సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

పిల్లల్లో చర్మం పొడిబారకూడదంటే ఏం చేయాలి?

మేడం.. పిల్లల్లో చర్మం పొడిబారే సమస్య (Dry Skin Problem) తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చెబుతారా? - ఓ సోదరి


శోభారాణి

బ్యూటీ ఎక్స్‌పర్ట్

పిల్లలంటే ఏ వయసు పిల్లలకు అనేది మీరు రాయలేదు. సాధారణంగా నెలల వయసున్న పిల్లలకైతే పాల మీగడ, వెన్న.. వంటివి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అలాగే ఐదేళ్లు దాటిన పిల్లలైతే బాదం నూనె రాసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను చర్మానికి రాసుకుంటే అది చర్మంలోకి బాగా ఇంకిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు కూడా గ్లిజరిన్‌ ఆధారిత సబ్బుల్ని ఉపయోగిస్తే మరీ మంచిది. తద్వారా చర్మం పొడిబారే సమస్యను తగ్గించుకోవడంతో పాటు మేను మెరుపును సంతరించుకుంటుంది. ఐదేళ్ల పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల దాకా ఈ చిట్కాను పాటించచ్చు. అలాగే ముందు నుంచీ ఈ నూనె ఉపయోగిస్తున్నట్లయితే శీతాకాలంలో చర్మం పొడిబారే సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.
Post Your Comment Here

(Press ctrl+g to switch(English/Telugu))

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))