ఈ చలికాలంలో కర్లీ హెయిర్‌ని కాపాడుకోవడమెలా..?
మనం అందంగా మెరిసిపోవడంలో జుట్టుదీ కీలకపాత్రే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది ఒత్త్తెన కేశసంపద కోసం ఆరాటపడుతుంటారు. అయితే వాతావరణంలోని పలు మార్పుల వల్ల జుట్టుపై ప్రతికూల ప్రభావం పడి, తద్వారా దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. చలికాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ చలిగాలులకు సాధారణ జుట్టే పొడిగా మారుతుందనుకుంటే.. ఇక నార్మల్‌గానే డ్రైగా అనిపించే కర్లీ హెయిర్ ఈ కాలంలో మరింత పొడిబారిపోతుంది. ఫలితంగా చుండ్రు, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బాగా వూడిపోవడం.. వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మరి, ఈ కాలంలో వాటన్నింటి నుంచి దూరంగా ఉంటూ మన అందాన్ని పెంచే రింగుల జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు సౌందర్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందామా..