సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

చర్మంపై వచ్చిన ర్యాషెస్‌ పోవాలంటే ఏం చేయాలి?

హలో మేడం. నా చర్మంపై దద్దుర్లు (ర్యాషెస్‌) వచ్చాయి. దాంతో నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. అవి పోవడానికి ఏవైనా హోమ్‌ రెమెడీస్‌ ఉంటే చెప్పండి. - ఓ సోదరి


శోభారాణి

బ్యూటీ ఎక్స్‌పర్ట్

దద్దుర్లు అంటే అది చెమట పొక్కా.. ఏదైనా క్రీమ్‌ వాడడం వల్ల వచ్చిందా.. చేతులు-ముఖంపై దద్దుర్లు వచ్చాయా.. లేదంటే శరీరమంతా ఈ సమస్య ఉందా.. ఏదైనా మెడిసిన్‌ వాడడం వల్ల శరీరంపై వచ్చిన రియాక్షనాఇలా మీ అసలు సమస్య ఏది అనేది మీరు కరక్ట్‌గా చెప్పలేదుఒకవేళ ముఖంపై వచ్చిన దద్దుర్లు అయితే ఆ ప్రదేశంలో ఐస్‌క్యూబ్‌తో రుద్దుకుంటే సరిపోతుందిరోజూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దద్దుర్లు వచ్చిన చోట ఐస్‌క్యూబ్‌తో మసాజ్‌ చేసుకుంటే కొన్ని రోజులకు ర్యాష్‌ పోతుంది.

rashesexpertanswer650-1.jpg

అలాగే ముఖంచేతులపై ర్యాష్‌ ఉన్నట్లయితే బకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్‌ ముక్కలు వేసుకొని ఆ నీటితో ముఖాన్నిచేతుల్ని తరచూ శుభ్రం చేసుకుంటుండాలిఆపై గంధం ప్యాక్‌ వేసుకోవచ్చుఇందుకోసం గంధం అరగదీసి నేరుగా మచ్చలున్న చోట అప్లై చేసుకోవాలిలేదంటే గంధంలో రోజ్‌వాటర్‌ వేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. (అయితే ఇందులో పాలు ఉపయోగించకూడదుఎందుకంటే పాలలో జిడ్డుదనం ఎక్కువగా ఉంటుంది.) ఈ మిశ్రమాన్ని ముఖంచేతులు.. ఇలా ర్యాష్‌ ఉన్న భాగాల్లో పూతలా వేసుకొని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలిఇలా రోజుకోసారి పదిహేను రోజుల పాటు చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
Post Your Comment Here

(Press ctrl+g to switch(English/Telugu))

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))