ఈ గ్యాడ్జెట్స్‌తో మీ పాదాలు పదిలం!
అందమంటే.. కేవలం ముఖం, జుట్టుని సంరక్షించుకుంటే సరిపోదు.. చేతులు, కాళ్లు, పాదాల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే సంపూర్ణ సౌందర్యం ఇనుమడిస్తుంది. అయితే పాదాలే కదా.. అని చాలామంది వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తద్వారా వాతావరణ కాలుష్యం, దుమ్ము-ధూళి పాదాలపైకి చేరి అక్కడి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తున్నాయి. ఫలితంగా పాదాలు, మడమలపై మృతకణాలు పెరిగిపోయి ఆనెలు ఏర్పడడం, చర్మం వూడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా రాబోయే చలికాలంలో చాలామంది మహిళలకు మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. మరి, ఇలాంటి పాదాలు, మడమల సమస్యల్ని తగ్గించుకొని వాటి అందాన్ని సంరక్షించుకోవడానికి ప్రస్తుతం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. ఇంతకీ అవేంటి? పాదాల అందం, ఆరోగ్యం విషయంలో అవెలా ఉపయోగడతాయి? రండి.. తెలుసుకుందాం..