scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాన్నే కాటేయాలని చూశాడు..!'

'కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. అప్పటికి ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. జరిగిన విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అతను భార్య కాళ్ల మీద పడి ఇంకెప్పుడూ ఇలా జరగదంటూ కపట ప్రేమను ప్రదర్శించాడు. కానీ ఆ ముసుగు కొన్ని రోజులు మాత్రమే నిలిచింది.. మళ్లీ కూతురిపై అత్యాచారానికి పాల్పడడంతో ఈసారి ఆ అమ్మాయి వూరుకోలేదు.. నేరుగా పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయిలు వేధింపుల విషయంలో మౌనం వహించడం తగదు అంటోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏం జరిగింది?? తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

అదిరేటి ఫ్యాషన్‌ లుక్స్‌తో దడ పుట్టించారు!

The Star Shined At Umang 2020

ముంబై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ‘ఉమంగ్‌ ఫెస్టివల్‌’.. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరిగింది. పోలీస్‌ ఫోర్స్‌, పోలీస్‌ కుటుంబాల కోసం నిధుల్ని సమీకరించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఛారిటీ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటీనటులు పెద్ద ఎత్తున హాజరుకావడమే కాకుండా తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. అంతేకాదు.. రెడ్‌ కార్పెట్‌పై ఈ అందాల తారలు తమ ఫ్యాషన్‌ లుక్స్‌తో చేసిన హంగామా చూడడానికి రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. మరి, ‘ఉమంగ్‌ ఫెస్టివల్‌’లో వారి రెడ్‌ కార్పెట్‌ ఫ్యాషన్‌ పరేడ్‌ని మనమూ ఓ సారి చూసొద్దాం రండి..!

ప్రియాంకా చోప్రా

గ్లోబల్‌ తారగా పేరుగాంచిన ప్రియాంకా చోప్రా ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో హాజరై అందరి చూపును తనవైపు తిప్పుకుందనడంలో సందేహం లేదు. ఎకాయ బెనారస్‌ క్లాతింగ్‌ స్టోర్‌, ఫ్యాషనర్‌ మసాబా గుప్తా సంయుక్తంగా రూపొందించిన బ్లూ కలర్‌ చీరలో మెరిసింది పీసీ. దానికి జతచేసిన మ్యాచింగ్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, మ్యాచింగ్‌ బ్యాంగిల్స్‌, లూజ్‌ హెయిర్‌తో తన లుక్‌ సూపర్బ్‌ అనిపించేలా ముస్తాబైందీ మిసెస్‌ నిక్‌ జొనాస్‌.

View this post on Instagram

A post shared by Ami Patel (@stylebyami) on

అనన్యా పాండే

రైజింగ్‌ స్టార్‌ అనన్య యెల్లో కలర్‌ లెహెంగా లుక్‌లో వావ్‌ అనిపించింది. అర్పితా మెహతా డిజైన్‌ చేసిన యెల్లో కలర్‌ లెహెంగా ధరించి.. జతగా అదే కలర్‌ బ్రాలెటీని జోడించింది. మ్యాచింగ్‌ దుపట్టాతో తన లుక్‌ని మరింత హైలైట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. స్టన్నింగ్‌ మేకప్‌తో, స్టైలిష్‌ పోనీ, హెవీ ఇయర్‌రింగ్స్‌తో తన లుక్‌ని ముగించిందీ స్టార్‌ కిడ్‌.

View this post on Instagram

A post shared by Ami Patel (@stylebyami) on

శిల్పా శెట్టి

ఈ ఛారిటీ కార్యక్రమానికి బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ శిల్పా శెట్టి కూడా హాజరైంది. డిజైనర్‌ రిధీ మెహ్రా ఫ్యాషన్‌ హౌస్‌ నుండి ఎంచుకున్న తన మోనోక్రొమాటిక్ అటైర్ అద్భుతం అని చెప్పాలి. పింక్‌ కలర్‌ స్కర్ట్‌కి సేమ్‌ కలర్‌ టాప్‌ని జోడించిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఇక నడుమును కట్టిపడేసిన మల్టీకలర్‌ బెల్ట్‌ అన్నింటి కంటే హైలైట్‌ అనక తప్పదు. తన డ్రస్‌ కలర్‌కి అపోజిట్‌ కలర్‌ ఎమరాల్డ్‌ ఆభరణాలను ధరించి తన ఫ్యాషన్‌ సెన్స్‌ని నిరూపించుకుంది శిల్ప. తనని చూస్తే ఎవరైనా ‘సింప్లీ బ్యూటిఫుల్‌’ అనాల్సిందే..!

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

కత్రినా కైఫ్‌

వైట్‌ శారీలో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతలా ముస్తాబైంది కత్రినా. ప్రముఖ డిజైనర్‌ ద్వయం అబుజానీ, సందీప్‌ ఖోస్లా రూపొందించిన వైట్‌ కలర్‌ మిర్రర్‌ వర్క్‌ చీరలో అందంగా తయారైంది. తన లుక్‌ని వర్ణించడానికి మాటలు సరిపోవేమో అన్నంతగా తనను తాను ముస్తాబు చేసుకున్న క్యాట్‌.. లూజ్‌ హెయిర్‌, షైనీ మేకప్‌తో అదరగొట్టింది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani) on

జాన్వీ కపూర్‌..

రెడ్‌ కార్పెట్‌పై రెడ్‌ కలర్‌ లుక్‌లో దర్శనమిచ్చింది జూనియర్‌ అతిలోక సుందరి. మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన రెడ్‌ కలర్‌ చీరలో రెడ్‌ రోజ్‌లా మెరిసిపోయింది జాన్వీ. సెల్ఫ్‌ ఎంబ్రాయిడరీ బోర్డర్‌, శారీకి సీక్విన్‌ వర్క్‌ బ్లౌజ్‌ని జత చేసిన ఈ ధడక్‌ బ్యూటీ.. బీచ్‌ వేవీ హెయిర్‌ స్టైల్‌, బ్లష్‌ మేకప్‌తో తన లుక్‌ని ముగించింది.

View this post on Instagram

A post shared by Mohit Rai (@mohitrai) on

శ్రద్ధా కపూర్‌

సందర్భమేదైనా స్టైల్‌ బేబీలా తయారయ్యే శ్రద్ధ.. ఈ ఈవెంట్‌లో ట్రెడిషనల్‌ లుక్‌లో తళుక్కుమంది. డిజైనర్‌ అనితా డోంగ్రే డిజైన్‌ చేసిన గ్రీన్‌ కలర్‌ లెహెంగాను ఎంచుకుని అందంగా ముస్తాబైందీ భామ. లెహెంగా ఆసాంతం డిజైన్‌ చేసిన సిల్వర్‌ వర్క్‌ తన లుక్‌కి హైలైట్‌ అని చెప్పచ్చు. దానికి జతగా సేమ్‌ టాప్‌, దుపట్టాని జత చేసిందీ బాలీవుడ్‌ భామ. తన క్లాసీ లుక్‌కి నప్పేట్లుగా తన హెయిర్‌స్టైల్‌ కూడా తీర్చిదిద్దిందీ ముద్దుగుమ్మ. చివరగా సింపుల్‌ మేకప్‌, మ్యాచింగ్‌ ఇయర్‌వేర్‌తో తన లుక్‌ను పూర్తిచేసిన ఈ సాహో భామ.. అదుర్స్‌ అనిపించేలా కనిపించింది.

View this post on Instagram

A post shared by Tanya Ghavri (@tanghavri) on

కృతీ సనన్‌

వైట్‌-గోల్డ్‌ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన దుస్తులు ధరించిన వారిని చూస్తే అచ్చం ప్రిన్సెస్‌లా ఉన్నారనిపిస్తుంది. ఈ మాట కృతీ సనన్‌ని చూస్తే నిజమనిపించక మానదు. శంతను- నిఖిల్‌ డిజైనర్‌ ద్వయం రూపొందించిన వైట్‌-గోల్డెన్‌ లెహెంగాకు.. హై నెక్‌ వైట్‌ బ్లౌజ్‌ని జత చేసింది కృతి. ఇక అదే కలర్‌ దుపట్టా తన లుక్‌ని ద్విగుణీకృతం చేసిందని చెప్పుకోవచ్చు

View this post on Instagram

A post shared by S U K R I T I G R O V E R (@sukritigrover) on

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ఇటు టాలీవుడ్‌తో పాటు.. అటు బాలీవుడ్‌లో కూడా వరుస విజయాలను అందుకుంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ కార్యక్రమంలో అందమైన చీరలో ముస్తాబైందీ అందాల భామ. క్రేషా బజాజ్‌ డిజైన్‌ చేసిన గ్రే కలర్‌ షిమ్మరీ శారీ, దానికి మ్యాచింగ్‌ బ్లౌజ్‌ ధరించి అదరగొట్టిందీ టాలీవుడ్‌ క్యూటీ. మెటాలిక్‌ ఇయర్‌ రింగ్స్‌, కాస్త హెవీ మేకప్‌, లూజ్‌ హెయిర్‌తో అదుర్స్‌ అనిపించేలా ఆకట్టుకుంది రకుల్‌.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on

డయానా పెంటీ

ఫ్యాషన్‌ ప్రపంచంలో కొంతకాలం నుండి సీక్విన్‌ చీరల హవా నడుస్తోందని చెప్పచ్చు. మరి అటువంటి ట్రెండింగ్‌ ఫ్యాషన్‌లో ముస్తాబై ఉమంగ్‌ ఫెస్టివల్‌లో మెరిసింది బాలీవుడ్‌ బేబ్‌ డయానా పెంటీ. ఫ్యాషనర్‌ ఆకాంక్ష గజ్రియా డిజైన్‌ చేసిన డై-సీక్విన్‌ శారీని ఎంచుకుంది డయానా. దానికి తనదైన స్టైల్‌లో స్ట్రాప్‌లెస్‌ ఫ్లోరల్‌ డిజైన్‌ బ్లౌజ్‌ని జత చేసింది. మ్యాచింగ్‌ నెక్‌పీస్‌, పింక్‌ బ్లష్‌ మేకప్‌తో తన లుక్‌ని హైలైట్‌ చేసిందీ ముంబై భామ.

View this post on Instagram

A post shared by Diana Penty (@dianapenty) on

రిచా చద్దా

ఫ్యాషన్‌ ప్రపంచంలో తన స్టైలిష్‌ లుక్స్‌తో ఫ్యాషన్‌ ప్రియులను కట్టిపడేసే అందాల తారల్లో రిచా చద్దా ఒకరు. ఈ కార్యక్రమంలో కూడా అందమైన చీరకట్టుతో అందరి చూపును తనవైపు తిప్పుకుందీ బిహార్‌ భామ. రా-మ్యాంగో ఫ్యాషన్‌ స్టోర్స్‌ నుండి ఎంపిక చేసుకున్న తెలుపు రంగు చీరలో దేవతలా మెరిసిపోయింది రిచా. దానికి తగ్గట్టుగా బ్లౌజ్‌ని జత చేసి... గోల్డెన్‌ ఇయర్‌రింగ్స్‌, కంగన్‌ బ్యాంగిల్‌తో తన జ్యుయలరీ లుక్‌ని ముగించింది. తన లుక్‌కి తగ్గట్లుగా బన్‌ హెయిర్‌స్టైల్‌కి వైట్‌ రోజెస్‌ జత చేసి, నుదుటన బొట్టుతో చూడచక్కగా ముస్తాబైందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Who Wore What When (@who_wore_what_when) on

శ్రేయా ఘోషల్‌

బ్యూటిఫుల్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ కూడా రెడ్‌ కార్పెట్‌పై తళుక్కుమంది. సీమా గుజ్రాల్‌ డిజైన్‌ చేసిన ఫ్యాబ్రిక్‌ అటైర్‌లో అందంగా ముస్తాబైందీ బాలీవుడ్‌ గాయని. కాఫీ కలర్‌ డ్రస్‌కి సిల్వర్‌ కలర్‌ త్రెడ్‌ వర్క్‌ హైలైట్‌ అని చెప్పాలి. ఆభరణాలేవీ ధరించకపోయినా స్టైలిష్‌ లుక్‌లో తనకెవరూ సాటి రారనిపించుకుందీ క్యూట్‌ సింగర్‌. లూజ్‌ హెయిర్‌, సింపుల్‌ మేకప్‌తో తన లుక్‌కి మరిన్ని వన్నెలద్దింది శ్రేయ.

View this post on Instagram

A post shared by shreyaghoshal (@shreyaghoshal) on

తారా సుతారియా..

కేవలం రెండంటే రెండే సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చోటు దక్కించుకుంది తారా సుతారియా. ఈ కార్యక్రమంలో తనదైన క్లాసీ లుక్‌లో రెడ్‌కార్పెట్‌పై అడుగుపెట్టిందీ తార. డిజైనర్‌ ఫ్యాబినా డిజైన్‌ చేసిన హాఫ్‌ వైట్‌ కలర్‌ లేస్‌ లెహంగాను ధరించి.. దానికి జతగా కాంట్రాస్ట్‌ బ్లాక్‌ కలర్‌ హై నెక్‌ బ్లౌజ్‌, దుపట్టాని జత చేసింది. మెడ, చేతులు, దుపట్టాపై గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ తన అటైర్‌కి రిచ్‌ లుక్‌ ఇచ్చాయని చెప్పచ్చు. మెటాలిక్‌ ఇయర్‌రింగ్స్‌, సాఫ్ట్‌ హెయిర్‌తో తన లుక్‌ని సంపూర్ణం చేసిందీ సుందరి.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani) on

వీరితో పాటు.. దివ్యా ఖోస్లా కుమార్‌, తులసీ కుమార్‌, సారా అలీ ఖాన్‌, విద్యా బాలన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, కార్తీక్‌ ఆర్యన్‌.. వంటి తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని అటు తమ ఫ్యాషన్స్‌తో, ఇటు తమ ఆటపాటలతో సందడి చేశారు





women icon@teamvasundhara
stylish-ways-to-wear-linen-this-summer-in-telugu

ఈ ఎండల్లో ‘లినెన్‌’తో కూలైపోదాం!

ఓవైపు ఎండ వేడి.. మరోవైపు భరించలేని ఉక్కపోతతో వేసవి కాలమంటేనే చిరాకొస్తుంటుంది. ఇలాంటి అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికే కంఫర్టబుల్‌గా ఉండే కాటన్‌ దుస్తుల్ని ఎంపిక చేసుకుంటాం. అయితే ఈ మధ్య లినెన్‌ దుస్తులకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని ఎంచుకునే వారి సంఖ్య రెట్టింపవుతోందని చెప్పచ్చు. ఇవి కాటన్‌ కంటే మరింత సమర్థంగా చెమటను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉండడమే ఇందుకు కారణం! అవిసె మొక్క నుంచి తయారయ్యే ఈ ఫ్యాబ్రిక్‌తో సంప్రదాయ చీరలే కాదు.. మగువల అభిరుచులకు అనుగుణంగా మోడ్రన్‌ డ్రస్సులూ రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు నేటి డిజైనర్లు. మరి, అలాంటి కొన్ని లినెన్ అవుట్‌ఫిట్స్‌ గురించి ఈ హాట్‌ సమ్మర్‌లో ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
who-wore-what-in-lakme-fashion-week-2021-in-telugu

women icon@teamvasundhara
fashion-tips-to-revamp-your-wardrobe-for-this-summer-in-telugu

హాట్‌ సమ్మర్‌లో ఈ ‘కూల్‌’ ఫ్యాషన్స్‌ ట్రై చేద్దామా?!

ఆయా కాలాలకు అనుగుణంగా తమ వార్డ్‌రోబ్‌ను మార్చుకోవడం ఈ తరం అమ్మాయిలకు కొత్తేమీ కాదు. సీజన్‌లో మార్పులు మొదలైన మరుక్షణం నుంచి దానికి తగినట్లుగా.. అటు ఫ్యాషనబుల్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా ఉండే దుస్తుల్ని అల్మరాలో చేర్చుకోవడానికి అస్సలు వెనకాడరు. ఇక ప్రస్తుతం రాబోయే వేసవి కోసం దుస్తుల దగ్గర్నుంచి వాటికి మ్యాచింగ్‌గా ధరించే యాక్సెసరీస్‌ దాకా.. ఇలా ప్రతి విషయంలో తమ వార్డ్‌రోబ్‌ను అప్‌డేట్‌ చేసుకునే పనిలో పడ్డారు చాలామంది అమ్మాయిలు. మరి, మీరూ ఇదే పనిలో ఉన్నారా? అయితే ఈ కూల్‌ ఫ్యాషనబుల్‌ టిప్స్‌ మీకోసమే..!

Know More

women icon@teamvasundhara
different-ways-to-wore-red-color-in-your-wedding-and-other-wedding-rituals

ఎర్ర చీరలో మేడమ్ సార్.. మేడమ్ అంతే!

పెళ్లంటేనే శుభకార్యం. అలాంటి వేడుకలో శుభసూచకంగా వధువులు ఎరుపు రంగును ఎంచుకోవడం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం! అయితే ఇందులోనూ మారుతోన్న ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి అనుగుణంగా ఎరుపు రంగులో రూపొందించిన సరికొత్త చీరలు, లెహెంగాలు, ఇతర అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకొని.. వాటికి మ్యాచింగ్‌ జ్యుయలరీని జత చేసి అటు సంప్రదాయబద్ధంగా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు ఈ తరం మగువలు. తాజాగా తన ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు నడిచిన బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా కూడా తన పెళ్లికి రెడ్‌ కలర్‌ బ్రైడల్‌ ట్రెండ్‌నే కొనసాగించింది. ఎరుపు రంగు లవ్లీ శారీలో ముస్తాబై కాబోయే వధువులందరికీ సరికొత్త బ్రైడల్‌ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది దియా. అందుకే ‘సింప్లీ సూపర్బ్‌, దేశీ బ్రైడ్‌’ అంటూ అందరూ ఆమె బ్రైడల్‌ అటైర్‌కు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎరుపు రంగును మన వెడ్డింగ్‌ లుక్స్‌లో ఎన్ని విధాలుగా భాగం చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
dress-code-for-valentines-day-in-telugu
women icon@teamvasundhara
try-these-red-color-stylish-outfits-on-this-valentines-day

ఎర్ర గౌను బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే!

మనసుకు నచ్చిన వాడు ఎదుటే ఉంటే మాటల కంటే చేతలతోనే తమ మనసులోని భావాలను వ్యక్తపరచాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. అందమైన ఆహార్యంతో అవతలి వారిని కట్టిపడేస్తూనే.. తమ మనోహరుడికి గుండె లోతుల్లో దాగున్న ప్రేమను తెలియజేస్తుంటారు. ఇలా ప్రేమను పంచుకునే ప్రేమికుల దినోత్సవం రోజున అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తుల్ని ఎంచుకోవడం కొత్తేమీ కాదు. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సరికొత్త ఫ్యాషన్లను ఎంచుకోవడానికి, సౌకర్యవంతంగా మెరిసిపోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏటికేడు కొత్త కొత్త రెడ్‌ కలర్‌ ట్రెండీ అవుట్‌ఫిట్స్ మగువల మనసు దోచుకుంటున్నాయి. మరి, అలాంటి కొన్ని ఎరుపు రంగు అవుట్‌ఫిట్స్‌ గురించి ఈ ‘వేలంటైన్స్‌ డే’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
stylish-jackets-to-have-this-winter-to-keep-yourself-warm-in-telugu

వెచ్చదనానికి కాస్త స్టైల్‌ని జోడించేద్దాం..!

చలికాలమొచ్చిందంటే వార్డ్‌రోబ్‌లో దాచుకున్న స్వెట్టర్లు, శాలువాలు బయటికి తీస్తాం. ఇక ఈ విషయంలో కాస్త ఫ్యాషనబుల్‌గా ఆలోచించే వారైతే ఎప్పటికప్పుడు ఆదరణలో ఉన్న వింటర్‌ వేర్‌ను కొనడానికీ వెనకాడరు. ఈ క్రమంలో స్వెట్టర్లే కాదు.. వింటర్‌ జాకెట్స్‌ని ధరించే అమ్మాయిలు నానాటికీ పెరిగిపోతున్నారు. అటు చలి నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇటు మనల్ని స్టైలిష్గా కనిపించేలా చేయడంలో ఇవి ముందుంటాయి. ఇలా అతివల అభిరుచులకు తగినట్లుగానే విభిన్న ఫ్యాషనబుల్‌ వింటర్‌ జాకెట్స్‌ని కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్స్‌ దగ్గర్నుంచి ట్రెండీ అవుట్‌ఫిట్స్‌ దాకా దేనిపైనైనా వీటిని మ్యాచ్‌ చేసి స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు. మరి, ప్రస్తుతం మగువల మనసు దోచుకుంటోన్న అలాంటి కొన్ని వింటర్‌ జాకెట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
most-expensive-bridal-lehengas-worn-by-celebrity-brides-in-telugu

కళ్లు చెదిరే ఈ వెడ్డింగ్‌ లెహెంగాల ధరెంతో తెలుసా?

పెళ్లంటే చీరే కట్టుకోవాలి.. ఇది ఒకప్పటి మాట! ఇక ఇప్పటి అమ్మాయిలంతా తమ పెళ్లికి లెహెంగాల జపం చేస్తున్నారు. అంతేనా.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదంటే అది అతిశయోక్తి కాదు. మనలాంటి సామాన్యులే పెళ్లి దుస్తుల కోసం వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుంటే.. ఇక సెలబ్రిటీల మాటేంటి? నిజానికి మన ముద్దుగుమ్మలు తమ పెళ్లికి ధరించిన బ్రైడల్‌ లెహెంగాల ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అంతేకాదు.. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ భారీ డిజైనర్‌ లెహెంగాల్ని ఎంచుకుంటున్నారేమో అనిపిస్తుంది వారి వెడ్డింగ్‌ అటైర్స్‌ చూస్తుంటే..!

Know More

women icon@teamvasundhara
niharika-konidela-looks-radiant-in-her-bridal-fashions
women icon@teamvasundhara
celebrities-daughters-who-chose-to-wear-their-mother’s-wedding-outfits-for-their-wedding-festivities

అమ్మ పెళ్లి చీరలో మేమంతా అలా మెరిసిపోయాం!

పెళ్లంటే చాలు.. అమ్మాయిల మనసు అందంగా ముస్తాబవడం వైపే పరిగెడుతుంటుంది. ఈ క్రమంలో ప్రి-వెడ్డింగ్‌ వేడుకల దగ్గర్నుంచి పెళ్లి తంతు ముగిసే దాకా.. ప్రతి వేడుకలోనూ అటు సంప్రదాయబద్ధంగా, ఇటు అందరికంటే ప్రత్యేకంగా రడీ అయి మెరిసిపోతుంటారు వధువులు. ఇక ఈ తరం అమ్మాయిలైతే తమ పెళ్లి వేడుకల్లో అలనాడు అమ్మ ధరించిన పెళ్లి దుస్తులు, నగలకూ ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్సెస్‌ నిహారిక కూడా అదే చేసింది. ‘పెళ్లి కూతురు’ ఫంక్షన్‌లో తన తల్లి పద్మజ నిశ్చితార్థం చీర ధరించి యువరాణిలా దర్శనమిచ్చింది. రాయల్‌ బ్లూ పట్టు చీరలో రాయల్‌గా మెరిసిపోయింది నిహా. అందుకే తన చిట్టితల్లిని చూసి నాగబాబు కూడా ‘ఏంజెల్‌లా ఉంది’ అంటూ మురిసిపోయారు. నిహానే కాదు.. గతంలోనూ కొంతమంది ముద్దుగుమ్మలు తమ పెళ్లి వేడుకల్లో తమ తల్లుల చీరలు, నగలు ధరించి సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. మరి, వారెవరో, వారు ధరించిన ఆ ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
stylish-hair-accessories-for-this-wedding-season

ఇలా సిగ సింగారించుకుంటే పెళ్లి కళంతా మీదే!

మామూలుగానే అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు.. ఇక పండగలు, ప్రత్యేక సందర్భాలంటే మరింత ప్రత్యేకంగా ముస్తాబవ్వాలనుకుంటారు. మరి, పెళ్లిళ్లలో అయితే చెప్పే పనే లేదు... తమకు మరెవరూ సాటిరారన్నట్లుగా తయారవ్వాలనుకుంటారు. అది వారి పెళ్లైనా లేదంటే బంధువులు, స్నేహితురాలి పెళ్లికి హాజరవ్వాలనుకున్నా.. తమ పెళ్లేనేమో అన్నంత హడావిడి చేస్తుంటారు. ఇందుకోసం దుస్తుల దగ్గర్నుంచి ఆభరణాల దాకా.. మేకప్‌ దగ్గర్నుంచి సిగ సింగారించుకోవడం దాకా ఏ ఒక్క దాని విషయంలోనూ రాజీపడరు. అందుకు తగినట్లుగానే డిజైనర్లు కూడా కొత్త కొత్త ఫ్యాషన్స్‌ని, యాక్సెసరీస్‌ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలైతే వారి ఫ్యాషన్స్‌కు నప్పిన హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడమే కాదు.. వాటికీ వివిధ రకాల హెయిర్‌ యాక్సెసరీస్‌తో వన్నెలద్దుతున్నారు. మరి, సిగ సొగసును ఇనుమడింపచేసే అలాంటి కొన్ని హెయిర్‌ యాక్సెసరీస్‌ గురించి ఈ పెళ్లిళ్ల సీజన్‌ సందర్భంగా తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
beautiful-bride-kajal-aggarwal-bridal-fashions-looks-elegant

అందాల ‘చందమామ’ వెడ్డింగ్‌ లుక్స్‌ అదుర్స్‌!

పెళ్లి నిశ్చయమైందంటే చాలు.. ఇక అమ్మాయిల మనసంతా తాము ఎలాంటి బ్రైడల్‌ లుక్స్‌ ఎంపిక చేసుకోవాలా? అన్న అంశం చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రతి వేడుకలోనూ అందరికంటే భిన్నంగా, కుందనపు బొమ్మలా మెరిసిపోవాలన్న వారి ఆరాటం అంతా ఇంతా కాదు. మరి, మనలాంటి సామాన్యులమే ఇలా ఆలోచిస్తే.. సెలబ్రిటీలు ఇంకెంత హై-ఫైగా ఆలోచిస్తారు. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా నవ వధువు కాజల్‌ అగర్వాల్‌ బ్రైడల్‌ అటైర్స్‌కు సంబంధించిన ఫొటోలే సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఎవరిని కదిపినా ‘చందమామ బ్రైడల్‌ లుక్స్‌ అదుర్స్‌!!’ అనే అంటున్నారు. తన మది దోచిన గౌతమ్‌ కిచ్లుతో ఇటీవలే ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. నిశ్చితార్థం దగ్గర్నుంచి రిసెప్షన్‌ వరకూ తనదైన స్టైల్‌లో మెరిసిపోయింది. అటు భారతీయ సంప్రదాయానికి ఇటు తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని జతచేస్తూ ప్రతి వేడుకలో తాను ధరించిన దుస్తులు ఈ తరం అమ్మాయిలకు బ్రైడల్‌ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతున్నాయనడంలో సందేహం లేదు.

Know More

women icon@teamvasundhara
bollywood-to-be-moms-stylish-maternity-wear-in-telugu

ఈ కాబోయే అమ్మల మెటర్నిటీ ఫ్యాషన్స్‌ చూశారా?

అమ్మతనంలో ప్రతి క్షణం అపురూపమే.. ఆనందమే! అందుకే గర్భం ధరించినప్పట్నుంచే కాబోయే తల్లుల ధ్యాసంతా కడుపులోని బిడ్డ పైనే ఉంటుంది. తీసుకునే ఆహారం దగ్గర్నుంచి వేసుకునే దుస్తుల దాకా.. ప్రతి విషయంలోనూ తమ బుజ్జాయికి సౌకర్యవంతంగా ఉండే వాటినే ఎంచుకుంటుంటారు. మనలో చాలామంది కూడా గర్భం ధరించిన సమయంలో వదులుగా, కంఫర్టబుల్‌గా ఉండే దుస్తులకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. అయితే అలాంటి వాటికి తమదైన స్టైల్స్‌ని జతచేసి ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు త్వరలో అమ్మతనంలోకి అడుగిడుతోన్న కొందరు అందాల తారలు. మరి, అటు స్టైలిష్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా కనిపించేలా మన ముద్దుగుమ్మలు ధరించిన ఆ సరికొత్త మెటర్నిటీ ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-fashionable-looks-at-lakme-fashion-week-virtual-event

ఈ ముద్దుగుమ్మలంతా ఇలా మెరిసిపోయారు!

పబ్లిక్‌ ఈవెంట్లు, ప్రత్యేక సందర్భాలంటే చాలు.. మన ముద్దుగుమ్మలు ఎంత అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి, అలాంటిది ఫ్యాషన్‌ షోలంటే మన తారలు ఇంకెంత సరికొత్తగా ముస్తాబవుతారో, మేటి డిజైనర్లు రూపొందించిన విభిన్న డిజైన్లు ధరించి కొత్త కొత్త ఫ్యాషన్లను ఫ్యాషన్‌ ప్రియులకు పరిచయం చేస్తారో కదూ!! అలాంటి ఫ్యాషన్‌ పండగలోనే పలువురు ముద్దుగుమ్మలు కళ్లు జిగేలుమనేలా మెరిసిపోయారు. ఏటా నిర్వహించే ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో భాగంగా.. ఈసారి కరోనా నేపథ్యంలో వర్చువల్‌గానే వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు ముద్దుగుమ్మలు ఆయా డిజైనర్లు రూపొందించిన సరికొత్త ఫ్యాషన్లను ధరించి ఈ ఫ్యాషన్‌ పరేడ్‌లో భాగమయ్యారు. మరి, ఎవరెవరు ఎలాంటి దుస్తుల్లో తళుక్కుమన్నారో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
style-yourself-in-these-colours-to-sport-this-festive-season-in-telugu

నవరాత్రుల్లో ఇలా ‘కలర్‌’ఫుల్‌గా మెరిసిపోదాం!

పండగొచ్చిందంటే చాలు.. సందడంతా మహిళలదే. నేటి తరం ఫ్యాషన్లను ఫాలో అవుతూనే సంప్రదాయబద్ధంగా మెరిసిపోవడంలో ఎప్పుడూ వారు ముందే ఉంటారు. అలాంటిది అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే దసరా నవరాత్రుల్లో మహిళల తళుకులు, సొగసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మవారిని రోజుకో అలంకారంలో, రోజుకో రంగు చీరతో అలంకరించి మరీ కొలవడం ఈ పండగ ప్రత్యేకత. ఈ క్రమంలోనే మనలో చాలామంది ఆయా రంగుల్లో ఉండే దుస్తుల్నే ధరించి తొమ్మిది రోజులు పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులోనూ అటు సంప్రదాయబద్ధంగా ఉంటూనే, ఇటు నేటి తరం ఫ్యాషన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న అవుట్‌ఫిట్స్‌నే ఎంచుకుంటున్నారంతా! మరి, ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అటు రంగుకు ప్రాధాన్యమిస్తూనే.. ఇటు సంప్రదాయబద్ధంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
stylish-face-shields-for-women-amid-pandemic

ఫేస్ షీల్డ్‌.. కాస్త స్టైలిష్‌గా.. కాస్త కంఫర్టబుల్‌గా!

ప్రతి విషయంలోనూ అందరికంటే భిన్నంగా, తమకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు మగువలు. ఇక ఫ్యాషన్‌ దగ్గరికొచ్చే సరికి మాత్రం ఎందులోనూ రాజీ పడరు. ధరించే డ్రస్సుల దగ్గర్నుంచి వాటికి మ్యాచింగ్‌గా పెట్టుకునే యాక్సెసరీస్‌ వరకూ.. ప్రతిదీ స్టైలిష్‌గానే ఉండాలనుకుంటారు. ఆఖరికి ఈ కరోనా సమయంలోనూ కొంతమంది పెట్టుకునే మాస్కులు, ఫేస్‌షీల్డ్స్ విషయంలోనూ ఫ్యాషనబుల్‌గా ఉండే వాటినే ఎంచుకుంటున్నారు. ఇలా ఫ్యాషన్‌ ప్రియుల అభిరుచులకు తగినట్లుగానే ప్రస్తుతం విభిన్న రకాలైన ఫేస్‌షీల్డ్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు డిజైనర్లు. అటు సౌకర్యవంతంగా ఉంటూనే, ఇటు స్టైలిష్‌ లుక్‌ని అందించే ఈ ఫేస్‌షీల్డ్స్‌ అందుబాటు ధరల్లోనే లభిస్తుండడంతో రాన్రానూ వీటికి ఆదరణ పెరుగుతోంది. మరి, ఈ కరోనా వేళ అటు వైరస్ నుంచి కాపాడుకోవడానికి, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవడానికి, మరోవైపు నలుగురిలోనూ మన ప్రత్యేకతను చాటుకోవడానికి మార్కెట్లో సందడి చేస్తోన్న కొన్ని స్టైలిష్‌ ఫేస్‌షీల్డ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
work-from-home-outfits-ideas-for-those-who-don’t-want-to-compromise-on-style-and-comfort
women icon@teamvasundhara
different-saree-draping-styles-for-different-occasions-in-telugu

మా శారీ స్టైల్‌ ఇది.. మరి, మీది?!

దేశ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరకట్టు అతివల అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందనడం అతిశయోక్తి కాదు. అందుకే పండగైనా, ప్రత్యేక సందర్భమైనా మహిళలంతా ముందుగా ఎంచుకునేది చీరే! అయితే సాధారణంగా చీర ఎలా కట్టుకుంటారో మనందరికీ తెలిసిందే.. కానీ ఇందులోనూ విభిన్న రకాలుగా చీరను ధరించడం ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. సంప్రదాయ మెలకువలు, పాశ్చాత్య పోకడలు కలగలిసిన ఈ చీరకట్టు మగువల అపురూప లావణ్యానికి అదనపు హంగులద్దుతుందనడంలో సందేహం లేదు. అందుకే సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఈ విభిన్న శారీ స్టైల్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో వాటిని ధరించి మెరిసిపోతున్నారు.. ఇతరులకూ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతున్నారు. మరి, అలాంటి కొన్ని విభిన్న శారీ స్టైల్స్‌ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-wear-kasavu-in-stylish-way-in-telugu

‘కసావు’ కాస్త స్టైలిష్‌గా ధరిస్తే.. 'ఓనమ్' కళంతా ఇలా మీలోనే!

పండగంటేనే అతివలు చేసే ఫ్యాషన్‌ సందడి అంతా ఇంతా కాదు. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వారు నట్టింట నడయాడుతుంటే పండగ శోభంతా మనింట్లోనే ఉందేమో అనిపించకమానదు! అలాంటి పండగల్లో ఒకటే ఓనమ్‌. అయితే కేరళీయులు ఎక్కువగా జరుపుకొనే ఈ పండగను ఈ రోజుల్లో దేశ ప్రజలందరూ సెలబ్రేట్‌ చేసుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నారు. వారి పండగ సంబరాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మరి, ఓనమ్‌ అనగానే తెలుపు/క్రీమ్‌, గోల్డెన్ కలర్‌ కాంబినేషన్‌లో రూపొందించిన ‘కసావు’ చీరలే గుర్తొస్తాయి. అయితే ఈ తరం అమ్మాయిలు ఈ విషయంలోనూ కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కసావు కలర్‌ కాంబినేషన్స్‌నే ఫ్యాషనబుల్‌గా, స్టైలిష్‌గా ధరించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అటు ట్రెడిషనల్‌గా ఉంటూనే, ఇటు మోడ్రన్‌గా మెరిసిపోతున్నారు. మరి, ఓనమ్‌ పండగ సందర్భంగా ‘కసావు’ను కాస్త సంప్రదాయబద్ధంగా, ఇంకాస్త మోడ్రన్‌గా ఎలా ధరించచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
try-these-tri-color-fashions-for-this-independence-day-in-telugu

‘ట్రై-కలర్స్‌’ని ఇలా సరికొత్తగా ట్రై చేద్దాం!!

ఎలాంటి సందర్భంలోనైనా దానికి తగినట్లుగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకోవడం అతివల నైజం. ఈ క్రమంలోనే ఆ సమయంలో ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్లకు తమ క్రియేటివిటీని జతచేసి లవ్లీ లుక్‌ని సొంతం చేసుకుంటుంటారు. మరి, అలాంటి అకేషన్‌ రానే వచ్చింది. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు మహిళలు ట్రై-కలర్‌ ఫ్యాషన్‌తో తమలోని దేశభక్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో అందరూ ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కొందరు అమ్మాయిలు తమ వార్డ్‌రోబ్‌లో ఉన్న తిరంగా ఫ్యాషన్లను బయటికి తీస్తున్నారు. మరికొందరు ట్రై-కలర్స్‌లోనే సరికొత్త ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. ఏదేమైనా.. ఈసారి ఇంట్లోనే సింపుల్‌గా జరుపుకునే స్వాతంత్ర్య వేడుకల కోసం ఎంతో సింపుల్‌గా, అదీ నేటి తరం ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబవ్వాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-new-bride-miheeka-bajaj-elegant-wedding-lehenga

అందుకే ఈ పెళ్లి డ్రస్సు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్!

ప్రముఖుల ఇంట పెళ్లనగానే అమ్మాయిలందరి కళ్లూ ఆ నవవధువు ధరించే పెళ్లి దుస్తులు, నగలనే వెంటాడతాయి. ఆమెలాగే తామూ తమ పెళ్లిలో అందంగా, అదిరిపోయే పెళ్లి దుస్తుల్లో ముస్తాబవ్వాలని ఆరాటపడుతుంటారు అమ్మాయిలంతా! మన భళ్లాల దేవుడి భార్య మిహీకా బజాజ్‌ వెడ్డింగ్‌ డ్రస్‌ని చూసి మనలో చాలామంది అలాగే అనుకొని ఉంటారు. ఆమె పెళ్లి లెహెంగా అందరినీ అంత మాయ చేసింది మరి! చూడ్డానికి ఎంతో రాయల్‌గా, అద్భుతమైన కలర్‌ కాంబినేషన్‌లో ఉన్న ఈ భారీ లెహెంగాను కొన్ని వేల పనిగంటలు వెచ్చించి పూర్తిగా చేత్తోనే డిజైన్‌ చేయడం విశేషం. అందుకే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలామంది ఆమె ధరించిన ఈ పెళ్లి దుస్తుల గురించే మాట్లాడుకుంటున్నారు. మరి, ఇంతకీ ఈ వెడ్డింగ్‌ లెహెంగా అసలు కథేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
on-national-handloom-day-smriti-asked-for-pics-bollywood-obliged

మేమంతా ‘పక్కా లోకల్‌’.. మరి మీరు?

చేనేత... మనదేశ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలుస్తోందీ ఫ్యాషన్‌. దేశ వారసత్వ సంపదలో భాగమైన ఈ వస్త్ర పరిశ్రమ దేశ ఔన్నత్యం, వైవిధ్యం, కళాత్మకతకు పెద్ద పీట వేస్తోంది. అతివల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుకుంటూ సరికొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతోందీ ఫ్యాషన్‌. పాశ్చాత్య ఫ్యాషన్‌ పోకడలు రాజ్యమేలుతోన్న ప్రస్తుత తరుణంలో ఈ వస్త్ర రంగాన్ని ఆదుకోవడానికి, మన దేశ వస్త్ర కళల్ని ప్రపంచానికి పరిచయం చేసే సదుద్దేశంతో ఏటా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేత కళాకారుల్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో పలువురు సినీ ప్రముఖులు ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అంటూ చేనేత చీరల్లో మెరిశారు. చేనేత చీరకట్టులో వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తళుక్కుమన్నారు.

Know More

women icon@teamvasundhara
the-story-behind-miheeka-bajajs-pre-wedding-lehenga

మిహీక ధరించిన ఆ లెహెంగా ప్రత్యేకతేంటో తెలుసా?

పెళ్లంటేనే ఎన్నో వేడుకలు, సంబరాలు. మరి, వాటికి తగ్గట్లుగానే నవ వధువులు కూడా అటు సంప్రదాయబద్ధంగా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని కోరుకుంటారు. అంతేనా.. పెళ్లిలో, ఇతర పెళ్లి వేడుకల్లో తాము ధరించే అవుట్‌ఫిట్స్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని ఆరాటపడుతుంటారు. కొత్త పెళ్లికూతురు మిహీకా బజాజ్‌ కూడా అచ్చం అలానే ఆలోచించినట్లుంది. అందుకే తన ప్రి-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ వేడుకలో అందమైన లెహెంగాలో మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. అయితే తాను ధరించిన ఈ అవుట్‌ఫిట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చంతా! మరి, ఇంతకీ ఏంటా లెహెంగా కథ? రండి.. మనం కూడా తెలుసుకుందాం..!

Know More