సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

నా ముఖంపై నల్ల మచ్చలు తగ్గేదెలా?

హాయ్‌ మేడం. నా ముఖంపై నల్ల మచ్చలున్నాయి. అవి పోవాలంటే ఏం చేయాలి?


శోభారాణి

బ్యూటీ ఎక్స్‌పర్ట్

మీ ముఖంపై సాధారణ నల్ల మచ్చలున్నాయాలేదంటే పిగ్మెంటేషన్‌ సమస్యా అనేది మీరు స్పష్టంగా రాయలేదుఅలాగే మీ వయసెంతో కూడా చెప్పలేదుసాధారణంగా 40-50 ఏళ్లు దాటిన మహిళల్లో నల్ల మచ్చలంటే పిగ్మెంటేషన్‌ అనుకోవచ్చుకానీ మీరు మీ వయసుసమస్య గురించి స్పష్టంగా చెప్పలేదు.. కాబట్టి మీ ముఖంపై ఉన్న నల్ల మచ్చల్ని తగ్గించుకోవాలంటే యాపిల్‌తో తయారుచేసిన ఈ ప్యాక్‌ను ఉపయోగించచ్చు.

ముందుగా ఒక యాపిల్‌ తీసుకొని.. దాని తొక్క చెక్కేసిగుజ్జును మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలిఇందులో టేబుల్‌స్పూన్‌ చొప్పున బార్లీ పౌడర్‌తేనె వేసుకొని.. ఈ మూడింటినీ బాగా కలుపుకోవాలిఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలిఇదే ప్యాక్‌ను క్రమం తప్పకుండా నెల రోజుల పాటు రోజూ వేసుకున్నట్లయితే నల్ల మచ్చలు తగ్గి ముఖమంతా ఒకే రంగులోకి వస్తుంది.. కాంతివంతంగానూ మారుతుంది.
Post Your Comment Here

(Press ctrl+g to switch(English/Telugu))

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))