటి చిత్రాలతో తెలుగునాట ఎనలేని గుర్తింపు సంపాదించుకుంది అందాల భామ ప్రియమణి. ఆపై ‘ప్రవరాఖ్యుడు’, ‘సాధ్యం’, ‘రగడ’, ‘క్షేత్రం’ వంటి తెలుగు సినిమాలలో నటించింది. పుట్టి పెరిగింది కన్నడ నాటైనా.. తెలుగమ్మాయేనేమో అనిపించే విధంగా తన పాత్రల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. కేవలం నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్‌తోనూ ఆకట్టుకుంటుందీ అందాల తార. ఎటువంటి సందర్భమైనా దానికి తగ్గట్టుగా తన ఫ్యాషన్స్‌తో మురిపించే ఈ బెంగళూరు భామ స్టైలిష్‌ లుక్స్‌ని నేటి తరం అమ్మాయిలు తెగ ఫాలో అయిపోతున్నారు. ఎప్పటికప్పుడు తన డిఫరెంట్‌ లుక్స్‌ని సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ.. ఫ్యాషన్‌ ఫ్రీక్స్‌ని సైతం తన స్టైల్స్‌తో మైమరపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియమణి వార్డ్‌రోబ్‌లోని సరికొత్త ఫ్యాషన్స్‌ గురించి తెలుసుకుని మనమూ ఫాలో అవుదాం రండి..

Know More

women icon@teamvasundhara
sri-divya-fashionable-wardrobe-in-telugu

ఈ తెలుగందం ఫ్యాషన్లు చూశారా?

‘పరవాలేదు.. పరవాలేదు..’ అంటూ తన చిలిపి చూపులు, అందమైన అభినయంతో తొలి సినిమాలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగందం శ్రీ దివ్య. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సినీ అభిమానులతో మంచి మార్కులు వేయించుకున్న ఈ అందాల బొమ్మ.. ‘మనసారా’ సినిమాతో హీరోయిన్‌గా తనని తాను పరిచయం చేసుకుంది. ‘బస్‌ స్టాప్‌’, ‘వారధి’, ‘కేరింత’, ‘సైజ్‌ జీరో’.. వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆపై తమిళ సినిమాలతో బిజీ అయిపోయిన ఈ లవ్లీ గర్ల్‌.. ప్రస్తుతం ‘ఒతైక్కు ఒతై’ అనే మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. సినిమాల్లో తన పాత్రకు తగినట్లుగా పద్ధతిగా డ్రస్సింగ్‌ వేసుకునే శ్రీ.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ అంతే ట్రెడిషనల్‌గా మెరిసిపోతుంది. ఇందుకు ఆమె సోషల్‌ మీడియా పేజీలే ప్రత్యక్ష నిదర్శనం. పండగలు, ప్రత్యేక సందర్భాలు, చిత్రోత్సవాలు, ఫొటోషూట్స్‌.. ఇలా సందర్భమేదైనా తనదైన ఫ్యాషన్లతో అదరగొట్టే ఈ ముద్దుగుమ్మ.. నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది. అంతేనా.. చక్కటి డ్రస్సింగ్‌ సెన్స్‌తో అటు ట్రెడిషనల్‌గా, ఇటు ట్రెండీగా మెరిసిపోవచ్చని తనదైన డ్రస్సింగ్‌ స్టైల్‌తో నిరూపిస్తోందీ సొగసరి. ఈ నేపథ్యంలో శ్రీ ఫ్యాషనబుల్‌ వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న ఆ ట్రెడిషనల్‌ కమ్‌ ట్రెండీ ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
take-a-look-on-tollywood-beauty-lavanya-tripathi-fashionable-wardrobe-in-telugu

‘అందాల రాక్షసి’ ఫ్యాషన్లెంతో అపురూపం!

చారడేసి కళ్లు, పువ్వంటి పెదాలు, సొట్ట బుగ్గలు, ముట్టుకుంటే కందిపోయే మోము.. ఇంతటి అపురూప లావణ్యాన్ని తన సొంతం చేసుకొని టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఉత్తర్‌ప్రదేశ్‌ బ్యూటీ లావణ్యా త్రిపాఠి. ‘అందాల రాక్షసి’గా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’.. వంటి సినిమాల్లో రాణించి.. తాజాగా ‘అర్జున్‌ సురవరం’తో మన ముందుకొచ్చింది. ఆన్‌స్క్రీన్‌పై తన అందం, అభినయంతో పాటు చక్కనైన ఫ్యాషన్లతో అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ అంతే ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతుంది. ఈ విషయం తన సోషల్‌ మీడియా పేజీల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో, అవార్డుల ఫంక్షన్లలో.. ఇలా అకేషన్‌ ఏదైనా అప్‌డేటెడ్‌ ఫ్యాషన్లతో అదరగొట్టేయడం ఈ అందాల చందమామకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే కేవలం నటిగానే కాదు.. ఈ తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ ఐకాన్‌గా కూడా మారిపోయిందీ లవ్లీ గర్ల్‌. మరి, తనదైన ఫ్యాషన్లతో నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోన్న ఈ అందాల రాక్షసి వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
tollywood-beauty-anjali-wardrobe-is-very-fashionable

కూల్‌ అండ్‌ క్యూట్‌ ఫ్యాషన్లకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ ‘గీతాంజలి’!

‘ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే..!’ అంటూ ఇలా తన అమాయకపు మాటలు, చిలిపితనంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘సీత’గా తెలుగువారిని మెప్పించింది తెలుగందం అంజలి. ‘బలుపు’, ‘మసాలా’, ‘గీతాంజలి’, ‘డిక్టేటర్‌’.. వంటి తెలుగు సినిమాలతో పాటు మరెన్నో తమిళ చిత్రాల్లో నటించి తన మార్క్‌ను ప్రదర్శించిన ఈ అందాల తార.. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’, ‘గీతాంజలి-2’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఇలా క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్‌తో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటుందీ లవ్లీ గర్ల్‌. ఈ క్రమంలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని పంచుకోవడమే కాదు.. సందర్భమేదైనా ఎంతో లవ్లీగా మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాషనబుల్‌ అటైర్స్‌ని సైతం ఫొటోల్లో బంధించి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఇలా ఇండస్ట్రీలో మంచి నాయికగానే కాదు.. ఫ్యాషన్‌ దివాగా కూడా మన సీతకు పేరుంది. మరి, తనదైన ఫ్యాషన్లతో అదరగొడుతూ నేటితరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోన్న ఈ చక్కనమ్మ వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
take-a-look-on-anchor-vishnu-priya-fashionable-wardrobe

మాటలతో నవ్విస్తూ.. ఫ్యాషన్లతో కవ్విస్తోంది!

ఆకట్టుకునే అందంతో, గలగలా మాట్లాడే తన వాక్చాతుర్యంతో తక్కువ కాలంలోనే పాపులర్‌ యాంకర్‌గా మారిపోయింది హైదరాబాదీ బ్యూటీ విష్ణు ప్రియ. ‘పోవే పోరా’.. అనే టీవీ షోలో తన మాటలతో నవ్విస్తూ, తన చలాకీతనంతో కవ్విస్తూ.. బుల్లితెర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేస్తోందీ సూపర్‌ యాంకర్‌. అంతేకాదు.. పలు ట్యాలెంట్‌ షోలలోనూ పాల్గొంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలోనూ మహా చురుగ్గా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఫ్యాషన్‌ విషయంలో ఎప్పకప్పుడు అప్‌డేట్‌ అవుతూ.. పలు సందర్భాల్లో తాను ఫ్యాషనబుల్‌గా ముస్తాబై దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయింది విష్ణు. మరి, తనదైన ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో అలరిస్తోన్న ఈ ముద్దుగమ్మ వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్స్‌పై మనమూ ఓ లు