సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం.. వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!
ఇలా స్నానం చేస్తే తాజాదనం సొంతం!
అందాల బుట్టబొమ్మలు వయ్యారంగా నడిచొచ్చిన వేళ..!
ఆపరేషన్ లేకుండా ఆ బ్లాక్స్ తొలగించలేమా?
బరువు తగ్గడానికి సమీర చేస్తున్న ఈ ఉపవాసం గురించి విన్నారా?
వీటిని పిల్లలు పుట్టకముందే చేసేయండి!
పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !
అవంటే నాకు చచ్చేంత భయం!
ఆ పవర్ మనకు పుట్టుకతోనే వచ్చింది!
ఇంటి దగ్గరే ఉండండి.. ఇప్పుడు ఇదే ఉత్తమం!
ఇల్లు చల్లగా ఉండాలంటే...!
కరోనా నుంచి చంటి పిల్లలను కంటికి రెప్పలా కాచుకోండి!
మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..
అసభ్యకర సందేశాలు పంపిన బాస్‌కు అలా బుద్ధి చెప్పింది!
అదొక్కటీ బాగుంటే అన్నిట్లోనూ మీరే టాప్.. అదేమిటో తెలుసా?
అందుకే మహిళలు పెట్టుబడులు పెట్టాల్సిందేనట!
అందుకే మా మెన్స్ట్రువల్ కప్ ఒకటి కొంటే మరొకటి ఉచితం!
కట్టుబాట్లను కాదని తండ్రి పాడె మోశారు!
Login
నా ముఖంపై ఎక్కువ నల్ల మచ్చలున్నాయి. ఎనిమిది నెలల క్రితం నాకు పొంగు చూపింది. అప్పటినుంచి ముఖం ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి. - ఓ సోదరి
పొంగు చూపిన తర్వాత మీ ముఖం ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తుందని రాశారు. అందుకే ముందుగా మీ ముఖంపై ఉండే జిడ్డును తొలగించుకోవడానికి సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. ఇందుకోసం అర టేబుల్‌స్పూన్ చొప్పున చందనం, ముల్తానీ మట్టి తీసుకొని.. ఈ రెండింటినీ రోజ్‌వాటర్‌లో కలుపుకుంటూ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డుదనం తొలగిపోతుంది.
అలాగే మీ ముఖంపై ఉన్న నల్ల మచ్చల్ని తొలగించుకోవడానికి మంచి నాణ్యమైన తేనె తీసుకోవాలి. దీన్ని నల్ల మచ్చలున్న చోట నేరుగా అప్లై చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆ నల్ల రంగు మచ్చలు తేనె రంగులోకి మారతాయి. ఆపై క్రమక్రమంగా చర్మ రంగులో కలిసిపోతాయి. అయితే ఈ మచ్చలు అంత త్వరగా తగ్గవు కాబట్టి.. ఓపిగ్గా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
Share via facebook
Share via whatsapp
Share via twitter