scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

రక్షలు.. రక్షలు.. ‘పాద’రక్షలు!

Different Gadgets For The Footwear

beautygadgetstrip.gifఏదైనా పార్టీ అయినా.. ఫంక్షనైనా.. కొత్త దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్‌ వరకూ అన్నీ మ్యాచింగ్‌ వేసుకుని అందరి ప్రశంసలందుకోవాలనుకుంటారు అమ్మాయిలు. కానీ దుస్తులకు జతగా కొత్త చెప్పులు కొనాలంటే మాత్రం కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడల్లా కాలి వేళ్లు, మడమల భాగంలో గీసుకుపోవడం, ఎరుపెక్కడం.. వంటివి జరుగుతుంటాయి. తద్వారా ఆ భాగాల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఒక్కోసారి ఆ చెప్పులు వేసుకునే కంటే వేసుకోకపోవడమే మంచిదనిపిస్తుంది. ఇక నుండి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అలా చెప్పులు కరవకుండా మీ పాదాల్ని సురక్షితంగా ఉంచే పూచీ నాదంటూ ప్రస్తుతం ఓ గ్యాడ్జెట్‌ మార్కెట్లోకొచ్చేసింది. కేవలం అదొక్కటే కాదు.. చెప్పులు గట్టివైనా పాదాలకు మెత్తదనం అందించేలా, మడమలు పగలకుండా.. ఇలా పాదాల రక్షణ కోసం బోలెడన్ని గ్యాడ్జెట్లు అతివలకు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటితో ఎలాంటి ఉపయోగాలుంటాయి? ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

footweargadgetsgh650-1.jpg

స్కడ్‌గేర్‌ ఇన్‌సోల్స్‌
కాలుష్యం నుండి పాదాలను కాపాడుకోవడానికి, కార్పొరేట్‌ డ్రస్‌కోడ్‌ని బట్టి చాలామంది షూస్‌ని వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్లాట్‌గా ఉండేవి వాడాల్సి వస్తుంది.. మరికొన్ని సందర్భాల్లో హీల్‌ షూస్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా సందర్భానికో షూ అంటూ కొనాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్నదనే చెప్పాలి. అలాకాకుండా ఫ్లాట్‌ షూస్‌ని మనకు కావాలనుకున్నప్పుడు హీల్‌ షూస్‌గా మార్చుకోగలిగితే.. వావ్‌ వింటుంటేనే అద్భుతంగా ఉందనుకుంటున్నారా! అయితే వెంటనే ‘స్కడ్‌గేర్‌ ఇన్‌సోల్స్‌’ మీ ఫుట్‌ వేర్‌ కిట్టీలో చేర్చేసుకోండి. వీటిని ఉపయోగించి తాత్కాలికంగా మీ షూస్‌ ఎత్తుని 5 సెంటీమీటర్ల వరకూ పెంచుకోవచ్చు. చిత్రంలో చూపించిన విధంగా ఇవి రెండు భాగాలుగా లభిస్తాయి. అవసరాన్ని బట్టి ఒకటే ఉపయోగించడమా లేదా రెండింటినీ కలిపి ఉపయోగించడమా అనేది నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు.. వీటిని మీ బూట్ల సైజ్‌కి అనుగుణంగా కత్తిరించుకోవచ్చు. ఇవి కుషన్‌లా మెత్తగా ఉండడం వల్ల మీ మడమలకు ఇబ్బంది కూడా కలగదు. వీటి నాణ్యత, డిజైన్‌ని బట్టి ధర రూ.199 నుండి రూ.575 వరకు ఉంటుంది.


footweargadgetsgh650-2.jpg
ఫుట్‌ బ్లిస్టర్‌ జెల్‌ ప్యాడ్స్‌
కొత్త యాక్సెసరీస్‌ ఏవి ధరించినా పెద్దగా ఇబ్బందిపడం.. కానీ కొత్త చెప్పులు ధరించినప్పుడు మాత్రం కాలి వేళ్లు, మడమల పైభాగంలో గీసుకుపోవడం, నొప్పి పెట్టడం కామన్‌. ఇక నుండి కొత్త చెప్పుల వల్ల అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ‘ఫుట్‌ బ్లిస్టర్‌ జెల్‌ ప్యాడ్స్‌’ని వాడితే సరి. చిత్రంలో చూపించిన విధంగా ఇది దెబ్బలపై అంటించుకునే బ్యాండ్‌-ఎయిడ్‌లా ఉంటుంది. కొత్త శాండిల్స్‌ని ధరించడానికి ముందు పాదాల వెనకభాగంలో (మడమల పైభాగంలో), వేళ్ల దగ్గర.. ఇలా చెప్పులు కరుస్తాయనుకున్న చోట ఈ స్టిక్కర్స్‌ని బ్యాండ్‌-ఎయిడ్‌లా అతికించుకుంటే సరిపోతుంది. ఈ బ్యాండ్‌-ఎయిడ్‌ చర్మంలో కలిసిపోయేలా న్యూడ్‌ కలర్‌లోనే ఉంటాయి కాబట్టి పెద్దగా అసౌకర్యానికి గురవ్వాల్సిన పని కూడా లేదు. పైగా ఆయా భాగాల్లో ధరించేందుకు వీలుగా వివిధ షేప్స్‌లోనూ ఇవి లభిస్తున్నాయి. ఇలా వీటిని అంటించుకొని మీ కొత్త ఫుట్‌వేర్‌ను ఎంజాయ్ చేయచ్చు. వీటి నాణ్యత, ప్యాకెట్‌లో ఉండే ప్యాడ్స్‌ సంఖ్యను బట్టి ధర రూ.199 నుండి రూ.799 వరకు ఉంటుంది.


footweargadgetsgh650-3.jpg
యాంటీ స్లిప్పరీ సాక్స్‌
నడుస్తుంటే హఠాత్తుగా ఒక్కోసారి చెప్పులు జారిపోతుంటాయి. ఫలితంగా మనమూ కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. నేల ఏటవాలుగా ఉండడం లేదా మనం వేసుకున్న చెప్పుల పైభాగం మృదువుగా ఉండడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. అస్తమానం స్లిప్పర్స్‌ని వదలకుండా తిరుగుతూ ఉండడం వల్ల కాలి మడమల్లో పగుళ్లు ఏర్పడతాయి. వీటన్నింటికీ పరిష్కారమే ‘యాంటీ స్లిప్పరీ సాక్స్‌’. ఇవి చూడడానికి మామూలు సాక్స్‌లా ఉంటాయి. కానీ వీటికి అడుగుభాగంలో బొడిపెల్లా డిజైన్‌ చేయడం వల్ల పాదాలకు గ్రిప్‌ ఉంటుంది. అంతేకాదు.. మడమలు పగలకుండా కూడా ఈ సిలికాన్‌ సాక్స్‌ ఉపయోగపడతాయి. పైగా ఇవి వాటర్‌ ప్రూఫ్‌ కూడానూ! వీటిలోనూ మీరు ధరించే షూస్‌, శాండిల్స్‌, హీల్స్‌కి తగ్గట్టుగా విభిన్న డిజైన్స్‌లో ఈ సాక్స్‌ లభిస్తాయి. వీటి నాణ్యత, డిజైన్‌ని బట్టి ధర రూ.170 నుండి రూ.500 వరకు ఉంటుంది.


footweargadgetsgh650-4.jpg
హీల్‌ ప్రొటెక్టర్స్‌
తమ పనిలో భాగంగానో లేదా ఫ్యాషన్‌ లుక్స్‌ కోసమో అమ్మాయిలు హీల్స్‌ వేసుకుంటుంటారు. వాటి వల్ల మడమలు నొప్పి పెట్టడం, నడిచే విధానంపై ప్రభావం పడడం.. వంటివి జరుగుతాయి. క్రమంగా అది వెన్నునొప్పికి దారితీసే అవకాశాలూ లేకపోలేదు. అలాగని హీల్స్‌ వాడడం మానలేం అంటారా? అయితే మీలాంటి వారి కోసమే ఈ ‘హీల్ ప్రొటెక్టర్స్‌’ని డిజైన్‌ చేశారు. చిత్రంలో చూపించిన విధంగా చిన్న గొట్టాల్లా ఉంటాయివి. మీకు హీల్స్‌ వల్ల ఇబ్బందిగా ఉందనిపించిన సమయంలో హీల్స్‌ అడుగుభాగంలో వీటిని అటాచ్‌ చేసుకుంటే సరి. ఈ గ్యాడ్జెట్‌ అడుగుభాగం వెడల్పుగా ఉండడం వల్ల నడవడానికి గ్రిప్‌ ఉంటుంది. అందువల్ల హీల్స్‌ ధరించినప్పటికీ మడమల నొప్పులు రాకుండా ఉంటాయి. మీరు వాడే హీల్‌ సైజ్‌ని బట్టి వీటిని ఎంచుకోవడానికి వీలుగా ఈ హీల్‌ ప్రొటెక్టర్స్‌ వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. వీటి నాణ్యత, సైజ్‌ని బట్టి ధర రూ.299 నుండి రూ.599 వరకు ఉంటుంది.


footweargadgetsgh650-5.jpg
హీల్‌ కుషన్‌ ఇన్‌సర్ట్స్‌
హీల్స్‌.. షూస్‌.. ఏవైనా ఎక్కువసేపు ధరించడం వల్ల మడమలతో పాటు.. కాలి అడుగుభాగంలో నొప్పి రావడం సహజం. కొన్ని సందర్భాల్లో హీల్స్‌ని కాస్త పక్కన్ పెట్టి రిలాక్స్‌ అయ్యే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఇలాంటి ‘హీల్‌ కుషన్‌ ఇన్‌సర్ట్స్‌’ని ఉపయోగిస్తే సరి. చిత్రంలో చూపించినట్లుగా కాలి వెనకభాగం నుండి కాలి అడుగుభాగమంతా కవరయ్యే విధంగా మెత్తని కుషన్‌లా ఉంటుందీ ప్యాడ్‌. ఇందులో చాలా రకాలు దొరుకుతాయి. కేవలం కాలి వెనకభాగానికి మాత్రమే అమర్చుకునేలా లేదంటే కాలి అడుగుభాగం వరకే అమర్చుకునే విధంగా కూడా ఉంటాయీ కుషన్స్‌. సో.. మన సౌకర్యాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. వీటి నాణ్యత, సైజ్‌ని బట్టి ధర రూ.220 నుండి రూ.500 వరకు ఉంటుంది.
గమనిక: మగువల అందాన్ని పెంపొందించి, సౌందర్య పరిరక్షణలో వారి పనిని సులభతరం చేసే ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్‌ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్‌’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని మిస్‌ కాకుండా చదవండి.

Photos: Amazon.in





women icon@teamvasundhara
austrian-women-beauty-secrets-in-telugu

ఆ మహారాణి బాటలో నడుస్తున్నారు.. అందంగా మెరిసిపోతున్నారు!

అందమైన ముఖారవిందం, మోముపై చెరగని చిరునవ్వు, నయాగరా జలపాతం లాంటి కురులు, దొండపండును పోలిన పెదాలు, నాజూకైన నడుము.. ఇలా తను పుట్టాకే అందం పుట్టిందేమో అన్నంత అపురూప లావణ్యం ఆస్ట్రియా మహారాణి ఎలిజబెత్ అమాలీ యుగెనీ (సిసీ) సొంతం. ఆస్ట్రియా దేశపు సామ్రాజ్ఞిగానే కాదు.. అందాల రాశిగా, సౌందర్య దేవతగా చరిత్రలో నిలిచిపోయిందామె. మరి, ఆమె అంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? ప్రకృతి మనకు వరంగా ప్రసాదించిన సహజసిద్ధమైన సౌందర్య సాధనాల్ని వాడడం వల్లే! అందుకే నేటికీ ఆ దేశపు మగువలు మహారాణి సిసీ బాటలోనే నడుస్తూ, తాను పాటించిన సహజమైన సౌందర్య పద్ధతుల్నే అనుసరిస్తూ.. అందానికి తమదైన రీతిలో నిర్వచనమిస్తున్నారు. అందం విషయంలో ఇతర దేశాల్లోని మగువలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా దేశపు మగువలు నాటి నుంచి నేటి వరకు పాటిస్తోన్న ఆ సహజమైన సౌందర్య పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-juhi-parmar-shares-oraganic-secrets-through-videos

ఇవి నా బ్యూటీ సీక్రెట్స్‌.. మీరూ ట్రై చేస్తారా?

అందరికంటే తానే అందంగా కనిపించాలని తాపత్రయపడని అమ్మాయి ఉంటుందా చెప్పండి? అందుకేగా బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టేది.. మార్కెట్లో లభించే ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్ని వాడేది.. అంటారా? అయితే వాటివల్ల తాత్కాలిక అందమే తప్ప శాశ్వతమైన సౌందర్యం మన సొంతం కాదన్నది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని తన మాటల్లో చెబుతోంది బాలీవుడ్‌ బుల్లితెర తార జుహీ పర్మార్‌. అందానికైనా, ఆరోగ్యానికైనా ఇంటి చిట్కాలను మించినవి మరొకటి లేదంటోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే #OrganicSecretsWithJuhiఅనే హ్యాష్‌ట్యాగ్‌తో పలు సౌందర్య చిట్కాలను పంచుకుంటోంది. అలా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ireland-women-beauty-secrets-in-telugu
women icon@teamvasundhara
bollywood-actress-share-their-diy-beauty-hacks-through-social-media

అందుకే ఇలా అందంగా ఉన్నాం..!

తెరపై మేకప్‌ వేసుకొని అందంగా కనిపించే మన ముద్దుగుమ్మలంతా.. తెరవెనుకా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు. అందుకు కారణం మేకప్‌ కాదు.. వారు పాటించే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే! అయితే ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి సినీ తారలంతా ఒకరికొకరు పోటీ పడుతూ మరీ న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని పాటించేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ బ్యూటీ రెసిపీలను సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తోనూ పంచుకుంటున్నారు. ఇలా అందం విషయంలోనూ నేటి అమ్మాయిలకు పాఠాలు నేర్పుతున్నారీ అందాల చందమామలు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు తన అందాన్ని రెట్టింపు చేసే ఫేస్‌ప్యాక్‌ ఇదేనంటూ ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ వేసుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అంతేకాదు.. అదెలా తయారుచేయాలో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఈ మధ్యకాలంలో కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న వారి న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ గురించి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
hawaii-women-beauty-secrets-in-telugu

హవాయ్ మగువల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే !

అందంగా ఉండడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. చర్మ ఛాయ, ముఖకవళికలు ఎలా ఉన్నా వాటిని మేకప్‌తో కవర్ చేసి అందంగా మెరిసిపోవడం.. రెండోది.. లోలోపలి నుంచి చర్మాన్ని మెరిపించుకుంటూ సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం. తాము మాత్రం తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి రెండో పద్ధతినే ఆశ్రయిస్తామంటున్నారు హవాయ్ మగువలు. తాత్కాలిక అందాన్ని అందించే మేకప్ ఉత్పత్తుల కంటే సహజమైన పదార్థాలతో వచ్చిన నిగారింపు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అది తమ విషయంలో రుజువైందని నిరూపిస్తున్నారీ దేశపు అతివలు. మరి, ఈ నేపథ్యంలో హవాయ్ మహిళల శాశ్వతమైన అందం వెనకున్న ఆ సహజమైన సౌందర్య సాధనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
top-3-foods-to-prevent-hair-loss-this-monsoon-shared-by-nutritionist-rujuta-diwekar

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందా.. అయితే ఇలా చేయండి!

కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్య పరంగానూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అందాన్ని సంరక్షించుకోవడమనేది అమ్మాయిలకు ఓ పెద్ద సవాలు లాంటిది. వాతావరణంలో తేమ స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల ముఖమంతా జిడ్డుగా మారడం, తద్వారా మొటిమలు రావడంతో చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక దీనికి తోడు ఈ కాలంలో జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇందుకు వాతావరణంలో అధికంగా ఉండే హైడ్రోజన్‌ స్థాయులే కారణమంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య నుంచి బయటపడి జుట్టును సంరక్షించుకోవాలంటే మన వంటింట్లో ఉండే ఈ మూడు ఆహార పదార్థాల వల్లే సాధ్యమవుతుందంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూ పోస్టులు పెట్టే ఆమె.. తాజాగా జుట్టు సంరక్షణకు సంబంధించిన మరో పోస్ట్‌ను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. మరి, ఇంతకీ ఈ కాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి రుజుత సూచించిన ఆ వంటింటి చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alaya-fs-home-made-coffee-mask-is-perfect-to-get-rid-of-dark-circles-puffiness-and-more

ఈ ‘కాఫీ ఫేస్’ మాస్క్ తో నవ యవ్వనం మీ సొంతం!

మచ్చలేని చందమామల్లా మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మరి, ఆ అందానికి కారణం మేకప్‌ అనుకుంటాం.. కానీ ఇంటి చిట్కాలతోనే కుందనపు బొమ్మల్లా మెరిసిపోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నటీమణులు. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. బాలీవుడ్‌ యువ కథానాయిక అలయా ఫర్నిచర్‌వాలా కూడా తన సౌందర్య రహస్యమేంటో తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది. ఈ ఏడాది ‘జవానీ జానేమన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. అలాగని ఖాళీగా కూర్చోకుండా విభిన్న వంటకాలు చేస్తూ, వ్యాయామాలు చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక ఇప్పుడు తన సౌందర్య రహస్యమేంటో చెప్తూ మరో పోస్ట్‌ పెట్టిందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
bulgarian-beauty-secrets-in-telugu

బల్గేరియా భామల సౌందర్య సాధనం ఏంటో తెలుసా?

చాలామంది తమ అందాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే ఏకైక మార్గం మేకప్. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులతో తమ అందానికి మెరుగులు దిద్దుకునే మగువలు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ప్రకృతిని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదని అంటున్నారు బల్గేరియన్ మగువలు. జుట్టు దగ్గర్నుంచి చర్మం, కొనగోటి సౌందర్యం వరకు సహజసిద్ధంగా లభించిన పదార్థాలతోనే తమ అందాన్ని సంరక్షించుకోవడం బల్గేరియన్ బ్యూటీస్‌కి అలవాటు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు తమ సంపూర్ణ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే ఆ న్యాచురల్ కాస్మెటిక్ ప్రొడక్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
henna-hair-packs-to-treat-dandruff-problem

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-to-get-rid-of-black-marks-around-lips-and-neck?
women icon@teamvasundhara
home-remedies-to-turn-white-hair-to-black-hair

ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది..!

కొంతమందిలో వయసు తక్కువే అయినా.. జుట్టు మాత్రం తెల్లగా మారిపోయి.. వారిని ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ముప్ఫై సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ సాధారణంగా వయసు పైబడిన వారిలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమందిలో శరీరంలోని మార్పుల వల్ల ఇది ముందుగానే తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది నలుపురంగు డైలు వేసుకుంటూ ఈ సమస్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఇవి మన కేశాలపై ఉండే సహజమైన నూనెలను పీల్చేస్తాయి. ఫలితంగా జుట్టు జీవం లేకుండా తయారవుతుంది. మరెలా? అని ఆలోచిస్తున్నారా? కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా జుట్టును నల్లబర్చుకోవచ్చని మీకు తెలుసా? మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
samantha-akkineni-shares-diy-hack-for-dehydrated-skin-that-works-wonders-

సమంత బ్యూటీ సీక్రెట్ ఇదేనట!

వెండితెరపై అందాల తారల్ని చూసినప్పుడల్లా ‘అబ్బ.. వీళ్లెంత అందంగా ఉన్నారో.. ఇదంతా మేకప్‌ మాయాజాలమేమో..’ అని మనలో చాలామంది అనుకోవడం సహజమే. అయితే మేకప్‌ వేసుకున్నప్పుడే కాదు.. మామూలుగానూ అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోతుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. మరి, దీనికంతటికీ కారణమేంటో తెలుసా..? వారు రోజూ పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే. ఇలా తాము పాటించే న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు కొందరు తారలు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటూ మన ముందుకొచ్చేసింది అందాల సమంత. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలే కాదు.. తాను చేసే వ్యాయామాలు, పాటించే ఆహార నియమాలు.. వంటివన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది సామ్‌. ఇక ఇప్పుడు తాను పాటించే ఓ న్యాచురల్‌ బ్యూటీ టిప్‌ని పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతోందీ తెలుగందం.

Know More

women icon@teamvasundhara
french-women-beauty-secrets-in-telugu

శృంగారం వల్లే వాళ్లు అంత అందంగా ఉంటారట!

అమ్మాయిల అందానికి కారణం మేకప్ అనేది చాలామంది భావన. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అంటున్నారు ఫ్రెంచ్ భామలు. వేలకు వేలు పోసి ఖరీదైన మేకప్ ఉత్పత్తులు కొనడం కంటే సహజసిద్ధమైన బ్యూటీ ట్రీట్‌మెంట్లు పాటించడం, శారీరక-మానసిక ఉత్తేజాన్ని అందిస్తూ చర్మాన్ని పునరుత్తేజితం చేసే స్పాలలో ఎక్కువ సమయం గడపడం.. వంటివి చేస్తుంటారు ఫ్రెంచ్ మహిళలు. అందుకే నవయవ్వనంతో మెరిసిపోతూ అందాల రాశుల్లా కనిపిస్తుంటారు. అంతేకాదు.. వారు రోజూ చేసే కొన్ని పనులు సైతం వారి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయట! మరి, ఆ పనులేంటి? ఫ్రెంచ్ మగువల అపురూప లావణ్యం వెనకున్న ఆ 'అంద'మైన రహస్యాలేంటి? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
how-to-remove-upper-my-upper-lip-hair-in-telugu
women icon@teamvasundhara
get-rid-of-underarm-blackness-naturally-in-telugu
women icon@teamvasundhara
here-are-the-parlour-precautionary-measures-that-customers-and-staff-must-follow-for-a-safe-visit

కరోనా అలర్ట్‌: బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నారా? అయితే ఇవి పాటించాల్సిందే!

రూప ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. అందాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా రెండువారాలకోసారైనా ఫేషియల్‌ చేయించుకోవడం ఆమెకు అలవాటు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలల నుంచి పార్లర్లన్నీ మూతపడడంతో సౌందర్య నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే స్వయంగా ఫేషియల్‌ చేసుకుంటోంది. గీతకు అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ. వీటిని తొలగించుకోవడానికి పార్లర్‌ను ఆశ్రయిస్తుంటుందామె. అయితే పార్లర్లన్నీ గత రెండు నెలలుగా మూసే ఉండడంతో ఇంట్లోనే వ్యాక్సింగ్‌ చేసుకుంటోంది. అది సరిగ్గా వర్కవుట్‌ కాకపోవడంతో ఎప్పుడెప్పుడు పార్లర్లు తెరుస్తారా అని మొన్నటిదాకా ఎదురుచూసింది. వీళ్లే కాదు.. చాలామంది అమ్మాయిలు, మహిళలు తమ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ కోసం బ్యూటీ పార్లర్లను, స్పా సెంటర్లను ఆశ్రయించడం సహజమే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా మూత పడిన సెలూన్లన్నీ లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పార్లర్స్‌కి వెళ్లి అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Know More

women icon@teamvasundhara
diy-hand-scrubs-that-you-can-use-to-get-soft-and-supple-hands-in-telugu

వీటితో చేతుల్ని కోమలంగా మార్చుకోండి!

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చిన ప్రతిసారీ లేదా ఇంట్లో ఉన్నా సరే... పదే పదే హ్యాండ్‌వాష్‌ లేదా సబ్బుతో చేతుల్ని రుద్ది మరీ కడుగుతున్నాం. అయితే ఇలా పదే పదే చేతుల్ని కడగడం వల్ల చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోతున్నాయి.. నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇక దీనికి తోడు మహిళలకు అదనంగా ఇంటి పని, వంట పని, గిన్నెలు తోమడం, బట్టలుతకడం.. వంటి రోజువారీ పనుల కారణంగా పదే పదే చేతులు నీళ్లలో నాని మరింత పొడిగా తయారవుతున్నాయి. ఫలితంగా దురద రావడం, మంట పుట్టడం, అలర్జీలు.. వంటి సమస్యలొచ్చే అవకాశమే ఎక్కువ. మరి, వీటి నుంచి బయటపడాలంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే స్క్రబ్స్‌ తయారుచేసుకొని వాడితే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, చేతుల్ని తేమగా, కోమలంగా మార్చే ఆ న్యాచురల్‌ స్క్రబ్స్‌ ఏంటో తెలుసుకొని, మనమూ ట్రై చేసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
easy-ways-to-sanitize-your-beauty-products

కరోనా అలర్ట్‌: మేకప్‌ కిట్‌ని శానిటైజ్‌ చేయండిలా !

ఈ కరోనా సమయంలో ఏ వస్తువును ముట్టుకున్నా, పట్టుకున్నా భయంగానే అనిపిస్తోంది. అందుకే బయటి నుంచి రాగానే హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పదే పదే శానిటైజర్‌ని వాడడం కామనైపోయింది. అయితే చేతులు శుభ్రం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ కొన్ని వస్తువుల్ని ఎలా శానిటైజ్‌ చేయాలో అర్థం కాక తికమకపడిపోతుంటాం. అలాంటి వాటిలో మనం రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు కూడా ఒకటి. మేకప్‌ బాక్స్‌నైతే శానిటైజర్‌తో శుభ్రం చేసేస్తాం.. మరి, అందులో ఉన్న ఉత్పత్తుల సంగతో! పౌడర్‌, క్రీమ్‌, మేకప్‌ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్‌ చేయచ్చంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
beauty-benefits-of-matcha-green-tea

ఈ గ్రీన్‌టీ ఫేస్‌ మాస్క్‌తో మేం మెరిసిపోతున్నాం... మరి మీరు?

తమ అందానికి మెరుగులు దిద్దుకోవాలన్న ఆరాటం ప్రతి మహిళలోనూ ఉంటుంది. ఇక ఈ విషయంలో మన అందాల తారలు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్‌స్క్రీన్‌ అయినా, ఆఫ్‌స్క్రీన్‌ అయినా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మేకప్‌ వేసుకున్నప్పుడే కాదు.. డీ-గ్లామరస్‌గానూ తమకు మరెవరూ సాటిరారంటూ అదరగొడుతుంటారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడమే తమ అందానికి కారణమంటూ పలు సందర్భాల్లో కొందరు నటీమణులు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. పైగా లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ క్యూట్‌ బ్యూటీస్‌ న్యాచురల్‌ ఫేస్‌ప్యాక్స్‌ ప్రయత్నిస్తూ.. ఆ ఫొటోలు, రెసిపీలను సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు కూడా! అలా తాజాగా మన కపూర్‌ సిస్టర్స్‌ కరిష్మా, కరీనాతో పాటు పటౌడీ బ్యూటీ సోహా అలీ ఖాన్‌ కూడా ఓ సహజసిద్ధమైన ఫేస్‌మాస్క్‌ వేసుకొని.. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇంతకీ వాళ్లు వేసుకున్న ఆ న్యాచురల్‌ ఫేస్‌ మాస్క్‌ ఏంటి? దానివల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
anti-aging-foods-for-women
women icon@teamvasundhara
beauty-tips-to-look-perfect-on-video-calls

వీడియో కాల్స్‌లో ఆకర్షణీయంగా కనిపించాలంటే!

లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చినా ఇంకా కొంత మంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమ స్నేహితులు, బంధువులు, సహోద్యోగులతో.. ప్రత్యక్షంగా మాట్లాడడం వీలు కాకపోవడంతో వీడియో కాల్స్‌ ద్వారా పరోక్షంగా మాట్లాడుతూ తృప్తి పడుతున్నారు చాలామంది. అలాగే ఇప్పటికీ చాలామంది ఇంటి నుంచే పని చేస్తుండడంతో ముఖ్యమైన చర్చలు, సమావేశాల కోసం వీడియో కాల్స్‌పైన ఆధారపడాల్సి వస్తోంది. అలాగే కొన్ని సంస్థల్లో నియామకాలు కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈక్రమంలో వీడియో కాల్స్‌ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. కాల్‌లో మన మాటలతో పాటు.. మనం ఎలా కనిపిస్తున్నాం అనే దానిని బట్టి అవతల వ్యక్తి మనల్ని అంచనా వేసే అవకాశముంది. ఈ క్రమంలో వీడియో కాల్స్‌ మాట్లాడే క్రమంలో అందంగా, ఆకర్షణీయంగా కనబడడం మన చేతుల్లోనే ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
benefits-of-moringa-oil-for-skin
women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
homemade-eyeliner-and-mascara-recipes

కంటి అందాన్ని పెంచే ఉత్పత్తులు ఇంట్లోనే ఇలా..

ముఖంలో ఇతరుల దృష్టిని తొలుత ఆకర్షించేవి కళ్లే. అందుకే వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాధాన్యమిస్తారు అతివలు. దీనికోసం ఐలైనర్, మస్కారా వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో లభించే వీటిలో రసాయనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలంలో వాటి ప్రభావం కళ్లపైనా.. వాటి సౌందర్యంపైనా పడే అవకాశం ఉంటుంది. అందుకే సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకొన్న వాటిని ఉపయోగించడం మంచిది. అయితే వీటిని తయారుచేసుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. ఖర్చు కూడా తక్కువే. పైగా కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా కూడా ఉంటుంది. మరి ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా.. ప్రకృతి అందించిన ఉత్పత్తులతో ఇంట్లోనే మస్కారా, ఐలైనర్ సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకొందామా..

Know More

women icon@teamvasundhara
how-to-make-hair-toner-in-home

హెయిర్ టోనర్ ఇంట్లోనే ఇలా...

సౌందర్య పరిరక్షణ విషయంలో చర్మానికి ఎంత ప్రాధాన్యమిస్తామో.. కురుల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరిస్తుంటాం. మేనిఛాయను పరిరక్షించుకోవడానికి ఉపయోగించినట్లే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా కొంతమంది టోనర్‌ని ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టుకి పోషణనివ్వడం మాత్రమే కాకుండా ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. ముఖ్యంగా హెయిర్‌డైలు వేసుకొనే అలవాటు ఉన్నవారు వీటిని ఉపయోగించడం ద్వారా ఆ రంగు మరింత సహజంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులను కాకుండా ఇంట్లోనే తయారుచేసుకొని ఉపయోగించుకోవడం మంచిది.

Know More

women icon@teamvasundhara
sugar-scrubs-to-glow-your-skin

‘పంచదార’ బొమ్మలా మెరిసిపోండి!

లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉండడమేమో గానీ.. చర్మ సంరక్షణ గురించి పట్టించుకోవడమే మానేశారు చాలామంది అమ్మాయిలు. ఎలాగూ బయటికి వెళ్లట్లేదు కదా అన్న నిర్లక్ష్యం ఒక కారణమైతే.. బద్ధకం మరో కారణం. అయితే ఇంట్లో ఉన్నా కూడా చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే చర్మం నిర్జీవంగా, జిడ్డుగా, పొడిబారిపోవడం ఖాయమంటున్నారు సౌందర్య నిపుణులు. ఫలితంగా మొటిమలు, అలర్జీ.. వంటి సమస్యలు తప్పవంటున్నారు. మరి, ఈ సౌందర్య సమస్యల నుంచి బయటపడాలంటే స్క్రబ్బింగ్‌ చక్కటి మార్గమని వారు సూచిస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ కదా.. సౌందర్య ఉత్పత్తులు ఎలా దొరుకుతాయి అనుకోకండి. వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులతో పనిలేదు.. కేవలం మన వంటింట్లో ఉండే పంచదార చాలు.. ఇది మీ చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి మీ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.. మచ్చలను మాయం చేస్తుంది.. తేమను, మెరుపును అందిస్తుంది. ఈ క్రమంలో పంచదారతో తయారుచేసుకునే కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్స్‌ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
mandira-bedi-shared-flawless-and-quick-makeup-tutorial

‘మందిర’ మేకప్‌ పాఠాలు.. మనమూ విందామా?

ఫిట్‌నెస్‌, కుకింగ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు.. ఇలా ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని మన సినీ తారలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీగా పేరుగాంచిన మందిరా బేడీ కూడా అటు వ్యాయామంపై శ్రద్ధ కనబరుస్తూనే.. ఇటు తన అందానికి మెరుగులద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే మేకప్‌ వేసుకోవడానికి గంటలు గంటలు సమయం కేటాయించాల్సిన అవసరం లేదంటూ.. రోజులో ఓ పన్నెండు నిమిషాలు వెచ్చిస్తే చాలు.. చూడచక్కని మేకప్‌తో సిద్ధమవ్వచ్చంటూ నేటి మహిళలందరికీ మేకప్‌ పాఠాలు చెబుతోంది మందిర. ఈ క్రమంలోనే ఓ మేకప్‌ ట్యుటోరియల్‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ ఫిట్టెస్ట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
cool-packs-in-summer

women icon@teamvasundhara
anti-aging-kitchen-ingredients-to-get-a-glowy-skin

ఈ లాక్‌డౌన్‌లో వయసును ‘లాక్‌’ చేయండిలా!

ఆఫీసుకు వెళ్లేటప్పుడు మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకుందామన్నా సమయం దొరికేది కాదు. ఇంటి పని, వంట పనికి తోడు భర్తను ఆఫీస్‌కి పంపడం, పిల్లల్ని రడీ చేసి స్కూల్‌కి పంపడం.. ఇలా వీటితోనే సరిపోయేది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక మళ్లీ ఇంటి పని షరా మామూలే. అంతటి బిజీ లైఫ్‌స్టైల్లో అందాన్ని సంరక్షించుకోవడానికి ఓ అరగంటైనా సమయం ఉండేది కాదు. కానీ లాక్‌డౌన్‌ మొదలైనప్పట్నుంచి ఇంట్లో పని పెరిగినా, ఇంటి నుంచి పనిచేసినా కొంతమందికి కాస్తో కూస్తో ఖాళీ సమయం దొరికే అవకాశం ఉండచ్చు. అలాంటి అవకాశం ఉన్నవారు ఇలా దొరక్క దొరక్క దొరికిన ఆ సమయంలో మనం చేయాలనుకున్న పనులు చేసుకోవచ్చు. అందులో అందాన్ని సంరక్షించుకోవడం కూడా ఒకటి. చాలామంది చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడుతున్నాయని దిగులు పడుతుంటారు. అలాంటి వారు ఈ వంటింటి ఔషధాలను ఉపయోగించుకొని నవ యవ్వనంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
ways-to-cover-gray-hair-naturally-at-home
women icon@teamvasundhara
raveena-cool-beauty-tip-for-this-hot-summer

కీరా ప్యాక్‌తో ‘కూల్‌’గా మెరిసిపోదాం!

అసలే వేసవి.. రోజురోజుకీ పెరిగే ఉష్ణోగ్రతలతో మనం ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఆవిరైపోతుంటాయి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. అంతేనా.. దీనివల్ల చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా, పాలిపోయినట్లుగా మారిపోతుంది. అందుకే ఈ ఎండాకాలంలో అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యర్థమే అని చెప్పచ్చు. అలాగని విసుగెత్తిపోకుండా ఈ బ్యూటీ టిప్‌ని ప్రయత్నించమని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార రవీనా టాండన్‌. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తాను గతంలో చెప్పిన బ్యూటీ టిప్స్‌ని ఇప్పుడు వారానికొకటి చొప్పున మళ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
henna-hair-packs-to-treat-dandruff-problem

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
salons-parlours-are-closed-here-are-the-tips-to-pamper-yourself-at-home

ఈ లాక్‌డౌన్‌ వేళ.. ఇంటినే పార్లర్‌గా మార్చుకోండిలా!

కరోనా లాక్‌డౌన్‌తో అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావసరాలు తప్ప మిగిలిన షాపులన్నీ మూతపడ్డాయి. సాధారణంగా సెలవు రోజున, కనీసం పదిహేను రోజులకోసారైనా పార్లర్లకు వెళ్లడం చాలామంది అమ్మాయిలకు అలవాటు. ప్రస్తుతం కొనసాగుతోన్న లాక్‌డౌన్‌తో పార్లర్స్‌ కూడా మూతపడ్డాయి. దీంతో ఫేషియల్స్‌ చేయించుకోవట్లేదని, హెయిర్‌ స్పా మిస్‌ అవుతున్నామంటూ.. ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎలాగో బోలెడంత సమయం దొరికింది కాబట్టి.. దీన్నే మన సౌందర్య పోషణ కోసం వినియోగిస్తూ, ఇంటినే పార్లర్‌గా మార్చుకుంటే సహజసిద్ధమైన సౌందర్యం మన సొంతం చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ నేపథ్యంలో ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే పార్లర్‌ అనుభూతిని పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
natural-ways-to-reduce-upper-lip-shadow

women icon@teamvasundhara
raveena-tondon-shares-another-beauty-tip-to-beat-the-heat-in-this-lockdown-period

ఈ హాట్‌ సమ్మర్‌లో రవీనా ‘కూల్‌’ టిప్స్‌.. మీకోసం!

వేసవి కాలం.. ఎన్నో సమస్యల వలయం. అటు ఆరోగ్యపరంగా, ఇటు అందం పరంగా.. ఎలా చూసుకున్నా ఎన్నో చిక్కులు తెచ్చిపెడుతుందీ కాలం. అయితే వీటన్నింటికీ ముఖ్య కారణం డీహైడ్రేషనే అంటోంది బాలీవుడ్‌ అందాల తార రవీనా టాండన్‌. ఈ వేసవిలో మన శరీరాన్ని ఎప్పుడూ చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతోందీ లవ్లీ మామ్‌. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా స్వీయ నిర్బంధంలో ఉంటోన్న రవీనా.. ప్రతి బుధవారం ఒక్కో సౌందర్య చిట్కాను వివరిస్తూ.. తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోంది. అనుకోకుండా వచ్చిన ఈ లాక్‌డౌన్‌ హాలిడేస్‌ని అందంపై దృష్టి పెట్టడానికి వినియోగించమని చెబుతోందీ సుందరి. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టా వేదికగా మరో బ్యూటీ టిప్‌ని షేర్‌ చేసుకుందీ బాలీవుడ్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
amazing-ways-to-cure-dandruff-with-neem

వేపతో చుండ్రుకు చెక్ పెట్టండిలా..!

ఇటీవలి కాలంలో చాలామందిలో చుండ్రు సాధారణమైన సమస్యగా మారిపోయింది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే యాంటీడాండ్రఫ్ షాంపూలను ఉపయోగిస్తుంటాం. అయితే వీటివల్ల కలిగే ఫలితం తాత్కాలిమే అవుతుంది. మరి ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం పొందేదెలా? చాలా సింపుల్.. వేపాకులు, వేపనూనె ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి మనం విముక్తి పొందవచ్చు. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు సమస్యను తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాదు చుండ్రు కారణంగా వచ్చే దురద, మంటను సైతం ఇవి తగ్గిస్తాయి. మరి ఈ ఫలితాన్ని పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
coropna-virus-covid-19-raveena-tandon-giving-beauty-tips-in-lockdown-to-keep-hands-soft

కరోనా కాలం.. రవీనా బ్యూటీ పాఠం!

కరోనా ఎప్పుడైతే పురుడు పోసుకుందో ఇక అప్పట్నుంచి ఆ వైరస్‌ ముప్పును తప్పించుకోవడానికి మనమంతా తెగ చేతులు కడుగుతున్నాం. ఈ క్రమంలో సబ్బుల దగ్గర్నుంచి హ్యాండ్‌వాష్‌లు, శానిటైజర్లు.. వంటివి విచ్చలవిడిగా వాడుతున్నాం. అయితే కరోనా పుణ్యమాని చేతులు కడుక్కోవడం అనే మంచి అలవాటు మనకు అలవడినా.. ఇలా పదే పదే చేతుల్ని శుభ్రం చేసుకోవడం వల్ల కోమలంగా ఉండాల్సిన చేతులు పొడిబారిపోయి నిర్జీవంగా మారుతున్నాయి. ఇందుకు మనం ఉపయోగించే హ్యాండ్‌వాష్‌, హ్యాండ్‌ శానిటైజర్లలోని రసాయనాలు కూడా ఓ కారణమే. మరైతే, ఇలా పొడిబారిపోయిన చేతుల్ని తిరిగి కోమలంగా మార్చుకునేదెలా.. అని ఆలోచిస్తున్నారా? అందుకు ఓ చక్కటి చిట్కా సూచించింది బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్‌. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో భాగంగా ఇంట్లోనే ఉంటోన్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. దీనికి సంబంధించిన చిట్కాను చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
natural-body-scrubbers-for-a-healthy-skin

మేని మెరుపు కోసం వాడేద్దాం.. ఈ న్యాచురల్‌ స్క్రబ్బర్స్‌!

మండే ఎండాకాలం రాబోతోంది.. ఎండవేడిమి వల్ల వచ్చే చెమట, జిడ్డుదనం, మొటిమలు, అలర్జీ, క్రిములు.. ఇవన్నీ తలచుకుంటేనే ఎవరికైనా ‘బాబోయ్‌’ అనిపించడం సహజమే. వీటి నివారణకు చాలామంది బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌, బయట దొరికే క్రీమ్స్‌.. అంటూ ఏవేవో సౌందర్య చిట్కాలను ఫాలో అయిపోతుంటారు. ఇలా ఎన్ని వాడినా కూడా.. శుభ్రత పాటించకపోతే అందాన్ని సంరక్షించుకోవడం కత్తి మీద సామే అవుతుంది. అందుకోసమే స్నానం చేసే సమయంలో చాలామంది స్క్రబ్బింగ్‌ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగిస్తుంటారు. కానీ ఎంత అత్యాధునిక స్క్రబ్‌ టూల్స్‌ని వాడినా.. సహజ పదార్థాలతో తయారుచేసిన స్క్రబ్బర్స్‌ ముందు దిగదుడుపే అనడంలో సందేహం లేదు. న్యాచురల్‌గా లభించే పదార్థాలతో తయారుచేసిన ఈ స్క్రబ్బర్స్‌ని వాడడం వల్ల శరీరం పూర్తిగా శుభ్రపడడంతో పాటు మేనికి చక్కటి పోషణ కూడా అందుతుంది. తద్వారా ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందచ్చు. మరి, ఆ న్యాచురల్‌ స్క్రబ్బర్స్‌ ఏంటో తెలుసుకొని వాటిని మన సమ్మర్‌ బ్యూటీ కిట్‌లో చేర్చేసుకుందామా?

Know More

women icon@teamvasundhara
natural-packs-for-lip-care
women icon@teamvasundhara
clean-your-makeup-tools-easily-with-these-gadgets

వీటితో మేకప్‌ టూల్స్‌ని శుభ్రం చేయడం చాలా ఈజీ!

మేకప్‌ టూల్స్‌ని శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నందు వల్లే చాలామంది వీటిని శుభ్రం చేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న మేకప్‌ క్లీనింగ్‌ గ్యాడ్జెట్స్‌ని వాడితే ఎలాంటి మేకప్‌ టూల్‌ అయినా చిటికెలో, ఈజీగా శుభ్రం చేసేయచ్చు. అయితే.. సాధారణంగా ఇంట్లో లభించే వస్తువులతోనే మేకప్‌ టూల్స్‌ని శుభ్రం చేయచ్చు కదా అనుకునే వారూ లేకపోలేదు. కానీ వాటివల్ల మీ మేకప్‌ టూల్స్‌ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదముంది. కాబట్టి అలా జరగకుండా నివారించడానికి ఉపయోగించేవే ఈ మేకప్‌ క్లీనింగ్‌ గ్యాడ్జెట్స్‌. అలాంటి కొన్ని మేకప్‌ క్లీనింగ్‌ గ్యాడ్జెట్స్‌ గురించి, వాటి వాడకం గురించి ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
indonesian-women-natural-beauty-secrets

వీరిని చూస్తే.. ‘సొగసు చూడతరమా’ అని పాటందుకోవాల్సిందే!

పాల మీగడ లాంటి చర్మ ఛాయ, లిప్‌స్టిక్‌ అవసరమే లేకుండా సహజంగానే గులాబీలా మెరిసే పెదాలు, ‘కాటుక కళ్లు కాటుక కళ్లు ఏమంటున్నాయో..’ అని పాడుకునేంత నయన సోయగం.. వెరసి అసలు సిసలైన అందానికి నిలువుటద్దంలా నిలుస్తున్నారు ఇండోనేషియా భామలు. మేకప్‌ పులుముకుంటేనే అందంగా ఉంటామన్న మాటను కొట్టిపడేస్తూ.. సహజసిద్ధమైన అందానికి చిరునామా తామేనంటూ చెబుతున్నారీ సొగసరులు. మరి, వారు ఇంతటి అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోవడానికి కారణమేంటో తెలుసా.. తరతరాలుగా సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులను అనుసరించడం వల్లేనట! ఇంతకీ ఆ పద్ధతులేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-choose-the-right-handbag-for-your-daily-routine