scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అందాన్ని పెంచే ‘షీట్‌ మాస్క్‌’!

All you need to know about the history of Sheet Masks in Telugu

అందంగా కనిపించడానికి ఆడవాళ్లు చేయని ప్రయత్నమంటూ ఉండదనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో కొందరు సహజసిద్ధమైన చిట్కాల్ని పాటిస్తే.. మరికొందరు పార్లర్లను, స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. సౌందర్య చికిత్సల కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టడానికీ వెనకాడని వారూ మనలో చాలామందే! అయితే ఈ తిప్పలన్నీ పడకుండా, అదీ చాలా తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే నిమిషాల్లో అందంగా మెరిసిపోయే మార్గం ఒకటుందని మీకు తెలుసా? అదేనండీ.. మనం మాట్లాడుకుంటోంది షీట్‌ మాస్క్‌ గురించి! అందుకే మన ముద్దుగుమ్మలు కూడా ఈ మధ్య షీట్‌ మాస్కులు వేసుకొని తమ అందాన్ని సంరక్షించుకుంటున్నారు.. అంతేనా.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో సైతం పోస్ట్‌ చేస్తూ అమ్మాయిలకు సౌందర్య పాఠాలు నేర్పుతున్నారు. మరి, మనలో చాలామందికి షీట్‌ మాస్క్‌ తెలుసు గానీ.. అసలు అదెలా తయారవుతుంది? దాన్నెలా ఉపయోగించాలి? ఫలితంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? ఈ వివరాలన్నీ తెలియకపోవచ్చు. మరైతే ఆలస్యమెందుకు? రండి.. తెలుసుకుందాం..!

sheetmasksprecautions650-1.jpg
గత కొన్ని రోజులుగా మన సినీ తారలంతా వారు పాటించే సౌందర్య చిట్కాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోన్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే దీపికా పదుకొణె, అలియా భట్‌, కరీనా కపూర్‌.. తాము షీట్‌మాస్క్‌ వేసుకున్న ఫొటోలను తరచూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మనందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతున్నారు. ఈ క్రమంలో మనలో చాలామందికి అసలు ఏంటీ షీట్‌ మాస్క్‌? దీన్నెలా తయారుచేస్తారు? అన్న సందేహాలు తలెత్తే ఉంటాయి. నిజానికి ఈ షీట్‌ మాస్క్‌ పుట్టింది జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో! కానీ క్రమంగా ఈ బ్యూటీ థెరపీ ప్రపంచమంతా విస్తరిస్తోందని చెప్పచ్చు. ప్రస్తుతం మన దేశంలోనూ వీటి హవా కొనసాగుతోంది.
ఎలా తయారవుతుందంటే..!
మనం ఉపయోగించే చాలా సౌందర్య ఉత్పత్తుల్లో సీరం అనే పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇదే సీరంతో షీట్‌ మాస్క్‌ తయారవుతుంది. గాఢత కలిగిన సీరంలో షీట్‌ ఫ్యాబ్రిక్స్‌ని నానబెట్టి వీటిని తయారుచేస్తారు. ఇదొక్కటనే కాదు.. బ్లూ బెర్రీ, బొప్పాయి.. వంటి పండ్ల గుజ్జు, పోషకాలతో నిండిన మొక్కల సారం, సముద్రపు నాచు, వెదురు, కలబంద, గ్రీన్‌ టీ, చార్‌కోల్‌.. వంటి పదార్థాలను కూడా షీట్‌ మాస్క్స్‌ తయారీకి ఉపయోగిస్తారు. దీనికోసం ముఖ్యంగా పేపర్‌, ఫైబర్స్‌, పత్తి, జెల్‌ తరహా మెటీరియల్స్‌ని వాడతారు. హైఅల్యూరోనిక్‌ యాసిడ్‌, విటమిన్లు, ఇతర పోషకాలు నిండి ఉన్న ఈ పదార్థాలు మాస్క్‌లోకి చేరతాయి. ఇలాంటి మాస్క్‌ని ముఖానికి ధరించడం వల్ల ఆ పోషకాలన్నీ ముఖ చర్మంలోకి ఇంకి చర్మాన్ని పునరుత్తేజితం చేస్తాయి.

sheetmasksprecautions650-2.jpg
వేసుకోవడం-తొలగించడం చాలా సులువు!
ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది.. పైగా ఇది వేసుకున్న తర్వాత అన్ని పనులు చేసుకోవడానికి వీలుండచ్చు.. వీల్లేకపోవచ్చు..! కానీ షీట్‌ మాస్క్‌ అలా కాదు.. దీన్ని ధరించి ఇంటి పనుల దగ్గర్నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ దాకా ఏ పనైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పైగా వేసుకోవడం కూడా చాలా సులువు. అన్ని ముఖాకృతులకూ ఒకే షీట్‌ మాస్క్‌ సూటవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగంటే.. కళ్లు, ముక్కు రంధ్రాలు, నోటి భాగంలో ఈ మాస్క్‌కి రంధ్రాలుంటాయి. ముందుగా నుదురు దగ్గర షీట్‌ మాస్క్‌ పెట్టుకొని.. కళ్లు, ముక్కు, బుగ్గలు, గడ్డం దాకా నెమ్మదిగా విస్తరించుకుంటూ వస్తే సులభంగా మాస్క్‌ వేసుకోవచ్చు.. ఈ చిట్కా పాటిస్తే ఏ ముఖాకృతికైనా ఈ మాస్క్‌ని సెట్‌ చేసుకోవచ్చు.. అలాగే ఈ మాస్క్‌ చర్మానికి అంటుకునే దాకా నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. అంతేకాదు.. మాస్క్‌ వేసుకోవడానికి ముందు ముఖ చర్మాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్న విషయం మర్చిపోవద్దు. ఇలా వేసుకున్న షీట్‌ మాస్క్‌ని అరగంట పాటు ఉంచుకొని తొలగిస్తే సరిపోతుంది. సాధారణంగా ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే నీటితో తొలగించుకుంటాం.. కానీ ఈ షీట్‌ మాస్క్‌ తొలగించిన తర్వాత నీటితో శుభ్రపరచుకోవాల్సిన పనిలేదు.

sheetmasksprecautions650-3.jpg
ఎన్నిసార్లు వేసుకోవచ్చు?
షీట్‌ మాస్క్‌ని రోజుకోసారి లేదా వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. అది కూడా అరగంట సేపు మాత్రమే వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగే షీట్‌ మాస్క్‌లో ఉండే తడిదనం అంత త్వరగా ఇగిరిపోదట! ఎక్కువ సమయం పాటు తేమ నిలిచి ఉండి.. మాస్క్‌లోని పోషకాలు చర్మానికి ఇంకేలా ఇది సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఈ మాస్క్‌ల నాణ్యత, బ్రాండ్‌, వాటిలో ఉపయోగించిన ఇతర పదార్థాలను బట్టి ఒక్కో మాస్క్‌ ధర రూ. 79 నుంచి రూ. 1029 వరకు ఉంటుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో అంటే పెళ్లిళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బ్యూటీ పార్లర్స్‌కి వెచ్చించే దాంతో పోలిస్తే ఈ మాస్క్‌కయ్యే ఖర్చు చాలా తక్కువనే చెప్పుకోవాలి.
చర్మతత్వాన్ని బట్టే ఎంచుకోవాలి!
షీట్‌ మాస్కుల తయారీలో వాడే విభిన్న సహజసిద్ధమైన పదార్థాల్లోని సుగుణాలు చర్మానికి సంపూర్ణ ప్రయోజనాలను అందించాలంటే ఆయా చర్మతత్వాలను బట్టి మాస్కుల్ని ఎంచుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. జిడ్డు, పొడి, సాధారణ.. ఇలా ఆయా చర్మతత్వాలను బట్టి విభిన్న షీట్‌ మాస్కులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. మీ చర్మానికి ఏది సరిపోతుందో ఆయా షీట్‌ మాస్క్‌ ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ని పరిశీలిస్తే తెలిసిపోతుంది. కాబట్టి కొనే ముందు లేబుల్‌ చూసి తీసుకోవడం మంచిది. లేదంటే సౌందర్య నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో!

sheetmasksprecautions650-4.jpg

* చర్మం తేమగా ఉంటేనే తాజాగా కనిపిస్తుంది. ఇలా చర్మానికి తేమనందించడంలో షీట్‌ మాస్క్‌ చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
* షీట్ మాస్కుల తయారీకి వాడే పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు; ‘సి’, ‘ఎ’ విటమిన్లు, కొలాజెన్‌, ఇతర పోషకాలు.. చర్మానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. చర్మంపై వాపు, మొటిమలు, దద్దుర్లు.. వంటి వాటిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి.
* ఒక్కోసారి ఎండ వల్ల, ముఖంపై ఉండే మచ్చల కారణంగా ముఖమంతా నల్లగా తయారైపోతుంది. అలాంటప్పుడు షీట్‌ మాస్క్‌ని ఉపయోగిస్తే చర్మం తిరిగి సాధారణ రంగులోకి మారుతుంది. ఇలా చర్మ ఛాయ పెంచడంలోనూ దీని పాత్ర కీలకమే!
* షీట్‌ మాస్కుల్లో ఉండే విటమిన్‌ ‘సి’ చర్మానికి మెరుపునిస్తుంది.. అలాగే పిగ్మెంటేషన్‌ సమస్యను దూరం చేస్తుంది.
* సముద్రపు నాచుతో తయారైన షీట్‌ మాస్కులు చర్మానికి తేమనందించడంలో ముందుంటాయి. అలాగే ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి.
* హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై మొటిమలు, హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యలొస్తుంటాయి. వాటికి చెక్‌ పెట్టాలంటే ఈ షీట్‌ మాస్కుల్లో ఉండే విటమిన్‌ ‘ఎ’ అందుకు దోహదం చేస్తుంది.
* వెదురులో ఉండే సిలికా అనే సమ్మేళనం కొలాజెన్‌ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. తద్వారా కొత్త చర్మ కణాలు ఏర్పడి చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది. అలాగే చర్మంపై ఏర్పడిన గీతలు-ముడతలను కూడా ఈ తరహా షీట్‌ మాస్కులు తొలగిస్తాయి.
* ఇక పండ్ల గుజ్జుతో తయారుచేసిన షీట్‌ మాస్కుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే డ్యామేజ్‌ అయిన చర్మ కణాలను తిరిగి రిపేర్‌ చేస్తాయి.

ఇవి గుర్తుంచుకోండి!

sheetmasksprecautions650.jpg

* షీట్‌ మాస్కులు చర్మానికి తేమనందిస్తాయి.. కాబట్టి వాటిలోని తేమ ఇగిరిపోయేదాకా అలాగే ఉంచుకుందాం అనుకుంటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకంటే షీట్‌ మాస్క్‌ ముఖంపైనే పొడిబారిపోతే పగుళ్లు ఏర్పడతాయి. చర్మానికి అంటుకుపోయిన దీన్ని తొలగించాలంటే ఇబ్బందవుతుంది.. సరికదా చర్మానికి డ్యామేజ్‌ కూడా అవుతుంది. అందుకే షీట్‌ మాస్క్‌ని అరగంట కంటే ఎక్కువ సేపు ఉంచుకోకూడదని సలహా ఇస్తున్నారు.
* షీట్‌ మాస్క్‌ తొలగించుకున్నాక కొద్దిగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. తద్వారా షీట్‌ మాస్క్‌లోని సుగుణాలన్నీ చర్మంలోకి మరింత బాగా ఇంకుతాయి. అలాగే కళ్ల కింద ఐ-క్రీమ్‌ రాసుకోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు.
* షీట్‌ మాస్కులు సహజసిద్ధమైన పదార్థాలతో, ఒక్కో చర్మతత్వానికి విడివిడిగా తయారైనప్పటికీ వీటిని ఉపయోగించడం వల్ల చర్మంపై దురద, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తే మాత్రం వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం మంచిది.. లేదంటే ఎంచుకునే ముందే నిపుణుల్ని అడిగితే మీ చర్మతత్వాన్ని బట్టి వారే చక్కటి మాస్క్‌ సూచిస్తారు.





women icon@teamvasundhara
these-pedicure-gadgets-are-very-useful-to-us-in-telugu

ఈ గ్యాడ్జెట్స్‌తో మీ పాదాలు పదిలం!

అందమంటే.. కేవలం ముఖం, జుట్టుని సంరక్షించుకుంటే సరిపోదు.. చేతులు, కాళ్లు, పాదాల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే సంపూర్ణ సౌందర్యం ఇనుమడిస్తుంది. అయితే పాదాలే కదా.. అని చాలామంది వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తద్వారా వాతావరణ కాలుష్యం, దుమ్ము-ధూళి పాదాలపైకి చేరి అక్కడి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తున్నాయి. ఫలితంగా పాదాలు, మడమలపై మృతకణాలు పెరిగిపోయి ఆనెలు ఏర్పడడం, చర్మం వూడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా రాబోయే చలికాలంలో చాలామంది మహిళలకు మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. మరి, ఇలాంటి పాదాలు, మడమల సమస్యల్ని తగ్గించుకొని వాటి అందాన్ని సంరక్షించుకోవడానికి ప్రస్తుతం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. ఇంతకీ అవేంటి? పాదాల అందం, ఆరోగ్యం విషయంలో అవెలా ఉపయోగడతాయి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
ways-to-overcome-pigmentation-in-pregnancy

ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్‌కు 14 చిట్కాలు!

గర్భం ధరించడం ప్రతి మహిళకూ ఓ వరం. అయితే ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం, ఎక్కువ మొత్తంలో హార్మోన్లు ఉత్పత్తవడం వంటివి సహజం. తద్వారా పలు శారీరక మార్పులు జరగడంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటిలో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. నుదురు, బుగ్గలపై నల్లటి మచ్చల్లాగా వచ్చే ఈ సమస్య వల్ల ముఖం నిర్జీవమైపోయినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తుంది. మరి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా సౌందర్య సాధనాలు వాడదామా అంటే వాటిలో ఉండే రసాయనాలు కడుపులో పెరిగే బిడ్డపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయో అన్న భయం కాబోయే తల్లుల్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని డాక్టర్ సలహా మేరకు వాటిని వాడితే ఈ సమస్య నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది.

Know More

women icon@teamvasundhara
egg-packs-for-healthy-hair

ఈ ప్యాక్స్‌తో చలికాలంలోనూ కురులు ఆరోగ్యంగా..

వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగాలంటే అందుకు ప్రొటీన్ ఎంతో అవసరం అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి, అది పుష్కలంగా లభించే కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడంతోపాటు దాంతో కొన్ని హెయిర్‌ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగిస్తే జుట్టు మరింత ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు విషయంలో ఎదురయ్యే చుండ్రు, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలకూ గుడ్లు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ఇంతకీ కోడిగుడ్డుతో ఇంట్లోనే లభించే పదార్థాలను కలిపి తయారుచేసుకునే ఈ హెయిర్‌ప్యాక్స్ ఏంటి? అవి జుట్టు ఆరోగ్యానికి ఏవిధంగా దోహదం చేస్తాయి.. వంటి విషయాలన్నీ మీకోసం..

Know More

women icon@teamvasundhara
7-simple-steps-to-do-facial-at-home-in-telugu

ఇంట్లోనే ఫేషియల్... మిలమిల మెరిసే అందం మీ సొంతమిలా..!

అందంగా కనిపించాలని, తన ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. అందుకోసమే రకరకాల క్రీములు, సౌందర్య సాధనాల్ని వాడుతున్నారు ఈ తరం అమ్మాయిలు. అయితే మరికొందరు ఫేషియల్స్ కోసం బ్యూటీ పార్లర్ల బాట పడుతుంటారు. ఎంతో ఖర్చుపెట్టి మరీ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. మరి, ఇలాంటి అధిక ఖర్చుతో పని లేకుండా మీరెప్పుడైనా ఫేషియల్‌ని ఇంట్లోనే ట్రై చేశారా? లేదా? అయితే ఈసారి ట్రై చేసి చూడండి. బ్యూటీ పార్లర్లలో వేల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టే బదులు తక్కువ ఖర్చుతో, అది కూడా సహజసిద్ధంగా లభించే పదార్థాలతో ఇంట్లోనే సులభంగా ఫేషియల్ చేసుకోవచ్చు. మాకంత టైం లేదంటారా? అందుకోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే సమయాన్ని ఇంట్లో ఫేషియల్ చేసుకోవడానికి కేటాయిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
things-you-must-do-before-during-and-after-a-bath-in-winter

చలికాలంలో ఇలా స్నానం చేస్తే చర్మం పొడిబారదు!

చలికాలం మొదలైందంటే వింధ్యకు నరకమే! అటు చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇటు పాదాల్లో పగుళ్లతో తెగ ఇబ్బంది పడిపోతుంటుందామె. సంధ్యదీ ఇదే పరిస్థితి. వేసవి కాలంలో జిడ్డుగా మారే తన చర్మం చలికాలంలో మాత్రం పొడిబారిపోయి కళ తప్పుతుందని తెగ బాధపడుతుందామె. ఇలా చలికాలం వచ్చిదంటే చాలు.. చాలామంది ఎదుర్కొనే సౌందర్య సమస్య చర్మం పొడిబారిపోవడం. అయితే దీన్నుంచి విముక్తి పొందడానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవడం, బయట దొరికే క్రీమ్‌లు వాడడం.. వంటివి చేస్తుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనమే అందిస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే రోజూ స్నానం చేసే క్రమంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఏంటా చిట్కాలు? రండి.. మనమూ తెలుసుకొని పాటించేద్దాం..!

Know More

women icon@teamvasundhara
here-is-how-to-take-care-of-hair-in-winter
women icon@teamvasundhara
get-glowing-skin-this-festival-season-with-these-diy-home-remedies

పండగ సీజన్లో ఇంట్లోనే ఇలా మెరిసిపోదాం!

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా అమ్మాయిల మనసు అందం మీదకే మళ్లుతుంది. రోజూ కనిపించే కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటారు అతివలు. అందుకే పార్లర్లు, స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో బయటికి వెళ్లడం కంటే ఇంట్లోనే అందాన్ని సంరక్షించుకోవడం సురక్షితం! అది కూడా ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతో అయితే వందల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మరి, ఈ పండగలు, పెళ్లిళ్ల సీజన్లో ఇంటి పట్టునే ఉంటూ అందాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-prevent-dandruff-in-winter

చలికాలంలో చుండ్రుని నివారించండిలా..

శీతాకాలం వచ్చిందంటే చాలు.. సౌందర్య సంరక్షణ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాయిశ్చరైజర్ రాసుకొన్నప్పటికీ చర్మం పొడిబారిపోవడం, పెదవులు పగలడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా చర్మం విషయంలో మాత్రమే కాదు.. జుట్టు విషయంలో కూడా ఈ కాలంలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యంగా శీతాకాలంలో కురుల సంరక్షణ విషయంలో ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. ఈ సమయంలో చర్మం మాదిరిగానే కుదుళ్ల భాగం కూడా పొడిగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు తలలో దురద, ముఖంపై చిన్న చిన్న మొటిమలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో వేధించే చుండ్రు సమస్యను ఇట్టే వదిలించుకోవచ్చు. మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
beauty-mistakes-to-avoid-before-your-wedding-days-in-telugu

పెళ్లికి ముందు మీరూ ఈ పొరపాట్లు చేస్తున్నారా?!

పెళ్లంటే చాలు అమ్మాయిలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు.. తమ వివాహానికి ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్‌ దాకా ప్రతిదీ అందరికంటే భిన్నంగా, సరికొత్తగా ఉండాలని అనుకోవడం సహజం. ఇక అందం విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే సమస్యే లేదంటున్నారు ఈ తరం అమ్మాయిలు! ఈ క్రమంలోనే పెళ్లికి ముందు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి ఫేషియల్స్‌, మానిక్యూర్‌, పెడిక్యూర్‌.. వంటి సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇక కొంతమందైతే పెళ్లిలో మరింత అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో రెండు మూడు రోజుల ముందు నుంచే కొత్త కొత్త బ్యూటీ ఉత్పత్తుల్ని వాడడం, స్టైలిష్‌ హెయిర్‌కట్స్‌ చేయించుకోవడం లేదంటే ఉన్న జుట్టుతోనే ఏవేవో హెయిర్‌ స్టైల్స్‌ ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. అయితే వివాహానికి ముందు ఇలా సరికొత్త ప్రయోగాలు చేయడం వల్ల అవి వికటించి పలు సౌందర్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రైడల్‌ లుక్‌ విషయంలో ముందు నుంచే ప్రణాళిక వేసుకోవడం మంచిందంటున్నారు. మరి, ఇంతకీ పెళ్లిలో అందంగా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు చేసే ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
different-face-fack-with-marigold-flowers-in-telugu
women icon@teamvasundhara
home-made-packs-for-flawless-back-in-telugu

వీపుని మెరిపించే ప్యాక్స్ ఇవిగో..!

'నఖశిఖపర్యంతం అందంగా మెరిసిపోవాలి..'.. ఇది ప్రతి అమ్మాయికీ ఉండే ఆశే. ఈ క్రమంలోనే గోళ్ల దగ్గర్నుంచి పాదాల వరకూ అందంగా ఉండాలని కోరుకుంటారు అతివలంతా. అందుకే వాటి సౌందర్య సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మరి, మీ వీపు సంగతి ఏంటి?? ఏముంది.. అది ఎలానూ డ్రస్ లేదా హెయిర్‌తో కవర్ అయిపోతుంది కదా.. సో.. కనిపించదు.. అంటారా?? అయితే అక్కడే మీరు పప్పులో కాలేశారు.. ఎందుకంటే ప్రస్తుతం బ్యాక్‌లెస్ లేదా డీప్ బ్యాక్‌నెక్‌తో ఉన్న అవుట్‌ఫిట్స్ ధరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి, అలాంటి దుస్తుల్లో అందంగా, స్త్టెలిష్‌గా కనిపించాలంటే వీపు విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే..! అందుకోసం మనమే ఇంటి దగ్గర కొన్ని ప్యాక్స్ తయారుచేసుకొని ప్రయత్నిస్తే సరి..! అవేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
raveena-tandon-shares-bathing-tips-for-winter-to-prevent-dry-skin
women icon@teamvasundhara
keep-these-safety-tips-in-mind-while-opting-for-salon-services-at-home

బ్యుటీషియన్‌ని ఇంటికే పిలుస్తున్నారా? అయితే ఇవి గుర్తుపెట్టుకోండి!

అమ్మాయంటేనే అందం.. అందమంటేనే అమ్మాయి.. ఇలా సౌందర్యానికి మారుపేరుగా నిలిచే అతివలు తమ అందం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కరోనా వచ్చిన దగ్గర్నుంచి పార్లర్స్‌కి వెళ్లే మహిళల సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకోవాలి. దానికి బదులుగా కొంతమందైతే ఇంటికే బ్యుటీషియన్స్‌ని పిలిపించుకుంటూ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మరి, మీరూ ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించకుండా కరోనాను నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. మరి, ఇంతకీ బ్యుటీషియన్‌ని ఇంటికి పిలిపించుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
malaika-arora-shares-tips-on-curbing-hair-fall-after-her-recovery-from-covid-19

కరోనా తర్వాత జుట్టు రాలుతోంది.. ఈ చిట్కా పాటిస్తున్నా!

జుట్టు రాలడం.. ప్రతి మహిళకు సాధారణంగా ఎదురయ్యే సమస్యే ఇది. అయితే జీవన శైలిలో మార్పులు, వాతావరణ కాలుష్యం.. వంటివి దీనికి ముఖ్య కారణాలన్న విషయం మనకు తెలిసిందే! అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ బ్యూటీ మలైకాకు ఇప్పుడు మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలుతోందట. మొన్నామధ్య ఈ మహమ్మారి బారిన పడిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, అయితే జుట్టు రాలే సమస్య మాత్రం గతంలో కంటే ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఉందంటోంది. అంతేకాదు.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎక్కడికో పరుగు పెట్టాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే.. అది కూడా ఒకే ఒక్క పదార్థంతో పరిష్కరించుకోవచ్చని చెబుతోంది. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
foods-to-eat-for-better-skin-in-telugu
women icon@teamvasundhara
beauty-face-packs-with-tamarind-in-telugu

మొటిమలను తగ్గించే చింతపండు ప్యాక్స్‌..!

'చింతపండు'.. ఈ పేరు చెబితే చాలు.. అబ్బ ఎంత పులుపో అనుకోనివారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే అదే సమయంలో కొన్ని వంటకాల్లో చింతపండు లేకపోతే ముద్ద దిగనివారు కూడా ఉంటారు. కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. దీనివల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఎక్కువే. అయితే చింతపండు అందాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగించవచ్చన్న విషయం మీకు తెలుసా? మీరు ఇప్పటివరకూ ప్రయత్నించి ఉండరు కానీ చింతపండు సౌందర్య పరిరక్షణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి, చింతపండుతో ఇంట్లోనే తయారుచేసుకోదగిన కొన్ని ప్యాక్స్, సౌందర్య ఉత్పత్తుల గురించి తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
foot-care-in-the-rainy-season-in-telugu
women icon@teamvasundhara
herbal-beauty-tips-in-telugu
women icon@teamvasundhara
how-to-get-rid-of-a-double-chin-in-telugu
women icon@teamvasundhara
shruti-haasan-shares-a-tip-to-clean-makeup-brushes-sponges-in-telugu
women icon@teamvasundhara
preparation-of-natural-lip-stain-in-telugu

బీట్‌రూట్ లిప్ స్టెయిన్ ఇంట్లోనే చేద్దాం...!

అధరాలు అందంగా కనిపించడం కోసం వాడే లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటి రకరకాల సౌందర్య సాధనాల గురించి మనందరికీ తెలుసు. లిప్‌స్టిక్ తయారీలో వాడే రకరకాల రసాయనాలకు భయపడి కొంతమంది వాటి జోలికి వెళ్లరు. సహజమైన పదార్థాలతో తయారయే ఆర్గానిక్ లిప్‌స్టిక్ లు, బ్రాండెడ్ లిప్‌స్టిక్‌లు చాలా ఖరీదు. ఎంత ఖరీదైన లిప్‌స్టిక్ వాడినా సహజమైన అధర సౌందర్యాన్ని మించిన అందం లేదు కదా..! లిప్ స్టెయినింగ్ అనే పద్ధతి ద్వారా సహజమైన పద్ధతిలో మీ పెదాలకు నచ్చిన రంగులు అద్దవచ్చు. పైగా ఎటువంటి హానికారక రసాయనాలు లేకుండా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
do-you-know-the-beauty-secrets-of-these-bollywood-actresses?

వయసును దాచిపెడుతుంది.. మొటిమలను తగ్గిస్తుంది.. అవేంటంటే?

అందం కోసం తాపత్రయపడని అమ్మాయంటూ ఉంటుందా చెప్పండి..? ఈ క్రమంలో అందంగా మెరిసిపోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం బయట దొరికే క్రీముల దగ్గర్నుంచి ఇంటి చిట్కాల దాకా ప్రతిదీ ట్రై చేస్తుంటారు. అయినా ఒత్తిళ్లు, ఆహారపుటలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత.. వంటి పలు కారణాల వల్ల కొందరిలో వివిధ రకాల సౌందర్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి సమస్యలకు సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టేయమంటున్నారు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు మలైకా అరోరా, భాగ్యశ్రీ. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలేంటో చెబుతూ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్‌ చేశారీ చక్కనమ్మలు. మరి, అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవడానికి వారు ఉపయోగించే ఆ బ్యూటీ టిప్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
the-natural-beauty-secrets-of-poland-women-in-telugu

ఈ భూలోక దేవతల సౌందర్య రహస్యం తెలుసా?

వారి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక.. ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా నిలిచే గ్రీక్‌ దేవత ‘అఫ్రోడైట్‌’తో పోల్చాడు ప్రముఖ జర్మన్‌ కవి హెన్రిచ్‌ హెయిన్‌. అంతటితో ఆగకుండా ‘భువిపై పుట్టిన దేవతలు’ అంటూ వారి పట్ల తన ఆరాధన భావానికి అక్షరరూపమిచ్చాడు. ఇంతకీ కవుల కలాన్ని సైతం పులకరింపజేసిన ఆ సౌందర్యరాశులెవరో తెలుసా..? పోలండ్‌ భామలు. పొడుగు కాళ్ల సుందరీమణులుగా పేరుగాంచిన వీరి సోయగం వెనక గల రహస్యాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ! ప్రకృతి ప్రసాదించే వనరులే మా సౌందర్యానికి రక్షణ కవచం అంటున్నారీ ముద్దుగుమ్మలు. మరి ప్రకృతినే వారి సోయగానికి రక్షణగా ఏర్పాటుచేసుకున్న పోలండ్‌ సొగసుల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
quick-hacks-to-solve-acne-problems-on-d-day-in-telugu

women icon@teamvasundhara
natural-ways-to-minimal-appearance-of-skin-pores-in-telugu

ముఖం పైన అలా కనిపించకూడదంటే ఏం చేయాలి?

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అతివల్ని ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో చర్మ రంధ్రాలు పెద్దవిగా కనిపించడం కూడా ఒకటి. మనం ఉపయోగించే మేకప్‌లో ఉండే రసాయన పదార్థాలు, జిడ్డుదనం, సూర్యరశ్మి ప్రభావం, మొటిమలు.. వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే ఇలా చర్మ రంధ్రాలు పెద్దవవడం వల్ల ముఖ చర్మం పైన చిన్న చిన్న గుంతల్లాగా కనిపించడం, వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అయితే వీటి పరిమాణాన్ని తగ్గించడం అసాధ్యమని, కాకపోతే వీటిని కనిపించకుండా చేసి నవయవ్వనంగా మెరిసిపోయేందుకు పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
malaika-arora-shows-how-to-make-the-body-scrub-with-three-simple-ingredients-available-in-every-kitchen

ఇది కూడా నా అందానికి కారణమే!

పర్యావరణ కాలుష్యం మన ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ దెబ్బతీస్తుంది. వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు.. వంటివి చర్మ రంధ్రాల్లోకి చేరిపోయి మృతకణాలు, మొటిమలు ఏర్పడడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందేందుకు బయట దొరికే సౌందర్య ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే మేలంటోంది బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా. తన అందాన్ని సంరక్షించుకోవడానికి అమ్మ చెప్పిన చిట్కాల్నే పాటిస్తున్నానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతోనూ పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ టిప్‌ని మన ముందుకు తీసుకొచ్చింది మలైకా. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
colombia-women-beauty-secrets-in-telugu-in-telugu

వారి అందమంతా ఆ మట్టిలోనే దాగుందట!

అందమంటే కేవలం బయటి చర్మానికి మేకప్‌తో హంగులు దిద్దడమేనా? అంటే అస్సలు కాదని అంటున్నారు కొలంబియా మగువలు. లోలోపలి నుంచి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా కనిపించేలా చేసినప్పుడే అది సంపూర్ణ సౌందర్యంగా వారు అభివర్ణిస్తున్నారు. మరి, అలా చర్మాన్ని లోలోపలి నుంచి తాజాగా ఉంచాలంటే.. చర్మం తేమగా ఉండడంతో పాటు చర్మ రంధ్రాల్లో చేరిన దుమ్ము, ధూళిని తొలగించినప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకోసం కొలంబియా మగువలు పాటించే సహజసిద్ధమైన పద్ధతేంటో తెలుసా? అగ్నిపర్వతం మట్టి. వినడానికి వింతగా అనిపించినా ఈ మట్టిలో దాగున్న ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పదింతలు చేస్తాయి. కేవలం ఇదొక్కటే కాదు.. అన్ని చర్మ సమస్యల్ని దూరం చేసుకొని సంపూర్ణ సౌందర్యాన్ని తమ సొంతం చేసుకోవడానికి ఎన్నో సహజసిద్ధమైన పద్ధతుల్ని తమ సౌందర్య పోషణలో భాగం చేసుకుంటారీ మగువలు. ఈ నేపథ్యంలో కొలంబియా ముద్దుగుమ్మలు పాటించే కొన్ని సౌందర్య రహస్యాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
surprising-benefits-of-using-a-wooden-comb-for-your-hair-and-scalp

మీరు ఏ దువ్వెన వాడుతున్నారు?

సాధారణంగా జుట్టు దువ్వుకోవడానికి మీరు ఏ దువ్వెన వాడతారు? అయినా అదేం ప్రశ్న.. అది అందరూ వాడేదేగా.. ప్లాస్టిక్‌ దువ్వెన! అంటారా? అది నిజమే అనుకోండి.. కానీ ప్లాస్టిక్ దువ్వెన వల్ల పర్యావరణానికే కాదు.. జుట్టుకూ నష్టమేనంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే ధనావేశం, జుట్టులో ఉండే రుణావేశంతో ఆకర్షితమై జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సైన్స్‌ చెబుతోంది. అందుకే ప్లాస్టిక్‌ దువ్వెనతో దువ్వేటప్పుడు జుట్టు దువ్వెనకు అతుక్కుపోవడం మనం గమనిస్తూనే ఉంటాం.. అయినా ఇప్పుడీ సైన్స్‌ గోల మనకెందుకు గానీ.. జుట్టు సమస్యల్ని తొలగించి కేశ సౌందర్యం రెట్టింపు చేసుకోవాలంటే ప్లాస్టిక్‌కి బదులుగా చెక్కతో చేసిన దువ్వెనే సరైందంటున్నారు నిపుణులు. అందుకూ ఓ కారణముంది.. అదేంటంటే.. చెక్క విద్యుత్తును ప్రసరింపజేయదు కాబట్టి జుట్టుకు ఎలాంటి డ్యామేజ్‌ జరగదట! ఇదే కాదు.. చెక్కతో తయారుచేసిన దువ్వెన వాడడం వల్ల జుట్టుకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
rashmika-mandanna-narrates-her-skincare-routine

చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా!

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని సినీతారలు అనుకోవడం సహజం. ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మన ముద్దుగుమ్మలు. ప్రత్యేకించి చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన చిట్కాల్ని పాటించడమే కాకుండా.. తమ శరీరతత్వానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. ఎంత రుచిగా ఉన్నా సరే.. శరీరానికి అలర్జీ కలిగించే ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలో తాను కూడా గతంలో ఫుడ్‌ అలర్జీతో బాధ పడ్డానంటోంది రష్మిక మందన. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన స్కిన్‌ కేర్‌ టిప్స్‌ని అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
austrian-women-beauty-secrets-in-telugu

ఆ మహారాణి బాటలో నడుస్తున్నారు.. అందంగా మెరిసిపోతున్నారు!

అందమైన ముఖారవిందం, మోముపై చెరగని చిరునవ్వు, నయాగరా జలపాతం లాంటి కురులు, దొండపండును పోలిన పెదాలు, నాజూకైన నడుము.. ఇలా తను పుట్టాకే అందం పుట్టిందేమో అన్నంత అపురూప లావణ్యం ఆస్ట్రియా మహారాణి ఎలిజబెత్ అమాలీ యుగెనీ (సిసీ) సొంతం. ఆస్ట్రియా దేశపు సామ్రాజ్ఞిగానే కాదు.. అందాల రాశిగా, సౌందర్య దేవతగా చరిత్రలో నిలిచిపోయిందామె. మరి, ఆమె అంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? ప్రకృతి మనకు వరంగా ప్రసాదించిన సహజసిద్ధమైన సౌందర్య సాధనాల్ని వాడడం వల్లే! అందుకే నేటికీ ఆ దేశపు మగువలు మహారాణి సిసీ బాటలోనే నడుస్తూ, తాను పాటించిన సహజమైన సౌందర్య పద్ధతుల్నే అనుసరిస్తూ.. అందానికి తమదైన రీతిలో నిర్వచనమిస్తున్నారు. అందం విషయంలో ఇతర దేశాల్లోని మగువలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా దేశపు మగువలు నాటి నుంచి నేటి వరకు పాటిస్తోన్న ఆ సహజమైన సౌందర్య పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-juhi-parmar-shares-oraganic-secrets-through-videos

ఇవి నా బ్యూటీ సీక్రెట్స్‌.. మీరూ ట్రై చేస్తారా?

అందరికంటే తానే అందంగా కనిపించాలని తాపత్రయపడని అమ్మాయి ఉంటుందా చెప్పండి? అందుకేగా బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టేది.. మార్కెట్లో లభించే ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్ని వాడేది.. అంటారా? అయితే వాటివల్ల తాత్కాలిక అందమే తప్ప శాశ్వతమైన సౌందర్యం మన సొంతం కాదన్నది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని తన మాటల్లో చెబుతోంది బాలీవుడ్‌ బుల్లితెర తార జుహీ పర్మార్‌. అందానికైనా, ఆరోగ్యానికైనా ఇంటి చిట్కాలను మించినవి మరొకటి లేదంటోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే #OrganicSecretsWithJuhiఅనే హ్యాష్‌ట్యాగ్‌తో పలు సౌందర్య చిట్కాలను పంచుకుంటోంది. అలా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-actress-share-their-diy-beauty-hacks-through-social-media

అందుకే ఇలా అందంగా ఉన్నాం..!

తెరపై మేకప్‌ వేసుకొని అందంగా కనిపించే మన ముద్దుగుమ్మలంతా.. తెరవెనుకా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు. అందుకు కారణం మేకప్‌ కాదు.. వారు పాటించే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే! అయితే ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి సినీ తారలంతా ఒకరికొకరు పోటీ పడుతూ మరీ న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని పాటించేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ బ్యూటీ రెసిపీలను సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తోనూ పంచుకుంటున్నారు. ఇలా అందం విషయంలోనూ నేటి అమ్మాయిలకు పాఠాలు నేర్పుతున్నారీ అందాల చందమామలు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు తన అందాన్ని రెట్టింపు చేసే ఫేస్‌ప్యాక్‌ ఇదేనంటూ ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ వేసుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అంతేకాదు.. అదెలా తయారుచేయాలో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఈ మధ్యకాలంలో కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న వారి న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ గురించి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
hawaii-women-beauty-secrets-in-telugu

హవాయ్ మగువల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే !

అందంగా ఉండడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. చర్మ ఛాయ, ముఖకవళికలు ఎలా ఉన్నా వాటిని మేకప్‌తో కవర్ చేసి అందంగా మెరిసిపోవడం.. రెండోది.. లోలోపలి నుంచి చర్మాన్ని మెరిపించుకుంటూ సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం. తాము మాత్రం తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి రెండో పద్ధతినే ఆశ్రయిస్తామంటున్నారు హవాయ్ మగువలు. తాత్కాలిక అందాన్ని అందించే మేకప్ ఉత్పత్తుల కంటే సహజమైన పదార్థాలతో వచ్చిన నిగారింపు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అది తమ విషయంలో రుజువైందని నిరూపిస్తున్నారీ దేశపు అతివలు. మరి, ఈ నేపథ్యంలో హవాయ్ మహిళల శాశ్వతమైన అందం వెనకున్న ఆ సహజమైన సౌందర్య సాధనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
top-3-foods-to-prevent-hair-loss-this-monsoon-shared-by-nutritionist-rujuta-diwekar

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందా.. అయితే ఇలా చేయండి!

కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్య పరంగానూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అందాన్ని సంరక్షించుకోవడమనేది అమ్మాయిలకు ఓ పెద్ద సవాలు లాంటిది. వాతావరణంలో తేమ స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల ముఖమంతా జిడ్డుగా మారడం, తద్వారా మొటిమలు రావడంతో చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక దీనికి తోడు ఈ కాలంలో జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇందుకు వాతావరణంలో అధికంగా ఉండే హైడ్రోజన్‌ స్థాయులే కారణమంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య నుంచి బయటపడి జుట్టును సంరక్షించుకోవాలంటే మన వంటింట్లో ఉండే ఈ మూడు ఆహార పదార్థాల వల్లే సాధ్యమవుతుందంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూ పోస్టులు పెట్టే ఆమె.. తాజాగా జుట్టు సంరక్షణకు సంబంధించిన మరో పోస్ట్‌ను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. మరి, ఇంతకీ ఈ కాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి రుజుత సూచించిన ఆ వంటింటి చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alaya-fs-home-made-coffee-mask-is-perfect-to-get-rid-of-dark-circles-puffiness-and-more

ఈ ‘కాఫీ ఫేస్’ మాస్క్ తో నవ యవ్వనం మీ సొంతం!

మచ్చలేని చందమామల్లా మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మరి, ఆ అందానికి కారణం మేకప్‌ అనుకుంటాం.. కానీ ఇంటి చిట్కాలతోనే కుందనపు బొమ్మల్లా మెరిసిపోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నటీమణులు. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. బాలీవుడ్‌ యువ కథానాయిక అలయా ఫర్నిచర్‌వాలా కూడా తన సౌందర్య రహస్యమేంటో తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది. ఈ ఏడాది ‘జవానీ జానేమన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. అలాగని ఖాళీగా కూర్చోకుండా విభిన్న వంటకాలు చేస్తూ, వ్యాయామాలు చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక ఇప్పుడు తన సౌందర్య రహస్యమేంటో చెప్తూ మరో పోస్ట్‌ పెట్టిందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
bulgarian-beauty-secrets-in-telugu

బల్గేరియా భామల సౌందర్య సాధనం ఏంటో తెలుసా?

చాలామంది తమ అందాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే ఏకైక మార్గం మేకప్. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులతో తమ అందానికి మెరుగులు దిద్దుకునే మగువలు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ప్రకృతిని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదని అంటున్నారు బల్గేరియన్ మగువలు. జుట్టు దగ్గర్నుంచి చర్మం, కొనగోటి సౌందర్యం వరకు సహజసిద్ధంగా లభించిన పదార్థాలతోనే తమ అందాన్ని సంరక్షించుకోవడం బల్గేరియన్ బ్యూటీస్‌కి అలవాటు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు తమ సంపూర్ణ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే ఆ న్యాచురల్ కాస్మెటిక్ ప్రొడక్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
henna-hair-packs-to-treat-dandruff-problem

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More