‘కసావు’ కాస్త స్టైలిష్‌గా ధరిస్తే.. 'ఓనమ్' కళంతా ఇలా మీలోనే!
పండగంటేనే అతివలు చేసే ఫ్యాషన్ సందడి అంతా ఇంతా కాదు. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వారు నట్టింట నడయాడుతుంటే పండగ శోభంతా మనింట్లోనే ఉందేమో అనిపించకమానదు! అలాంటి పండగల్లో ఒకటే ఓనమ్. అయితే కేరళీయులు ఎక్కువగా జరుపుకొనే ఈ పండగను ఈ రోజుల్లో దేశ ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నారు. వారి పండగ సంబరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మరి, ఓనమ్ అనగానే తెలుపు/క్రీమ్, గోల్డెన్ కలర్ కాంబినేషన్‌లో రూపొందించిన ‘కసావు’ చీరలే గుర్తొస్తాయి. అయితే ఈ తరం అమ్మాయిలు ఈ విషయంలోనూ కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కసావు కలర్ కాంబినేషన్స్‌నే ఫ్యాషనబుల్‌గా, స్టైలిష్‌గా ధరించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అటు ట్రెడిషనల్‌గా ఉంటూనే, ఇటు మోడ్రన్‌గా మెరిసిపోతున్నారు. మరి, ఓనమ్ పండగ సందర్భంగా ‘కసావు’ను కాస్త సంప్రదాయబద్ధంగా, ఇంకాస్త మోడ్రన్‌గా ఎలా ధరించచ్చో తెలుసుకుందాం రండి..